News
News
వీడియోలు ఆటలు
X

‘పుష్ప’లో శ్రీవల్లి పాత్రను రష్మిక కంటే బాగా చేయగలను: ఐశ్వర్య రాజేష్

ఇటీవల విడుదలైన 'పర్హానా' మూవీతో ప్రేక్షకులను అలరించిన ఐశ్వర్య రాజేష్.. 'పుష్ప'లోని శ్రీవల్లి పాత్రపై కీలక వ్యాఖ్యలు చేశారు. ఆ క్యారెక్టర్ ను రష్మిక కంటే తాను మెరుగ్గా చేయగలనని విశ్వాసం వ్యక్తం చేశారు.

FOLLOW US: 
Share:

Aishwarya Rajesh : తమిళ, తెలుగు సినిమాలతో మంచి పేరు తెచ్చుకున్న హీరోయిన్ ఐశ్వర్య రాజేష్.. ఇటీవలే 'ఫర్హానా' సినిమాతో ప్రేక్షకులను అలరించారు. ఈ సినిమా ఐశ్వర్య ముస్లిం మహిళగా నటించగా.. ఈ మూవీలోని నటనకు ఆమె ఎన్నో ప్రశంసలు అందుకున్నారు. ఫ్యామిలీ థ్రిల్లర్ డ్రామాగా తెరకెక్కిన ఈ సినిమాకు నెల్సన్ వెంకటేశన్ రచన, దర్శకత్వం వహించారు. వరుస సినిమాలతో దూసుకుపోతున్న ఐశ్వర్య రాజేష్.. రీసెంట్ గా ఇంట్రస్టింగ్ వ్యాఖ్యలు చేశారు. 

'పుష్ప'లో శ్రీవల్లి పాత్ర గురించి..

పుష్పలో శ్రీవల్లి పాత్ర గురించి మాట్లాడిన ఐశ్వర్య రాజేష్.. "పుష్ప సినిమాలో రష్మిక శ్రీవల్లి పాత్రలో బాగా నటించింది. అలాంటి అవకాశం నాకు వస్తే, నేను కూడా నిరూపించుకునేదాన్ని. వాస్తవంగా చెప్పాలంటే శ్రీవల్లి పాత్రలో రష్మిక కంటే నేనే మెరుగ్గా నటించగలను, ఆ పాత్రకు నేను బాగా సరిపోతానని భావిస్తున్నాను, నమ్ముతున్నాను" అంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

తెలుగు సినిమాల్లో ఎక్కువగా ఎందుకు నటించడం లేదని అడిగిన ప్రశ్నకు ఐశ్వర్య ఇలా సమాధానమిచ్చారు. తనకు తెలుగు ఇండస్ట్రీ అంటే చాలా ఇష్టమని, ఇక్కడి నుంచి కూడా ఆఫర్లు వస్తున్నాయని ఐశ్వర్య రాజేష్ చెప్పారు. కానీ తన కుటుంబం గర్వపడేలా కమ్ బ్యాక్ లాంటి మంచి తెలుగు సినిమా చేయాలనుకుంటున్నానని తెలిపారు. తాను గతంలో విజయ్ దేవరకొండ సరసన 'వరల్డ్ ఫేమస్ లవర్' సినిమాలో నటించానన్న ఆమె.. కానీ అది ఆశించిన స్థాయిలో వర్కవుట్ కాలేదన్నారు. 

ఐశ్వర్య తండ్రి, దివంగత రాజేష్, 1980లలో తెలుగులో అనేక చిత్రాలలో ప్రధాన పాత్రలు పోషించిన నటుడిగా పేరు తెచ్చుకున్నారు. ఇతను ప్రముఖ హాస్యనటి శ్రీలక్ష్మికి తమ్ముడు కూడా. ఐశ్వర్య చెన్నైలో పుట్టి పెరిగినందున తమిళ సినిమాల్లోనే ఎక్కువగా అవకాశాలు వస్తున్నాయి. తెలుగు దర్శక నిర్మాతలు ఆమెకు అవకాశాలు ఇచ్చేందుకు పెద్దగా ఆశక్తి చూపడం లేదు.
 
ఐశ్వర్య రాజేష్ దక్షిణాదిలో పలు సినిమాల్లో నటించింది. ‘స్వప్న సుందరి’, ‘డ్రైవర్ జమున’, 'ది గ్రేట్ ఇండియన్ కిచెన్' (2023), 'కాకా ముట్టై' (2015), 'వడ చెన్నై' (2018) లాంటి సినిమాల ద్వారా మంచి పేరు తెచ్చుకుంది. ఇటీవలే విడుదలైన ‘ఫర్హానా’ తో ప్రేక్షకులను అలరించింది. కాల్ సెంటర్‌లో పనిచేస్తున్న ముస్లిం మహిళ చుట్టూ జరిగే సంఘటనల ఆధారంగా ఈ చిత్రం తెరకెక్కింది. ఈ మూవీలో ఐశ్వర్య రాజేష్‌తో పాటు అనుమోల్ కూడా నటించారు.  'ఫర్హానా' సినిమాలో ఐశ్వర్య రాజేష్ తో పాటు సెల్వరాఘవన్, జితన్ రమేష్, అనుమోల్, ఐశ్వర్యదత్తా తదితరులు కీలక పాత్రలు పోషించారు. ఈ సినిమాకు జస్టిన్ ప్రభాకరన్ సంగీతం, నేపథ్య సంగీతాన్ని సమకూర్చారు. గోకుల్ బెనోయ్,  VJ సాబు జోసెఫ్ లు ఈ చిత్రానికి సినిమాటోగ్రాఫర్, ఎడిటర్‌గా పనిచేశారు. డ్రీమ్‌ వారియర్‌ పిక్చర్స్‌ బ్యానర్‌పై ఎస్‌ఆర్‌ ప్రకాష్‌బాబు, ఎస్‌ఆర్‌ ప్రభు ఈ చిత్రాన్ని నిర్మించారు.

ఇటీవలి రిలీజై కాంట్రవర్సీ మూవీగా పేరు తెచ్చుకున్న 'కేరళ స్టోరీ'పైనా ఐశ్వర్య స్పందించారు. తాను ఆ సినిమాను చూడలేదని, కాబట్టి దాని గురించి ఎక్కువగా మాట్లాడలేనని చెప్పారు. కానీ ఈ సినిమాపై రెండు వెర్షన్ల అభిప్రాయాలను విన్నట్టు వెల్లడించారు. ఇలాంటి సున్నితమైన విషయాలను గురించి చెప్పాలనుకున్నపుడు దానికి రెండు రకాల కామెంట్స్ వస్తాయని, ఇలాంటి విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలని ఆమె చెప్పారు.

ఇక సుకుమార్ డైరెక్షన్ లో ఐకాన్ స్టార్ అల్లు అర్జున హీరోగా తెరకెక్కిన 'పుష్ప' ఎంతటి భారీ విజయాన్ని నమోదు చేసిందో అందరికీ తెలిసిందే. 2020లో రిలీజైన ఈ మూవీ తెలుగు సూపర్‌స్టార్ పుష్ప రాజ్‌ను ఐకాన్‌గా మార్చింది. రష్మిక తన నటనతో శ్రీవల్లిగా మంచి పేరు తెచ్చుకుంది. పాన్ ఇండియా రేంజ్ లో పలు భాషల్లో విడుదలైన ఈ సినిమా కేవలం హిందీ సర్క్యూట్స్ లోనే రూ.100కోట్లకు పైగా వసూలు చేసింది. 

Also Read గాలి జనార్ధన్ రెడ్డి వర్సెస్ సుంకులమ్మ కథతో వైష్ణవ్ తేజ్ 'ఆదికేశవ'?

Published at : 16 May 2023 05:57 PM (IST) Tags: Allu Arjun Rashmika Mandanna Pushpa Telugu Cinema Aishwarya Rajesh Sri Valli

సంబంధిత కథనాలు

'Hari Hara Veera Mallu Movie: ‘హరిహర వీర మల్లు’ సెట్స్‌లో భారీ అగ్ని ప్రమాదం, షూటింగ్ మరింత ఆలస్యం?

'Hari Hara Veera Mallu Movie: ‘హరిహర వీర మల్లు’ సెట్స్‌లో భారీ అగ్ని ప్రమాదం, షూటింగ్ మరింత ఆలస్యం?

Ram Sita Ram Song: ఆహా ఎంత అద్భుతం! ఆకట్టుకుంటున్న‘ఆదిపురుష్‌’ ‘రామ్ సీతా రామ్’ సాంగ్

Ram Sita Ram Song: ఆహా ఎంత అద్భుతం! ఆకట్టుకుంటున్న‘ఆదిపురుష్‌’ ‘రామ్ సీతా రామ్’ సాంగ్

HanuMan Movie: ‘హనుమాన్‘ చిత్రంలో 1600 వీఎఫ్‌ఎక్స్ షాట్స్ - మరి రిలీజ్?

HanuMan Movie: ‘హనుమాన్‘ చిత్రంలో 1600 వీఎఫ్‌ఎక్స్ షాట్స్ - మరి రిలీజ్?

Allu Arjun: ఆ మూవీలో గెస్ట్ రోల్ కోసం అసలు బన్నీని ఎవరూ సంప్రదించలేదా?

Allu Arjun: ఆ మూవీలో గెస్ట్ రోల్ కోసం అసలు బన్నీని ఎవరూ సంప్రదించలేదా?

అఖిల్‌‌కు బదులు నిఖిల్ - చెర్రీపై అక్కినేని ఫ్యాన్స్ అలక, మెగా ఫ్యాన్స్‌కూ మింగుడు పడని ఆ నిర్ణయం!

అఖిల్‌‌కు బదులు నిఖిల్ - చెర్రీపై అక్కినేని ఫ్యాన్స్ అలక, మెగా ఫ్యాన్స్‌కూ మింగుడు పడని ఆ నిర్ణయం!

టాప్ స్టోరీస్

చంద్రబాబుకు మేనిఫెస్టో అంటే చిత్తు కాగితంతో సమానం- వైఎస్‌ఆర్‌సీపీ ఘాటు విమర్శలు

చంద్రబాబుకు మేనిఫెస్టో అంటే చిత్తు కాగితంతో సమానం- వైఎస్‌ఆర్‌సీపీ ఘాటు విమర్శలు

Wrestlers Protest: ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చిన రెజ్లర్లకు ఇచ్చే గౌరవమిదేనా: మంత్రి కేటీఆర్

Wrestlers Protest: ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చిన రెజ్లర్లకు ఇచ్చే గౌరవమిదేనా: మంత్రి కేటీఆర్

Telangana Decade Celebration: గ్రామాల్లో 23 రోజుల పాటు ప్రణాళికా బ‌ద్ధంగా దశాబ్ధి వేడుకలు: మంత్రి ఎర్రబెల్లి

Telangana Decade Celebration: గ్రామాల్లో 23 రోజుల పాటు ప్రణాళికా బ‌ద్ధంగా దశాబ్ధి వేడుకలు: మంత్రి ఎర్రబెల్లి

Telangana News: ఇంట్లోనే కూర్చొని రీల్స్ చేస్తుంటారా - అయితే ఈ అదిరిపోయే ఆఫర్ మీ కోసమే!

Telangana News: ఇంట్లోనే కూర్చొని రీల్స్ చేస్తుంటారా - అయితే ఈ అదిరిపోయే ఆఫర్ మీ కోసమే!