Mahesh Babu: మహేష్ బాబు ఫ్యాన్స్‌కు షాక్.. ఆగిన షూటింగ్, సర్జరీ కోసం అమెరికాకు ప్రయాణం?

మహేశ్ గెట్ వెల్ సూన్ అంటూ ట్విట్టర్లో హ్యాష్ ట్యాగ్స్ ట్రెండ్ అవుతున్నాయ్. ఇంతకీ మహేశ్ బాబుకి ఏం జరిగింది... లేటెస్ట్ మూవీ 'సర్కారువారి పాట' షూటింగ్ కి ఎందుకు బ్రేక్ పడింది..

FOLLOW US: 

సూపర్ స్టార్ మహేష్ బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో బిజీగా ఉన్నాడు.  పరశురామ్ దర్శకత్వంలో `సర్కార్ వారి పాట` మూవీ షూటింగ్ త్వరగా పూర్తిచేయాలని ప్లాన్ చేశారు. ఇప్పటికే సంక్రాంతి బరిలో రావాల్సిన ఈ సినిమా వాయిదా పడింది. దీంతో ఇంకా ఆలస్యం కాకుండా ఉండాలంటే శరవేగంగా షూటింగ్, పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ పూర్తిచేయాలన టార్గెట్ పెట్టుకున్నారు.  ఇంతలో మరోసారి ఈ మూవీ షూటింగ్ కి బ్రేక్ పడింది.

సూపర్‌స్టార్‌ మహేశ్‌ బాబు సర్జరీ కోసం అమెరికా వెళ్లనుండడమే కారణం అంటున్నారు.  గత కొన్నిరోజులుగా మోకాలికి సంబంధించిన సమస్యతో బాధపడుతున్న మహేశ్ బాబు శస్త్రచికిత్స కోసం  యూఎస్‌కి వెళ్లనున్నారని టాక్. దీంతో ప్రస్తుతం నటిస్తున్న సర్కారు వారి పాట షూటింగ్‌కు బ్రేక్‌ పడిందని తెలుస్తోంది. ఏకంగా రెండు నెలల పాటూ ఈ మూవీ షూటింగ్ వాయిదా పడనున్నట్టు సమాచారం. దీంతో అభిమానులు కలత చెందుతున్నారు. ఈ సందర్భంగా గెట్ వెల్ సూన్ అంటూ ట్వీట్లు చేస్తున్నారు. 

'సర్కారు వారి పాట' యాక్షన్ సీన్లు చేస్తున్నప్పుడు మహేశ్  మోకాలికి గాయం అయ్యింది. దానికి చిన్న సర్జరీ అవసరమని సోషల్ మీడియాలో ఇప్పటికే వార్తలొచ్చాయి.  వాస్తవానికి ఈ నెలలో సర్కార్ వారి పాట షూటింగ్ పూర్తి చేయాల్సి ఉండగా నొప్పి పెరగడం వల్లో ఏమో మళ్లీ బ్రేక్ తప్పలేదు.

'సర్కారువారి పాట' తర్వాత త్రివిక్రమ్ శ్రీనివాస్ తో  #SSMB28ని ప్రారంభించాల్సి ఉంది. ఈ లెక్కన ఈ మూవీ ప్రారంభోత్సవం కూడా లేట్ అయ్యే అవకాశాలున్నాయి. ఇప్పటికే 'సర్కార్ వారి పాట' రిలీజ్ ఏప్రిల్ కి వెళ్లింది . దీంతో సినిమాలు లేటైతే అయ్యాయి ఆరోగ్యం జాగ్రత్త,  గెట్ వెల్ సూన్ అంటూ అభిమానులు వరుస ట్వీట్లు చేస్తున్నారు. 
Also Read:  'పావుగంటకొక పెక్.. రాత్రికొక పెగ్'.. బ్రహ్మానందంతో బాలయ్య అల్లరి..

Also Read: 'ఫోకస్' టాస్క్ ఫన్నీ టాస్క్ గా మారిపోయిందే..

Also Read: థియేటర్లు దొరక్క... పదిహేను రోజులు వెనక్కి వెళ్లిన పూర్ణ సినిమా
 
ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి 
Published at : 02 Dec 2021 10:19 AM (IST) Tags: Mahesh Babu America Surgery Shock To Mahesh Babu Fans Sarkaruvaari Paata

సంబంధిత కథనాలు

F3 Movie: 'ఎఫ్3' బడ్జెట్ - రెమ్యునరేషన్సే ఎక్కువ?

F3 Movie: 'ఎఫ్3' బడ్జెట్ - రెమ్యునరేషన్సే ఎక్కువ?

ఓటీటీలోకి ‘కణ్మని రాంబో ఖతీజా’, వెరైటీగా ప్రకటించిన విఘ్నేష్!

ఓటీటీలోకి ‘కణ్మని రాంబో ఖతీజా’, వెరైటీగా ప్రకటించిన విఘ్నేష్!

Karthika Deepam మే 19 ఎపిసోడ్: సౌందర్యకు కాల్ చేసి అసలు విషయం చెప్పేసిన జ్వాల- హిమలో మళ్లీ టెన్షన్

Karthika Deepam మే 19 ఎపిసోడ్: సౌందర్యకు కాల్ చేసి అసలు విషయం చెప్పేసిన జ్వాల- హిమలో మళ్లీ టెన్షన్

Niharkika: భర్తతో లిప్ లాక్ ఫొటోను షేర్ చేసిన నిహారిక కొణిదెల, అవసరమా అంటున్న ఫ్యాన్స్!

Niharkika: భర్తతో లిప్ లాక్ ఫొటోను షేర్ చేసిన నిహారిక కొణిదెల, అవసరమా అంటున్న ఫ్యాన్స్!

Guppedantha Manasu మే 19 ఎపిసోడ్: వసుధారని తప్పించడానికి దేవయాని, సాక్షి ప్లాన్- రిషి రక్షించగలడా?

Guppedantha Manasu మే 19 ఎపిసోడ్: వసుధారని తప్పించడానికి దేవయాని, సాక్షి ప్లాన్- రిషి రక్షించగలడా?
SHOPPING
Top Mobiles
LAPTOP AND ACCESORIES
Best Deals

టాప్ స్టోరీస్

AP PCC Chief Kiran : ఏపీ పీసీసీ చీఫ్‌గా కిరణ్‌కుమార్ రెడ్డి ! కాంగ్రెస్‌కు జరిగే మేలెంత ?

AP PCC Chief Kiran :  ఏపీ పీసీసీ చీఫ్‌గా కిరణ్‌కుమార్ రెడ్డి ! కాంగ్రెస్‌కు జరిగే మేలెంత ?

Minister KTR UK Tour : తొలి రోజు యూకే పర్యటనలో మంత్రి కేటీఆర్ బిజీబీజీ, పలు కంపెనీల ప్రతినిధులతో భేటీ

Minister KTR UK Tour : తొలి రోజు యూకే పర్యటనలో మంత్రి కేటీఆర్ బిజీబీజీ, పలు కంపెనీల ప్రతినిధులతో భేటీ

Bhanu Saptami 2022: ఈ ఆదివారం భానుసప్తమి, ఆ రోజు మాత్రం ఈ పనులు చేయకండి

Bhanu Saptami 2022: ఈ ఆదివారం భానుసప్తమి, ఆ రోజు మాత్రం ఈ పనులు చేయకండి

LPG Price Hike : సామాన్యుడిపై గ్యాస్ గుదిబండ, మరోసారి పెరిగిన ధరలు

LPG Price Hike : సామాన్యుడిపై గ్యాస్ గుదిబండ, మరోసారి పెరిగిన ధరలు