News
News
X

Bigg Boss Telugu: ‘బిగ్ బాస్’ సీజన్-6 ఫస్ట్ కెప్టెన్ అతడే, టాస్క్ మొత్తం సంతే!

‘బిగ్ బాస్’లో కెప్టెన్సీ టాస్క్ మొదలైపోయింది. మరి, ఈ హౌస్‌కు తొలి కెప్టెన్ అయ్యే ఛాన్స్ ఎవరు కొట్టేశారు?

FOLLOW US: 

‘బిగ్ బాస్’ హౌస్‌లో కెప్టెన్సీ టాస్క్ మొదలైంది. ఈ సందర్భంగా బిగ్ బాస్ క్లాస్ సెక్షన్లో ఉన్న గీతూ, ఆది రెడ్డి, నేహా చౌదరిలను కెప్టెన్సీ కంటెడెర్లుగా మారారు. మాస్ సెక్షన్ నుంచి మరో ముగ్గురినీ కెప్టెన్సీ కంటెడెర్లుగా ఎంపిక చేయమని అడిగాడు బిగ్ బాస్. ఆ సమయంలోను గీతూ ఎప్పటి తరహాలోనే తన నోటికి పని చెప్పింది. చివరికి.. మెరీనా- రోహిత్ జంట, ఆర్జే సూర్య, బాలాదిత్యలు కెప్టెన్సీ పోటీదారులుగా ఎంపికయ్యారు. ఈ రోజు ప్రసారం కాబోయే కెప్టెన్సీ టాస్కులో ఆరుగురు పోటీ పడబోతున్నారు. 

ఈ సందర్భంగా బిగ్ బాస్ వారికి వివిధ టాస్కులు ఇచ్చాడు. నీటిలో తాళాలు వేసి చేతితో కాకుండా నోటితో తియాలని ఆదేశించాడు. ‘కెప్టెన్సీ బండి’ టాస్క్ కింద కాస్త టఫ్ ఫైటే ఇచ్చాడు బిగ్ బాస్. చేతుల సాయం లేకుండా నీటి తొట్టెలో ముఖం పెట్టి తాళాలు తీయాలనేది ఒక టాస్క్. ఆ తర్వాత ఆ తాళం చేతులకు తగిన పెట్టెను వెతికి.. దాన్ని తెరవాలి. తాజా ప్రోమో ప్రకారం.. ఈ టాస్క్‌కు ఫైమా సంచాలకురాలిగా వ్యవహరిస్తున్నట్లు తెలిసింది. విశ్వసనీయ సమాచారం ప్రకారం.. ఈ టాస్క్‌లు బాలాదిత్య హౌస్‌కు మొదటి కెప్టెన్‌గా ఎంపికైనట్లు సమాచారం. అయితే, ఇందులో వాస్తవం ఏమిటనేది ఈ రోజు ప్రసారమయ్యే ఎపిసోడ్ తర్వాతే తెలుస్తుంది. 

ఇక నిన్నటి ఎపిసోడ్ గురించి మాట్లాడుకుంటే...: 

ఇనయ తనను తెల్లగా, అందంగా ఉన్నావని అందని, తెల్లగా ఉండడం వేరు, అందంగా ఉండడం వేరని వివరించానని అందరికీ చెప్పుకొచ్చాడు బాలాదిత్య. దానికి ఇనయ రెస్పాండ్ అయ్యింది. తాను బాడీ షేమింగ్ చేయలేదని, పొగిడానని వివరణ ఇచ్చింది. ఎన్నిసార్లు మంచిగా ఉందామనుకున్నా, మీరు నన్ను ప్రతి విషయంలో టార్గెట్ చేస్తున్నారని, తాను ఫైట్ చేయడానికి రెడీ అని చెప్పింది. 

మెరీనా -రోహిత్, శ్రీ సత్య చిన్న ప్రాంక్ చేసి తుస్సుమనిపించారు. తన భర్తతో ఉండేందుకు సత్య అవకాశం ఇవ్వడం లేదంటూ గట్టిగా అరిచింది మెరీనా. కానీ ఈ ప్రాంక్ పెద్దగా పండలేదు. తరువాత బిగ్‌బాస్ చిన్న పోటీ పెట్టారు. ఆ పోటీ కోసం ఇంటి సభ్యులంతా రెండు టీమ్‌లుగా విడిపోయారు. టీమ్ ఏ నుంచి శ్రీ సత్యా, టీమ్ బి నుంచి ఆరోహి వెళ్లారు. అడిగిన ప్రశ్నలకు మొదల ఎవరైతే బజర్ నొక్కి జవాబులు చెబుతారో వారే విన్నర్. ఇందులో శ్రీ సత్య గెలిచింది. టీమ్ ఏ వారికి మంచి గిఫ్టులు పంపిచారు బిగ్ బాస్. 

యూట్యూబ్ లో తెగ మాట్లాడే ఆదిరెడ్డి ఇంట్లో మాత్రం మౌనంగా ఉంటున్నాడు. పెద్దగా ఎవరితోనూ కలవడం లేదు. తానేదో లోకంలో ఉన్నట్టు వింతగా ప్రవర్తిస్తున్నాడు. ఆయన కూడా రేవంత్ ను తప్పుపట్టబోయాడు. బయట నువ్వెవరు అయితే ఏంటి బ్రో, ఇంట్లో అందరూ సమానమే అంటూ తనకు సంబంధం లేని విషయాలు మాట్లాడాడు. పక్కనే అతి బిడ్డ గలాటా గీతూ ఊరుకుంటుందా. అగ్నికి ఆజ్యం పోస్తూనే ఉంది. 

గీతూ తనలో తానే మాట్లాడుకుంటూ కనిపించింది. నేను మాట్లాడటానికి ఒకరి పర్మిషన్ కావాలా? ఎందుక్కావాలి? వాళ్లేమైనా బిగ్ బాసా? అంటూ మాట్లాడుకుంది. మాట్లాడితే తనను అతి బిడ్డ (ఓవర్ యాక్షన్ చేస్తుందని) అనుకుంటారని, చిన్నప్పట్నించి అందరూ అనుకుంటూనే ఉన్నారని చెప్పుకుంది. అయినా తాను అతి చేయాలని డిసైడ్ అయ్యింది ఈ అతి బిడ్డ. 

Also Read : 'కెప్టెన్' సినిమా రివ్యూ : ఆర్య గురి తప్పిందా? బావుందా?

Also Read : 'రంగ రంగ వైభవంగా' రివ్యూ : మెగా మేనల్లుడు వైష్ణవ్ తేజ్, రొమాంటిక్ హీరోయిన్ కేతికా శర్మ నటించిన సినిమా ఎలా ఉందంటే?

Published at : 09 Sep 2022 03:05 PM (IST) Tags: Bigg Boss Telugu baladitya Bigg Boss Telugu Captain Bigg Boss Captaincy Task

సంబంధిత కథనాలు

SSMB28: మహేష్ సినిమాలో ఐటెం సాంగ్ - త్రివిక్రమ్ ఒప్పుకుంటారా?

SSMB28: మహేష్ సినిమాలో ఐటెం సాంగ్ - త్రివిక్రమ్ ఒప్పుకుంటారా?

Godfather Vs Ghost : 'గాడ్ ఫాదర్' వర్సెస్ 'ఘోస్ట్' - ఒకటి టమోటా, ఇంకొకటి ఉల్లిపాయ్  

Godfather Vs Ghost : 'గాడ్ ఫాదర్' వర్సెస్ 'ఘోస్ట్' - ఒకటి టమోటా, ఇంకొకటి ఉల్లిపాయ్  

Chiranjeevi: 'దర్శకుడు చెప్పినట్లే చేశా' - 'ఆచార్య' ప్లాప్ పై చిరు కామెంట్స్!

Chiranjeevi: 'దర్శకుడు చెప్పినట్లే చేశా' - 'ఆచార్య' ప్లాప్ పై చిరు కామెంట్స్!

Pawan Kalyan: ప్లాప్ డైరెక్ట‌ర్‌తో పవన్ కళ్యాణ్ సినిమా - లాంఛింగ్ కి రెడీ!

Pawan Kalyan: ప్లాప్ డైరెక్ట‌ర్‌తో పవన్ కళ్యాణ్ సినిమా - లాంఛింగ్ కి రెడీ!

Balakrishna's Unstoppable 2 Trailer : విజయవాడలో బాలకృష్ణ 'అన్‌స్టాప‌బుల్‌ 2' ట్రైలర్

Balakrishna's Unstoppable 2 Trailer : విజయవాడలో బాలకృష్ణ 'అన్‌స్టాప‌బుల్‌ 2' ట్రైలర్

టాప్ స్టోరీస్

KCR Warangal Tour: వరంగల్‌లో ప్రతిమ మెడికల్‌ కాలేజ్‌‌ ప్రారంభించిన కేసీఆర్, అప్రమత్తంగా ఉండాలని వ్యాఖ్యలు

KCR Warangal Tour: వరంగల్‌లో ప్రతిమ మెడికల్‌ కాలేజ్‌‌ ప్రారంభించిన కేసీఆర్, అప్రమత్తంగా ఉండాలని వ్యాఖ్యలు

Srikalahasti News : రెచ్చిపోయిన శ్రీకాళహస్తి సీఐ అంజూ యాదవ్, మహిళపై అమానుష దాడి!

Srikalahasti News : రెచ్చిపోయిన శ్రీకాళహస్తి సీఐ అంజూ యాదవ్, మహిళపై అమానుష దాడి!

IND W vs SL W T20: గెలుపుతో ఆసియా కప్‌ ప్రారంభించిన టీమిండియా - శ్రీలంక మహిళల జట్టుపై భారీ విజయం!

IND W vs SL W T20: గెలుపుతో ఆసియా కప్‌ ప్రారంభించిన టీమిండియా - శ్రీలంక మహిళల జట్టుపై భారీ విజయం!

Pawan Kalyan's Footwear Price: పవన్ కళ్యాణ్ షూ ఖరీదు రూ.10 లక్షలా? సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం నిజమేనా?

Pawan Kalyan's Footwear Price: పవన్ కళ్యాణ్ షూ ఖరీదు రూ.10 లక్షలా? సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం నిజమేనా?