By: ABP Desam | Updated at : 24 Apr 2023 09:02 PM (IST)
విరూపాక్ష (Photo Credit: Sai Dharam Tej/Twitter)
సుప్రీం హీరో సాయి ధరమ్ తేజ్ నటించిన తాజా సినిమా ‘విరూపాక్ష’. కార్తీక్ దండు దర్శకత్వం వహించిన ఈ సినిమా విడుదలైన తొలి రోజు నుంచే హిట్ టాక్ తెచ్చుకుంది. బాక్సాఫీస్ దగ్గర వసూళ్ల వర్షం కురిపిస్తోంది. యాక్సిడెంట్ తర్వాత నటించిన ఫస్ట్ మూవీ బ్లాక్ బస్టర్ సాధించడతో సాయి ధరమ్ తేజ్ సంతోషానికి అవధులు లేకుండా పోయాయి. ఈ నేపథ్యంలోనే ‘విరూపాక్ష’ సీక్వెల్ పై జోరుగా చర్చ నడుస్తోంది. తాజాగా ఈ సినిమా సీక్వెల్ ఉండబోతోందని హీరో కన్ఫార్మ్ చేశారు. సోషల్ మీడియాలో ఓ అభిమాని అడిగిన ప్రశ్నకు సీక్వెల్ ఉంటుందని క్లారిటీ ఇచ్చారు.
‘విరూపాక్ష’ బ్లాక్ బస్టర్ కావడంతో నెటిజన్లతో ముచ్చటించారు. #AskSDT పేరుతో అభిమానుల ప్రశ్నలకు సమాధానం చెప్పారు. ఓ అభిమాని “విరూపాక్ష మూవీ క్లైమాక్స్ లో చిన్న హింట్ ఇచ్చారు పార్ట్2 ఉంటుందా? సాయి ధరమ్ తేజ్ అన్నా ఒకవేళ పార్ట్ 2 ఉంటే మన ఫ్యాన్స్ కి పండుగే” అని ట్వీట్ చేశారు. దీనికి హీరో రియాక్ట్ అయ్యారు. “ఉంది అనే కదా హింట్ ఇచ్చాం” అని చెప్పుకొచ్చారు. సాయి సమాధానంతో మెగా అభిమానులు ఫుల్ ఖుషీ అవుతున్నారు.
#Virupaksha Movie Climax Lo Chinna Hint Icharu Part2 Untundha @IamSaiDharamTej Anna Okavela Part2 Unte Mana Fan's Ki Panduge Anna#AskSDT #BlockBusterVirupaksha pic.twitter.com/yvDJsxxnej
— Pavan Kalyan Mbs (@MbsPavanJsp) April 24, 2023
Undhi ane kadha hint ichamu 😊
— Sai Dharam Tej (@IamSaiDharamTej) April 24, 2023
ఇప్పటికే ‘విరూపాక్ష’ సీక్వెల్ పై దర్శకుడు కార్తీక్ దండు అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పారు. సీక్వెల్ ఉంటుందని క్లారిటీ ఇచ్చారు. ఓ టీవీ చానెల్ ఇంటర్వూలో ఓ ప్రేక్షకుడు ‘విరూపాక్ష’కు సీక్వెల్ వస్తుందా అని అడిగాడు. దీనిపై కార్తీక్ స్పందిస్తూ.. ‘‘ఇప్పటికైతే అనుకోలేదు. నేను, సుకుమార్ ప్లాన్ చేస్తున్నాం. తప్పకుండా సీక్వెల్ ఉంటుంది. కానీ, వెంటనే రాకపోవచ్చు’’ అని తెలిపారు. అయితే, ఈ మూవీలో ఉన్న రెండు పాటల్లో కేవలం ఒక పాట మాత్రమే థియేటర్లో ఉందని, రెండోది లేదని అడగ్గా.. ఓటీటీలో రిలీజ్ చేసేప్పుడు ఆ పాటను చేర్చుతామన్నారు. థియేటర్‌లో థ్రిల్ మిస్సవ్వకూడదనే ఉద్దేశంతోనే ఆ పాటను తొలగించినట్లు వెల్లడించారు.
శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర, సుకుమార్ పతాకాలపై బాపినీడు బి సమర్పణలో బీవీఎస్‌ఎన్ ప్రసాద్ 'విరూపాక్ష' సినిమాను నిర్మించారు. సంయుక్త మీనన్ హీరోయిన్ గా చేసింది. బైక్ యాక్సిడెంట్ అయిన తర్వాత సాయి ధరమ్ తేజ్ నటించిన తొలి చిత్రం ‘విరూపాక్ష’ కావడంతో అభిమానులలో ఈ మూవీపై ఆసక్తి నెలకొంది. అంతేకాకుండా రెగ్యులర్ కమర్షియల్ కథతో కాకుండా మిస్టరీ థ్రిల్లర్ కాన్సెప్ట్ ఎంపిక చేసుకోవడం కూడా సాయి ధరమ్ తేజ్‌కు ప్లస్ అయ్యింది. మొత్తంగా సినిమా బావుందని చాలా మంది సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. ఈ మూవీ తొలి షో నుంచే బ్లాక్ బస్టర్ హిట్ టాక్ తో దూసుకుపోతోంది. సినిమా చూసేందుకు థియేటర్ల దగ్గర అభిమానులు పోటెత్తుతున్నారు. సాయి ధరమ్ తేజ్ హిట్ అందుకోవడం పట్ల మెగా అభిమానులు ఫుల్ హ్యాపీగా ఉన్నారు. ఈ దెబ్బతో సాయి కెరీర్ మళ్లీ గాడిన పడటం ఖాయమని అంటున్నారు.
Read Also: మొన్న ఎన్టీఆర్, ఇప్పుడు సమంత - అలా మాట్లాడటం అవసరమా అంటూ నెటిజనులు ఆగ్రహం
'Hari Hara Veera Mallu Movie: ‘హరిహర వీర మల్లు’ సెట్స్‌లో భారీ అగ్ని ప్రమాదం, షూటింగ్ మరింత ఆలస్యం?
Ram Sita Ram Song: ఆహా ఎంత అద్భుతం! ఆకట్టుకుంటున్న‘ఆదిపురుష్’ ‘రామ్ సీతా రామ్’ సాంగ్
HanuMan Movie: ‘హనుమాన్‘ చిత్రంలో 1600 వీఎఫ్ఎక్స్ షాట్స్ - మరి రిలీజ్?
Allu Arjun: ఆ మూవీలో గెస్ట్ రోల్ కోసం అసలు బన్నీని ఎవరూ సంప్రదించలేదా?
అఖిల్‌కు బదులు నిఖిల్ - చెర్రీపై అక్కినేని ఫ్యాన్స్ అలక, మెగా ఫ్యాన్స్‌కూ మింగుడు పడని ఆ నిర్ణయం!
చంద్రబాబుకు మేనిఫెస్టో అంటే చిత్తు కాగితంతో సమానం- వైఎస్ఆర్సీపీ ఘాటు విమర్శలు
Wrestlers Protest: ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చిన రెజ్లర్లకు ఇచ్చే గౌరవమిదేనా: మంత్రి కేటీఆర్
Telangana Decade Celebration: గ్రామాల్లో 23 రోజుల పాటు ప్రణాళికా బద్ధంగా దశాబ్ధి వేడుకలు: మంత్రి ఎర్రబెల్లి
Telangana News: ఇంట్లోనే కూర్చొని రీల్స్ చేస్తుంటారా - అయితే ఈ అదిరిపోయే ఆఫర్ మీ కోసమే!