Ram Charan : రామ్ చరణ్ సినిమాకు ఎందుకు ఇలా జరుగుతోంది? మళ్ళీ యూనిట్‌లో క్రియేటివ్ రగడ?
రామ్ చరణ్ పాన్ ఇండియా సినిమా (Ram Charan Pan India Movie) కు అనుకోని అవాంతరాలు ఎదురు అవుతున్నాయి. మళ్ళీ యూనిట్‌లో అభిప్రాయ బేధాలు తలెత్తినట్లు ఫిల్మ్ నగర్ ఖబర్.
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, సౌత్ ఇండియా స్టార్ డైరెక్టర్ శంకర్ కాంబినేషన్‌లో ఓ సినిమా (RC15) రూపొందుతోంది. ఈ యూనిట్‌లో మరోసారి క్రియేటివ్ డిఫరెన్స్ రగడ మొదలు అయ్యిందని ఫిల్మ్ ఇండస్ట్రీ గుసగుస. ఇటువంటి సమస్య యూనిట్ ఫేస్ చేయడం ఇది తొలిసారి కాదు... రెండోసారి!
రామ్ చరణ్ సినిమాకు తొలుత టాటా చెప్పేసిన రామకృష్ణ మౌనిక
చరణ్ - శంకర్ పాన్ ఇండియా సినిమాకు ప్రొడక్షన్ డిజైనర్లుగా తొలుత రామకృష్ణ - మౌనిక దంపతులను తీసుకున్నారు. చరణ్ హిట్ సినిమా 'రంగస్థలం'కు వాళ్ళు పని చేశారు. 'తలైవి' వంటి పాన్ ఇండియా సినిమాలు చేశారు. ఏమైందో ఏమో... కొన్ని రోజులు షూటింగ్ చేసిన తర్వాత RC15 సినిమా నుంచి తప్పుకొన్నారు. వాళ్ళ స్థానంలో రవీందర్ రెడ్డిని తీసుకున్నారు. ఫిల్మ్ నగర్ వర్గాల కథనం ప్రకారం... రవీందర్ కూడా సినిమా నుంచి వాకౌట్ చేశారట.
రవీందర్ ఎందుకు వాకౌట్ చేశారు?
ప్రముఖ నిర్మాత 'దిల్' రాజు ఈ సినిమాను ప్రొడ్యూస్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఆయన ప్రొడక్షన్ హౌస్‌తో రవీందర్ రెడ్డికి క్రియేటివ్ డిఫరెన్స్‌లు వచ్చాయట. ఈ సినిమా కోసం శంషాబాద్‌లోని ఒక ఏరియాలో యూనివర్సిటీ సెట్ వేస్తున్నారు. ఆ సెట్ వర్క్ పూర్తి కాకముందే నిర్మాత, ప్రొడక్షన్ డిజైనర్ మధ్య సమస్యలు వచ్చాయని గుసగుస. దాంతో రవీందర్ వాకౌట్ చేశారట.
'భారతీయుడు 2' కోసం వెళ్లిన శంకర్!
తెలుగులో భారీ సినిమాల షూటింగులు ఆగడంతో లోక నాయకుడు కమల్ హాసన్ 'భారతీయుడు 2' షూటింగ్ రీస్టార్ట్ చేయడానికి శంకర్ చెన్నై వెళ్లారు. కరోనాకు ముందు ఆ సినిమాను పక్కన పెట్టారు. రీసెంట్ 'విక్రమ్' సూపర్ డూపర్ సక్సెస్‌తో మళ్ళీ సినిమా పట్టాలు ఎక్కుతోంది. మరో నెల రోజుల ఆ సినిమా పనులతో శంకర్ బిజీగా ఉంటారట. దాని తర్వాత చరణ్ సినిమా కోసం హైదరాబాద్ వచ్చే అవకాశాలు ఉన్నాయి.
మిలాన్‌లో రామ్ చరణ్
రామ్ చరణ్ - ఉపాసన దంపతులు మిలాన్ వెళ్లినట్లు తెలుస్తోంది. ఇటు శంకర్ సినిమా షూటింగ్‌కు బ్రేక్ రావడం, అటు కొత్త సినిమా స్టార్ట్ చేయడానికి టైమ్ ఉండటంతో ఫారిన్ వెకేషన్‌కు వెళ్లారు.
Also Read : హైవే రివ్యూ : విజయ్ దేవరకొండ తమ్ముడు ఆనంద్ విజయం అందుకున్నారా? లేదా?
Uber Cool 😎 Look of Mega Power Star ⭐ @AlwaysRamCharan gaaru with Little Fan from Milan Airport !#MegaPowerStar #RamCharan #RC15 ⚡ pic.twitter.com/kXAlbn5yFc
— SivaCherry (@sivacherry9) August 18, 2022
ఇప్పుడు రామ్ చరణ్ (Ram Charan) పాన్ ఇండియా సినిమాలపై దృష్టి పెట్టారు. 'ఆర్ఆర్ఆర్ : రౌద్రం రణం రుధిరం' చిత్రం (RRR Movie) తో ప్రపంచవ్యాప్తంగా ఆయనకు మంచి గుర్తింపు లభించింది. 'ఆర్ఆర్ఆర్' తర్వాత చేయబోయే చిత్రాలు సైతం అందరినీ ఆకట్టుకునేలా ఉండాలని, ఆ సినిమా విడుదలకు ముందు నుంచి ప్లాన్ చేస్తున్నారు. అందులో భాగంగా పాన్ ఇండియా సినిమాలకు టార్చ్ బేరర్ అయినటువంటి శంకర్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నారు. అయితే... అనుకున్న విధంగా షూటింగ్ జరగకపోవడం మెగా అభిమానులను కలవరపెడుతోంది.
Also Read : శంకర్ - పాన్ ఇండియా పదానికి టార్చ్ బేరర్, భారీ బడ్జెట్ సినిమాలకు కేరాఫ్ అడ్రస్