Guppedantha Manasu September 30 Update: ప్రాజెక్ట్ పేరుతో మళ్లీ ఒక్కచోట చేరిన ప్రియమైన శత్రువులు రిషిధార
Guppedantha Manasu September 30th Update: గుప్పెడంతమనసు సీరియల్ ఇంట్రెస్టింగ్ గా సాగుతోంది. ఈ రోజు( శుక్రవారం) ఎపిసోడ్ లో ఏం జరిగిందంటే...
గుప్పెడంత మనసు శుక్రవారం ఎపిసోడ్ ( Guppedantha Manasu September 30 Today Episode 569)
రిషిని వసుధారని కలిపి ఉంచేందుకు జగతి అండ్ కో స్కెచ్ వేస్తారు. మిషన్ ఎడ్యుకేషన్ ద్వారానే అది సాధ్యం అని ఫిక్సవుతారు. అటు రిషి..వసుధార మాటలు తలుచుకుంటూ చేతికున్న కట్టువిప్పుకుంటూ ఉండగా మహేంద్ర నేను హెల్ప్ చేయనా అంటూ ఎంట్రీ ఇచ్చాడు. నేను తీస్తానని చెప్పడంతో..కాఫీ ఎందుకు తీసుకొచ్చారు నేను వచ్చేవాడిని కదా అంటాడు. ప్రతి దగ్గరా తల్లిప్రేమ గురించి చెప్పారు కానీ తండ్రి ప్రేమ గురించి చెప్పలేదు..నాకు ప్రతిక్షణం నీ దగ్గర ఉండాలని అనిపిస్తుందంటే..నాక్కూడా డాడ్ అని చెబుతాడు. ఆపరేషన్ రిషిధార స్కెచ్ అమలుచేసే పనిలో పడిన మహేంద్ర.. కాలేజీలో మీటింగ్ ఉంది నీకు హెల్త్ బావుంటే రా..లేదంటే..వద్దు అంటాడు. మీరు వెళ్లండి నేనుకూడా వస్తానంటాడు రిషి...
మహేంద్ర: రిషి అంతా ఓకే కదా...
రిషి: ఏ విషయం గురించి అడుగుతున్నారు
మహేంద్ర: ఇలా అడిగితే ఏం చెబుతాం..నీకు హెల్త్ బాగాలేకపోతే ఇంట్లోనే ఉండు
Also Read:
కాలేజీలో తన క్యాబిన్ కి వెళ్లిన రిషి..అక్కడ హార్ట్ సింబల్ చూసి వసుని గుర్తుచేసుకుంటాడు. నా గుండె మోయలేనన్ని జ్ఞపకాలు ఇచ్చావ్, గుండె పట్టలేనంత ఆనందం ఇచ్చావ్..ఇంత చేసి మనమధ్య ఎందుకింత దూరం.. గురుదక్షిణ విషయంలో నువ్వు వెనక్కు తగ్గలేదు..వసుధారా నిన్ను నన్ను వేరుచేస్తున్నది అమ్మా అనే ఒక్క పిలుపు అనుకుంటాడు ఇంతలో జగతి క్యాబిన్ కి వస్తుంది.
జగతి: మినిస్టర్ గారి దగ్గర్నుంచి కో ఆర్డినేటర్ వస్తున్నాడు..ఈ డీటేల్స్ కొంచెం చూస్తావా
రిషి: ఇప్పుడు వద్దులెండి..మీరు వెళ్లండి అనేసి తన సీట్లో కూర్చుని..గతంలో వసు తన కోటుకి పెట్టిన బ్యాడ్జిని చూసి మళ్లీ ఆ జ్ఞాపకాల్లోకి వెళ్లిపోతాడు..ఈ ఫైల్ కొంచెం అని జగతి అడుగుతున్నా..మీరు వెళ్లండి మీటింగ్ లో మాట్లాడుతా అనేస్తాడు...
మీటింగ్ హాల్లో అందరూ కూర్చుని ఉంటారు..విద్యాశాఖనుంచి కో ఆర్డినేటర్ వస్తారని అంతా ఎదురుచూస్తుంటారు... ఆ కో ఆర్డి నేటర్ నేనే అని ఎంట్రీ ఇస్తుంది వసుధార..
రిషి: ఈ విషయం నాకు చెప్పనేలేదే..విద్యాశాఖలో కో ఆర్డినేటర్ జాబ్ లో చేరిందా అనుకుంటాడు..
ఆ తర్వాత వసుధార అందరికీ నమస్కారం చెప్పి..మిషన్ ఎడ్యుకేషన్ ప్రాజెక్ట్ కోసం విద్యాశాఖలో జాబ్ లో చేరానంటుంది. అంతా ఎక్స్ ప్లైన్ చేస్తుంది... జాబ్ లో చేరిన విషయం నాకు చెప్పలేదని రిషి అనుకుంటాడు.. చెప్పలేదని ఫీలవుతున్నారా అని వసుధార మనసులో అనుకుంటుంది.... ఇవన్నీ మీరు చూసుకోండని జగతికి చెప్పేసి కోపంగా లేస్తాడు రిషి... చేయికి దెబ్బతగులుతుంది... అక్కడి నుంచి అందరూ వెళ్లిపోతారు... వసుకూడా వెళ్లిపోతూ..మళ్లీ వెనక్కు తిరిగి వస్తుంది... రిషి బయటకు వెళ్లిపోతాడు...
Also Read: Also Read: రిషికి ప్రేమగా అన్నం తినిపించిన వసు - ఆపరేషన్ రిషిధార కు ప్లాన్ చేసిన జగతి అండ్ కో!
గౌతమ్ హాల్లో కూర్చోవడంతో ఆరా తీసేందుకు వస్తుంది దేవయాని.. ఏంటి సంగతులు అని అడిగితే..సంగతులేముంటాయ్ అంతే అని రిప్లై ఇస్తాడు గౌతమ్.
దేవయాని: మీరు ముగ్గురూ ఏవో మంతనాలు చేస్తున్నారు...
గౌతమ్: మీరు కూపీ లాగేందుకు వచ్చారని నాకు అర్థమైంది పెద్దమ్మా అనుకుంటూ.. వంటల గురించి,రిషి గురించి మాట్లాడుకున్నాం..
దేవయాని: రిషి-వసుధార గురించి ఏమైనా మాట్లాడారా అని అడుగుతున్నాను
గౌతమ్: వసు అంటే మీకు నచ్చదని అందుకే మీరు వాళ్లకి అడ్డుపడుతున్నారని నాకు తెలుసు..మీకైతే ఈ విషయాలు అస్సలు చెప్పను అనుకుంటూ.. రిషికి కోపం ఎక్కువ చెప్పినా వినడని మాట్లాడుకుంటున్నారు
దేవయాని: అంతే అంటావ్.. గౌతమ్ నీకు తెలిసి కూడా కావాలనే చెప్పడం లేదుకదా ఇది కూడా ఎన్నిరోజులో చూస్తానని మనసులో అనుకుంటూ వెళ్లిపోతుంది..
మీరు ఈ గౌతమ్ గాడిని మాయలేరు అని నవ్వుకుంటాడు..
అటు కాలేజీలోంచి రిషి..ఆ వెనుకే వసు బయటకు వస్తుంటారు.. జగతి-మహేంద్ర చూసి సంతోషిస్తారు. వెంటనే మినిస్టర్ గారికి కాల్ చేసిన మహేంద్ర.. మీటింగ్ అయిపోయిందని చెబుతాడు. నేను అడగగానే వసుధారకి జాబ్ ఇచ్చారు సంతోషంగా ఉందని మహేంద్ర అంటే..వసుధార లాంటి తెలివైన అమ్మాయికి ఆ జాబ్ ఇవ్వడం నాక్కూడా సంతోషం అని రిప్లై ఇస్తాడు మినిస్టర్. కాల్ కట్ చేస్తాడు మహేంద్ర..
ఈగో మాస్టర్ కారు దగ్గరకు వెళ్లి నిల్చుంటాడు..వసు వస్తుంది..
వసు: ఎవరి కోసం ఎదురు చూస్తున్నారు..
రిషి: ఎలా వచ్చావ్..కారేది..
వసు: నాకు కారెందుకు ఇస్తారు..క్యాబ్ లో వచ్చాను
రిషి: నువ్వు మినిస్టర్ గారిదగ్గర జాబ్ లో చేరడం ఏంటి..నాకు చెప్పాలి కదా
వసు: పరీక్షలు అయిపోయాయి..ఖాళీగా ఉండడం ఎందుకనుకున్నాను
రిషి: నాకు ఓ మాట కూడా చెప్పలేదు..నా దగ్గర అసిస్టెంట్ గా చేసేదానివి గుర్తుందా
వసు: ఇప్పుడు కాలేజీ అయిపోయింది..మొన్నటి వరకూ జీతం తీసుకున్న అసిస్టెంట్ ని.. ఇప్పుడు జీతం తీసుకోని జీవితాంతం తోడుగా నడిచే అసిస్టెంట్ ని అంటుంది..
ఎపిసోడ్ ముగిసింది...