అన్వేషించండి

Samantha Accent: మొన్న ఎన్టీఆర్, ఇప్పుడు సమంత - అలా మాట్లాడటం అవసరమా అంటూ నెటిజనులు ఆగ్రహం

ప్రియాంక చోప్రా, రిచర్డ్ మాడాన్ కీలక పాత్రల్లో నటిస్తున్న వెబ్ సిరీస్ ‘సిటాడెల్’. తాజాగా లండన్ లో ప్రీమియర్ షో వేశారు. ఈ షోకు హాజరైన సమంత, మీడియాతో మాట్లాడిన మాటలపై నెటిజన్లు ట్రోల్ చేస్తున్నారు.

హాలీవుడ్ లో అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న వెబ్ సిరీస్ ‘సిటాడెల్’. ప్రియాంక చోప్రా, రిచర్డ్ మాడాన్, స్టాన్లీ టుక్సీ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ సిరీస్ ను, అమెజాన్ సంస్థ గ్రాండ్ గా రూపొందిస్తోంది. ‘సిటాడెల్‌’లో ప్రియాంక ఎలైట్ గూఢచారి నదియా సిన్ పాత్ర పోషిస్తుంది. ఏప్రిల్ 28న ‘సిటాడెల్’ సిరీస్ స్ట్రీమింగ్ కు రానున్నది. రస్సో బ్రదర్స్ సృష్టించిన సైన్స్ ఫిక్షన్ డ్రామా  ‘సిటాడెల్‘ సిరీస్ ను తెలుగు, హిందీ, తమిళం, కన్నడ, మలయాళంలోనూ విడుదల కానుంది.  

సమంతా యాసపై నెటిజన్ల విమర్శలు

రీసెంట్ గా ‘సిటాడెల్‘ ప్రీమియర్ షోను లండన్ లో వేశారు. ఈ షోకు ఇండియన్ వెర్షన్ నటీటనలు, దర్శకులు సమంత, వరుణ్ ధావన్,  రాజ్, డీకే హాజరయ్యారు. ప్రియాంక చోప్రాతో కలిసి సమంతా ఈ షో తిలకించారు.  షో అనంతరం  సహ నటుడు  వరుణ్ ధావన్‌తో కలిసి అక్కడి మీడియాతో మాట్లాడారు. అయితే, వెస్ట్రన్ యాస్ లో మాట్లాడేందుకు ఆమె ప్రయత్నించారు. ఈ మాటలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. చాలా మంది ఆమె మాట్లాడిన విధానాన్ని తప్పుబడుతూ నెట్టింట్లో పోస్టులు పెడుతున్నారు.  లండన్ వెళ్లినంత మాత్రాన యాసను మార్చాల్సిన అవసరం ఏమిటని ప్రశ్నిస్తున్నారు. “ఈ ఇండియన్ యాక్టర్స్ కు ఏమైంది? ఇతర దేశాలకు వెళ్లగానే వారికి వేరే యాస ఎందుకు వస్తుంది?” అంటూ ఓ నెటిజన్ ట్వీట్ చేశాడు. “ఆమె యాస చాలా ఆర్టిఫీషియల్ గా ఉంది” అంటూ మరొకరు కామెంట్ చేశారు. చాలా మంది ఆమె యానను తప్పుబడుతున్నారు. మరికొంత మంది సమంత అభిమానులు మాత్రం ఆమె బాగానే మాట్లాడారు అంటూ  తనకు సపోర్టు చేస్తున్నారు. కొద్ది రోజుల క్రితం ఆస్కార్ వేడుకల సందర్భంగా జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ మాట్లాడిన యాసపైనా నెటిజన్లు ట్రోల్ చేశారు.

ఏప్రిల్ 28 నుంచి ‘సిటాడెల్’ సిరీస్ స్ట్రీమింగ్

ఏప్రిల్ 28న ‘సిటాడెల్’ సిరీస్ కు సంబంధించిన రెండు ఎపిసోడ్ లు స్ట్రీమింగ్ కు రానున్నది.  దాని తర్వాత ప్రతి శుక్రవారం మే 26 వరకు వారానికో కొత్త ఎపిసోడ్ విడుదల అవుతుంది. ఇప్పటికే ఈ సిరీస్ కు సంబంధించిన  ట్రైలర్ ను తెలుగుతో పాటు హిందీ, తమిళం,  కన్నడ, మలయాళంలోనూ విడుదల చేశారు. ట్రైలర్ ఆద్యంతం హై యాక్షన్ సన్నివేశాలతో నిండిపోయింది. ‘సిటాడెల్’ స్పై ఏజెంట్లుగా ప్రియాంక, మాడన్ సూపర్ డూపర్ యాక్షన్ తో అదరగొట్టారు. వీరిద్దరి మధ్య రొమాంటిక్ సన్నివేశాలు సైతం ఆకట్టుకున్నాయి. గన్స్, బాంబ్స్ మోతలతో భారీ యాక్షన్ సన్నివేశాలతో ట్రైలర్ నిండిపోయింది. ట్రైలర్ స్టార్టింగ్ మొదలుకుని చివరి వరకు రెప్పలు ఆర్పకుండా చూసేలా ఉంది.

ఇదే ‘సిటాడెల్’ సిరీస్  హిందీలోనూ తెరకెక్కుతోంది. ఇక్కడి ప్రేక్షకులకు అనుకూలంగా స్క్రిప్ట్ ని మార్చి దర్శకులు రాజ్, డీకే రూపొందిస్తున్నారు. సమంతను ’సిటాడెల్’ ఇండియన్ వర్షన్ మెయిన్ లీడ్ గా తీసుకున్నారు. వరుణ్ ధావన్ సైతం ఇందులో ప్రముఖ పాత్ర పోషిస్తున్నారు. ఇక  తాజాగా సమంత నటించిన ‘శాకుంతలం’ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర బోల్తా కొట్టింది.

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Samantha (@samantharuthprabhuoffl)

Read Also: ఈ వారం థియేటర్‌, ఓటీటీలో అలరించే చిత్రాలివే!

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Chandrababu Meets Modi: ప్రధానమంత్రి మోదీతో ఏపీ సీఎం చంద్రబాబు సమావేశం- చర్చించిన అంశాలు ఏంటంటే?
ప్రధానమంత్రి మోదీతో ఏపీ సీఎం చంద్రబాబు సమావేశం- చర్చించిన అంశాలు ఏంటంటే?
Telangana CM Revanth Reddy: తెలంగాణ సీఎంతో సమావేశాలో పాల్గొనే సినీ ప్రముఖులు వీళ్లే 
తెలంగాణ సీఎంతో సమావేశాలో పాల్గొనే సినీ ప్రముఖులు వీళ్లే 
Sandhya Theatre Incident: శ్రీతేజ్ కుటుంబానికి రూ.2 కోట్లు సాయం - చెక్కులు అందించిన పుష్ప 2 టీమ్
శ్రీతేజ్ కుటుంబానికి రూ.2 కోట్లు సాయం - చెక్కులు అందించిన పుష్ప 2 టీమ్
Kazakhstan Plane Crash: కజకిస్తాన్‌లో కుప్పకూలిన విమానం, భారీగా ప్రాణ నష్టం - క్రాష్ అవుతున్న వీడియో వైరల్
కజకిస్తాన్‌లో కుప్పకూలిన విమానం, భారీగా ప్రాణ నష్టం - క్రాష్ అవుతున్న వీడియో వైరల్
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Chiranjeevi Meeting CM Revanth Reddy | సినీ పరిశ్రమ సమస్యలపై సీఎంతో భేటీ | ABP Desamకశ్మీర్‌లో మంచు చూశారా? డ్రోన్ విజువల్స్బ్రెజిల్‌లోని జీసెస్ కాకినాడకు దగ్గర్లోహిందూ, ముస్లింలూ వెళ్లే ఈ చర్చి గురించి తెలుసా?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Chandrababu Meets Modi: ప్రధానమంత్రి మోదీతో ఏపీ సీఎం చంద్రబాబు సమావేశం- చర్చించిన అంశాలు ఏంటంటే?
ప్రధానమంత్రి మోదీతో ఏపీ సీఎం చంద్రబాబు సమావేశం- చర్చించిన అంశాలు ఏంటంటే?
Telangana CM Revanth Reddy: తెలంగాణ సీఎంతో సమావేశాలో పాల్గొనే సినీ ప్రముఖులు వీళ్లే 
తెలంగాణ సీఎంతో సమావేశాలో పాల్గొనే సినీ ప్రముఖులు వీళ్లే 
Sandhya Theatre Incident: శ్రీతేజ్ కుటుంబానికి రూ.2 కోట్లు సాయం - చెక్కులు అందించిన పుష్ప 2 టీమ్
శ్రీతేజ్ కుటుంబానికి రూ.2 కోట్లు సాయం - చెక్కులు అందించిన పుష్ప 2 టీమ్
Kazakhstan Plane Crash: కజకిస్తాన్‌లో కుప్పకూలిన విమానం, భారీగా ప్రాణ నష్టం - క్రాష్ అవుతున్న వీడియో వైరల్
కజకిస్తాన్‌లో కుప్పకూలిన విమానం, భారీగా ప్రాణ నష్టం - క్రాష్ అవుతున్న వీడియో వైరల్
Bumrah VS Ashwin: అశ్విన్ ను సమం చేసిన బుమ్రా.. తాజా ఐసీసీ ర్యాంకింగ్స్ దుమ్ము రేపిన స్టార్ పేసర్.. కొత్త రికార్డు దిశగా బుమ్రా ప్రయాణం
అశ్విన్ ను సమం చేసిన బుమ్రా.. తాజా ఐసీసీ ర్యాంకింగ్స్ దుమ్ము రేపిన స్టార్ పేసర్.. కొత్త రికార్డు దిశగా బుమ్రా ప్రయాణం
Andhra Pradesh News: అన్నదాతపై పగబట్టి అల్పపీడనం- వర్షాలకు నీట మునిగిన పంటలు
అన్నదాతపై పగబట్టి అల్పపీడనం- వర్షాలకు నీట మునిగిన పంటలు
Hydra Commissioner Ranganath : త్వరలోనే హైడ్రా యాప్.. జులై తర్వాత కట్టిన అక్రమ నిర్మాణాలు కచ్చితంగా కూల్చేస్తాం: రంగనాథ్‌
త్వరలోనే హైడ్రా యాప్.. జులై తర్వాత కట్టిన అక్రమ నిర్మాణాలు కచ్చితంగా కూల్చేస్తాం: రంగనాథ్‌
Tollywood  News: రేపు సీఎం రేవంత్‌తో ఫిల్మ్‌ ఇండస్ట్రీ పెద్దల సమావేశం- బెనిఫిట్‌ షోలకు ఓకే చెబుతారా!
రేపు సీఎం రేవంత్‌తో ఫిల్మ్‌ ఇండస్ట్రీ పెద్దల సమావేశం- బెనిఫిట్‌ షోలకు ఓకే చెబుతారా!
Embed widget