అన్వేషించండి

Tarun Marriage: త‌రుణ్‌కు మూడుసార్లు పెళ్లి అయ్యింది: రోజా ర‌మ‌ణి

Tarun: హీరో త‌రుణ్.. చిన్న‌త‌నం నుంచి సినిమాల్లో న‌టిస్తున్నారు. ప్ర‌స్తుతం సినిమాల‌కి బ్రేక్ ఇచ్చారు . అయితే, ఆయ‌న‌పై త‌ర‌చూ వ‌స్తున్న పెళ్లి రూమ‌ర్స్ పై స్పందించారు ఆయ‌న తల్లి రోజా ర‌మ‌ణి.

Tarun Mother About Marriage & Rumors: హీరో, హీరోయిన్ల మీద రూమ‌ర్స్ ఈ రోజుల్లో కామ‌న్ అయిపోయాయి. ముఖ్యంగా వాళ్ల పెళ్లికి సంబంధించిన ఏదో ఒక వార్త చ‌క్క‌ర్లు కొడుతూనే ఉంది. ఇక తెలుగు ఫిలిమ్ ఇండ‌స్ట్రీలో మోస్ట్ ఎలిజ‌బుల్ బ్యాచ్‌లర్స్‌లో ఒక‌రు హీరో త‌రుణ్. తన గురించైతే విప‌రీత‌మైన రూమ‌ర్స్ వ‌స్తూనే ఉంటాయి. ఇప్ప‌టికే తన పెళ్లికి సంబంధించి ఎన్నో వార్త‌లు బ‌య‌టికి వ‌చ్చాయి కూడా. తాజా ఓ ఇంటర్వ్యూలో అలనాటి నటి, త‌రుణ్ త‌ల్లి రోజా ర‌మ‌ణి ఆ రూమర్స్‌పై స్పందించారు. త‌రుణ్‌కు ఇప్ప‌టికే చాలా సార్లు పెళ్లి చేశారు అని అన్నారు ఆమె. ఇక త‌రుణ్‌కు త్వ‌ర‌లోనే పెళ్లి చేస్తామ‌ని అని కూడా చెప్పారు.

రూమ‌ర్స్ వ‌స్తూనే ఉంటాయి.. 

త‌రుణ్ గురించి రూమ‌ర్స్ వ‌స్తూనే ఉంటాయ‌ని, వాటిని ఎలా తీసుకుంటారు? అనే ప్రశ్న‌కి రోజా ర‌మ‌ణి గారు ఇలా చెప్పారు. "రూమ‌ర్స్ అనే ప‌దంలోనే ఉంది క‌దా.. నిజం కాదు అని. రూమ‌ర్స్ రూమ‌ర్స్ గానే వ‌దిలేయాలి. సీరియ‌స్ గా తీసుకోవ‌ద్దు, యాక్ష‌న్ తీసుకోవ‌ద్దు, న‌వ్వుకుని వ‌దిలేయాలి. చెప్పుకోనివ్వండి, మాట్లాడుకోనివ్వండి.. ఏం వ‌స్తుంది అలా చేస్తే. మేం యంగ్ స్ట‌ర్స్ గా ఉన్న‌ప్పుడు మ్యాగ‌జైన్స్ వ‌చ్చేవి. దాంట్లో రూమ‌ర్స్, గాసిప్స్‌కు ఒక కాల‌మ్ ఉండేది. స్టార్ డ‌స్ట్ అని ఒక‌టి ఉండేది. దాంట్లో కేవ‌లం రూమ‌ర్స్ మాత్ర‌మే ఉండేవి. కాలేజి పిల్ల‌లు తెగ చ‌దివేవాళ్లు. చూడండి రూమ‌ర్స్ ఎంత‌బాగా చ‌దువుతున్నారో అనేవాడు ఒక వ్య‌క్తి. ఎవ‌రైతే ఫేమ్ గా ఉన్నారో, ఎవ‌రిపైన రూమ‌ర్స్ రాస్తే చ‌దువుతారో వాళ్ల మీదే రాస్తారు రూమ‌ర్స్" అని త‌మ కాలంలోనే ఇలాంటివి ఉండేవని చెప్పారు రోజా రమ‌ణి.  

సినిమాలో కంటే ఎక్కువ పెళ్లిలు చేశారు

"ఇక త‌రుణ్ విష‌యానికొస్తే.. సినిమాల్లో పెళ్లిలు కంటే బ‌య‌ట ఎక్కువ అవుతాయి క‌దా. దానికంటే వీళ్లే ఎక్కువ చేసేస్తారు. ఇప్ప‌టికి ఎంతోమందితో పెళ్లి చేశారు. ఎవ‌రిదో ఫొటో తీసుకుని, దానికి వేరే త‌ల‌కాయ పెట్ట‌డ‌మో.. లేదంటే ముఖాలు బ్ల‌ర్ చేయ‌డ‌మో చేసి పెట్టేస్తుంటారు. ఇంక ఆ ఫొటో తాలూకు హీరోయిన్లు ఫోన్ చేసి ఆంటీ ఫొటో చూశారా? అంటూ చెప్తుంటారు. హీరోయిన్లు శ్రేయ‌, త్రిష, ప్రియ‌మ‌ణి వాళ్లంతా చాలా క్లోజ్ గా ఉంటారు. అలా వాళ్లంతా ఫోన్ చేసి ఆట ప‌ట్టిస్తారు. చూశారా? మాకు పెళ్లి చేశారు అంటూ అంటుంటారు. పేరెంట్ గా పెళ్లి చేయ‌డం నా బాధ్య‌త‌. కానీ, వాళ్ల‌కు న‌చ్చిన అమ్మాయిన ఇచ్చి చేస్తాం. అది ల‌వ్ మ్యారేజా? అరేంజ్డ్ మ్యారేజా? వాళ్ల చేతుల్లోనే ఉంది" అని త‌రుణ్ పెళ్లి గురించి చెప్పారు ఆమె. 

సినిమాలు బాగా చూస్తాను..  

త‌ను సినిమాలు బాగా చూస్తాన‌ని చెప్పారు రోజా రమ‌ణి. "నేను మూవీ ల‌వ‌ర్. మ‌ల‌యాళం, తెలుగు, హిందీ అన్నీ సినిమాలు చూస్తాను. థియేట‌ర్‌కు వెళ్లి కూడా చూస్తాను. అంత ఇష్టం. హోమ్ థియేట‌ర్‌లో చూస్తాను. వారంలో ఐదు రోజులు చూస్తాను" అని తెలిపారు.

వింటేజ్ యాక్ట‌ర్.. 

త‌రుణ్ త‌ల్లి రోజార‌మ‌ణి కూడా గొప్ప యాక్ట‌ర్. పాత సినిమాల్లో చాలా వాటిల్లో న‌టించారు ఆమె. హీరోయిన్ గా, చెల్లిగా, ఫ్రెండ్ గా అక్క‌గా ఎన్నో సినిమాలు చేశారు ఆమె. ఇక త‌రుణ్ కూడా చైల్డ్ ఆర్టిస్ట్ గా చాలా సినిమాల్లో న‌టించారు. బాల న‌టుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇక హీరోగా కూడా హిట్ సినిమాలు తీశాడు.

Also Read: పాపం, ఈ హీరోయిన్స్‌కు హిట్స్ అంటే తెలియదు

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

CM Revanth Reddy: 'సినీ స్టారా? పొలిటికల్ స్టారా? అనేది ప్రభుత్వం చూడదు' - అల్లు అర్జున్ ఘటనపై స్పందించిన సీఎం రేవంత్ రెడ్డి
'సినీ స్టారా? పొలిటికల్ స్టారా? అనేది ప్రభుత్వం చూడదు' - అల్లు అర్జున్ ఘటనపై స్పందించిన సీఎం రేవంత్ రెడ్డి
Telangana News: శనివారం సంక్షేమ హాస్టళ్లలో సీఎం, మంత్రుల ఆకస్మిక తనిఖీలు - ట్విస్ట్ ఏంటంటే!
శనివారం సంక్షేమ హాస్టళ్లలో సీఎం, మంత్రుల ఆకస్మిక తనిఖీలు - ట్విస్ట్ ఏంటంటే!
Ind Vs Aus Test Series: నేటి నుంచే భారత్ - ఆసీస్ మూడో టెస్టు - టీమిండియాలో మార్పులు!
నేటి నుంచే భారత్ - ఆసీస్ మూడో టెస్టు - టీమిండియాలో మార్పులు!
Jagan For Arjun: అర్జున్‌ను అరెస్టు చేయడం అన్యాయం - మద్దతుగా జగన్ సంచలన ట్వీట్
అర్జున్‌ను అరెస్టు చేయడం అన్యాయం - మద్దతుగా జగన్ సంచలన ట్వీట్
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

చంచల్ గూడ జైలుకి అల్లు అర్జున్ తరలింపుఆ ఒక్క నిర్ణయమే అల్లు అర్జున్ అరెస్ట్ వరకూ వచ్చిందా..?అల్లు అర్జున్ అరెస్ట్ సమయంలో కన్నీళ్లు పెట్టున్న స్నేహపాతిక లక్షల పరిహారం ఇచ్చినా అరెస్ట్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
CM Revanth Reddy: 'సినీ స్టారా? పొలిటికల్ స్టారా? అనేది ప్రభుత్వం చూడదు' - అల్లు అర్జున్ ఘటనపై స్పందించిన సీఎం రేవంత్ రెడ్డి
'సినీ స్టారా? పొలిటికల్ స్టారా? అనేది ప్రభుత్వం చూడదు' - అల్లు అర్జున్ ఘటనపై స్పందించిన సీఎం రేవంత్ రెడ్డి
Telangana News: శనివారం సంక్షేమ హాస్టళ్లలో సీఎం, మంత్రుల ఆకస్మిక తనిఖీలు - ట్విస్ట్ ఏంటంటే!
శనివారం సంక్షేమ హాస్టళ్లలో సీఎం, మంత్రుల ఆకస్మిక తనిఖీలు - ట్విస్ట్ ఏంటంటే!
Ind Vs Aus Test Series: నేటి నుంచే భారత్ - ఆసీస్ మూడో టెస్టు - టీమిండియాలో మార్పులు!
నేటి నుంచే భారత్ - ఆసీస్ మూడో టెస్టు - టీమిండియాలో మార్పులు!
Jagan For Arjun: అర్జున్‌ను అరెస్టు చేయడం అన్యాయం - మద్దతుగా జగన్ సంచలన ట్వీట్
అర్జున్‌ను అరెస్టు చేయడం అన్యాయం - మద్దతుగా జగన్ సంచలన ట్వీట్
2024 Flashback: గ్రేట్ ఇయర్ - ఈ ఏడాది తండ్రులుగా మారిన క్రికెటర్లు వీరే!
గ్రేట్ ఇయర్ - ఈ ఏడాది తండ్రులుగా మారిన క్రికెటర్లు వీరే!
Google Pay Transaction Delete: గూగుల్ పేలో ట్రాన్సాక్షన్లు డిలీట్ చేయడం ఎలా? - సింపుల్‌ స్టెప్స్‌తో పని అయిపోతుంది!
గూగుల్ పేలో ట్రాన్సాక్షన్లు డిలీట్ చేయడం ఎలా? - సింపుల్‌ స్టెప్స్‌తో పని అయిపోతుంది!
Allu Arjun Bail: చంచల్ గూడ జైలుకు అల్లు అర్జున్ - హైకోర్టు మధ్యంతర బెయిల్‌తో..
చంచల్ గూడ జైలుకు అల్లు అర్జున్ - హైకోర్టు మధ్యంతర బెయిల్‌తో..
Skoda Kylaq: 10 రోజుల్లో 10 వేల బుకింగ్స్ - మార్కెట్లో దూసుకుపోతున్న స్కోడా కైలాక్!
10 రోజుల్లో 10 వేల బుకింగ్స్ - మార్కెట్లో దూసుకుపోతున్న స్కోడా కైలాక్!
Embed widget