సెప్టెంబరు 25 రాశిఫలాలు



మేష రాశి
ఈ రోజు వ్యాపారంలో పెట్టుబడులకు అనుకూలమైన రోజు. మీరు ఉద్యోగంలో ప్రమోషన్ పొందుతారు. మీపై మీకున్న విశ్వాసం వల్ల అనుకున్న పనులు పూర్తిచేస్తారు. ఇంట్లో శుభకార్యాలు నిర్వహించేందుకు ప్లాన్ చేస్తారు.



వృషభ రాశి
ఎప్పటి నుంచో పెండింగ్ లో ఉన్న పనిలో మీరు సక్సెస్ అవుతారు. ఆరోగ్యంలో హెచ్చు తగ్గులు ఉంటాయి. ఇంటికి అతిథి రాకతో వాతావరణం తేలికవుతుంది. ధన వ్యయం పెరగవచ్చు. మీరు పిల్లల కారణంగా సంతోషంగా ఉంటారు.



మిథున రాశి
ఈ రాశికి చెందిన వ్యాపారులు ఈరోజు లాభపడతారు. మీ మాటల మీద సంయమనం పాటించండి.ఉద్యోగస్తులకు ఆఫీసులో ప్రశంసలు లభిస్తాయి. వైవాహిక జీవితంలో ఆనందం, శాంతి ఉంటుంది. విదేశాలకు వెళ్లాలనుకునేవారికి ఇదే మంచి అవకాశం.



కర్కాటక రాశి
ఈ రోజు పిల్లల నుంచి కొన్ని శుభవార్తలు అందుతాయి. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. విద్యార్థులు చదువుపై దృష్టి సారించాలి. ఆఫీసులో సహోద్యోగుల సహాయం అందుతుంది.



సింహ రాశి
ఈ రాశివారు ఈ రోజు కుటంబ సభ్యులతో చర్చల్లో పాల్గొంటారు. ఆర్థిక ప్రయోజనాలు ఉంటాయి. మనశ్శాంతి కోసం ధ్యానం యోగా దినచర్యలో చేర్చుకోండి. మీరు స్నేహితుల నుంచి సర్ ప్రైజ్ పొందుతారు. అవివాహితులకు సంబంధాలు కుదురుతాయి.



కన్యా రాశి
ఈ రోజు మీకు మిశ్రమ ఫలితాలున్నాయి. విదేశాల్లో వ్యాపారం చేయాలి అనుకున్నవారికి అనుకూల సమయం ఇది. మనసుకు ఏదో కలవరం కులుగుతుంది. స్వతహాగా ఉన్న కోపాన్ని కొంచెం కంట్రోల్ చేయండి.



తులా రాశి
ఉద్యోగంలో పదోన్నతి లభిస్తుంది. తల్లి ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి. వ్యాపారం సాధారణంగా ఉంటుంది. మీ ఆరోగ్యం పట్ల నిర్లక్ష్యాన్ని వీడండి. వాహనం కొనుగోలు చేయాలి అనుకుంటే ఇదే మంచి సమయం.



వృశ్చిక రాశి
ఈ రోజు మీరు డబ్బుకు సంబంధించిన విషయాలలో విజయం సాధిస్తారు. కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు. మీరు ఆఫీసు పనిలో చుట్టూ తిరగాల్సి రావచ్చు. మీ భావాలను మీ సన్నిహితులకు చెప్పండి



ధనుస్సు రాశి
ఈ రోజు కుటుంబ సభ్యుల మధ్య కొంత దూరం ఉంటుంది. ఈ రోజు సాధారణంగా ఉంటుంది. ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించండి. ఉద్యోగంలో కొంత ఇబ్బంది ఉండొచ్చు. వ్యాపారం పెరుగుతుంది.



మకర రాశి
కుటుంబ సభ్యులతో మంచి సమన్వయం ఉంటుంది. మీరు ప్రయాణం చేయవలసి రావచ్చు.హృదయపూర్వక కోరిక ఏదైనా నెరవేరినందుకు సంతోషంగా ఉంటారు.ఉద్యోగులు తమ పనితీరుతో ఉన్నతాధికారులను మెప్పిస్తారు.



కుంభ రాశి
భాగస్వామ్యంతో వ్యాపారం ప్రారంభించడానికి అనుకూలంగా ఉంటుంది. ప్రేమికులకు ఈరోజు ప్రత్యేకమైన రోజు. మీ సన్నిహితులతో సమయం గడుపుతారు.ఉద్యోగులు, వ్యాపారులకు శుభసమయం. కానీ మనసులో ఏదో నిరాశ, నిస్పృహలు తలెత్తుతాయి.



మీన రాశి
ఈ రోజు మీరు వ్యాపారంలో మంచి లాభాలు సాధిస్తారు. నిరుద్యోగులు కొత్త ఉద్యోగం పొందవచ్చు. కుటుంబంలో చిచ్చు రావొచ్చు. డబ్బు పరంగా ఈ రోజు శుభప్రదం.