అన్వేషించండి

Tata Tiago EV 2026: ఏడు లక్షలకే సరికొత్త టాటా టియాగో ఈవీ లాంచ్! బ్యాటరీకి లైఫ్‌టైమ్ వారంటీ!

టాటా మోటార్స్ 2026 టియాగో ఈవీని 6.99లక్షల ప్రారంభ ధరతో విడుదల చేసింది. 293 కిలోమీటర్ల రేంజ్‌, సరికొత్త బాస్‌ ప్లాన్‌తో మార్కెట్‌లోకి వచ్చింది.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • టాటా టియాగో ఈవీ 2026 రూ. 6.99 లక్షల ప్రారంభ ధరతో విడుదలైంది.
  • బ్యాటరీ యాజ్ ఏ సర్వీస్ విధానంతో రూ. 4.69 లక్షలకే కారు సొంతం.
  • కొత్త లుక్, ప్రీమియం క్యాబిన్, 10.25-అంగుళాల ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ కలదు.
  • రెండు బ్యాటరీ ఆప్షన్లు, 293 కి.మీ. రేంజ్, 35 నిమిషాల్లో ఫాస్ట్ ఛార్జింగ్.

Tata Tiago EV 2026: భారతీయ ఆటోమొబైల్ దిగ్గజం టాటా మోటార్స్ దేశీయ ఎలక్ట్రిక్ వాహన మార్కెట్‌లో మరోసారి తన ఆధిపత్యాన్ని చాటుకుంది. సామాన్యుడికి ఎలక్ట్రిక్ కారు కలని నిజం చేస్తూ, సరికొత్త హంగులతో 2026 టాటా టియాగో ఈవీని మే28న లాంచ్ చేసింది. ఈ కొత్త వెర్షన్ కేవలం అప్‌డేట్ మాత్రమే కాదు, ధర, టెక్నాలజీ పరంగా ఒక పెద్ద సంచలనంగా మారబోతోంది. 

టాటా టియాగో ఈవీ 2026 ధర, వేరియంట్స్‌

ఈ లాంచ్‌లో అందర్నీ ఆశ్చర్యపరిచిన అంశం ధర. పాత మోడల్‌ 7.99 లక్షల నుంచి 11.14 లక్షల మధ్య ఉండేది. అయితే టాటా మోటార్స్‌ వ్యూహాత్మకంగా కొత్త 2026 మోడల్ ధరను గణనీయంగా తగ్గించి, ప్రారంభ ధరను కేవలం 6.99 లక్షలుగా నిర్ణయించింది. ఇది భారత్‌లో అత్యంత సరమైన ఎలక్ట్రిక్ కార్లలో ఒకటిగా నిలిచింది. 

సరికొత్త బ్యాటరీ యాజ్‌ ఏ సర్వీస్‌

వినియోగదారులపై భారాన్ని తగ్గించేందుకు టాటా మోటార్స్ బ్యాటరీ యాజ్‌ ఏ సర్వీస్‌ విధానంలో మార్పులు చేసింది. ఈ ప్లాన్ కింద మీరు కారును కేవలం 4.69 లక్షలకే ఇంటికి తీసుకెళ్లవచ్చు. బ్యాటరీ కోసం మీరు విడిగా కొనుగోలు చేయనవసరం లేదు. మీరు కారును నడిపిన ప్రతి కిలోమీటరుకు సుమారు 2.6 రూపాయల చొప్పున ఛార్జీలు చెల్లిస్తే సరిపోతుంది. ఇది మొబైల్ రీఛార్జ్ లాంటి సౌకర్యాన్ని వాహదారులకు కల్పిస్తోంది. 

కొత్త లుక్- కొత్త రంగు

కొత్త టియాగో ఈవీ చూడటానికి మరింత షార్ప్‌గా , స్పోరీగా కనిపిస్తోంది. ముందుభాగంలో కొత్త ఎల్‌ఈడీ లైట్లు, రీడిజైన్ చేసిన బంపర్లు కారుకు సరికొత్త రూపాన్ని ఇచ్చాయి. వెనుక భాగం స్టైలిష్‌గా ఉండే కనెక్టెడ్‌ ఎల్‌ఈడీ టైల్‌- ల్యాంప్స్‌ ఈ మోడల్‌కు ప్రత్యేకత. ఈసారి టాటా మోటార్స్‌ ప్రకృతి ప్రేరణతో ఆరు కొత్త రంగులను పరిచయం చేసింది. ఇందులో డెహ్రడూన్ డ్యూ, పాంగాంగ్‌ పల్స్‌ వంటి రంగులు యువతను ఆకట్టుకోనున్నాయి. 

ప్రీమియం క్యాబిన్, స్మార్ట్ ఫీచర్లు

లోపలి భాగంలో కూడా భారీ మార్పులు జరిగాయి. డాష్ బోర్డులు డ్యూయల్‌ టోన్ థీమ్‌తో మరింత మోడరన్‌గా తీర్చిదిద్దారు. ఇందులో పెద్ద 10.25-ఇంచుల టచ్‌స్క్రీన్ ఇన్‌ఫోటైన్‌మెంట్ సిస్టమ్ ఉంది. ఇది వైరలెస్‌ ఆండ్రాయిడ్‌ ఆటో, ఆపిల్ కార్‌ప్లే సపోర్ట్ చేస్తుంది. వైర్‌లెస్‌ ఫోన్ ఛార్జింగ్‌, క్రూయిజ్‌ కంట్రోల్‌, వెనుక ప్రయాణికుల కోసం ప్రత్యేక ఏసీ వెంట్స్‌ వంటి ఫీచర్లు ఇందులో ఉన్నాయి. 

కొత్తగా వచ్చిన టియాగో ఈవీలోని అన్ని వేరియంట్స్‌లో ఆరు ఎయిర్‌ బ్యాగ్‌లు ఇస్తోంది. ఇందులో 360డిగ్రీ కెమెరా, బ్లైండ్‌ స్పాట్‌ మానిటరింగ్, హిల్ స్టార్ట్ అసిస్ట్‌ వంటి ప్రీమియం భద్రతా ఫీచర్లు జోడించారు. వర్షం పడితే ఆటోమేటిక్‌గాఆన్‌ అయ్యే వైప్లు, చీకటి పడితే వెలిగే హెడ్‌ లైట్లు కూడా ఉన్నాయి. 

టాటా టియాగో ఈవీ 2026 మైలేజ్‌, బ్యాటరీ వారంటీ వివరాలు 

టియాగో ఈవీ రెండు రకాల బ్యాటరీ సైజుల్లో లభిస్తుంది. పెద్ద బ్యాటరీ వేరియంట్‌ పూర్తి ఛార్జింగ్‌పై 293కిలోమీటర్ల వరకు ప్రయాణం చేయవచ్చు. ఫాస్ట్ ఛార్జింగ్ సహాయంతో కేవలం 35 నిమిషాల్లోనే పది శాతం నుంచి 80శాతం వరకు ఛార్జింగ్ చేసుకోవచ్చు. వినియోగదారులకు మరింత భరోసా ఇచ్చేలా, 24kWh బ్యాటరీ వెర్షన్ కొనే మొదటి యజమానులకు బ్యాటరీ లైఫ్‌టైమ్ వారంటీని టాటా మోటార్స్ ప్రకటిస్తోంది.  

Frequently Asked Questions

2026 టాటా టియాగో ఈవీ ధర ఎంత?

2026 టాటా టియాగో ఈవీ ప్రారంభ ధర 6.99 లక్షలు. ఇది భారతదేశంలో అత్యంత సరసమైన ఎలక్ట్రిక్ కార్లలో ఒకటిగా నిలిచింది.

బ్యాటరీ యాజ్ ఏ సర్వీస్ అంటే ఏమిటి?

ఈ ప్లాన్ కింద, మీరు కారును 4.69 లక్షలకే కొనుగోలు చేయవచ్చు. బ్యాటరీని విడిగా కొనుగోలు చేయాల్సిన అవసరం లేదు, ప్రతి కిలోమీటరుకు 2.6 రూపాయలు చెల్లిస్తే సరిపోతుంది.

2026 టాటా టియాగో ఈవీలో కొత్తగా ఏ రంగులు అందుబాటులో ఉన్నాయి?

ప్రకృతి ప్రేరణతో డెహ్రడూన్ డ్యూ, పాంగాంగ్ పల్స్ వంటి ఆరు కొత్త రంగులు అందుబాటులో ఉన్నాయి. ఈ రంగులు యువతను ఆకట్టుకోనున్నాయి.

2026 టాటా టియాగో ఈవీ మైలేజ్ ఎంత?

పెద్ద బ్యాటరీ వేరియంట్ పూర్తి ఛార్జింగ్ పై 293 కిలోమీటర్ల వరకు ప్రయాణించవచ్చు. ఫాస్ట్ ఛార్జింగ్ తో 35 నిమిషాల్లో 10% నుండి 80% వరకు ఛార్జ్ చేయవచ్చు.

2026 టాటా టియాగో ఈవీలో ఏ భద్రతా ఫీచర్లు ఉన్నాయి?

అన్ని వేరియంట్లలో ఆరు ఎయిర్ బ్యాగ్ లు, 360 డిగ్రీ కెమెరా, బ్లైండ్ స్పాట్ మానిటరింగ్, హిల్ స్టార్ట్ అసిస్ట్ వంటి ప్రీమియం భద్రతా ఫీచర్లు ఉన్నాయి.

Advertisement

టాప్ హెడ్ లైన్స్

526 km లాంగ్‌ రేంజ్‌తో రాబోతున్న కియా సైరస్ ఎలక్ట్రిక్‌ కారు - తెలుగు రాష్ట్రాల్లో ధర, బ్యాటరీ ఆప్షన్లు, ఫీచర్లు తెలుసుకోండి
కియా సైరస్ EV వచ్చేస్తోంది - ఎన్ని వేరియంట్లు ఉన్నయి? వేరియంట్‌లో ఎలాంటి ఫీచర్లు ఇస్తారు? పూర్తి వివరాలు
ఏథర్ రిజ్టాకు LFP బ్యాటరీ ఆప్షన్‌ - కొత్త బ్యాటరీ ప్యాక్‌లు, 900W ఛార్జర్‌తో కీలక అప్‌డేట్
యూత్‌ మెచ్చిన ఏథర్ స్కూటర్లకు ఫ్రెష్‌ అప్‌డేట్‌ - చిన్న బ్యాటరీలతోనే సేమ్‌ రేంజ్, ఛార్జింగ్‌లో మరింత వేగం!
మారుతి బ్రెజ్జా ఫేస్‌లిఫ్ట్‌ 2026లో ఏం కొత్తగా మారనుంది? కొత్త ఇంజిన్‌తో పాటు అదిరిపోయే ఫీచర్లు! రేటు ఎంత ఉండొచ్చు?
మారుతి బ్రెజ్జా 2026 మోడల్‌ ఎంట్రీకి మరో 10 రోజులు కూడా లేదు - కొత్త ఇంజిన్‌తో పాటు మిడిల్‌క్లాస్‌ మెచ్చే ఫీచర్లు!
మీ డ్రైవింగ్‌ను నెక్స్ట్ లెవల్‌కు తీసుకెళ్లే 8 స్మార్ట్ కార్ గాడ్జెట్లు - వీటిని ఒక్కసారి ట్రై చేస్తే ఇక వదిలిపెట్టరు!
మీ కారులో ఈ స్మార్ట్ గాడ్జెట్లు ఉన్నాయా? సేఫ్టీ నుంచి స్టైల్ వరకు డ్రైవింగ్ ఎక్స్‌పీరియెన్స్ మారిపోతుంది!
Advertisement

వీడియోలు

IND vs ENG 2nd T20 Highlights | రెండో టీ20లో భారత్‌కు షాక్
Vaibhav Sooryavanshi Debut vs ENG | 15 ఏళ్లకే వైభవ్ సూర్యవంశీ హిస్టారిక్ డెబ్యూ
Shreyas Iyer Worst Captaincy Record | శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీలో భారత్ రికార్డు
Who Is Podarillu Serial Heroine Kruthika? | హీరోయిన్ కృతిక బ్యాక్‌గ్రౌండ్ తెలుసా?
Shreyas Iyer about T20 Loss vs ENG | రవి బిష్ణోయ్‌పై కెప్టెన్ శ్రేయస్ హాట్ కామెంట్స్
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP Corona Deaths: ఏపీలో 12 మందికి కరోనా పాజిటివ్.. నలుగురు మృతితో కలకలం, మళ్లీ టెన్షన్ టెన్షన్
ఏపీలో 12 మందికి కరోనా పాజిటివ్.. నలుగురు మృతితో కలకలం, మళ్లీ టెన్షన్ టెన్షన్
Rains In AP And Telangana: అల్పపీడనం ఎఫెక్ట్.. ఏపీలో ఈ జిల్లాల్లో మోస్తరు వర్షాలు.. తెలంగాణలో పలుచోట్ల తేలికపాటి జల్లులు
అల్పపీడనం ఎఫెక్ట్.. ఏపీలో ఈ జిల్లాల్లో మోస్తరు వర్షాలు.. తెలంగాణలో పలుచోట్ల తేలికపాటి జల్లులు
US Airstrikes On Iran: ఇరాన్‌పై అమెరికా భీకర దాడులు.. రైల్వే స్టేషన్లు, ఎయిర్‌పోర్టులపై మిస్సైల్ దాడులు.. నిలిచిన విద్యుత్ సరఫరా
ఇరాన్‌పై అమెరికా భీకర దాడులు.. రైల్వే స్టేషన్లు, ఎయిర్‌పోర్టులపై మిస్సైల్ దాడులు.. నిలిచిన విద్యుత్ సరఫరా
Telangana Congress Crisis: తెలంగాణ కాంగ్రెస్‌లో ముదురుతున్న సమన్వయ లోపం - వరుసగా వివాదాలు.. పీసీసీ మార్పు తప్పదా?
తెలంగాణ కాంగ్రెస్‌లో ముదురుతున్న సమన్వయ లోపం - వరుసగా వివాదాలు.. పీసీసీ మార్పు తప్పదా?
Re-NEET UG 2026 Result: నీట్‌ రీటెస్ట్ 2026 ఫలితాలు విడుదల! 11.21 లక్షల మంది అభ్యర్థులు అర్హత!  
నీట్‌ రీటెస్ట్ 2026 ఫలితాలు విడుదల! 11.21 లక్షల మంది అభ్యర్థులు అర్హత!  
Asifabad Forest Officials Attack Case: సార్సాల అటవీ అధికారులపై దాడి కేసు.. మాజీ జెడ్పీ వైస్ చైర్మన్‌ సహా 8 మందికి జైలు శిక్ష
సార్సాల అటవీ అధికారులపై దాడి కేసు.. మాజీ జెడ్పీ వైస్ చైర్మన్‌ సహా 8 మందికి జైలు శిక్ష
Rohit Sharma Retirement: రోహిత్‌శర్మ రిటైర్మెంట్‌ న్యూస్! లార్డ్స్ వన్డే తర్వాత ఆటకు వీడ్కోలు! వరల్డ్‌కప్ ప్లాన్స్‌లో లేడని తేల్చి చెప్పిన బీసీసీఐ!
రోహిత్‌శర్మ రిటైర్మెంట్‌ న్యూస్! లార్డ్స్ వన్డే తర్వాత ఆటకు వీడ్కోలు! వరల్డ్‌కప్ ప్లాన్స్‌లో లేడని తేల్చి చెప్పిన బీసీసీఐ!
Supreme Court On Third Language: 9వ తరగతిలో మూడో భాష వద్దు - కేంద్రానికి సుప్రీంకోర్టు కీలక సూచన!
9వ తరగతిలో మూడో భాష వద్దు - కేంద్రానికి సుప్రీంకోర్టు కీలక సూచన!
Embed widget