Theatre-OTT Releases: ఈ వారం థియేటర్, ఓటీటీలో అలరించే చిత్రాలివే!
ప్రతి వారం మాదిరిగానే ఈవారం సైతం పలు సినిమాలు థియేటర్లలో సందడి చేయనున్నాయి. మరికొన్ని చిత్రాలు నేరుగా ఓటీటీలో స్ట్రీమింగ్ కాబోతున్నాయి. ఇంతకీ ఈ వీక్ లో థియేటర్, ఓటీటీలో అలరించే చిత్రాలేవో చూద్దాం!
గత వారం సమంత, సంయుక్త మీనన్ జంటగా నటించిన చిత్రం ‘విరూపాక్ష‘ విడుదల అయ్యింది. గార్గేయి యల్లాప్రగడ ప్రధానపాత్రలో రూపొందిన చిత్రం 'హలో మీరా' ప్రేక్షకుల ముందుకు వచ్చింది. వీటిలో ‘విరూపాక్ష‘ చిత్రం బ్లాక్ బస్టర్ అయ్యింది. రోడ్డు ప్రమాదం తర్వాత సాయి ధరమ్ తేజ్ నటించిన ఈ సస్పెన్స్ థ్రిల్లర్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. ‘హలో మీరా‘ గురించి పెద్దగా టాక్ లేదు. ఇక ఈ వారం సైతం పలు సినిమాలు థియేటర్లలో సందడి చేయబోతున్నాయి. కొన్ని చిత్రాలు ఓటీటీ ఫ్లాట్ ఫారమ్ లలో విడుదలకు రెడీ అవుతున్నాయి. ఇటు థియేటర్లు, అటు ఓటీటీల్లో విడుదలకాబోతున్నసినిమాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
ఏజెంట్ - ఏప్రిల్ 28
సురేందర్ రెడ్డి డైరెక్షన్ లో టాలీవుడ్ హీరో అఖిల్ అక్కినేని నటించిన చిత్రం 'ఏజెంట్'. యాక్షన్ ఎలిమెంట్స్ తో వస్తోన్న 'ఏజెంట్' చిత్రం ఈ నెల 28న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ సినిమాలో మమ్ముట్టి, డినో మోరియా ప్రధాన పాత్రలో నటించారు. అఖిల్ సరసన సాక్షి వైద్య హీరోయిన్‌గా చేస్తోంది.ఈ సినిమాకు సంబంధించి ఇటీవల మూవీ ట్రైలర్ విడుదల కావడంతో భారీ రెస్పాన్స్ వస్తోంది. 'ఏజెంట్' ను ఏకే ఎంటర్ టైన్మెంట్స్, సురేందర్ 2 సినిమా బ్యానర్ లపై నిర్మించారు.
పొన్నియన్ సెల్వన్ 2 - ఏప్రిల్ 28
దర్శక దిగ్గజం మణిరత్నం దర్శకత్వం వహించిన హిస్టారికల్ యాక్షన్ సినిమా ‘పొన్నియిన్ సెల్వన్’ ఎంత పెద్ద హిట్ అయిందో అందరికీ తెలిసిందే. గతేడాది వచ్చిన ఇండియన్ బిగ్గెస్ట్ కలెక్షన్స్ మూవీలలో ఒకటిగా నిలిచింది. ఇక ఏప్రిల్ 28 న ‘పొన్నియిన్ సెల్వన్ 2’ విడుదల కానుంది. ఈ సినిమాలో ఐశ్వర్య రాయ్, నందిని, చియాన్ విక్రమ్, జయం రవి, త్రిష, కార్తీ, జయరామన్, నాజర్, ప్రభు, ఐశ్వర్య లక్ష్మి, శోభిత తదితరులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ఏ ఆర్ రెహమాన్ మూవీకు సంగీతం అందించారు. లైకా ప్రొడక్షన్స్, మద్రాస్ టాకీస్ కలిసి సినిమాను నిర్మించారు.
రారా పెనిమిటి - ఏప్రిల్ 28
భర్త రాక కోసం భార్య పడే విరహ వేదన కథాంశంతో తెరకెక్కిన చిత్రం ‘రారా పెనిమిటి‘. సింగిల్ క్యారక్టర్ తో రూపొందిన ఈ మూవీలో నందిత శ్వేత నటించింది. శ్రీ విజయానంద్ పిక్చర్స్ బ్యానర్ లో రూపొందిన ఈ సినిమాకు సత్య వెంకట గెద్దాడ దర్శకత్వం వహించారు. ప్రమీల గెద్దాడ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. మణిశర్మ ఈ సినిమాకు సంగీతం అందించారు. ఈ చిత్రం ఏప్రిల్ 28న విడుదల కానుంది.
ఓటీటీ సినిమాలు/ వెబ్ సిరీస్‌లు ఇవే!
నెట్‌ఫ్లిక్స్
1.దసరా - ఏప్రిల్ 27
2.కోర్ట్ లేడీ (వెబ్ సిరీస్) - ఏప్రిల్ 26
3.నోవోల్యాండ్ (వెబ్ సిరీస్) - ఏప్రిల్ 27
4.ది గుడ్ బ్యాడ్ మదర్ (వెబ్ సిరీస్)- ఏప్రిల్ 27
5.ఎకా - ఏప్రిల్ 28
6.బిఫోర్ లైఫ్ ఆఫ్టర్ డెత్ - ఏప్రిల్ 28
అమెజాన్ ప్రైమ్
1.పత్తు తల - ఏప్రిల్ 27
2.సిటాడెల్ (వెబ్ సిరీస్) - ఏప్రిల్ 28
జీ5
1.వ్యవస్థ - ఏప్రిల్ 28
2.యూటర్న్ - ఏప్రిల్ 28
హాట్‌స్టార్
1.సేవ్ ది టైగర్స్ (వెబ్ సిరీస్) - ఏప్రిల్ 27
2. పీటర్ పాన్ అండ్ వెండీ - ఏప్రిల్ 28
సోనీలివ్
1.తురముఖమ్ - ఏప్రిల్ 28
Read Also: ఉపాసన సీమంతానికి అల్లు అర్జున్, ఆ వార్తలకు ఫుల్ స్టాప్ పడినట్లేనా?