By: ABP Desam | Updated at : 08 Jan 2022 06:42 AM (IST)
నందమూరి బాలకృష్ణ (image credit: ahavideoIN/Twitter)
"రానా! నీకు ఓ సలహా ఇవ్వనా? నేను వసుంధరతో పెళ్లైన మొదటి రోజే... ఒక కాంప్రమైజ్‌కు వచ్చేశా. బయట, ఎక్కడికైనా వెళ్లినా... మొత్తం నేనే మాట్లాడతాను, నువ్వు సైలెంట్‌గా ఉండాలని! ఇంట్లో ఆవిడ ఎంత వైలెంట్‌గా ఉన్నా... నేను సైలెంట్‌గా ఉంటాను" - ఇదీ బాలకృష్ణ సలహా!
"సార్... ఇది చాలా మంచి టిప్" అని రానా అన్నారు. 'అన్‌స్టాపబుల్' లేటెస్ట్ ఎపిసోడ్‌లో జరిగిన సంగతి ఇది.
'యన్.టి.ఆర్' బయోపిక్‌లో నట సింహ బాలకృష్ణ, రానా దగ్గుబాటి కలిసి నటించారు. ఎన్టీఆర్ పాత్రను బాలకృష్ణ పోషించగా... చంద్రబాబు పాత్రలో రానా నటించారు. రానా హోస్ట్‌గా చేసిన 'నంబర్ వన్ యారి' షోకు బాలకృష్ణ అతిథిగా వెళ్లారు. ఇప్పుడు ఆయన హోస్ట్ చేస్తున్న 'అన్‌స్టాపబుల్' షోకు రానా వచ్చారు. ఇద్దరి మధ్య ముందు నుంచి పరిచయం ఉంది. రామానాయుడి మనవడిగా రానా అంటే బాలకృష్ణకు చనువు కూడా ఉంది. ఇద్దరి మధ్య సంభాషణ చాలా సరదాగా సాగింది. ముఖ్యంగా రానా పెళ్లి గురించి చాలా ప్రశ్నలు అడిగారు బాలకృష్ణ. ఆల్రెడీ టాక్ షో హోస్ట్ చేసిన అనుభవం ఉండటంతో బాలకృష్ణను రానా కొన్ని క్వశ్చన్స్ అడిగారు. అవన్నీ పెళ్లి తర్వాత భార్యాభర్తల మధ్య ఎదురయ్యే సందర్భాలకు సంబంధించినవి కావడం విశేషం. బాలకృష్ణతో రానా ఇంటర్వ్యూ ఈ విధంగా సాగింది.
రానా: ప్రతిసారి ఇంట్లో ఆర్గ్యుమెంట్ స్టార్ట్ చేసేది బాలయ్య గారే! అవునా? కాదా?
బాలకృష్ణ: అవును! అంటే... కష్టాన్ని కొనుక్కు తెచ్చుకోవడం!
రానా: ఆర్గ్యుమెంట్ అయితే... ఫస్ట్ సారీ చెప్పేది ఎవరు?
బాలకృష్ణ: నేనే... తప్పదు కదయ్యా!
రానా: ఇది చాలా మంచి టిప్ సార్...
బాలకృష్ణ: మొదలు పెట్టింది మనమే అయినప్పుడు...
రానా (మధ్యలో అందుకుని): సారీ చెప్పడం కూడా మన బాధ్యతే!
బాలకృష్ణ: అలిగితివా సఖి... ప్రియా... అలక మానవా (అని పాట పాడతారన్నమాట). కృష్ణుడే సత్యభామ కాళ్లు పట్టుకున్నాడు... బాలకృష్ణుడు ఓ లెక్కా!?
రానా: ఇంట్లో ఏ మేటర్ అయినా ఫైనల్ డెసిషన్ మీదే! కరెక్టా? కాదా?
బాలకృష్ణ: సంసారానికి ఎర్త్ పెట్టే క్వశ్చన్ అడుగుతున్నావ్.
రానా: మీరు ఆన్సర్ ఎలా చెబుతున్నారో చూసి నేనూ అలాగే ఫాలో అవుదామని, ఇంటర్వ్యూ అలాగే కంటిన్యూ చేద్దామని (నవ్వులు)!
బాలకృష్ణ: చర్చించుకుని ఓ నిర్ణయానికి వస్తామయ్యా! నేనూ ఇంటికి పోవాలి. నేనూ వెళ్లాలి, మీరూ వెళ్లాలి.
రానా: మీకు సహనం అనేది ఉందా? లేదంటే ఎప్పుడూ హై ఎనర్జీలో ఉంటారా?
బాలకృష్ణ: అప్పుడప్పుడూ సర్రున కోపం వస్తుంది. వీళ్లు మారరని అనుకున్నప్పుడు తగ్గిపోతుంది. కోపం కూడా ఆరోగ్యానికి మంచిది. గుడ్ కొలెస్ట్రాల్ లాగా... గుడ్ బీపీలు. ఇవి డాక్టర్లు చెప్పరు. ఇటువంటి వాటికి మనకి మనమే సరైన వైద్యులం. నేను కూడా అప్పుడప్పుడూ ఐసోలేషన్‌లోకి వెళ్లిపోతా. ఎవ్వరు వచ్చినా నన్ను డిస్ట్రబ్ చేయవద్దని మా ఆవిడకు కూడా చెప్పేస్తా. నాకు ఒంటరిగా ఉండాలని ఉందని చెబుతా.
రానా: మీరు ఒక్కరే ఉన్నప్పుడు... నాకు ఆ విజువల్ నచ్చింది. మీరు ఏం ఆలోచిస్తారు? అప్పుడు మైండ్ ఎలా ఉంటుంది?
బాలకృష్ణ: అప్పుడు మైండ్ ఉండదు కదా! అదే... మైండ్ లేకపోవడమే, ఆ నిశ్చలమే ధ్యానం.
రానా: మీకు వంట టచ్ ఉందా?
బాలకృష్ణ: చేయలేదు కానీ... ఎలా చేయాలో చెబుతా!
రానా: నేను వసుంధారగారికి మీ పెళ్లి రోజుకు బాలకృష్ణగారు కుక్ అవుట్ అదీ ప్లాన్ చేస్తున్నారని మెసేజ్ చేస్తా. నాకు షోలో పెద్ద మెనూ కూడా చెప్పారని చెబుతా.
బాలకృష్ణ: ఇదిగో... ఈ ఫిట్టుంగులే వద్దు. నువ్వు నారదుడిలా తయ్యారయ్యావ్ ఏంటయ్యా!?
ఆ తర్వాత రానా అడగడంతో తన అర్ధాంగి వసుంధర దేవికి బాలకృష్ణ ఐ లవ్యూ చెప్పారు.
"బాలకృష్ణ ప్రేమ నీకు తెలుసు...
ఎంత స్వచ్ఛమైనదో నీకు తెలుసు...
ఎంత నిర్మలమైనదో నీకు తెలుసు...
వసుంధరకు తెలిసినంత బాలకృష్ణ ప్రేమ ప్రపంచానికి తెలియదని నీకు తెలుసు.
ఐ లవ్యూ వసుంధర" అని బాలకృష్ణ చెప్పారు. "నాకు తెలుసు... మీరు ఎప్పుడూ నన్ను ప్రేమిస్తారు" అని వసుంధర బదులు ఇచ్చారు.
Two brilliant actors. Two equally brilliant hosts!
— ahavideoIN (@ahavideoIN) January 7, 2022
Watch #NandamuriBalakrishna and @RanaDaggubati have a gala of a time on #UnstoppableWithNBK Episode 8.
Streaming Now.
- https://t.co/1GSMRgr7Ff pic.twitter.com/ctuempt2lc
Also Read: బాలకృష్ణ వీక్‌నెస్ మీద కొట్టిన రాజమౌళి
Also Read: చచ్చిపోతా, మంట పెట్టేస్తారనుకున్నా - రాజశేఖర్ భావోద్వేగం... జీవిత కన్నీరు
Also Read: ఏపీలో సినిమా వ్యాపారానికి మరో దెబ్బ... కొత్త సినిమాలకు కలెక్షన్లు రావడం కష్టమే!
Also Read: 'అతిథి దేవో భవ' రివ్యూ: ప్రేక్షకుల్ని అతిథుల్లా చూశారా? లేదా?
Also Read: ఏడిస్తే కష్టం పోతుందా? - దీప్తి సునయన లేటెస్ట్ పంచ్! బ్రేకప్ బాధ నుంచి బయటకొస్తోందా?
Also Read: మహేష్ నుంచి తమన్‌కు... తమన్ నుంచి ఎవరికి? నెక్స్ట్ ఎవరు??
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి.
Nayanthara Wedding Date: నయనతార, విఘ్నేష్ ల పెళ్లి డేట్ ఫిక్స్ - ఎప్పుడంటే?
Ashoka Vanamlo Arjuna Kalyanam: 'అశోకవనంలో అర్జున కళ్యాణం' స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
Bigg Boss Sunny New Movie: 'సన్నాఫ్ ఇండియా' దర్శకుడితో 'బిగ్ బాస్' విన్నర్ సన్నీ హీరోగా సినిమా
Major Ticket Prices: కరోనా తర్వాత తక్కువ టికెట్ రేట్స్ వసూలు చేస్తున్న సినిమా అడివి శేష్ మేజర్
Karate Kalyani: యూట్యూబ్ ఛానెల్స్ పై కరాటే కళ్యాణి ఫిర్యాదు!
AP In Davos : దావోస్ నుంచి ఏపీకి రూ. 1లక్షా 25వేల కోట్ల పెట్టుబడులు - జగన్ పర్యటన విజయవంతమయిందన్న ప్రభుత్వం !
Lokesh Mahanadu : వరుసగా మూడు సార్లు ఓడిన వారికి నో టిక్కెట్ - టీడీపీ నిర్ణయం !
Hyundai Venue Facelift: హ్యుండాయ్ కొత్త వెన్యూ వచ్చేస్తుంది - ఈసారి వచ్చే మోడల్ వేరే లెవల్!
F3 Movie Review - 'ఎఫ్ 3' రివ్యూ: వెంకటేష్, వరుణ్ తేజ్ నవ్వించారా? ఫ్రస్ట్రేషన్ తెప్పించారా?