By: ABP Desam | Updated at : 18 Jun 2023 11:54 AM (IST)
జేడీ చక్రవర్తి(Image Credits : JD Chakravaarthy/Instagram)
JD Chakravarthy : వెరైటీ పాత్రలతో టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో మంచి పేరు తెచ్చుకున్న నటులలో ఒకరు జేడీ చక్రవర్తి.. డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ (ఆర్జీవీ) శిష్యుడిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు. తనకు జయసుధ అంటే చాలా ఇష్టమని, ఆమెను పెళ్లిచేసుకోవాలని ఉందని డైరెక్టుగా వెళ్లి ఆమె భర్తతోనే చెప్పానని అన్నారు. ఇటీవల జరిగిన ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆయన.. జయసుధతో అనుబంధాన్ని గురించి ఆసక్తికర విషయాలను పంచుకున్నారు.
సీనియర్ నటి జయసుధతో జరిగిన మంచి అనుభవాన్ని పంచుకున్న జేడీ చక్రవర్తి.. తాను ఆమెను సుధా, సుధా డార్లింగ్ అనే వాడినని చెప్పుకొచ్చారు. తాను జయసుధ గారికి పెద్ద ఫ్యాన్ అని, ఆ ఆభిమానంతో అలా పిలుస్తానని అన్నారు. ఓ సినిమా షూటింగ్ చేస్తున్నపుడు ఆమె భర్త నితిన్ షూటింగ్ స్పాట్ కు వచ్చాడని, ఆ సమయంలో ఆయనకు దగ్గరికి వెళ్లి.. నితిన్ నీతో ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను అని చెప్పానన్నారు. తాను జయసుధ గారిని పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్నట్టు వెల్లడించారట. "అతను 6 ఫీట్ వరకు హైట్ ఉంటాడు. లాగి కొడితే మళ్లీ లేవను కూడా లేవను. అయినా కూడా ఛాన్స్ తీసుకుని, ఉత్తిగనే అలా చెప్పాను. అంటే నేను సరదాగా మాట్లాడుతున్నానని తనకూ తెలుసు. వాళ్ల పెళ్లి రోజు నాకు ఎగ్జాక్ట్ గా గుర్తు లేదు గానీ.. నా మాట విని మే 17న పెళ్లి చేసుకో అని చెప్పాడాయన. ఎందుకని అని అడిగితే.. ఆ రోజు మా పెళ్లి రోజు.. ఆ రోజు చేసుకుంటే జస్ట్ పర్సన్ ఛేంజ్ అవుతారు. కానీ పెళ్లి రోజు అదే ఉంటుంది కదా" అని అన్నారని చక్రవర్తి తెలిపారు.
"నాది వీక్ సెన్సాఫ్ హ్యూమరో, గుడ్ సెన్సాఫ్ హ్యూమరా అనేది పక్కన పెడితే.. నితిన్ ది మాత్రం అమేజింగ్ సెన్సాఫ్ హ్యూమర్. అంటే నేను ఇలా సరదాగా మాట్లాడానని మాకు తెలుసు. కానీ చాలా మంది ఏంటీ వీడు ఇలా మాట్లాడుతున్నారు అని అంటారు. అసలు.. వాళ్లకు లేని ప్రాబ్లమ్ వీళ్లకు ఎందుకు అని నా ప్రశ్న. అది ఎక్కడ వస్తొందంటే.. మేం కొన్ని సంవత్సరాల పాటు ట్రావెల్ చేయడం వల్ల వచ్చే చనువు వల్ల వస్తుంది. చాలా మంది అది చెప్పరు. నేను చెప్పను.. అంతే. కాబట్టి అలా సరదాగా చాలా మాట్లాడుకుంటాం. మనం మన ఫ్రెండ్స్ తో ఇలాంటివి చాలా మాట్లాడుకుంటాం. అలానే ఫిల్మ్ ఇండస్ట్రీలో క్లోజ్ వారితో ఇలాంటివి మాట్లాడుకోవడం సహజమే. కాకపోతే ఇక్కడికి వచ్చేసరికి కెమెరాకు చిక్కిపోతాం" అని జేడీ చక్రవర్తి చెప్పారు.
"ఇక బ్యాడ్ ఎక్స్ పీరియన్స్ అంటే.. దెయ్యం సినిమా షూటింగ్ జరుగుతున్నపుడు.. నాకు బాగా సన్నిహితుడు, నాతో కలిసి చాలా సంవత్సరాలు ట్రావెల్ చేస్తున్న నా మేకప్ మెన్ రంగ పెళ్లికి వెళ్లలేకపోయాను. అదే చేదు అనుభవం. ఇంకొక బ్యాడ్ ఎక్స్ పీరియన్స్ ఏంటంటే.. ఒరేయ్ రసూల్ సారీరా.. నిన్ను రామ్ గారు ఫస్ట్ అనుకున్న మాట నిజమే.. కానీ కొంచెం మ్యానిప్ల్యులేట్ చేసి రాహుల్, చోటాను తీసుకురావడం జరిగింది" అని చక్రవర్తి చెప్పుకొచ్చారు. నిజానికి అతను చాలా స్వీట్ హార్ట్ అని, బిందాస్ అని కితాబిచ్చారు.
Read Also : Salman Khan: సల్మాన్ ఖాన్ ధరించే బ్లూ స్టోన్ బ్రాస్లెట్ సీక్రెట్ ఏంటో తెలుసా?
Samantha Production House: సొంతంగా నిర్మాణ సంస్థ ప్రారంభించిన సమంత - తనకు నచ్చిన పాట పేరుతో!
Devil Movie: ‘డెవిల్’ కోసం కళ్యాణ్రామ్కు 90 స్పెషల్ కాస్ట్యూమ్స్ - ఇటలీ నుంచి తెప్పిన మోహైర్ ఊల్తో!
‘సరిపోదా శనివారం’ రిలీజ్ అప్డేట్, ‘నాసామిరంగ’ ఫస్ట్ సింగిల్ - నేటి టాప్ సినీ విశేషాలివే!
Samantha: బాలీవుడ్ రియాలిటీ షోలో సమంత - స్టేజీపై హైదరాబాదీ ర్యాపర్తో హల్చల్!
Samuthirakani: ఎమ్మెల్యే బయోపిక్లో సముద్రఖని - తెరపైకి తెలంగాణ రాజకీయ నాయకుని కథ!
Revanth Reddy KCR: కోలుకొని అసెంబ్లీకి రావాలని కేసీఆర్ను కోరా, ఆస్పత్రికి వెళ్లి పరామర్శించిన సీఎం రేవంత్
Telangana News: రాష్ట్రంలోని 54 కార్పొరేషన్ల ఛైర్మన్ల నియామకాలు రద్దు, ఉత్తర్వులు జారీ
Navy Day: విశాఖలో ఆకట్టుకున్న నేవీ డే విన్యాసాలు - ముఖ్య అతిథిగా గవర్నర్ అబ్దుల్ నజీర్
Nizamabad Conductor Charged women: ఆర్టీసీలో మహిళల నుంచి ఛార్జీ వసూలు, కండక్టర్ పై విచారణకు సజ్జనార్ ఆదేశాలు
/body>