అన్వేషించండి

Guntur Kaaram VS Hanuman: ‘గుంటూరు కారం‘ను వెనక్కి నెట్టిన 'హనుమాన్', సొంత మల్టీఫ్లెక్స్ లో మహేష్ మూవీ క్యాన్సిల్?

Guntur Kaaram VS Hanuman: మహేష్ బాబు ‘గుంటూరు కారం‘తో పోల్చితే, తేజ సజ్జ ‘హనుమాన్‘ బాక్సాఫీస్ దగ్గర దూసుకెళ్తోంది. టికెట్ల సేల్ పరంగానూ ప్రశాంత్ వర్మ మూవీ సత్తా చాటుతోంది.

Guntur Kaaram VS Hanuman: సంక్రాంతి పండుగ వేళ టాలీవుడ్ లో గట్టి పోటీ నెలకొంది. ఈసారి పండుగ బరిలో నాలుగు సినిమాలు నిలిచాయి. మహేష్ బాబు హీరోగా తెరకెక్కిన ‘గుంటూరు కారం‘, తేజ సజ్జ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ‘హనుమాన్‘, నాగార్జున ‘నా సామిరంగ‘, వెంకటేష్ ‘సైంధవ్‘ సినిమా ప్రేక్షకులకు వినోదపు విందును పంచుతున్నాయి. మిగతా సినిమాల విషయం పక్కన పెడితే ఇవాళ(జనవరి 12న) విడుదలైన 'గుంటూరు కారం', 'హనుమాన్'​ చిత్రాల మధ్య ఇంట్రెస్టింగ్ ఫైట్ కొనసాగుతోంది. టాలీవుడ్ సూపర్ స్టార్ తో యంగ్ హీరో తేజ సజ్జ ఢీకొట్టారు.  

బుకింగ్స్ లోనూ దూసుకెళ్తున్న ‘హనుమాన్‘

విడుదలకు ముందే ‘గుంటూరు కారం‘తో పోల్చితే, ‘హనుమాన్‘ మూవీ టికెట్ బుకింగ్స్ లో టాప్ లో కొనసాగింది. అంతేకాదు, ‘హనుమాన్‘ సినిమా చూసేందుకే ప్రేక్షకులు ఎక్కువ ఆసక్తి చూపించారు. ఆన్ లైన్ టికెటింగ్ యాప్ బుక్ మై షో ఈ విషయాన్ని వెల్లడించింది. ఇక టికెట్ల సేల్ విషయంలోనూ మహేష్ మూవీతో పోల్చితే తేజ సజ్జ మూవీ దూసుకెళ్తోంది. గంట వ్యవధిలో ‘గుంటూరు కారం‘ సినిమా 16 వేల టికెట్లు బుక్ కాగా, ‘హనుమాన్‘ మూవీ సుమారు 20 వేల టికెట్లు బుక్ అయ్యాయి. ప్రస్తుతం మహేష్ మూవీ బుకింగ్స్ లో వెనుకబడింది.  

మహేష్ బాబు సొంత మల్టీఫ్లెక్స్ లో ‘గుంటూరు కారం‘ షో క్యాన్సిల్?

‘హనుమాన్‘ దూకుడుతో ‘గుంటూరు కారం‘ సినిమాకు షాకుల మీద షాకులు ఎదురవుతున్నాయి. ఏకంగా మహేష్ సొంత మల్టీఫ్లెక్స్ AMB సినిమాస్‌(గచ్చిబౌలి)లో తొలిరోజే ‘గుంటూరు కారం‘ సినిమా క్యాన్సిల్ అయ్యింది. కొత్తగా యాడ్ చేసిన 1 PM స్లాట్ కు బుకింగ్స్ లేకపోవడంతో షో క్యాన్సిల్ చేసినట్లు సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. సూపర్ స్టార్ మహేష్ బాబుకు తన సొంత మల్టీప్లెక్స్‌ లో ఎదురుదెబ్బ తగిలిందంటూ ప్రచారం జరుగుతోంది. అయితే, దీనిపై మల్టిఫ్లెక్స్ నిర్వాహకులు ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. వాస్తవానికి ‘గుంటూరు కారం’ మూవీకి సంబంధించిన టికెట్లు బుధవారమే నిండిపోయాయి. అయితే, క్రేజ్‌ను దృష్టిలో పెట్టుకుని మధ్యాహ్నం 1 గంటకు కూడా స్లాట్స్ యాడ్ చేశారని తెలుస్తోంది.

ఇక 'హనుమాన్' మూవీలో తేజ సజ్జాకు జంటగా అమృత అయ్యర్ నటించింది. కోలీవుడ్​ నటి వరలక్ష్మి శరత్‌కుమార్, సీనియర్ నటుడు, దర్శకుడు  సముద్రఖని ఇందులో కీలక పాత్రలు పోషించారు. ఈ చిత్రాన్ని ప్రైమ్ షో ఎంటర్టైన్మెంట్ బ్యానర్‌పై కే నిరంజన్ రెడ్డి నిర్మించారు. అటు ‘గుంటూరు కారం’ సినిమాలో మహేష్ బాబు హీరోగా నటించారు. త్రివిక్రమ్ దర్శకత్వం వహించారు. ఈ చిత్రంలో శ్రీలీల, మీనాక్షి చౌదరి హీరోయిన్లుగా నటించింది. రమ్యకృష్ణ, ప్రకాష్‌రాజ్‌, జగపతిబాబు కీలక పాత్రలు పోషించారు. హాసిని, హారిక క్రియేషన్స్‌ పతాకంపై ఎస్‌.రాధాకృష్ణ నిర్మించారు. తమన్‌ సంగీతం అందించారు.

Read Also: ‘కల్కి’ నుంచి క్రేజీ అప్ డేట్, టీజర్ రిలీజ్ అప్పుడేనా?

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

EVs Registration Fee: తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ - ఎలక్ట్రిక్ వాహనాలకు రిజిస్ట్రేషన్ ఫీజు మినహాయింపు
తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ - ఎలక్ట్రిక్ వాహనాలకు రిజిస్ట్రేషన్ ఫీజు మినహాయింపు
Andhra News: ఏపీలో తీవ్ర విషాదాలు - సెల్‌ఫోన్‌లో ఆడుతూ సాంబారులో పడి బాలుడు మృతి, రోడ్డు ప్రమాదంలో ముగ్గురు బాలురు మృతి
ఏపీలో తీవ్ర విషాదాలు - సెల్‌ఫోన్‌లో ఆడుతూ సాంబారులో పడి బాలుడు మృతి, రోడ్డు ప్రమాదంలో ముగ్గురు బాలురు మృతి
Devi Sri Prasad: ప్రతి ఫ్రేమ్‌లో వినిపించింది నేనే - ట్రైలర్ లాంచ్ అయ్యాక దేవిశ్రీ ట్వీట్!
ప్రతి ఫ్రేమ్‌లో వినిపించింది నేనే - ట్రైలర్ లాంచ్ అయ్యాక దేవిశ్రీ ట్వీట్!
Jio New Plan: ఒక్క రీఛార్జ్‌తో 98 రోజుల వ్యాలిడిటీ, 196 జీబీ డేటా - జియో సూపర్ ప్లాన్ ఇదే!
ఒక్క రీఛార్జ్‌తో 98 రోజుల వ్యాలిడిటీ, 196 జీబీ డేటా - జియో సూపర్ ప్లాన్ ఇదే!
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

సచ్చిపోదామని యాసిడ్ తాగినా!! ఇతని స్టోరీకి కన్నీళ్లు ఆగవు!బై నాన్నా.. వెక్కివెక్కి ఏడ్చిన నారా రోహిత్Nayanthara vs Dhanush Netflix Documentary | తమిళ్ సినీ ఇండస్ట్రీలో వివాదం..నయనతార vs ధనుష్ | ABP Desamరోహిత్ కి ధోని చేసిన మేలు, తిలక్ కి సూర్య చేస్తున్నాడు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
EVs Registration Fee: తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ - ఎలక్ట్రిక్ వాహనాలకు రిజిస్ట్రేషన్ ఫీజు మినహాయింపు
తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ - ఎలక్ట్రిక్ వాహనాలకు రిజిస్ట్రేషన్ ఫీజు మినహాయింపు
Andhra News: ఏపీలో తీవ్ర విషాదాలు - సెల్‌ఫోన్‌లో ఆడుతూ సాంబారులో పడి బాలుడు మృతి, రోడ్డు ప్రమాదంలో ముగ్గురు బాలురు మృతి
ఏపీలో తీవ్ర విషాదాలు - సెల్‌ఫోన్‌లో ఆడుతూ సాంబారులో పడి బాలుడు మృతి, రోడ్డు ప్రమాదంలో ముగ్గురు బాలురు మృతి
Devi Sri Prasad: ప్రతి ఫ్రేమ్‌లో వినిపించింది నేనే - ట్రైలర్ లాంచ్ అయ్యాక దేవిశ్రీ ట్వీట్!
ప్రతి ఫ్రేమ్‌లో వినిపించింది నేనే - ట్రైలర్ లాంచ్ అయ్యాక దేవిశ్రీ ట్వీట్!
Jio New Plan: ఒక్క రీఛార్జ్‌తో 98 రోజుల వ్యాలిడిటీ, 196 జీబీ డేటా - జియో సూపర్ ప్లాన్ ఇదే!
ఒక్క రీఛార్జ్‌తో 98 రోజుల వ్యాలిడిటీ, 196 జీబీ డేటా - జియో సూపర్ ప్లాన్ ఇదే!
Group 3 Exams: భార్యకు పరీక్ష, భర్తకు బాధ్యత - గ్రూప్ 3 పరీక్షా కేంద్రాల వద్ద వైరల్ 'సిత్రాలు'
భార్యకు పరీక్ష, భర్తకు బాధ్యత - గ్రూప్ 3 పరీక్షా కేంద్రాల వద్ద వైరల్ 'సిత్రాలు'
Pushpa 2 Trailer: మాసు డోసు పెరిగింది బాసూ - ‘పుష్ప 2’ ట్రైలర్ రిలీజ్ - సినిమా ఈ రేంజ్ అయితే ‘బాహుబలి 2’ అవుట్!
మాసు డోసు పెరిగింది బాసూ - ‘పుష్ప 2’ ట్రైలర్ రిలీజ్ - సినిమా ఈ రేంజ్ అయితే ‘బాహుబలి 2’ అవుట్!
Lagacherla News: వచ్చేది ఫార్మా ఇండస్ట్రీ కాదు, ఇండస్ట్రియల్ అండ్‌ టెక్స్‌టైల్ పార్కు- లగచర్ల వివాదంలో భారీ ట్విస్ట్
వచ్చేది ఫార్మా ఇండస్ట్రీ కాదు, ఇండస్ట్రియల్ అండ్‌ టెక్స్‌టైల్ పార్కు- లగచర్ల వివాదంలో భారీ ట్విస్ట్
Nara Rammurthy Naidu: సోదరుని పాడె మోసిన సీఎం చంద్రబాబు - అధికారిక లాంఛనాలతో రామ్మూర్తినాయుడు అంత్యక్రియలు పూర్తి
సోదరుని పాడె మోసిన సీఎం చంద్రబాబు - అధికారిక లాంఛనాలతో రామ్మూర్తినాయుడు అంత్యక్రియలు పూర్తి
Embed widget