News
News
X

'హైపర్' ఆది కోసం 'జబర్దస్త్' వదిలేసిన బ్యూటీ

'హైపర్' ఆది స్కిట్స్ కోసం 'జబర్దస్త్' చూసే వీక్షకులు ఉండేవారు. ఇప్పుడు ఆయన మానేశారు. ఆది 'జబర్దస్త్' చేయడం లేదని... ఆయన కోసం షో చేయడం మానేశానని అందాల భామ చెబుతున్నారు.

FOLLOW US: 

'హైపర్' ఆది (Hyper Aadi) 'జబర్దస్త్' ఎందుకు చేయడం లేదనేది మిస్టరీ. ఎవరైనా కమెడియన్లు ఆ కామెడీ షో చేయడం మానేస్తే... వేరే ఛానల్స్‌లో షోస్ చేయడానికి వెళతారు. కానీ, ఆది అలా కాదు. 'జబర్దస్త్' (Jabardasth Comedy Show) మానేసిన తర్వాత కూడా మల్లెమాల సంస్థతో అనుబంధాన్ని కంటిన్యూ చేస్తున్నారు. 'ఢీ 14 - డ్యాన్సింగ్ ఐకాన్', 'శ్రీ దేవి డ్రామా కంపెనీ' షోలు చేస్తున్నారు. మరి, 'జబర్దస్త్' ఎందుకు చేయడం లేదని బుల్లితెర వీక్షకులు, ఆది అభిమానులకు అర్థం కావడం లేదు. ఆ సంగతి పక్కన పెడితే...

'హైపర్' ఆది కామెడీ కోసం, ఆయన వేసే పంచ్ డైలాగులు కోసం 'జబర్దస్త్' చూసే వీక్షకులు చాలా మంది ఉండేవారు. యూట్యూబ్‌లో ఆయన స్కిట్స్‌కు వ్యూస్ బాగా వచ్చేవి. మిలియన్ వ్యూస్ దాటిన స్కిట్స్ కూడా కొన్ని ఉన్నాయి. 'హైపర్' ఆది  లేకపోవడంతో 'జబర్దస్త్' చూడటం మానేశామని కొందరు నెటిజన్లు చెబుతున్నారు. ఓ అందాల భామ అయితే... ఆది 'జబర్దస్త్' చేయడం లేదని తాను కూడా చేయడం లేదని చెబుతున్నారు. ఆవిడ ఎవరో కాదు... రీతూ చౌదరి.
 
గ్యాప్ ఇవ్వడానికి కారణం రీతూ చౌదరి బరువు పెరగడమేనా?
బుల్లితెర వీక్షకులకు రీతూ చౌదరి (Rithu Chowdary) గురించి స్పెషల్‌గా చెప్పాల్సిన అవసరం లేదు. 'గోరింటాకు', 'సూర్యవంశం', 'ఇంటి గుట్టు', 'అమ్మ కోసం' సీరియల్స్‌లో కీలక పాత్రలు చేశారు. సీరియల్స్ కంటే కామెడీ షో 'జబర్దస్త్', 'శ్రీ దేవి డ్రామా కంపెనీ' కార్యక్రమంతో ఆమెకు ఎక్కువ గుర్తింపు వచ్చింది. కొన్ని రోజులుగా ఆవిడ రెండు కార్యక్రమాల్లోనూ కనిపించలేదు. ఎందుకు అంటే... 'లావు అయ్యాను కాబట్టి గ్యాప్ ఇచ్చాను' అని సరదాగా చెప్పారు. త్వరలో బరువు తగ్గుతానని ఆమె అన్నారు.
 
ఆది లేడని 'జబర్దస్త్' చేయడం లేదా?
'శ్రీదేవి డ్రామా కంపెనీ'కి లావు అయ్యాను కాబట్టి గ్యాప్ ఇచ్చానని రీతూ చౌదరి అన్నారు. మరి, 'జబర్దస్త్' ఎందుకు చేయడం లేదు? అని ప్రశ్నిస్తే... మరో ఆలోచన లేకుండా ''ఆది గారు లేరు కాబట్టి గ్యాప్ వచ్చింది'' అని చెప్పారు. 'స్పెషల్ స్కిట్ చేశావ్ కదా' అని ప్రవీణ్ అడిగితే... ''ఆది గారు వచ్చిన తర్వాత వద్దామని స్పెషల్ స్కిట్స్ కూడా చేయడం లేదు'' అని రీతూ చౌదరి చెప్పారు. ఈ విషయాలను తన యూట్యూబ్ ఛానల్‌లో పోస్ట్ చేసిన వీడియోలో ఆమె చెప్పుకొచ్చారు.

Also Read : రామ్ చరణ్ సినిమాకు ఎందుకు ఇలా జరుగుతోంది? మళ్ళీ యూనిట్‌లో క్రియేటివ్ రగడ?

రీతూ చౌదరి పెళ్లి ఎప్పుడు?
తాను ప్రేమలో ఉన్న విషయాన్ని రీతూ చౌదరి సోషల్ మీడియా ద్వారా బయట పెట్టారు. 'శ్రీ దేవి డ్రామా కంపెనీ' కార్యక్రమంలో ఇటీవల రీ ఎంట్రీ ఇచ్చారు. ఆమె షూటింగ్ కోసం వెళితే... అందరూ అడిగిన ప్రశ్న ఒక్కటే. 'పెళ్లి ఎప్పుడు? పెళ్లి ఎప్పుడు?' అని! బాయ్‌ఫ్రెండ్‌తో ఉన్న ఫోటోలను తరచూ సోషల్ మీడియాలో రీతూ చౌదరి షేర్ చేస్తున్నారు. త్వరలో పెళ్లి పీటలు మీద కూర్చునే అవకాశం ఉంది. 

Also Read : హైవే రివ్యూ : విజయ్ దేవరకొండ తమ్ముడు ఆనంద్ విజయం అందుకున్నారా? లేదా?

View this post on Instagram
 
A post shared by Rithu_chowdary (@rithu_chowdhary)

Published at : 19 Aug 2022 08:55 AM (IST) Tags: Jabardasth Show Hyper Aadi Rithu Chowdary Rithu Chowdary Marriage Rithu Chowdary Love Aadi Rithu Chowdary

సంబంధిత కథనాలు

Karthikeya 2 OTT Release: దసరా స్పెషల్ - ఓటీటీ రిలీజ్‌కు 'కార్తికేయ2' రెడీ!

Karthikeya 2 OTT Release: దసరా స్పెషల్ - ఓటీటీ రిలీజ్‌కు 'కార్తికేయ2' రెడీ!

Salaar: 'సలార్' లీక్స్, డైరెక్టర్ అప్సెట్ - సెట్స్ లో కొత్త రూల్స్!

Salaar: 'సలార్' లీక్స్, డైరెక్టర్ అప్సెట్ - సెట్స్ లో కొత్త రూల్స్!

Allu Sirish: అల్లు శిరీష్ సినిమాకి కొత్త టైటిల్ - టీజర్ ఎప్పుడంటే?

Allu Sirish: అల్లు శిరీష్ సినిమాకి కొత్త టైటిల్ - టీజర్ ఎప్పుడంటే?

Aadi movie release: తారక్ అభిమానులకు అదిరిపోయే న్యూస్, మళ్లీ థియేటర్లలో సందడి చేయనున్న ‘ఆది‘

Aadi movie release: తారక్ అభిమానులకు అదిరిపోయే న్యూస్, మళ్లీ థియేటర్లలో సందడి చేయనున్న ‘ఆది‘

Ram Charan: రామ్ చరణ్ ఇంట్లో ఇండియన్ క్రికెటర్స్ - బయటకొచ్చిన ఫొటోలు!

Ram Charan: రామ్ చరణ్ ఇంట్లో ఇండియన్ క్రికెటర్స్ - బయటకొచ్చిన ఫొటోలు!

టాప్ స్టోరీస్

Mahesh Bhagwat: మీ ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ ఉందా? బీ కేర్ ఫుల్! రాచకొండ సీపీ వార్నింగ్

Mahesh Bhagwat: మీ ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ ఉందా? బీ కేర్ ఫుల్! రాచకొండ సీపీ వార్నింగ్

Viral Video: పాప బ్యాగ్‌లో పాము- ఓపెన్ చేసిన టీచర్, వైరల్ వీడియో!

Viral Video: పాప బ్యాగ్‌లో పాము- ఓపెన్ చేసిన టీచర్, వైరల్ వీడియో!

Director Anish Krishna : స్క్రిప్ట్ కి న్యాయం చేయాలంటే ఇద్దరు వెన్నెల కిషోర్ లు కావాలి | ABP Desam

Director Anish Krishna : స్క్రిప్ట్ కి న్యాయం చేయాలంటే ఇద్దరు వెన్నెల కిషోర్ లు కావాలి | ABP Desam

Sree Vishnu AK Entertainments Movie : ఏకే ఎంటర్ టైన్మంట్స్ లో శ్రీ విష్ణు కొత్త సినిమా షురూ

Sree Vishnu AK Entertainments Movie : ఏకే ఎంటర్ టైన్మంట్స్ లో శ్రీ విష్ణు కొత్త సినిమా షురూ