'Radhe Shyam' Song: 'నేను రోమియోని కాదు.. కానీ నేను జూలియట్‌నే'.. రాధే శ్యామ్ నుంచి మరో సాంగ్
రాధేశ్యామ్ సినిమాకు సంబంధించిన సెకండ్ సింగిల్ ను మేకర్స్ రిలీజ్ చేశారు. నగుమోము తారలే అంటూ సాగే ఈ పాటను సిద్ శ్రీరామ్ పాడగా జస్టిన్ ప్రభాకరన్ స్వరాలు సమకూర్చాడు.
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, పూజా హెగ్డే నటిస్తున్న మూవీ 'రాధేశ్యామ్'. రాధాకృష్ణ తెరకెక్కిస్తున్న ఈ చిత్రం జనవరి 14న సంక్రాంతి కానుకగా విడుదల కానుంది. రాధే శ్యామ్ అప్డేట్స్ కోసం ఫ్యాన్స్ ఆతృతగా ఎదురుచూస్తూనే ఉంటారు. ఇప్పటి వరకూ ప్రమోషన్స్ లో పెద్దగా స్పీడ్ చూపించని నిర్మాణ సంస్థ యూవీ క్రియేషన్స్ ఇప్పుడు జోరు పెంచుతోంది. ఈ మధ్యే రాధే శ్యామ్ నుంచి 'ఈ రాతలే' అనే మెలోడీ పాట విడుదలైంది. చాలా స్లోగా సాగిన ఈ సాంగ్..మెలోడీ లవర్స్ ని మైమరిపించింది. తాజాగా మరోసాంగ్ విడుదల చేసింది మూవీ యూనిట‌్.
Finally the wait is over, #LoveAnthem of the year is here 💕 #RadheShyam#NagumomuThaarale: https://t.co/RKdLYtYFhM#ThiraiyoaduThoorigai: https://t.co/tnImEiqpNB#NaguvanthaThaareye: https://t.co/ZS6potnaxz#MalaroduSaayame: https://t.co/uLkRfI5gAN pic.twitter.com/5jWSmbcRf0
— Radhe Shyam (@RadheShyamFilm) December 2, 2021
వాస్తవానికి 'రాధే శ్యామ్' సినిమాలో ఈ రెండో పాటను బుధవారం , డిసెంబర్ 1న విడుదల చేయాలని అనుకున్నారు. కానీ, విడుదల చేయలేదు. దివంగత గేయ రచయిత 'సిరివెన్నెల'కు నివాళిగా, ఆయనపై గౌరవంతో సెకండ్ సాంగ్ రిలీజ్ చేయడం లేదని చిత్ర నిర్మాణ సంస్థ యూవీ క్రియేషన్స్ సంస్థ పేర్కొంది. గురువారం ఉదయం పదకొండు గంటలకు విడుదల చేస్తామని తెలియజేసింది. ఈ మేరకు కాసేపటి క్రితం విడుదలైన సెకెండ్ సాంగ్ ఫ్యాన్స్ ని ఆకట్టుకుంటోంది.
నగుమోము తారలే అంటూ సాగే ఈ పాటను సిద్ శ్రీరామ్ పాడగా జస్టిన్ ప్రభాకరన్ సంగీతం అందించారు.
'నేను రోమియేను కాదు' అంటూ మరోసారి గ్లింప్స్‌లో చెప్పిన డైలాగునే రిపీట్ చేశాడు ప్రభాస్. దానికి సమాధానంగా పూజా హెగ్డే.. 'కానీ నేను జూలియట్‌నే. నన్ను ప్రేమిస్తే కచ్చితంగా చచ్చిపోతారు' అంటుంది. ప్రభాస్ తనకు రిలేషన్‌షిప్ వద్దని ఫ్లట్ రిషన్‌షిప్ మాత్రమే కావాలంటూ కొత్త రిలేషన్‌షిప్‌ను క్రియేట్ చేసే ప్రయత్నం చేశాడు. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి విడుదలైన సాంగ్, టీజర్ అన్ని కూడా ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. యూరప్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతున్న ఈ సినిమాలో ప్రభాస్ విక్రమాదిత్య గా కనిపించబోతున్నాడు. అలాగే భాగ్యశ్రీ , సత్య రాజు, జగపతిబాబు, మురళీశర్మ, ప్రియదర్శి తదితరులు కూడా ఈ సినిమాలో నటిస్తున్నారు.
Also Read: 'పావుగంటకొక పెక్.. రాత్రికొక పెగ్'.. బ్రహ్మానందంతో బాలయ్య అల్లరి..
Also Read: మహేష్ బాబు ఫ్యాన్స్‌కు షాక్.. ఆగిన షూటింగ్, సర్జరీ కోసం అమెరికాకు ప్రయాణం?