Rahul Ramakrishna: 'ఇట్స్ ఏ జోక్', ఫ్యాన్స్ ను ఫూల్స్ చేసిన కమెడియన్
ఈరోజు సడెన్ గా తను సినిమాల నుంచి రిటైర్ అవుతున్నట్లు ప్రకటించి షాకిచ్చారు రాహుల్ రామకృష్ణ.
![Rahul Ramakrishna: 'ఇట్స్ ఏ జోక్', ఫ్యాన్స్ ను ఫూల్స్ చేసిన కమెడియన్ It’s a joke you fools says Rahul Ramakrishna on his retirement Rahul Ramakrishna: 'ఇట్స్ ఏ జోక్', ఫ్యాన్స్ ను ఫూల్స్ చేసిన కమెడియన్](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/02/05/deb39b442d7f383264818a9d85f90975_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
టాలీవుడ్ లో టాప్ కమెడియన్ గా దూసుకుపోతున్నాడు రాహుల్ రామకృష్ణ. ఆయన కామెడీ టైమింగ్ కి, నటనకు చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు. కేవలం కమెడియన్ గానే కాకుండా అప్పుడప్పుడు కొన్ని సినిమాల్లో సీరియస్ రోల్స్ చేస్తుంటారు. త్వరలోనే విడుదల కానున్న 'ఆర్ఆర్ఆర్' సినిమాలో కూడా రాహుల్ రామకృష్ణ కనిపించనున్నాయి. అయితే ఈరోజు సడెన్ గా తను సినిమాల నుంచి రిటైర్ అవుతున్నట్లు ప్రకటించి షాకిచ్చారు రాహుల్ రామకృష్ణ.
2022 తన లాస్ట్ ఇయర్ అని.. ఈ ఏడాది తరువాత సినిమాల్లో నటించనని ట్విట్టర్ లో పోస్ట్ పెట్టారు. ఈ ట్వీట్ చూసిన ఫ్యాన్స్ రాహుల్ ని ప్రశ్నిస్తూ పలు కామెంట్స్ చేశారు. అయితే ఇప్పుడు మరో ట్వీట్ చేశారు రాహుల్. 'ఇట్స్ ఏ జోక్ యూ ఫూల్స్.. భారీ సంపాదనను, లగ్జరీ లైఫ్ ని నేనెందుకు వదులుకుంటాను..? నేను రిటైర్ అవుతున్నాననుకొని నా ఫ్రెండ్ ఫోన్లు చేసి కంగ్రాట్స్ చెప్పడం నమ్మలేకపోతున్నా..' అంటూ రాసుకొచ్చారు.
మొత్తానికి రాహుల్ తన రిటైర్మెంట్ జోక్ తో అందరినీ బాగానే ఫూల్స్ చేశాడు. అయితే కొందరు నెటిజన్లు మాత్రం రాహుల్ పై ఫైర్ అవుతున్నారు. 'నీ మీద అభిమానం ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు రెస్పాండ్ అయిన వాళ్ళలో..!!వాళ్లు ఏమైందా అని ఆందోళన చెందే ఉంటారు కదా నీ పట్ల ప్రేమతో..!!! వాళ్ళు కూడా ఫూల్స్ నా రాహుల్ అన్నా!?' అంటూ ఓ నెటిజన్ కామెంట్ చేయగా.. 'ఇదంతా అటెన్షన్ కోసం చేశావ్ కదా..?' అంటూ మరో నెటిజన్ కామెంట్ చేశాడు.
It’s a joke you fools
— Rahul Ramakrishna (@eyrahul) February 5, 2022
Why would I throw away a high paying, luxury life so full of benefits? I can’t believe my friends are calling me up to congratulate me on my retirement 😆
2022 is my last.
— Rahul Ramakrishna (@eyrahul) February 4, 2022
I will not do films anymore.
Not that I care, nor should anybody care
View this post on Instagram
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)