Guppedantha Manasu February 14th Update: వసు గురించి ఈగో మాస్టర్ కి దాదాపు క్లారిటీ వచ్చేసినట్టే, జగతితో కలసి బయలుదేరిన రిషి!
Guppedantha Manasu February 14th Update: గుప్పెడంతమనసు సీరియల్ ఇంట్రెస్టింగ్ గా సాగుతోంది. ఈ రోజు ఎపిసోడ్ లో ఏం జరిగిందంటే...
గుప్పెడంతమనసు ఫిబ్రవరి 14 ఎపిసోడ్ (Guppedanta Manasu February 14th Update)
వసుధార తలనొప్పి అన్నమాట గుర్తొచ్చి రిషి తగ్గిందా అని మెసేజ్ చేస్తాడు. మీరు వెళ్లిపోయారు గా అని రిప్లై ఇస్తుంది వసుధార. అప్పుడు రిషి అంటే... నేను తలనొప్పిగా మారానా , వసుధారని ఎక్కువగా విసిగించానా, కోపగించుకున్నానా అనుకుంటూ ఉంటాడు. ఇద్దరూ ఒకేసారి కాల్ చేయడంతో ఇద్దరికీ ఒకేసారి బిజీ రావడంతో ఎవరితో మాట్లాడుతున్నారో అనుకుంటారు. ఆ వెంటనే వసుధార కాల్ చేసేసరికి రిషి ఫోన్ స్విచ్చాఫ్ చేస్తాడు. వసుధార జ్ఞాపకాలు తెలుసుకుని బాధపడతాడు రిషి..అటు వసుధారది కూడా అదే పరిస్థితి.
తర్వాత రిషి కాలేజీలో వర్క్ చేసుకుంటూ ఉండగా ఇంతలో అక్కడికి పుష్ప రావడంతో పుష్ప ని పలకరించి..వసుధార గురించి ఆరాతీస్తాడు. ఏమీ తెలియదు సార్ అందుకే ఒక ప్లాన్ వేసాము ఈ సండే అందరం కలిసి వసుధార వాళ్ళ ఇంటికి వెళ్తున్నాము అనడంతో మంచి ఐడియా అని అంటాడు రిషి. అప్పుడు రిషి మీరు వసుధార ఇంటికి వెళ్లే బదులు వసుధార తన హస్బెండ్ ని మీ ఇంటికి రమ్మని చెప్పు అనడంతో పిలిచాను సార్....మాట దాటేసింది అంటుంది. పెళ్లి ఫోటోలు వీడియోలు ఏమైనా అడిగావా అనడంతో ఏది అడిగినా సమాధానం చెప్పడం లేదు సార్ అని రిప్లై ఇస్తుంది. ఆ తర్వాత పుష్ప అక్కడి నుంచి వెళ్తుండగా చక్రపాణి నెంబర్ తీసుకుంటాడు. తీరా కాల్ చేసేసరికి వసుధార లిఫ్ట్ చేసి కావాలనే ఆటపట్టింస్తుంది. ఆ తర్వాత కాల్ లిఫ్ట్ చేసిన వసుధార మీరు ఎవరు అని అడిగి...రిషిని అని చెప్పడంతో..పదే పదే ఎండీగారు అని కావాలని పిలుస్తుంది.
Also Read: ఊహించని నిర్ణయం తీసుకున్న మహేంద్ర- బెట్టు చేస్తున్న రిషిధార, బిక్కమొహం వేసిన చక్రపాణి
కాలేజీలో అడుగుపెట్టిన వసుధార..ఎండీగారు నా పెళ్లివివరాల కోసం బాగానే ప్రయత్నిస్తున్నారు అనుకుంటూ ఉంటుంది. తర్వాత రిషి జేబులో చేతులు పెట్టుకుని నడుచుకుంటూ వెళ్లడం చూసి..ఆలోచనలో పడుతుంది. మూడాఫ్ లో ఉన్నప్పుడే అలా నడుస్తారు అనుకుంటూ రిషిని ఫాలో అవుతుంది. పక్కనే కూర్చుని రిషి ఎలాంటి ఎక్స్ ప్రెషన్స్ ఇస్తే అలానే కూర్చుని ఇమిటేట్ చేస్తుంది. ఇంతలో వసుని గమనిస్తాడు రిషి
రిషి: నువ్వెప్పుడు వచ్చావు
వసు: నేనెప్పుడూ మీ వెనకే ఉంటాను సార్
రిషి: నువ్వు నా వెనకాల కాదు,నా పక్కన ఉండాల్సింది
వసు: వెనక ఉన్న వారే పక్కకు వస్తారు
రిషి: మ్యాథ్స్ లోలాజిక్స్ ఉంటాయి జీవితంలో కాదు
వసు:ఎక్కువగా ఆలోచించకండి సార్
రిషి: అలాంటప్పుడు ఎందుకు కొన్ని విషయాలు దాచావు
బాధ, జీవితం, ప్రేమ అంటూ ఎప్పటిలా కాసేపు ప్రేమగా పోట్లాడుకుంటారు. వెళ్దాం పదండి సార్ అని వసు అంటే నేను నీతో రాను నువ్వు వెళ్ళు అంటాడు. అప్పుడు 7 అంకెలు లెక్క పెట్టెలోగా రావాలి అనడంతో అప్పుడు రిషి ఏడు అంకెలు లెక్కపెట్టిలోగా లేచి వసుధారతో కలిసి వెళ్తాడు.
Also Read: ప్రేమ సంబంధాలలో ఈ రాశివారు రిస్క్ చేయాల్సిన సమయం ఇది
మరోవైపు మహేంద్ర...రిషి,వసువిషయంలో లేట్ చేయొద్దు జగతి ఇప్పటికే రెండు రోజుల్లో ఒకరోజు గడిచిపోయింది ఇంకొక రోజు మాత్రమే సమయం ఉంది అంటాడు. ఎందుకు మహేంద్ర అంతగా ఆవేశపడుతున్నావు కొంచెం ఆలోచించు అని అంటుంది జగతి. ఇంతలోనే అక్కడికి రిషి రావడంతో జగతి కొత్త ప్లాన్ మొదలు పెడుతుంది. రమ్మంటే రానంటున్నావేంటి అని జగతి అంటే.. జగతి సైగ చూసి అర్థం చేసుకుని అవును రానంటే రాను అంటాడు. ఎక్కడికి అని రిషి అడిగితే.. జగతి ఎక్కడికి అంటే అక్కడికి అని కవర్ చేస్తాడు. స్పందించిన రిషి...మేడం మిమ్మల్ని నేను తీసుకెళతాను పదండి అనడంతో..జగతి మొహం వెలిగిపోతుంది.