Liger Movie: 'లైగర్' కంటే 'సన్నాఫ్ ఆఫ్ ఇండియా'నే బెటరా? 'ఐఎంబీడీ' రేటింగ్ చూశారా?
స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ తో రూపొందిన 'లైగర్' సినిమా వసూళ్లను సాధించడానికి చాలా ఇబ్బందులు పడుతోంది.
'లైగర్' (Liger Movie) సినిమాకు ఇటు ప్రేక్షకులు, అటు విమర్శకుల నుంచి గొప్ప స్పందన ఏమీ రాలేదు. తొలి రోజు తొలి ఆట నుంచి ఫ్లాప్ టాక్ వచ్చింది. అది ఏమీ ఫస్ట్ డే కలెక్షన్స్ మీద ప్రభావం చూపించలేదు. రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ (Vijay Devarakonda) కు ప్రేక్షకులలో ఉన్న క్రేజ్, సినిమా విడుదలకు ముందు చేసిన ప్రమోషన్స్ కారణంగా చెప్పుకోదగ్గ రీతిలో వసూళ్లు వచ్చాయి. కానీ ఆ తరువాత మాత్రం కలెక్షన్స్ లో డ్రాప్ కనిపించింది.
స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ తో రూపొందిన ఈ సినిమా వసూళ్లను సాధించడానికి చాలా ఇబ్బందులు పడుతోంది. ఇప్పుడు ఈ సినిమా మరో డిజాస్టర్ రికార్డ్ సాధించిందని సోషల్ మీడియాలో ఓ న్యూస్ చక్కర్లు కోడ్టుహొంది. ఇంతకీ అదేంటంటే.. ప్రముఖ ఇంటర్నేషనల్ సినిమా సైట్ IMDB(ఇంటర్నెట్ మూవీ డేటా బేస్) 'లైగర్' సినిమాకి అత్యంత తక్కువ రేటింగ్ ఇచ్చింది. ఆ రేటింగ్ ఎంతంటే.. 1.7/10.
రీసెంట్ గా తమిళంలో శరవణన్ నటించిన 'ది లెజెండ్' అనే సినిమా విడుదలైంది. దీనికి IMDB సైట్ 4.7 రేటింగ్ ఇచ్చింది. అలానే ఆమిర్ ఖాన్ 'లాల్ సింగ్ చడ్డా' సినిమాకి 5 రేటింగ్ ఇచ్చింది. మోహన్ బాబు 'సన్నాఫ్ ఇండియా'కు కూడా 10కి 5 రేటింగ్ ఇచ్చింది. అలాంటిది 'లైగర్'కి మాత్రం చాలా తక్కువ రేటింగ్ ఇచ్చింది. దీంతో యాంటీ ఫ్యాన్స్ ఈ రేటింగ్ కి సంబంధించిన స్క్రీన్ షాట్స్ షేర్ చేస్తూ సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్నారు.
'లైగర్' మూడు రోజుల కలెక్షన్స్..
ఇక మూడో రోజు కలెక్షన్ల విషయానికి వస్తే.. భారీగా పడిపోయాయి. ప్రపంచ వ్యాప్తంగా రూ. 5 నుంచి 6 కోట్ల షేర్ సాధించింది. తెలంగాణ, ఏపీ రాష్ట్రాల్లో రూ. 1.5 నుంచి 3 కోట్ల షేర్ ను రాబట్టింది. ఇక మూడు రోజులుగా ప్రపంచ వ్యాప్తంగా రూ. 22.5 నుంచి 23.51 కోట్ల షేర్ అందుకుంది. మొత్తంగా తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమాకు సంబంధించిన వసూళ్లు చాలా వరకు తగ్గాయి. అన్ని ప్రాంతాల్లోనూ థియేటర్లకు ప్రేక్షకులు బాగా తగ్గిపోయారు. విజయ్ దేవరకొండ, పూరీ జగన్నాథ్ కెరీర్ కు ఈ సినిమా మైనస్ గా నిలుస్తుందనే టాక్ సినీ పరిశ్రమలో వినిపిస్తోంది. ఈ ఫ్లాప్ సినిమాను ప్రదర్శించడం కంటే మరో సినిమాను షో వేయడం మంచిదని కొన్ని ప్రాంతాల్లో థియేటర్ల యజమానులు భావిస్తున్నారట.
మొత్తంగా లైగర్ సినిమా యూనిట్‌కు ప్రతికూల ఫలితాలు వస్తున్నాయి. సినిమాలో కంటెంట్ లేకపోయినా.. భారీ ప్రమోషన్స్ తో ప్రేక్షకుల్లో సినిమా మీద భారీగా అంచనాలు పెరిగేలా చేసింది పూరి అండ్ టీమ్. ఎన్నో అంచనాలతో సినిమా థియేటర్లకు వెళ్లిన అభిమానులకు తీవ్ర నిరాశ ఎదురయ్యింది. మొత్తంగా సినిమా ఫ్లాప్ టాక్ తెచ్చుకుంది. రిలీజ్ కు ముందే ఓటీటీలో భారీ ఆఫర్ వచ్చినా థియేటర్‌లో అంతకుమించి వసూళ్లు సాధిస్తామని మూవీ యూనిట్ ధీమా వ్యక్తం చేసింది. ప్రస్తుతం సీన్ రివర్స్ అయింది.
విజయ్ దేవరకొండ సరసన అనన్యా పాండే కథానాయికగా నటించిన ఈ సినిమాకు పూరి జగన్నాథ్ దర్శకత్వం వహించారు. ఆయన రైటింగ్, డైరెక్షన్ మీద ఎక్కువ విమర్శలు వస్తున్నాయి. విజయ్ దేవరకొండతో ప్రస్తుతం ఆయన తెరకెక్కిస్తున్న 'జన గణ మణ' బిజినెస్ మీద 'లైగర్' బాక్సాఫీస్ రిజల్ట్ ఎఫెక్ట్ పడే అవకాశాలు ఉన్నాయని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.
Also Read : ‘ఆంటీ’ ట్రోల్స్‌పై అనసూయ ఆగ్రహం, రౌడీ బాయ్ అభిమానులకు స్ట్రాంగ్ వార్నింగ్
Also Read : విజయ్ దేవరకొండ కాదు, అనకొండ - రౌడీ బాయ్ ప్రవర్తనపై ముంబై థియేటర్ ఓనర్ ఫైర్