సెప్టెంబరు 30 రాశిఫలాలు



మేష రాశి
అపరిచిత వ్యక్తులను నమ్మవద్దు. ఈ రోజు ఆర్థిక పరంగా మంచి రోజు అని రుజువు అవుతుంది. ఉద్యోగస్తుల బదిలీకి అవకాశం ఉంది. పిల్లల కారణంగా సంతోషాన్ని పొందుతారు. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. మీరు పొదుపు చేయడంపై శ్రద్ధ పెడతారు.



వృషభ రాశి
కార్యాలయంలో మీ బాధ్యతలను అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించవలసి ఉంటుంది. అవివాహితులు జీవిత భాగస్వామిని ఎన్నుకోవడంలో కుటుంబ సభ్యుల సహాయం తీసుకోండి. వ్యాపారానికి సంబంధించిన ప్రణాళికలను అందరి ముందు చెప్పొద్దు.



మిథున రాశి
ధనం ఖర్చు చేయాల్సి రావొచ్చు. ఎవ్వరికీ అప్పు ఇవ్వొద్దు. ఆరోగ్యంలో హెచ్చుతగ్గులు ఉండే అవకాశం ఉంది. కుటుంబ సభ్యులతో గడిపే అవకాశం లభిస్తుంది. ఉద్యోగులకు కార్యాలయంలో సహకారం లభిస్తుంది. వ్యాపారంలో పురోగతికి అవకాశాలు ఉన్నాయి.



కర్కాటక రాశి
ఈ రాశివారు ఉత్సాహంగా ఉంటారు. ఆహారపు అలవాట్లను నియంత్రించుకోండి. మీరు కావాలనుకున్న వారినుంచి కావాలనున్న అభిమానం, ప్రేమ పొందుతారు. ఆర్థిక ప్రయోజనాలు పొందే అవకాశాలు ఉన్నాయి. ఇంట్లో ఆనంద వాతావరణం ఉంటుంది.



సింహ రాశి
మనసులో ఏదో ఒక సందిగ్ధత ఉంటుంది. ధనం లాభదాయకంగా ఉంటుంది. వ్యాపారంలో మందగమనం ఉండొచ్చు. వైవాహిక జీవితంలో సంతోషం ఉంటుంది. కార్యాలయంలో సహోద్యోగుల సహకారం ఉంటుంది. మీరు తల్లి మద్దతు పొందుతారు.



కన్యా రాశి
కార్యచరణలో కొన్ని మార్పులు చేయవచ్చు. విద్యార్థులు తమ సామర్థ్యాలను బట్టి విద్యారంగంలో విజయం సాధిస్తారు. మీరు కోరుకున్న జీవిత భాగస్వామిని పొందుతారు. ఏదో ఒక కారణంగా కుటుంబంలో టెన్షన్ ఏర్పడుతుంది. ఆరోగ్యం విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి.



తులా రాశి
దినచర్య వల్ల ముఖ్యమైన పనులు మధ్యలో నిలిచిపోతాయి. వ్యాపారంలో లాభం ఉంటుంది. మీరు మరింత కష్టపడాల్సి రావచ్చు. ఉద్యోగంలో లాభసాటి అవకాశాలుంటాయి. ఆధ్యాత్మిక చింతన ఉంటుంది. ఈ రోజు తుల రాశి వారు కొంచెం జాగ్రత్తగా ఉండాలి.



వృశ్చిక రాశి
మీ కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. ఆర్థిక పరిస్థితి బలంగా ఉంటుంది. పిల్లల ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి. పెద్ద ప్రాజెక్ట్‌లో పని చేస్తారు. వైవాహిక జీవితంలో సంతోషం ఉంటుంది.కార్యాలయంలోని ఉద్యోగులతో ఏదో ఒక విషయంలో వాగ్వాదం రావచ్చు.



ధనుస్సు రాశి
మతపరమైన పనుల పట్ల ఆసక్తి పెరుగుతుంది. కుటుంబ సమేతంగా విహారయాత్రకు వెళ్లే అవకాశం ఉంది. ప్రేమ సంబంధాలలో చికాకు ఉండవచ్చు. మిమ్మల్ని తప్పుగా అర్థం చేసుకునేవారున్నారు జాగ్రత్త. మీ సహనానికి అంతా ఫిదా అవుతారు. కుటుంబ సభ్యుల మద్దతు మీకు లభిస్తుంది.



మకర రాశి
కుటుంబ విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. జీవిత భాగస్వామితో మంచి సమయం గడుపుతారు. ప్రేమికులు పెళ్లిదిశగా అడుగేసేందుకు మంచి రోజు. ఉద్యోగం, వ్యాపారంలో లాభాన్ని పొందుతారు. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది.



కుంభ రాశి
ఈ రోజు కుంభ రాశి వారికి ప్రమోషన్ లభిస్తుంది. ఆదాయ వనరులు పెరుగుతాయి. తల నొప్పితో బాధపడతారు. భాగస్వామ్య పనులలో లాభాలు ఉంటాయి. వృద్ధుల ఆరోగ్యం ఆందోళన కలిగిస్తుంది. పిల్లల వైపు నుంచి కొన్ని శుభవార్తలు అందుతాయి.



మీన రాశి
గత పెట్టుబడుల నుంచి లాభాలు ఉంటాయి. మీ మనసుకి నచ్చినవారి హృదయాన్ని గెలుచుకునేందుకు వాళ్లకి నచ్చిన బహుమతి ఇవ్వండి. కుటుంబంలో సంతోషం ఉంటుంది. మనసులో సానుకూల ఆలోచనలు వస్తాయి. ఆరోగ్యం బాగానే ఉంటుంది. కొత్త ఉద్యోగావకాశాలు లభిస్తాయి.