News
News
X

మన పెళ్లి ఎప్పుడని అభిని నిలదీసిన మాళవిక- యష్ మీద పగ తీర్చుకోవడానికి అభికి దొరికిన అస్త్రం

యష్ కొడుకు ఆదిత్య రంగలోకి దిగాడు. తనని అడ్డుపెట్టుకుని పగ తీర్చుకోవాలని అభి కుట్రలు పన్నుతాడు. దీంతో కథనం ఉత్కంఠగా మారింది. ఈరోజు ఎపిసోడ్లో ఏం జరిగిందంటే..

FOLLOW US: 

"అమ్మా ఖుషి నేను నీకోసమే వచ్చానమ్మ.. నువ్వంటే నాకు ప్రాణం, నీకోసమే ఇక్కడికి వచ్చాను. నీకోసం ఏం చెయ్యడానికైనా సిద్ధమే. ఒక్కసారి అమ్మా అని పిలువమ్మా.. నువ్వు ఎవరిని చూసి భయపడకు మన ఇద్దరి మధ్య ఎవరు వచ్చిన మనల్ని విడదీయడం ఎవరి వల్ల కాదని నిరూపించడానికే వచ్చాను. ఖుషి నాతో మన ఇంటికి వస్తావా నేకు ఏం కావాలన్న కొంటాను నిన్ను చాలా ప్రేమగా చూసుకుంటాను వస్తావా" అని మాళవిక అడుగుతుంది. నేను రాను అని ఖుషి చెప్తుంది. ఒక్కసారి నన్ను అమ్మా అని పిలవమని అడుగుతుంది కానీ ఖుషి ఒప్పుకోదు. వేదను చూపించి తానే మా అమ్మ అని తన దగ్గర నుంచి వెళ్ళిపోతుంది. వేద అమ్మే మా అమ్మ అని తనని కౌగలించుకుంటుంది. మాళవిక చాలా బాధపడుతుంది. కోల్పోయింది ఏంటో ఇప్పటికైనా అర్థం అయ్యిందా అని యష్ అంటే నేనేమీ కోల్పోలేదు మీరే మార్చేశారు. ఈ వేద పేగు పంచకపోయిన బాగానే వలలో వేసుకుందని మాళవిక అంటుంది.

స్వచ్చమైన ప్రేమ చూపించడం తప్ప నాకు ఇంకేమీ రాదని వేద అంటుంది. పిల్లలు పుట్టే అదృష్టం కూడా లేదు అందుకే అవకాశం దొరికిందని మొత్తం ప్రేమ చూపిస్తున్నావ్ దిక్కులేక నా కూతుర్ని దగ్గరకు చేర్చుకున్నావ్ అని మాళవిక వేదని తిడుతుంది. చాలు ఆపుతావా ఇంటికి వచ్చింది వేదతో గొడవ పెట్టుకోడానికి కాదు ఖుషీలో ప్రేమ తెలుసుకోవడానికి అంటాడు. నాకు దక్కాల్సిన ప్రేమ దానికి దక్కుతుంటే చూస్తూ ఊరుకోమంటావా అని మాళవిక అంటే అది ప్రేమ కాదు పంతం అని యష్ అంటాడు. పేగు పంచిన తల్లిని అంటున్నావ్ కదా ఖుషితో అమ్మా అని పిలిపించుకో నీ తల్లి ప్రేమ ఏంటో చూపించు అని యష్ చెప్తాడు. చాలా సంతోషం ఆ పసి మనసుని మీరు బాగా మార్చేశారు అని మాళవిక అంటుంది. నా స్థానంలో ఉండి గెలిచానని సంతోషపడకు ఏదో ఒక రోజు నీ సంగతి చెప్తాను అని మాళవిక కోపంగా చెప్తుంది. నువ్వు ఖుషికి ఇవ్వలేని ప్రేమ కంటే రెట్టింపు ప్రేమ వేద ఇస్తుంది అందుకే ఖుషి తనని పట్టుకుని వదలడం లేదు నిన్ను చూసి భయపడతుందని చెప్తాడు. మాళవికని చూసి ఖుషి వేద వెనక దాక్కుంటుంది. దాంతో మాళవిక అక్కడ నుంచి వెళ్ళిపోతుంది.

Also Read:  రిషి కోసం ఎంగేజ్మెంట్ రింగ్ చేయించే పనిలో పడిన వసు, తల్లిపై ద్వేషం తగ్గించుకున్న రిషి

మాళవిక ఖుషి మాటలు తలుచుకుని బాధపడుతూ ఉంటుంది. అప్పుడే అభిమన్యు వస్తాడు. ఏంటి అలా ఉన్నావ్ మీ మాజీ అత్తగారి ఇంట్లో అవమానం జరిగిందా అని వెటకారంగా అంటాడు. మనం పెళ్లి ఎప్పుడు చేసుకుందాం అని మాళవిక అడుగుతుంది. ఇప్పుడు పెళ్లి ఎందుకు నిన్ను నేను బాగానే చూసుకుంటున్నాను కదా అని అభి అంటే భార్యగా చూసుకోవడం వేరు ప్రేమగా దగ్గరకి తీసుకోవడం వేరు. మగాడితో బతికే ఆడదానికి మెడలో తాళి లేకపోతే మంగల్యాణికే కాదు ఆత్మాభిమాననికి అవమానం. ఇంతకాలం వెయిట్ చేసింది చాలు నాకంటూ ఒక జీవితం కావాలి నేనంటూ సమాజంలో గౌరవంగా బతకాలి అని కోపంగా చెప్తుంది. ఏమైంది బంగారం ఎవరైనా ఏమైనా అన్నారా పద అలా లాంగ్ డ్రైవ్ కి వెళదాం అని అంటే.. ఇక చాలు అభి అని మాళవిక సీరియస్ అవుతుంది. ఈ మాయలు మంత్రాలు  చాలు పెళ్లి ఎప్పుడు చేసుకుంటావ్ అని నిలదీస్తుంది. చేసుకుంటాను ఖుషి మన దగ్గరకి రాగానే నువ్వు అడగకుండానే నిన్ను పెళ్లి చేసుకుంటానని అభి అంటే.. షటప్.. ఖుషి మన దగ్గరకి రావడానికి మన పెళ్ళికి సంబంధం ఏంటి కోపంగా అడుగుతుంది. నువ్వు సంతోషంగా ఉంటావని అంటే సంతోషం కోసం కాదు యష్ మీద పగతో ఉపయోగించుకుంటున్నావ్ అని మాళవిక బాధపడుతుంది. నేను తీసుకున్న నిర్ణయం తప్పో ఒప్పో నాకు తెలియదు కానీ నా జీవితం అంతా ప్రశ్నలమయం అయ్యింది, ఇంకోసారి యష్ మీద పగ తీర్చుకుంటాను సాయం చెయ్యి అంటే మాత్రం ఊరుకొను ఫో అవతలకి అనేసి వెళ్ళిపోతుంది.

యష్ ఒకచోట కూర్చుని తన కొడుకు ఆదిత్యకి బర్త్ డే విషెస్ చెప్పలేకపోతున్నా అని బాధపడతాడు. అప్పుడే వేద వచ్చి తన మూడ్ మార్చేందుకు ప్రయత్నిస్తుంది. కానీ యష్ కన్నీళ్ళు పెట్టుకుంటాడు. వేదతో తన బాధ చెప్పకపోవడంతో ఏమైందా అని ఆలోచిస్తుంది. అదే ఆలోచిస్తూ ఇంట్లోకి వచ్చి మాలినిని ఢీ కొడుతుంది. ఆయన చాలా బాధపడుతున్నారు కళ్లలో నీళ్ళు కూడా వచ్చాయి ఆయన్ని అలా చూడలేకపోతున్నాను ఏమైంది చెప్పమని అడుగుతుంది. యష్ కన్నీళ్ళకి కారణం ఆదిత్య అని మాలిని చెప్తుంది. ఈరోజు వాడి బర్త్ డే నా మనవడి పుట్టినరోజు నా కొడుకు మరచిపోలేని రోజు అని చెప్పేసి అక్కడ నుంచి బాధగా వెళ్ళిపోతుంది.

Also Read: డాక్టర్ బాబు-దీప ఎవరంటూ షాక్ ఇచ్చిన కార్తీక్, ఇప్పుడు వంటలక్క ఏం చేయబోతోంది!

వేద తన మావయ్య దగ్గరకి వస్తుంది. ఆదిత్య ఆయనకి దూరం అవడానికి కారణం ఏంటి అని అడుగుతుంది. ఇంకెవరూ మాళవిక అని చెప్తాడు. ఆదిత్య పుట్టిన క్షణం నుంచి యష్ లో చాలా మార్పు వచ్చింది పుట్టిన బిడ్డని చేతుల్లోకి తీసుకుని చాలా ఏడ్చాడు, తన చుట్టూ ఉన్న ప్రపంచాన్ని మర్చిపోయి ఆదిత్యతోనే ఉండేవాడు అని రత్నం చెప్తాడు. పాపం ఆయన తన మనసులో అంతా ప్రేమ ఉంది కాబట్టే అంతగా బాధపడుతున్నాడని వేద అంటుంది. మాళవిక బాధగా కూర్చుని నా కన్నీటిని తుడిచి నాకు ధైర్యం చెప్పేవాళ్ళు ఎవరు లేరా రారా అని చాలా కుమిలిపోతుంది. అప్పుడే ఆదిత్య వచ్చి అమ్మా అని పిలుస్తుంది. ఆ పిలుపుతో పరవశించిపోతుంది.. కొడుకుని ప్రేమగా దగ్గరకి తీసుకుని తనివితీరా ముద్దులు పెట్టుకుంటుంది. ఆదిత్య కోసం యష్ కొన్నవి అన్నీ చూపిస్తాడు రత్నం.. అది చూసి వేద బాధపడుతుంది. ఈ సమస్యకి నువ్వే పరిష్కారం చూపించాలని రత్నం అడుగుతాడు. 

తరువాయి భాగంలో.. 

ఆదిత్య యష్ కి ఫోన్ చేస్తాడు. యష్ చాలా సంతోషంగా బర్త్ డే విషెస్ చెప్తాడు. నా బర్త్ డే నీకు బాగా గుర్తుందే ఈవినింగ్ బర్త్ డే పార్టీ ఉంది రమ్మని చెప్పడానికే మీకు ఫోన్ చేశాను. తాతయ్య, నానమ్మ మరి ముఖ్యంగా ఖుషిని కూడా తీసుకురండి అని కోపంగా చెప్తాడు. కానీ అదేమీ యష్ పట్టించుకోకుండా సంతోషంగా ఆదిత్య తనతో మాట్లాడిన విషయం తల్లికి సంబరంగా చెప్తాడు. బర్త్ డే పార్టీకి అంతా కలిసి వస్తుంటే అక్కడ సెక్యూరిటీ యష్ ని ఆపుతాడు. మిమ్మల్ని ఎవరు రమ్మన్నారు ఖుషిని సొంతం చేసుకున్నట్టు ఆదిత్యని కూడా నీ కొడుకు అంటావా ఏంటి అని మాళవిక అంటుంది.

Published at : 22 Aug 2022 08:14 AM (IST) Tags: Ennenno Janmalabandham Serial Ennenno Janmalabandham Serial Today Episode Ennenno Janmalabandham Serial Written Update Ennenno Janmalabandham Serial August 22

సంబంధిత కథనాలు

Balakrishna : 'జల్సా' రికార్డులు బ్రేక్ చేసిన బాలకృష్ణ 'చెన్నకేశవరెడ్డి'

Balakrishna : 'జల్సా' రికార్డులు బ్రేక్ చేసిన బాలకృష్ణ 'చెన్నకేశవరెడ్డి'

Bigg Boss 6 Telugu: బాలాదిత్యకు నాగార్జున పంచ్, ఆ ఇద్దరినీ నేరుగా నామినేట్ చేసిన హోస్ట్ - శనివారం ఎపిసోడ్ హైలైట్స్!

Bigg Boss 6 Telugu: బాలాదిత్యకు నాగార్జున పంచ్, ఆ ఇద్దరినీ నేరుగా నామినేట్ చేసిన హోస్ట్ - శనివారం ఎపిసోడ్ హైలైట్స్!

Bigg Boss 6 Telugu: ఈ వారం ఎలిమినేషన్ - నేహా చౌదరి అవుట్?

Bigg Boss 6 Telugu: ఈ వారం ఎలిమినేషన్ - నేహా చౌదరి అవుట్?

Ravi Teja: రవితేజ 'ధమాకా' సినిమాలో కామెడీ స్కిట్స్ - హైపర్ ఆది రాశారా?

Ravi Teja: రవితేజ 'ధమాకా' సినిమాలో కామెడీ స్కిట్స్ - హైపర్ ఆది రాశారా?

Sonal Chauhan Interview : నాగార్జునతో మాట్లాడాక ఆయనదీ నా వయసే అని...

Sonal Chauhan Interview : నాగార్జునతో మాట్లాడాక ఆయనదీ నా వయసే అని...

టాప్ స్టోరీస్

Chittoor Fire Accident: రేణిగుంటలో భారీ అగ్ని ప్రమాదం, ఇద్దరు చిన్నారులు సహా ముగ్గురు మృతి - డాక్టర్ సజీవదహనం

Chittoor Fire Accident: రేణిగుంటలో భారీ అగ్ని ప్రమాదం, ఇద్దరు చిన్నారులు సహా ముగ్గురు మృతి - డాక్టర్ సజీవదహనం

Pawan Politics : పవన్ లక్ష్యం అసెంబ్లీలో అడుగు పెట్టడమా .. అధికారమా? పార్ట్‌టైమ్ పాలిటిక్స్‌తో సాధించేదేంటి ?

Pawan Politics : పవన్ లక్ష్యం అసెంబ్లీలో అడుగు పెట్టడమా  .. అధికారమా? పార్ట్‌టైమ్ పాలిటిక్స్‌తో సాధించేదేంటి ?

IND Vs AUS Match: Hydలో నేడు భారీ ట్రాఫిక్ ఆంక్షలు, మీరు క్రికెట్ మ్యాచ్‌కి వెళ్తున్నారా? పార్కింగ్ వివరాలివీ

IND Vs AUS Match: Hydలో నేడు భారీ ట్రాఫిక్ ఆంక్షలు, మీరు క్రికెట్ మ్యాచ్‌కి వెళ్తున్నారా? పార్కింగ్ వివరాలివీ

Lok Sabha Election 2024: సోనియా గాంధీతో నితీశ్, లాలూ భేటీ- టార్గెట్ 2024పై చర్చ!

Lok Sabha Election 2024: సోనియా గాంధీతో నితీశ్, లాలూ భేటీ- టార్గెట్ 2024పై చర్చ!