News
News
X

Janaki Kalaganaledu August 30th Update: జ్ఞానంబ ఇంటికి వచ్చిన జెస్సి- అసలు విషయం తెలుసుకునే పనిలో పడ్డ జానకి

జానకిని చదివిస్తుందన్న కోపంతో మల్లిక కడుపు డ్రామా మొదలుపెడుతుంది. కడుపు వచ్చినట్టు నాటకం ఆడుతూ రాజభోగాలు అనుభవిస్తుంది.

FOLLOW US: 

జన్మాష్టమి సంబరాల్లో మల్లిక కోలాటం ఆడుతుంటే అది చూసి జ్ఞానంబ గుర్రుగా ఉంటుంది. జెస్సి అఖిల్ గురించి ఆలోచిస్తూ ఉంటుంది. అప్పుడు అఖిల్ ఎంత చెప్తున్న వినకుండా పట్టించుకోకుండా అలా చేశాను ఇప్పుడు అమ్మానాన్నలకి తెలిసి నిజంగానే ప్రాబ్లం అయ్యింది. దీనికి కారణం ఎవరో చెప్పే వరకు అమ్మ వాళ్ళు ఊరుకోరు. దీనికి సొల్యూషన్ ఎంతో అఖిల్ ని అడిగి తెలుసుకోవాలి త్వరగా ప్రాబ్లం సాల్వ్ చెయ్యమని అఖిల్ కి చెప్పాలని అనుకుంటుంది. అఖిల్ కి ఫోన్ ట్రై చేస్తుంది కానీ కలవదు. దీంతో డైరెక్ట్ గా అఖిల్ ఇంటికి వెళ్లాలని బయల్దేరుతుంది. అటు జ్ఞానంబ ఇంట్లో సంబరాలు మిన్నంటుతాయి.

ఉట్టి కొట్టేందుకు గోవిందరాజులు ట్రై చేస్తాడు కానీ కుదరకపోయేసరికి విష్ణుని రంగంలోకి దింపుతారు. కానీ తన వల్ల కూడా కాకుండా జానకి, జ్ఞానంబ తాడు లాగుతూ ఉంటారు. పనికి పోటు రాజు తిండికి తిమ్మరాజు దేనికి పనికిరాడు నా మొగుడు అని మల్లిక తిట్టుకుంటుంది. విష్ణు వల్ల కూడా కాకపోవడంతో రామాని పిలుస్తారు. తను కోడా కొట్టలేకపోవడంతో రామా తమ్ముడు అఖిల్ ని భుజాల మీద పెట్టుకుని ఉట్టి కొడతారు. ఉట్టి కొట్టిన ఆనందంలో ఉండగా ఇంటికి జెస్సి రావడం అఖిల్ గమనించి షాక్ అవుతాడు.

Also Read:  అసలు ఏం జరుగుతోందని నిలదీసిన కార్తీక్, మోనితకు సవాల్ విసిరి వెళ్లిన దీప!

మా ఇంటికి ఎందుకు వచ్చావ్ ఎవరైనా చూస్తే ఎంత డేంజర్ నువ్వు వెళ్ళు నేను వచ్చి తర్వాత మాట్లాడతాను అని అంటాడు. జెస్సి ఏడుస్తూ తను నెల తప్పిన విషయం చెప్తుంది. కారణం ఎవరని అమ్మ వాళ్ళు నిలదీసి అడిగారు అని అంటుంది. చెప్పావా అని టెన్షన్ గా అడుగుతాడు లేదని చెప్తుంది. ఇంట్లో తెలిసిన విషయం బయట జనాలకి తెలియక ముందే మనం పెళ్లి చేసుకోవాలని జెస్సి అంటుంది. ఎప్పుడు పెళ్లి చేసుకుందామని అడుగుతుంది. ఇప్పుడు కాదు ఈ విషయం గురించి నేను ఫోన్ చేసి మాట్లాడతాను నువ్వు ఇక్కడ నుంచి వెళ్లిపో అని జెస్సి బతిమలాడటం జానకి కంట పడుతుంది. జెస్సి ఇంటికి వచ్చిందంటే ఏదో సీరియస్ విషయమై ఎంతో కనుక్కుందామని జానకి అనుకుంటూ ఉండగా జ్ఞానంబ పిలుస్తుంది.

ఇంట్లో అందరికీ జ్ఞానంబ విందు భోజనం ఏర్పాటు చేస్తుంది. ఈరోజు ఎలాగైనా కుర్చీలో కూర్చునే భోజనం చెయ్యాలని మల్లిక అనుకుంటూ ఉంటుంది. కింద కూర్చుని తినమని గోవిందరాజులు చెప్తాడు. నేను కింద కూర్చుని తింటే కడుపులో బిడ్డకి ప్రమాదం కదా అని అంటుంది. బిడ్డకి ప్రమాదం నెలలు నిండినాక ఇప్పుడు కాదులే పో వెళ్ళి కింద కూర్చో అంటుంది. నేను కింద కూర్చుంటే మీకే అవమానం ఏదైనా జరిగి కడుపు పోతే అందరూ మిమ్మల్నే అంటారు అని మల్లిక అనేసరికి జ్ఞానంబ నాలుగు చీవాట్లు పెట్టి కుర్చీలో కూర్చొని తినమని అంటుంది. జానకి మల్లికకి వడ్డిస్తుంది. ఇదే సందు దొరికిందనుకుని అందరి ముందు జానకి నెల తప్పలేదని అవమానకరంగా మాట్లాడుతుంది. వచ్చే సంవత్సరానికైనా నీ కడుపు పండాలని కోరుకుంటున్న అని వెటకారంగా మాట్లాడుతుంటే గోవిందరాజులు కౌంటర్ వేస్తాడు. అఖిల్ పరధ్యానంగా ఉండటం జానకి గమనిస్తుంది. వాళ్ళిద్దరి మధ్య ఏం జరిగిందో వెంటనే తెలుసుకోవాలని జానకి అనుకుంటుంది.     

Also Read: పరధ్యానంలో రిషి - రిషి ధ్యానంలో వసు, ప్రేమ పిచ్చి ముదిరింది!

Published at : 30 Aug 2022 10:40 AM (IST) Tags: Janaki Kalaganaledu Serial Today Episode Written Update Janaki Kalaganaledu Serial Janaki Kalaganaledu Serial Today Janaki Kalaganaledu August 30th

సంబంధిత కథనాలు

Ahimsa Movie Teaser : ముద్దు ఇవ్వడు, ఇవ్వనివ్వడు - బుద్ధుడికి హింస ఎదురైతే?

Ahimsa Movie Teaser : ముద్దు ఇవ్వడు, ఇవ్వనివ్వడు - బుద్ధుడికి హింస ఎదురైతే?

Gruhalakshmi October 6th: నిజం బయటపెట్టిన సామ్రాట్- తులసితో కలిసి కోలాటం ఆడి అందరికీ షాక్ ఇచ్చిన సామ్రాట్

Gruhalakshmi October 6th: నిజం బయటపెట్టిన సామ్రాట్- తులసితో కలిసి కోలాటం ఆడి అందరికీ షాక్ ఇచ్చిన సామ్రాట్

Guppedantha Manasu October 6th Update: అప్పుడే ప్రేమ అంతలోనే కోపం, రిషిధార గమ్యం ఏంటో మరి!

Guppedantha Manasu October 6th Update: అప్పుడే ప్రేమ అంతలోనే కోపం, రిషిధార గమ్యం ఏంటో మరి!

Karthika Deepam October 6th Update: అడుగడుగునా నిలదీస్తున్న కార్తీక్ - మోనితకి మొదలైన కౌంట్ డౌన్, టెన్షన్లో దీప!

Karthika Deepam October 6th Update: అడుగడుగునా నిలదీస్తున్న కార్తీక్ - మోనితకి మొదలైన కౌంట్ డౌన్, టెన్షన్లో దీప!

Devatha October 6th Update: మాధవ్ ప్లాన్ సక్సెస్, ప్రకృతి వైద్యశాలకి సత్య- నర్స్ చెంప పగలగొట్టిన రుక్మిణి

Devatha  October 6th Update: మాధవ్ ప్లాన్ సక్సెస్, ప్రకృతి వైద్యశాలకి సత్య- నర్స్ చెంప పగలగొట్టిన రుక్మిణి

టాప్ స్టోరీస్

తెలంగాణ ప్రజలను గెలిపించినట్టే దేశ ప్రజలను గెలిపిస్తాం: సీఎం కేసీఆర్

తెలంగాణ ప్రజలను గెలిపించినట్టే దేశ ప్రజలను గెలిపిస్తాం: సీఎం కేసీఆర్

RRR For Oscars : ఆస్కార్స్‌కు 'ఆర్ఆర్ఆర్' - తొలి అడుగు పడింది!

RRR For Oscars : ఆస్కార్స్‌కు 'ఆర్ఆర్ఆర్' - తొలి అడుగు పడింది!

ఉన్న ప్రతిపక్షాలకే ఆదరణ లేదు- వచ్చే బీఆర్‌ఎస్‌ ఏం చేస్తుంది: ఏపీ మంత్రులు

ఉన్న ప్రతిపక్షాలకే ఆదరణ లేదు- వచ్చే బీఆర్‌ఎస్‌ ఏం చేస్తుంది: ఏపీ మంత్రులు

Weather Latest Update: నేడు ఈ జిల్లాలకు వర్షం ఎలర్ట్! ఈ రెండ్రోజులు దంచికొట్టనున్న వానలు

Weather Latest Update: నేడు ఈ జిల్లాలకు వర్షం ఎలర్ట్! ఈ రెండ్రోజులు దంచికొట్టనున్న వానలు