Karthika Deepam August 30 Update: అసలు ఏం జరుగుతోందని నిలదీసిన కార్తీక్, మోనితకు సవాల్ విసిరి వెళ్లిన దీప!
Karthika Deepam August 30 Episode 1444: బుల్లితెర ప్రేక్షకుల్ని మెప్పిస్తోన్న ‘కార్తీకదీపం’ సీరియల్ మలుపులు తిరుగుతోంది. కార్తీక్ ని హాస్పిటల్ నుంచి తీసుకెళ్లిపోయింది మోనిత అని క్లారిటీ వచ్చింది.
![Karthika Deepam August 30 Update: అసలు ఏం జరుగుతోందని నిలదీసిన కార్తీక్, మోనితకు సవాల్ విసిరి వెళ్లిన దీప! Karthika Deepam August 30 Episode 1444 Written Update Today Episode Karthika Deepam August 30 Update: అసలు ఏం జరుగుతోందని నిలదీసిన కార్తీక్, మోనితకు సవాల్ విసిరి వెళ్లిన దీప!](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/08/30/8283585c4095023e96f6bfe56e3102e01661827758628217_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Karthika Deepam August 30 Episode 1444
కార్తీక్ నిద్రపోతుండగా అక్కడికి వచ్చిన మోనిత కార్తీక్ కీ దుప్పటి కప్పి అలా చూస్తూ మన ప్రేమకు ఇన్ని అడ్డంకులు ఏంటి కార్తీక్, దీప ఆ యాక్సిడెంట్ లో చనిపోయింది అనుకుంటే మళ్ళీ నీ ఫోటో పట్టుకుని రోడ్లమీద తిరుగుతుంది ఈసారి ఎట్టి పరిస్థితుల్లోనూ నిన్ను వదులుకోను అని తనలో తానే మాట్లాడుకుంటూ ఉంటుంది మోనిత. మరి ఏదో ఒక రోజు నా దగ్గర కార్తీక్ ఉన్నాడు అని ఆ దీపకీ తెలిస్తే పరిస్థితి ఏమి అంటూ టెన్షన్ పడుతూ ఉంటుంది.
Also Read: కార్తీక్ కి దీప గతం గుర్తొచ్చేలా చేయగలదా, మోనితపై సౌందర్యలో మొదలైన అనుమానం!
మరొకవైపు సౌందర్య, ఆనందరావు లు మోనిత గురించి ఆలోచిస్తూ మోనిత ప్రవర్తన పై అనుమాన పడుతుంటారు.
సౌందర్య: మోనిత విషయంలో నాకు కొంచెం భయంగా ఉంది
ఆనందరావు: అదంతా ఏం జరగదు ధైర్యంగా ఉండు అని ధైర్యం చెబుతాడు
సౌందర్య: అది నిజంగా వేరే పెళ్లి చేసుకుని ఉంటే ధైర్యంగా చెప్పి ఉండేది..ఇప్పటికీ కార్తీక్ జపం చేస్తోందంటే ఏదో జరుగుతోంది. అదంతా కనిపెడతాను...
మరొకవైపు కార్తీక్ అతని డ్రైవర్ శివ కార్ లో వెళ్తూ ఉండగా అప్పుడు శివ మేడంకి మీరు కార్ డ్రైవింగ్ చేస్తున్నట్టు చెబుతాను సార్ అని అనడంతో వెంటనే కార్తీక్ కోపంతో కార్ దిగి వెళ్ళిపోతూ ఉంటాడు. ఇంతలోనే అటుగా దీప వస్తూ ఉంటుంది. అప్పుడు కార్తీక్ నేను రాను అంటు నడుచుకుంటూ వెళుతుండగా డ్రైవర్ బ్రతిమలాడుతూ ఉంటాడు. అది చూసిన దీప, డాక్టర్ బాబు డాక్టర్ బాబు అని అరుస్తూ డాక్టర్ బాబు దగ్గరికి వచ్చేసరికి కార్తీక్ అక్కడి నుంచి కారులో వెళ్లిపోతాడు. ఆ తర్వాత దీప ఆటోలో కార్తీక్ ని ఫాలో అవుతూ వెళ్తుంది.
దీప...డాక్టర్ అన్నయ్యకి ఫోన్ చేసి జరిగిందంతా చెబుతుంది.
మరొకవైపు శౌర్య ఆటో కి వెనుకవైపు అమ్మానాన్న ఎక్కడ ఉన్నారు అని రాసి దాన్ని చూసి ఎమోషనల్ అవుతూ ఉండగా ఇంతలోనే వారణాసి అక్కడికి రావడంతో వారణాసిని వాళ్ళ నాన్నమ్మ వాళ్ళు పంపించారు అనుకుని సీరియస్ అవుతుంది. అప్పుడు వారణాసి లేదమ్మా అని చెప్పడంతో అప్పుడు సౌర్య సైలెంట్ అయిపోతుంది. అప్పుడు వారణాసికి తాను ఎవరన్నది ఎవ్వరికీ చెప్పొద్దంటుంది శౌర్య. అప్పుడు పిన్ని, బాబాయ్ ని పిలిచి మా మావయ్య అని పరిచయం చేస్తుంది.
Also Read: పరధ్యానంలో రిషి - రిషి ధ్యానంలో వసు, ప్రేమ పిచ్చి ముదిరింది!
ఆ తర్వాత దీప, కార్తీక్ ని ఫాలో అవుతూ మోనిత బట్టల షాప్ దగ్గరికి వెళ్తుంది. కార్తీక్ లోపల వెళుతుండగా డాక్టర్ బాబు అంటూ అక్కడికి వెళుతుంది దీప. నేను మీ డాక్టర్ బాబుని కాదు అనడంతో వెంటనే అక్కడికి ఎవరు కార్తీక్ అంటూ మోనిత వస్తుంది. దీప,మోనిత ఒకరినొకరు చూసుకుని షాక్ అవుతారు. అప్పుడు దీప ,మోనిత ను నిలదీయడంతో మోనిత మాత్రం దీప అంటే ఎవరో తెలియనట్టుగా నటిస్తుంది. అప్పుడు కార్తీక్,ఈమెకు నువ్వు ఎవరో తెలిసినప్పుడు నేను కూడా తెలిసి ఉంటుంది కదా అని అనడంతో మోనిత మాత్రం లేదు కార్తీక్ అది ఏదో పిచ్చిది అని అంటుంది. అంతే కాకుండా నేను ఈమెను ఇంతవరకు చూడలేదు అంటూ నటిస్తుంది మోనిత. అప్పుడు డబ్బు కోసం ఇలాంటి వాళ్ళు వస్తుంటారు అని మోనిత అనడంతో...ఎవరే డబ్బు కోసం వచ్చింది నా మాంగల్యం కోసం వచ్చానంటూ దీప తన తాళిబొట్టును చూపిస్తుంది.
ఎపిసోడ్ ముగిసింది...
రేపటి( బుధవారం) ఏపిసోడ్ లో
డాక్టర్ బాబు నాకోసం వస్తారని దీప అంటే.. మొన్న ప్రమాదంతో చచ్చి బతికారు..ఆ మరణంతో డాక్టర్ బాబు శకం ముగిసింది. ఎప్పటికీ కార్తీక్ నీ సొంతం అవలేడని మోనిత అంటే..అవుతుంది అంతవరకూ నా డాక్టర్ బాబుని జాగ్రత్తగా చూసుకో అని సవాల్ చేసి వెళ్లిపోతుంది దీప
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)