మేష రాశి ఈ రాశికి చెందిన వ్యాపారులు పనిలో అజాగ్రత్తవల్ల నష్టపోతారు. మీ ఆరోగ్యం సాధారణంగా ఉంటుంది. ధనానికి సంబంధించిన పనులు పూర్తిచేయగలుగుతారు. కుటుంబంలో సంతోషం ఉంటుంది. ఉద్యోగులు పనిపట్ల శ్రద్ధ చూపించాలి.
వృషభ రాశి ఈ రాశి వారు కొన్ని ఆర్థిక సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. బంధాల మధ్య ఉన్న ఇబ్బందులు తగ్గుతాయి. వైవాహిక జీవితం ప్రశాంతంగా ఉంటుంది. ఆకస్మిక ప్రయాణాలు కలిసొస్తాయి. వ్యాపారులు, ఉద్యోగులకు శుభసమయం.
మిథున రాశి ఈ రాశికి చెందిన అవివాహితులకు సంబంధాలు కుదురుతాయి. వృత్తిపరమైన పనుల్లో మార్పువల్ల మంచే జరుగుతుంది. నిరుద్యోగులకు ఉద్యోగం వచ్చే అవకాశం ఉంది. స్నేహితుల నుంచి ధనసహాయం లభిస్తుంది.
కర్కాటక రాశి ఈరోజు షేర్ మార్కెట్, ఆస్తిలో పెట్టుబడులకు అనుకూలమైన రోజు. ప్రేమ జీవితాన్ని ఆస్వాదిస్తారు. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. కుటుంబంతో సమయం గడపండి. మీరు పెద్ద కంపెనీ నుంచి జాబ్ ఆఫర్ పొందవచ్చు.
సింహ రాశి ఈరోజు మీకు కొత్త ఉద్యోగావకాశాలు లభిస్తాయి. కుటుంబ సంబంధాలు బలంగా ఉంటాయి. భార్యాభర్తల మధ్య గొడవలు జరిగే అవకాశం ఉంది జాగ్రత్త. మీ వ్యాపారాన్ని పెంచుకోవడానికి ఇతర వ్యక్తులపై ఆధారపడకండి.
కన్యా రాశి ఈ రోజు శ్రమకు తగ్గట్టుగా మీకు ప్రయోజనం కలుగుతుంది. మీరు మీ జీవిత భాగస్వామితో మంచి సమయం గడుపుతారు. ఈ రోజున ఎవరికైనా డబ్బు అప్పుగా ఇవ్వాలి అనుకుంటే ఆ ఆలోచన విరమించుకోవడం మంచిది.
తులా రాశి వైవాహిక జీవితంలో సానుకూల మార్పులు ఉంటాయి. ఈ రోజు, ఆస్తి లేదా స్టాక్ మార్కెట్‌లో పెట్టుబడి పెట్టడం వలన మీకు మరింత లాభం చేకూరుతుంది. విద్యార్థులు చదువులో విజయం సాధిస్తారు.
వృశ్చిక రాశి ఈరోజు కార్యాలయంలో మీ పనితీరుకి ప్రశంసలు లభిస్తాయి. అందరినీ గుడ్డిగా నమ్మవద్దు. సంతకం చేసే ముందు అవసరమైన పత్రాలను పూర్తిగా చదవండి. జీవిత భాగస్వామితో మంచి సమయం గడుపుతారు.
ధనుస్సు రాశి ఈరోజు సమాజంలో మీ గౌరవం మరింత పెరుగుతుంది. ఆర్థిక ప్రయోజనాలతో వాహనాన్ని కొనుగోలు చేసే అవకాశాలు ఉన్నాయి. వివాహితులకు అనుకూలమైన రోజు ఉంటుంది. పిల్లలతో సంతోష సమయం గడుపుతారు. వాదనపెట్టుకోవద్దు.
మకరం ఈరోజుఈ రాశి ఉద్యోగులు కార్యాలయంలో చిన్న చిన్న ఇబ్బందులు ఎదుర్కొంటారు. పనిలోనూ, ఆర్థిక వ్యవహారాల్లోనూ అప్రమత్తంగా ఉండండి. మీ కుటుంబం - ఉద్యోగం మధ్య సమతుల్యతను కాపాడుకోండి.
కుంభ రాశి ఈ రోజు కుంభ రాశి వారు చేపట్టిన పనులకు ఎలాంటి ఆటంకాలు ఉండవు. వ్యాపారాన్ని మరింత విస్తరించేందుకు ప్లాన్ చేసుకోవచ్చు. ఆర్థిక ప్రయోజనాలు బాగానే ఉంటాయి. ఉద్యోగులు ఇంటర్వ్యూలో విజయం సాధిస్తారు.
మీన రాశి ఈ రోజు మీరు మీ శ్రమకు అనుకూలమైన ఫలితాలు పొందుతారు. కుటుంబంలో ఏదైనా టెన్షన్ ఉండే అవకాశం ఉంది. మీ మాటపై నియంత్రణ పాటించండి. ప్రేమ జీవితంలో కొంత ఆందోళన ఉండొచ్చు.