Chiyaan61: రజనీకాంత్‌తో బ్యాక్ టు బ్యాక్ రెండు సినిమాలు చేసిన దర్శకుడితో విక్రమ్... దళిత్ సినిమా కన్ఫర్మ్
తెలుగు ప్రేక్షకులకు సైతం సుపరిచితుడైన తమిళ హీరో విక్రమ్ కొత్త సినిమా ప్రకటన వచ్చింది. రజనీకాంత్‌తో రెండు సినిమాలు చేసిన దర్శకుడితో ఆయన సినిమా చేస్తున్నారు.
![Chiyaan61: రజనీకాంత్‌తో బ్యాక్ టు బ్యాక్ రెండు సినిమాలు చేసిన దర్శకుడితో విక్రమ్... దళిత్ సినిమా కన్ఫర్మ్ Its Official: Studio Green to produce KE Gnanavel Raja to Vikram's 61st film in the direction of Pa Ranjith Chiyaan61: రజనీకాంత్‌తో బ్యాక్ టు బ్యాక్ రెండు సినిమాలు చేసిన దర్శకుడితో విక్రమ్... దళిత్ సినిమా కన్ఫర్మ్](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/12/02/9db40333875f6f6d7013426518a3511d_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా దర్శకుడు పా. రంజిత్ బ్యాక్ టు బ్యాక్ రెండు సినిమాలు... 'కబాలి', 'కాలా' చేశారు. ఆ సినిమాల కంటే ముందు తమిళంలో రెండు సినిమాలు చేశారు. అయితే... రజనీకాంత్ సినిమాలు తెలుగులోనూ విడుదల కావడంతో ఇక్కడ మెజారిటీ ప్రేక్షకులకు ఆ సినిమాల దర్శకుడిగా తెలుసు. ఇప్పుడు చియాన్ విక్రమ్ హీరోగా పా. రంజిత్ ఓ సినిమా చేయనున్నారు. వీళ్లిద్దరి కాంబినేషన్‌లో తొలి సినిమా ఇది.
హీరో విక్రమ్, దర్శకుడు పా. రంజిత్ కాంబినేషన్‌లో సినిమాను స్టూడియో గ్రీన్ పతాకంపై కె.ఇ. జ్ఞానవేల్ రాజా ప్రొడ్యూస్ చేయనున్నారు. గతంలో కార్తీ హీరోగా రంజిత్ దర్శకత్వం వహించిన 'మద్రాస్' సినిమాను ఆ సంస్థే నిర్మించింది. విక్రమ్, పా రంజిత్ కలయికలో రూపొందనున్న ఈ సినిమా గురించి కొన్ని రోజులుగా వార్తలు వస్తున్నాయి. ఈ రోజు స్టూడియో గ్రీన్ సంస్థ అధికారికంగా ప్రకటించింది. హీరోగా విక్రమ్ 61వ చిత్రమిది. ఇప్పటివరకూ పా. రంజిత్ చేసిన సినిమాలు గమనిస్తే... దళిత నేపథ్యంలో తీశారు. ఇప్పుడు విక్రమ్‌తో కూడా దళిత్ సినిమా తీస్తారని ఊహించవచ్చు.
కుమారుడు ధృవ్‌తో కలిసి నటించిన 'మహాన్' సినిమా విడుదల కోసం విక్రమ్ ఎదురు చూస్తున్నారు. ఆ చిత్రానికి కార్తీక్ సుబ్బరాజు దర్శకత్వం వహించారు. మరోవైపు పా రంజిత్ 'నట్చత్తిరమ్ నగర్జిరతు' చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఆ సినిమా పూర్తయిన తర్వాత విక్రమ్ సినిమా మొదలు కావచ్చు. సినిమాలో ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలు త్వరలో వెల్లడిస్తామని స్టూడియో గ్రీన్ సంస్థ తెలియజేసింది.
View this post on Instagram
Also Read: బికినీ షోలో ఇలియానా తర్వాతే ఎవరైనా అనేలా...
Also Read: బాయ్‌ఫ్రెండ్‌తో డబ్బింగ్ థియేటర్‌లో నయనతార...
Also Read: 'అఖండ' రివ్యూ: జాతర... బాలకృష్ణ మాస్ జాతర!
Also Read: 'నేను రోమియోని కాదు.. కానీ నేను జూలియట్‌నే'.. రాధే శ్యామ్ నుంచి మరో సాంగ్
Also Read: అందరూ ఆమె నీలికళ్లే చూశారు...ఆ కళ్లలో కన్నీళ్లు చూడలేదు..
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)