అన్వేషించండి

Hi Nanna Movie: మృణాల్‌తో నాని, అలా సరస్సులో సరదాలు - మరీ ఇంత రొమాంటిక్కా?

Hi Nanna Movie: నాని, మృణాల్ ఠాకూర్ జంటగా నటిస్తున్న మూవీ 'హాయ్ నాన్న'. విడుదల దగ్గర పడుతున్న నేపథ్యంలో చిత్రబృందం ఇంట్రెస్టింగ్ ఫోటోలు, వీడియోలను విడుదల చేసింది.

Nani, Mrunal Thakur : ‘దసరా’ మూవీతో సూపర్ డూపర్ హిట్ అందుకున్న నేచురల్ స్టార్ నాని, ప్రస్తుతం ‘హాయ్ నాన్న’ సినిమాతో ప్రేక్షకుల ముందుక రాబోతున్నారు. నూతన దర్శకుడు శౌర్యువ్ పాన్ ఇండియన్ మూవీగా తెరకెక్కిన ఈ సినిమా దేశ వ్యాప్తంగా పలు భాషల్లో విడుదల కానుంది. ఇప్పటికే విడుదలైన టీజర్, పాటలకు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వచ్చింది. ఈ సినిమా ‘దసరా’ మించి హిట్ అందుకోవాలని నాని ప్రయత్నిస్తున్నారు. అందుకే, సినిమాపై ఇంట్రెస్ట్ కలిగించేలా అభిమానులతో కీలక విషయాలు పంచుకుంటున్నారు.   

ఆకట్టుకుంటున్న మూవీ ప్రమోషన్స్

ఈ సినిమాకు సంబంధించిన ప్రమోషన్స్ కూడా చిత్రబృందం బాగానే కొనసాగిస్తోంది. ఇప్పటికే మూడు పాటలు విడుదలయ్యాయి. అన్ని పాటలు ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి. తండ్రి కూతురు సెంటిమెంట్ హైలెట్ గా నిలిచింది. ఇక హీరోయిన్ మృణాల్ తో నాని బాగానే రొమాన్స్ చేసినట్లు తెలుస్తోంది. 'అమ్మాడి' అంటూ సాగే పాట నాని, మృణాల్ మధ్య ప్రేమను కళ్లకు కట్టినట్లుగా చూపించింది. మృణాల్​ లైవ్ మ్యూజిక్​​ పెర్ఫామెన్స్​తో మొదలైన ఈ సాంగ్​లో తన భర్త నాని గురించి పాడుతూ కనిపిస్తుంది. వారిద్దరి మధ్య ఉన్న ప్రేమ, అనుబంధాన్ని ఇందులో చూపించారు. నాని, మృణాల్ లవ్​ కెమిస్ట్రీ అందరినీ ఆకట్టుకుంది. 

కొత్త ఫోటోలు, వీడియో విడుదల

అటు సినిమాకు సంబంధించి విడుదలైన పోస్టర్లు కూడా చాలా ప్రజెంట్ గా ఆకట్టుకుంటున్నాయి. కూల్ గా మనసుకు హత్తుకునేలా ఉన్నాయి. తాజాగా ఈ మూవీకి సంబంధించి మేకర్స్ కొన్ని ఫోటోలు, వీడియోలు విడుదల చేశారు. ఇందులో నాని, మృణాల్ ఠాగూర్ ఇద్దరూ సరదగా సరస్సులో విహరిస్తూ కనిపించారు. పడవలో నాని, మృణాల్ ఎదురెదురుగా కూర్చొని ఉండగా, నాని పడవను ముందుకు నడుపుతూ ఉన్నాడు. ఇద్దరూ హ్యాపీగా జాలీగా పడవ ప్రయాణం చేస్తూ అలరించారు. ఈ పిక్స్, వీడియో చాలా కూల్ గా రొమాంటిక్ గా కనిపిస్తున్నాయి. సినిమాపై భారీగా అంచనాలు కూడా పెంచేలా ఉన్నాయి. ఈ సినిమాతో నాని ఖాతాలో మరో మంచి హిట్ పడటం ఖాయం అని అందరూ భావిస్తున్నారు.

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Nani (@nameisnani)

వచ్చే నెల 7న పలు భాషల్లో విడుదల

వైరా ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై మోహన్ చెరుకూరి, డాక్టర్ విజయేందర్ రెడ్డి తీగల సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా బేబీ కియారా కన్నా ఇందులో నాని కుమార్తెగా కనిపించనుంది  హేషమ్ అబ్దుల్ వాహబ్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రానికి జాన్ వర్గీస్ సినిమాటోగ్రాఫర్ గా వ్యవహరిస్తున్నారు. ప్రవీణ్ ఆంటోనీ ఎడిటింగ్ బాధ్యతలు చేపట్టగా.. డిసెంబర్ 7న తెలుగు, హిందీ తమిళ కన్నడ మలయాళ భాషల్లో ఈ సినిమా విడుదల కానుంది.  ‘హాయ్ నాన్న’ మూవీ విడుదలకు రెడీ అవుతున్న నేపథ్యంలో డైరెక్టర్ వివేక్ ఆత్రేయతో కలిసి నాని మరో సినిమా చేస్తున్నారు. ఈ సినిమాకు ‘సరిపోదా శనివారం’ అనే ఆసక్తికరమైన టైటిల్ ను ఫిక్స్ చేశారు. 

Read Also: అట్లీ మల్టీస్టారర్‌ స్క్రిప్ట్ వర్క్ షురూ, టార్గెట్ వింటే షాక్ అవ్వాల్సిందే!

టాప్ హెడ్ లైన్స్

Transfer Trimurthulu OTT : ఓటీటీలోకి వడ్డే నవీన్ కమ్ హ్యాక్ మూవీ - నెల రోజుల్లోపే స్ట్రీమింగ్... ఎందులో చూడొచ్చంటే?
ఓటీటీలోకి వడ్డే నవీన్ కమ్ హ్యాక్ మూవీ - నెల రోజుల్లోపే స్ట్రీమింగ్... ఎందులో చూడొచ్చంటే?
Peddi OTT: పెద్ది ఓటీటీ రిలీజ్ డేట్... Netflixలో ఈవారమే స్ట్రీమింగ్ - కానీ ట్విస్ట్ ఏమిటంటే?
పెద్ది ఓటీటీ రిలీజ్ డేట్... Netflixలో ఈవారమే స్ట్రీమింగ్ - కానీ ట్విస్ట్ ఏమిటంటే?
Actor Sriman : సెల్ఫీలు దిగి పేరు అడుగుతారు - తెలుగులో ఓ మంచి ఛాన్స్... థాంక్యూ అనిల్ సార్
సెల్ఫీలు దిగి పేరు అడుగుతారు - తెలుగులో ఓ మంచి ఛాన్స్... థాంక్యూ అనిల్ సార్
Alpha Collections Day 1: హిందీలో 'పెద్ది'ని బీట్ చేసిన ఆల్ఫా... ఫస్ట్ డే టోటల్ కలెక్షన్లలో రామ్ చరణ్‌తో కంపేరిజన్ ఏంటి?
హిందీలో 'పెద్ది'ని బీట్ చేసిన ఆల్ఫా... ఫస్ట్ డే టోటల్ కలెక్షన్లలో రామ్ చరణ్‌తో కంపేరిజన్ ఏంటి?

వీడియోలు

IND W vs AUS W World Cup | టీ20 వరల్డ్ కప్ లో ముగిసిన భారత్ పోరాటం
IND vs IRE 2nd T20 Highlights | ఐర్లాండ్ చేతిలో భారత్ క్లీన్ స్వీప్
Vaibhav Debut in England Series | ఇంగ్లాండ్ సిరీస్ లో వైభవ్ సూర్యవంశీ ఎంట్రీ ?
Ricky Ponting To Replace Gautam Gambhir ? | త్వరలోనే టీమిండియాకు కొత్త హెడ్ కోచ్ ?
IND vs AUS Women's T20 World Cup 2026 | ఆస్ట్రేలియాను ఓడించి సెమీస్ వెళ్తామా?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
TRS Chief Kavitha: టీఆర్‌ఎస్‌ చీఫ్‌ కవితకు షాక్‌! 15 రోజు సమయం ఇచ్చిన ఈసీ!
టీఆర్‌ఎస్‌ చీఫ్‌ కవితకు షాక్‌! 15 రోజు సమయం ఇచ్చిన ఈసీ!
Rayalaseema Manufacturing Hub: పారిశ్రామిక చదరంగంలో ‘రాయల్’ సీమ.. తయారీ రంగ కేంద్రంగా మార్చేందుకు కూటమి సర్కార్ పక్కా స్కెచ్!
పారిశ్రామిక చదరంగంలో ‘రాయల్’ సీమ.. తయారీ రంగ కేంద్రంగా మార్చేందుకు కూటమి సర్కార్ పక్కా స్కెచ్!
Telangana Police Recruitment 2026: తెలంగాణ పోలీస్‌ శాఖలో భారీ కొలువులు జాతర! ఐదు వేల ఉద్యోగాల భర్తీకి ప్రభుత్వం గ్రీన్‌ సిగ్నల్!
తెలంగాణ పోలీస్‌ శాఖలో భారీ కొలువులు జాతర! ఐదు వేల ఉద్యోగాల భర్తీకి ప్రభుత్వం గ్రీన్‌ సిగ్నల్!
200 Rupee News: 200 రూపాయల నోటు అసలైనదో, నకిలీదో ఎలా గుర్తించాలి? ఆర్‌బిఐ చెప్పిన ట్రిక్స్‌ ఇవే!
200 రూపాయల నోటు అసలైనదో, నకిలీదో ఎలా గుర్తించాలి? ఆర్‌బిఐ చెప్పిన ట్రిక్స్‌ ఇవే!
Rao Bahadur Collections Day 1: ఓవర్సీస్‌లో దుమ్ము రేపిన సత్యదేవ్... 'రావు బహదూర్' ఫస్ట్ డే కలెక్షన్స్ ఎంతంటే?
ఓవర్సీస్‌లో దుమ్ము రేపిన సత్యదేవ్... 'రావు బహదూర్' ఫస్ట్ డే కలెక్షన్స్ ఎంతంటే?
How Car Airbags Work: ఎయిర్‌బ్యాగ్ లోపల సరిగ్గా ఏం జరుగుతుంది? అది ప్రాణాలను ఎలా కాపాడుతుంది? 
ఎయిర్‌బ్యాగ్ లోపల సరిగ్గా ఏం జరుగుతుంది? అది ప్రాణాలను ఎలా కాపాడుతుంది? 
Peddi OTT: పెద్ది ఓటీటీ రిలీజ్ డేట్... Netflixలో ఈవారమే స్ట్రీమింగ్ - కానీ ట్విస్ట్ ఏమిటంటే?
పెద్ది ఓటీటీ రిలీజ్ డేట్... Netflixలో ఈవారమే స్ట్రీమింగ్ - కానీ ట్విస్ట్ ఏమిటంటే?
Chiluka Gorinka: చిలుక గోరింకకు సంబంధం లేదు..మరెందుకు అలా దీవిస్తారు?
చిలుక గోరింకకు సంబంధం లేదు..మరెందుకు అలా దీవిస్తారు?
Embed widget