ఈ రాశులవారు ఎవ్వరి మాటల్ని మనసుకి తీసుకోవద్దుమేష రాశి
ఈ రోజు మీరు పనిలో మరింత బిజీగా ఉంటారు. కుటుంబంలో ఆనందం ఉంటుంది. కొత్త వ్యాపారాన్ని ప్రారంభించేందుకు ఈ రోజు అనుకూలమైనది. ఇంట్లో శుభకార్యం నిర్వహించేందుకు బిజీబిజీగా ఉంటారు.వృషభ రాశి
ఈరోజు ప్రేమ వ్యవహారాలు పెరుగుతాయి. విద్యార్థులు మంచి ఫలితాలు సాధిస్తారు. ఆర్థిక సమస్యలు పెరుగుతాయి. కొత్త ఉద్యోగావకాశాలు పెరుగుతాయి. కుటుంబంతో సామరస్యంగా నడుచుకుంటారు.మిథున రాశి
కార్యాలయంలో మీ ప్రభావం పెరుగుతుంది. వైవాహిక జీవితంలో కొంత టెన్షన్ ఉండవచ్చు. ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోండి. అందరి మాటలను మనసులోకి తీసుకోవద్దు. చేస్తున్న పనిలో తప్పులుంటే సరిదిద్దుకోండి.కర్కాటక రాశి
మీ జీవిత భాగస్వామితో కొనసాగుతున్న వైరం నుంచి విముక్తి లభిస్తుంది. సొంతంగా ఏదైనా వ్యాపారం లేదా ప్రాజెక్ట్ చేసేందుకు ఆలోచిస్తారు. ఆదాయం పెరుగుతుంది. ఆరోగ్యంలో హెచ్చు తగ్గులు ఉంటాయి. ఇంట్లో పెద్దల పట్ల శ్రద్ధ వహించండి.సింహ రాశి
ఈ రోజు ఆర్థిక పరంగా అనుకూలమైన రోజు. వ్యాపార పరిస్థితులు మెరుగుపడతాయి. కుటుంబ సంతోషం ఉంటుంది. మీ స్నేహితుడికి సహాయం చేయడానికి ముందుకు వస్తారు.కార్యాలయంలోని సీనియర్ అధికారులు మీపై కోపంగా ఉండవచ్చు.కన్యారాశి
కన్యారాశి ప్రేమికులకు మంచి రోజు..పెళ్లి చేసుకునే ఉద్దేశం ఉంటే కుటుంబాలతో మాట్లాడేందుకు ఇదే మంచి సమయం. మానసిక ప్రశాంతత ఉంటుంది. పని పట్ల ఉత్సాహం పెరుగుతుంది. ఆకస్మిక విజయాన్ని పొందడం ఆనందంగా ఉంటుంది.తులా రాశి
ఈ రోజు తులారాశి వారిపై లక్ష్మీదేవి అనుగ్రహం ఉంటుంది. అత్తమామల వైపు నుంచి ధనలాభం ఉండొచ్చు. చాలా రోజులుగా కార్యాలయంలో కొనసాగుతున్న పనికి బ్రేక్ ఇచ్చి రెస్ట్ తీసుకున్నట్టు అనిపిస్తుంది. ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి.వృశ్చిక రాశి
తోబుట్టువులతో సంతోష సమయం గడుపుతారు. ఈ రోజు కొన్ని శుభవార్తలను పొందవచ్చు. ఆహారం పానీయాల పట్ల శ్రద్ధ వహించండి స్నేహితుని సహాయంతో ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. వైవాహిక జీవితాన్ని చక్కదిద్దుకునే ప్రయత్నం చేయండి.ధనుస్సు రాశి
మీరు ఆత్మవిశ్వాసంతో ఉంటారు.ప్రయాణాలు చేయాలనుకుంటారు. షేర్ మార్కెట్‌లో పెట్టుబడులు పెట్టడానికి అనుకూలం. ప్రేమికుల జీవితంలో కొత్త మార్పులొస్తాయి.లావాదేవీల విషయంలో జాగ్రత్తగా ఉండండి. పిల్లల చదువుల గురించి ఆందోళన చెందుతారు.మకర రాశి
మీ ఖర్చులను నియంత్రించుకోండి. ప్రేమ జీవితంలో కొత్త వసంతం వస్తుంది. వ్యాపారంలో లాభం ఉంటుంది. ప్రభుత్వ ఉద్యోగం కోసం ప్రయత్నించే వారు ఆ ప్రయత్నాన్ని కొనసాగించండి. మీ జీవిత భాగస్వామి భావాలను అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి.కుంభ రాశి
ఈ రోజు మీరు మీ పనిలో ఆశించిన విజయాన్ని పొందుతారు. రచన, కళారంగంలో ఉన్నవారు పేరు సంపాదిస్తారు. జీవిత భాగస్వామితో మంచి సమయం గడుపుతారు. ఇంట్లో ఏవైనా పెద్ద సమస్య వచ్చే అవకాశం ఉంది..జాగ్రత్తగా వ్యవహరించండి.మీన రాశి
ఈ రోజు మీ ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించడం మంచిది. సమాజంలో గౌరవం పెరుగుతుంది. ఆదాయం మెరుగ్గా ఉంటుంది, జీవితంలో సానుకూల ఫలితాలు కనిపిస్తాయి. వ్యాపార విషయాలలో ఓపిక పట్టండి.


Follow for more Web Stories: ABP LIVE Visual Stories