By: ABP Desam | Updated at : 08 Dec 2021 04:58 PM (IST)
Image Credit: Star Maa/Hotstar
‘బిగ్ బాస్ 5’ తెలుగు ముగింపు దశకు వచ్చేసింది. ఈ సమయంలో ఓటేయ్యడం గురించి చెబుతున్నారేమిటీ అని అనుకుంటున్నారా? ఎందుకంటే.. ఇప్పటికీ చాలామంది బిగ్ బాస్ చూస్తున్నారు. కానీ, పనిగట్టుకుని ఓటేసేవారి సంఖ్య చాలా తక్కువ. కేవలం వారికి ఇప్పటివరకు ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ మాత్రమే కంటెస్టెంట్లను సేవ్ చేసింది. అయితే, ఇప్పుడు మీరు మీ ఓటును సద్వినియోగం చేసుకొనే సమయం వచ్చేసింది. టాప్ 5 కంటెస్టెంట్లతోపాటు ‘బిగ్ బాస్ 5’ టైటిల్ విన్నర్‌ను ఎంపిక చేసుకొనే సమయం కూడా ఇదే. కాబట్టి.. మీకు నచ్చిన, మెచ్చిన కంటెస్టెంట్‌ను క్లియర్ ఓట్లతో గెలిపించాలంటే ఓటేయండి.
ఇలా ఓటేయండి: అభిమానుల ఓట్లకు.. జెన్యూన్ ఓటర్లకు మధ్య చాలా వ్యత్యాసం ఉంటుంది. తమ ఫెవరెట్ కంటెస్టెంట్లు ఎలా ఉన్నా సరే ఓటేసి గెలిపించేందుకు ప్రయత్నిస్తారు. అయితే, జెన్యూన్ ఓటర్లు మాత్రం.. బిగ్ బాస్ ఇంట్లో తమకు నచ్చిన కంటెస్టెంట్‌కు మాత్రమే ఓటేస్తారు. అయితే, అలాంటివారు చాలా తక్కువగా ఉంటారు. ఫినాలే సమయంలో మాత్రం సాధారణ జనాలు స్పందించకపోతే వార్ వన్‌సైడ్ అయిపోతుంది. అందుకే.. ఈ రెండు వారాలు బిగ్ బాస్ ఓటింగ్ చాలా కీలకం.
మిస్డ్ కాల్‌తో ఓటింగ్: బిగ్ బాస్‌లో ప్రతి కంటెస్టెంట్‌కు ఒక ఫోన్ నెంబరు కేటాయిస్తారు. బిగ్ బాస్ షో మొదలైన రోజు నుంచి చివరి వరకు ఆ నెంబరే ఉంటుంది. కాబట్టి.. మీరు మీకు ఇష్టమైన కంటెస్టెంట్ ఫోన్ నెంబరును సేవ్ చేసుకొని సోమవారం నుంచి శుక్రవారం అర్ధరాత్రి వరకు ప్రతి రోజు మిస్డ్ కాల్ ఇస్తే చాలు. మీ ఓటు ఆటోమెటిక్‌గా నమోదవుతుంది. రోజులో ఒక్క నెంబరు నుంచి 50 మిస్డ్ కాల్స్ చేసి ఓటు వేయొచ్చు. అలాగే, మీరు ఒకే కంటెస్టెంట్‌కు ఓటేయాలనే రూల్ లేదు. మీ ఓట్లను వేర్వేరు కంటెస్టెంట్లకు కూడా విభజించవచ్చు.
డిస్నీ హాట్ స్టార్‌లో ఇలా..: బిగ్ బాస్ 5 తెలుగు షోను మీరు ‘డిస్నీ హాట్ స్టార్’లో చూస్తున్నా.. మీరు ఓటు వేయ్చొచ్చు. హాట్ స్టార్‌లో బిగ్ బాస్ సెక్షన్‌లోనే ఓట్ (VOTE) అనే ఆప్షన్ కూడా ఉంటుంది. అక్కడ మీకు ఆ వారంలో ఎవరైతే నామినేషన్లో ఉన్నారో ఆ కంటెస్టెంట్ల ఫోటోలు ఉంటాయి. అక్కడ మీకు ఇష్టమైన కంటెస్టెంట్ ఫొటో మీద క్లిక్ చేసి ఓటేయండి. అలా రోజుకు పది ఓట్లు చొప్పున వేయొచ్చు. మిస్డ్ కాల్ తరహాలోనే ఆ ఓట్లను మిగతా కంటెస్టెంట్లకు కూడా షేర్ చేయొచ్చు. ఈ వారం శ్రీరామ్ ఫినాలేలో స్థానం సంపాదించిన నేపథ్యంలో.. నామినేషన్లలో సన్నీ, షన్ను, మానస్, సిరి, కాజల్ మాత్రమే ఉన్నారు. మరి వీరిలో ఎవరిని టాప్ 5లోకి పంపాలని అనుకుంటారో మీరే నిర్ణయించండి.
Also Read: అషూ రెడ్డి ప్రెగ్నెంట్.. తల్లి చేతిలో చావుదెబ్బలు, వీడియో వైరల్
⦿ Maanas - Missed Call Number - 8886658216
⦿ RJ Kajal - Missed Call Number - 8886658217
⦿ Shanmukh Jaswanth - Missed Call Number - 8886658210
⦿ Siri Hanmanth - Missed Call Number - 8886658201
⦿ VJ Sunny - Missed Call Number - 8886658202
Also Read: ఈ సెలెబ్రిటీ పెళ్లి ఓటీటీలో ప్రసారం కానుందా... వందకోట్ల డీల్ కుదిరిందా?
Also Read: అల్లు అర్జున్ ప్లాన్ ఫెయిల్ అవుతోందా? తప్పు ఎక్కడ జరుగుతోంది?
Also Read: కార్డియాక్ అరెస్ట్‌తో యంగ్ యూట్యూబర్ మృతి...
Also Read: 'ఎవడి యుద్ధం వాడిదే'.. పుష్పరాజ్ వచ్చేశాడు..
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి
Ambika Rao Passed Away: గుండెపోటుతో సీనియర్ నటి అంబికా రావు మృతి
Kaduva Postponed: ఓ వారం వెనక్కి వెళ్లిన పృథ్వీరాజ్ - 'కడువా' విడుదల వాయిదా
Karthika Deepam జూన్ 28 ఎపిసోడ్: ప్రేమిస్తే జీవితాన్నిస్తాం, జాలిపడితే సాయం చేస్తాం- సౌందర్యఆనందరావుని బయటకు గెంటేసిన జ్వాల
Actor Prasad: చెట్టుకి ఉరేసుకొని చనిపోయిన నటుడు - కారణమేంటంటే?
Tollywood: ప్లాప్ సినిమాలను బ్లాక్ బస్టర్స్ అంటున్నారే!
Hyderabad Traffic News: హైదరాబాద్‌లో నేడు ట్రాఫిక్ ఆంక్షలు, ఈ టైంలో ఈ మార్గాల్లో అస్సలు వెళ్లొద్దు!
Kuppam Politics : కుప్పం బరిలో హీరో విశాల్, వైసీపీ నయా ప్లాన్-సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం!
KCR to Raj Bhavan: నేడు కొత్త సీజే ప్రమాణ స్వీకారం, సీఎం KCR రాజ్ భవన్‌కు వెళ్తారా?
Vizag Public Library: చిన్నారులను ఆకట్టుకుంటున్న జంగిల్ లైబ్రరీ - వైజాగ్‌లో ప్రయోగం సక్సెస్