News
News
X

Janaki Kalaganaledu August 22 Update: శుభవార్త చెప్పిన మల్లిక సంతోషంలో జ్ఞానంబ- జానకికి చీవాట్లు, చావే గతి అంటున్న జెస్సి

జానకి, జెస్సీలు మాట్లాడుకోవడం చూసి జ్ఞానంబ అరుస్తుంది. తనతో స్నేహం వద్దని హెచ్చరిస్తుంది. ఈరోజు ఎపిసోడ్లో ఏం జరిగిందంటే..

FOLLOW US: 

జానకి కాలేజీకి వెళ్తుంటే జ్ఞానంబ ఆపి మాట్లాడుతుంది. ‘ఎలా చెప్పాలి నీకు ఎలా చెప్తే అర్థం అవుతుందో నాకు అర్థం కావడం లేదు. నీ చదువుకు నేను ఒప్పుకున్నప్పుడే స్పష్టంగా చెప్పాను నీ చదువు కోడలిగా నీ బాధ్యతకి భార్యగా నువ్వు నిర్వర్తించాల్సిన ధర్మానికి ఆటంకం కాకూడదని.. కానీ ఇప్పుడు అదే జరుగుతుంటే ఏం మాట్లాడాలో కూడా అర్థం కావడం లేదు. రాత్రి నువ్వు నీ చదువు ధ్యాసలో పడి నా కొడుకుని పట్టించుకొకపోవడం నేను చూశాను. మీ ఏకాంతానికి ఇబ్బంది రాకూడదనే కదా నిన్ను రాత్రి పూట కాలేజీకి కాకుండా పగలు పూట కాలేజీలో చేర్పించాను. నీకు పరీక్షలు ఉన్నాయనే కదా ఇంటి పనులు మల్లికకి అప్పగించాను. నీకు, నీ చదువు మీద నీకున్న ఇష్టానికి అంత విలువ ఇచ్చినప్పుడు నువ్వు నాకు నా మాటకి ఇచ్చే విలువ ఇదేనా’ అని అడుగుతుంది. అఖిల్, జెస్సిల మధ్య ప్రేమ ఉందేమో అనుమానం ఉంది, ఆ ప్రేమ ఈ ఇంటికి ఎక్కడ సమస్యలు తీసుకొస్తుందో అని ఆలోచిస్తూ ఉండిపోయాను అంతే తప్ప చదువు ధ్యాసలో పడి నా భర్తని నిర్లక్ష్యం చెయ్యలేదు అత్తయ్యగారు అని జానకి మనసులో అనుకుంటుంది.

‘నేను ఎన్ని సార్లు చెప్పినా నేను ఎంత కోప్పడి చెప్పినా ప్రయోజనం లేదు కదా. నా మీద నీకు అంతా గౌరవం ఉంటే నాకు ఇలా బాధపడే పరిస్థితి తీసుకొచ్చి ఉండేది కాదు కదా. నీకు చెప్పి చెప్పి నాకు కంఠ శోష కదా’ అని అంటుంటే అత్తయ్య గారు అని మల్లిక అరుచుకుంటూ వచ్చి జానకి మీరు పెట్టిన షరతులు తప్పింది ఒక అంకె కొట్టేయండి కొట్టేయండి అని అరుస్తుంది. ఆ మాటకి గోవిందరాజులు ప్రతిదానికి మధ్యలో వచ్చి పెట్రోల్ పొయ్యడం తప్ప వేరే పని లేదా అని చీవాట్లు పెడతాడు. అమ్మా ఇందులో జానకి గారి తప్పేమీ లేదు పరీక్షలు దగ్గర పడుతున్నాయి కదా అందుకే చదువుకోమని నేనే చెప్పాను అని రామా చెప్తాడు. మల్లిక మళ్ళీ అడ్డుపడుతుంది. ఏ కారణంతో చేసిన తప్పు తప్పే అని అంటుంటే జ్ఞానంబ తిడుతుంది. మరోసారి ఇలా జరగకూడదు నీకు చెప్పే పరిస్థితి రాకూడదని అదే వస్తే నేను తీసుకోబోయే నిర్ణయం చాలా కఠినంగా ఉంటుందని హెచ్చరించి జ్ఞానంబ వెళ్ళిపోతుంది.

Also Read: ప్రాజెక్ట్ తెచ్చేసిన తులసి, సామ్రాట్ క్షమాపణలు- ప్రేమ్ ఇంటికి శ్రుతి, తులసి మీద అభి చిందులు

జెస్సి జ్ఞానంబ మాటలు తలుచుకుని ఆలోచిస్తు ఉంటే జానకి వచ్చి పలకరిస్తుంది. ఆవిడ మీ అత్తగారా టెన్షన్, భయంగా ఉందని అంటుంది. ఆవిడకి అసలే నా మీద మంచి అభిప్రాయం లేదు, నామీద చాలా కోపంగా ఉంది మా పెళ్ళికి ఒప్పుకుంటుందా లేదా అని చాలా భయంగా ఉందని జెస్సి అంటుంటే పెళ్లి ఏంటి అని షాక్ గా జానకి అడుగుతుంది. అదేంటక్కా అలా అడుగుతున్నావ్ నేను అఖిల్ ప్రేమించుకున్నాం అని చెప్పేస్తుంది. ఏంటి జెస్సి నువ్వు చెప్పేది మీరిద్దరు ఫ్రెండ్స్ కాదా అని అడుగుతుంది. లేదక్కా మేమిద్దరం రెండేళ్లుగా లవ్ లో ఉన్నాం సెటిల్ అయ్యినాక ఇంట్లో వాళ్ళకి చెప్పి ఒప్పించి పెళ్లి చేసుకోవాలని అనుకున్నాం. ఇప్పుడు మా పెళ్ళికి నువ్వే దేవతలా కనిపిస్తున్నావ్. ఆమెకి నా గురించి కాస్త మంచిగా చెప్పి మా పెళ్ళికి నువ్వే హెల్ప్ చెయ్యాలి ప్లీజ్ అక్కా అని జెస్సి బతిమలాడుతుంది.

మీది తెలిసి తెలియని వయసు, ఈ వయసులో అట్రాక్షన్ ఉంటుంది. మీరు ఈ విషయం మనసులో నుంచి తీసేసి చదువు మీద దృష్టి పెట్టండి అని జానకి అంటుంది. మాది నిజమైన ప్రేమ అఖిల్ అంటే నాకు చాలా ఇష్టం ఆ ఆలోచనే నేను తట్టుకోలేను, నేను గొడవపడిన వ్యక్తి అఖిల్ అమ్మగారని తెలిసిన దగ్గర నుంచి అఖిల్ నాకు ఎక్కడ దూరం అవుతాడో అని భయంగా ఉంది. ఒకవేళ అదే జరిగితే నాకు చావే గతి అని అంటుంది. ఆ మాటకి జానకి అలాంటి మాటలు మాట్లాడకు అని అంటుంది. పరిస్థితి అంతా దూరం రాకుండా ఉండాలంటే నువ్వే హెల్ప్ చెయ్యాలని అడుగుతుంది. మా అత్తయ్యగారు ఆచార సాంప్రదాయాల విషయంలో చాలా నిక్కచ్చిగా ఉంటారు ఆమె కోడళ్ళు కూడ అలాగే ఉండాలని అనుకుంటారు. నిన్ను ఆమె అంగీకరించడం కష్టం పరిస్థితి అర్థం చేసుకో అని సర్ది చెప్తుంది. అఖిల్ దూరమైతే నా నిర్ణయం మాత్రం మారదు అని జెస్సి అంటుంది.

Also Read: మన పెళ్లి ఎప్పుడని అభిని నిలదీసిన మాళవిక- యష్ మీద పగ తీర్చుకోవడానికి అభికి దొరికిన అస్త్రం

ఇక మల్లిక వాంతులు చేసుకుంటుంది. అప్పుడే అక్కడికి నీలావతి వస్తుంది. మల్లికని పరిశీలించి జ్ఞానంబ నువ్వు నానమ్మవి కాబోతున్నావని చెప్తుంది. నీ చిన్న కోడలు నెల తప్పిందని అంటుంది. నీలావతి నువ్వు చెప్పింది నిజమా అని అడుగుతుంది. అవును ఇవి అజీర్తి వాంతులు కావు వేవిళ్ళ వాంతులని అంటుంది. ఇక ఇంట్లో అందరూ మల్లికకు కంగ్రాట్స్ చెప్తారు. అందరూ ఒకరికొకరు స్వీట్స్ తినిపించుకుంటూ సంతోషంగా ఉంటారు. జ్ఞానంబ మల్లిక విషయంలో చాలా సంతోషంగా ఉంటుంది. ఇదొక పండగలా చెయ్యాలని ఉంది మన చుట్టూ పక్కల వాళ్ళని పిలిచి భోజనాలు పెట్టి వాళ్ళ ఆశీర్వాదలు తన కడుపులో బిడ్డకి వచ్చేలా చెయ్యాలని ఉందని చెప్తుంది. నీ ఆలోచన బాగుంది కానీ ఒకసారి నువ్వే ఒక మాట అన్నావ్ మల్లిక కంటే ముందు జానకి కడుపు పండేలా చెయ్యమని ఆ దేవుడని కోరుకుంటున్నావ్ అని చెప్పావ్ చిన్న కొడాలి కంటే ముందు పెద్ద కోడలు నెల తప్పిందంటే నాలుగు నాలుగురకలుగా మాట్లాడుకుంటారు. ఆ అవమానం జానకి తట్టుకోలేదని నువ్వే చెప్పావ్ ఇప్పుడు బిడ్డని దీవించడానికి వచ్చిన అమ్మలక్కలు జానకిని మాటలు అంటే తను భరించగలదా చెప్పమని గోవిందరాజులు అంటాడు. ఆ మాటలు జానకి వింటుంది. మీరు చెప్పింది నిజమే కానీ జానకి కోసం నా జ్ఞాపకాలని ఎందుకు తీర్చుకోకూడదని మల్లిక వేలెత్తి చూపిస్తే మనం ఏమని సమాధానం చెప్తాం అని జ్ఞానంబ అంటుంది. 

Published at : 22 Aug 2022 10:55 AM (IST) Tags: Janaki Kalaganaledu Serial Today Episode Written Update Janaki Kalaganaledu Serial Janaki Kalaganaledu Serial Today Janaki Kalaganaledu August 22

సంబంధిత కథనాలు

Prey Review: ప్రే సినిమా రివ్యూ: ఓటీటీలో డైరెక్ట్‌గా రిలీజ్ అయిన లేటెస్ట్ ప్రిడేటర్ సినిమా ఎలా ఉందంటే?

Prey Review: ప్రే సినిమా రివ్యూ: ఓటీటీలో డైరెక్ట్‌గా రిలీజ్ అయిన లేటెస్ట్ ప్రిడేటర్ సినిమా ఎలా ఉందంటే?

Devi Sri Prasad: స్టార్ హీరోతో విబేధాలు - దేవిశ్రీప్రసాద్ రియాక్షన్ ఇదే!

Devi Sri Prasad: స్టార్ హీరోతో విబేధాలు - దేవిశ్రీప్రసాద్ రియాక్షన్ ఇదే!

RGV On Adipurush Teaser: ఆయన లుక్ నాక్కూడా నచ్చలేదు, ప్రభాస్‌పై కుట్ర పెద్ద జోక్ - ‘ఆది పురుష్’ టీజర్ పై ఆర్జీవీ షాకింగ్ కామెంట్స్!

RGV On Adipurush Teaser: ఆయన లుక్ నాక్కూడా నచ్చలేదు, ప్రభాస్‌పై కుట్ర పెద్ద జోక్ - ‘ఆది పురుష్’ టీజర్ పై ఆర్జీవీ షాకింగ్ కామెంట్స్!

Ori Devuda: 'వైఫ్ లో ఫ్రెండ్ ని చూడొచ్చు, కానీ ఫ్రెండే వైఫ్ గా వస్తే' - 'ఓరి దేవుడా' ట్రైలర్!

Ori Devuda: 'వైఫ్ లో ఫ్రెండ్ ని చూడొచ్చు, కానీ ఫ్రెండే వైఫ్ గా వస్తే' - 'ఓరి దేవుడా' ట్రైలర్!

Bigg Boss 6 Telugu: 'గొంతు లేపడం ఒక్కటే గొప్ప కాదు' - గీతూపై బాలాదిత్య ఫైర్!

Bigg Boss 6 Telugu: 'గొంతు లేపడం ఒక్కటే గొప్ప కాదు' - గీతూపై బాలాదిత్య ఫైర్!

టాప్ స్టోరీస్

Minister Karumuri On BRS : కేసీఆర్ కాదు కదా కేసీఆర్ తాత వచ్చినా మాకేం నష్టం లేదు, మంత్రి కారుమూరి సంచలన వ్యాఖ్యలు

Minister Karumuri On BRS : కేసీఆర్ కాదు కదా కేసీఆర్ తాత వచ్చినా మాకేం నష్టం లేదు, మంత్రి కారుమూరి సంచలన వ్యాఖ్యలు

Hyderabad Metro Rail : మెట్రో ప్రయాణికులకు గుడ్ న్యూస్, రాత్రి 11 గంటల వరకు సేవలు పొడిగింపు

Hyderabad Metro Rail : మెట్రో ప్రయాణికులకు గుడ్ న్యూస్, రాత్రి 11 గంటల వరకు సేవలు పొడిగింపు

Tirumala : తిరుమలలో అనూహ్యంగా పెరిగిన భక్తుల రద్దీ, యాత్ర వాయిదా వేసుకోవాలని టీటీడీ విజ్ఞప్తి

Tirumala : తిరుమలలో అనూహ్యంగా పెరిగిన భక్తుల రద్దీ, యాత్ర వాయిదా వేసుకోవాలని టీటీడీ విజ్ఞప్తి

కార్లకు ఐరన్ బంపర్ గార్డ్స్ పెట్టుకోవడం తప్పు అని మీకు తెలుసా? ఇన్సూరెన్స్ కూడా రాదు!

కార్లకు ఐరన్ బంపర్ గార్డ్స్ పెట్టుకోవడం తప్పు అని మీకు తెలుసా? ఇన్సూరెన్స్ కూడా రాదు!