అన్వేషించండి

Tata Tiago And Tiago EV: సరికొత్త టాటా టియాగో, టియాగో ఈవీ: అదిరిపోయే డిజైన్, ఫీచర్లతో ఎంట్రీ.. ధర, రేంజ్ వివరాలు

టాటా మోటార్స్ తన పాపులర్ హ్యాచ్‌బ్యాక్ 2026 టియాగో, టియాగో ఈవీ మోడళ్లను సరికొత్త డిజైన్, అడ్వాన్స్‌డ్ ఫీచర్లతో ఇండియా మార్కెట్లో లాంచ్ చేసింది.

2026 Tata Tiago And Tiago EV Facelifts Launched In India: టాటా మోటార్స్ ప్యాసింజర్ వెహికల్ ఇండియా మార్కెట్లోకి సరికొత్త 2026 టియాగో (Tiago), టియాగో ఈవీ (Tiago EV) ఫేస్‌లిఫ్ట్ వెర్షన్లను అఫీషియల్‌గా రిలీజ్ చేసింది. ఈ అప్‌డేటెడ్ హ్యాచ్‌బ్యాక్ పెట్రోల్ వెర్షన్ ప్రారంభ ధర ఎక్స్-షోరూమ్ వద్ద రూ. 4.69 లక్షలుగా ఉండగా, ప్యూర్ ఎలెక్ట్రిక్ కౌంటర్ పార్ట్ ధర రూ. 6.99 లక్షల నుంచి స్టార్ట్ అవుతోంది. బ్యాటరీ యాజ్ ఏ సర్వీస్ (BaaS) ఆప్షన్ తో టియాగో ఈవీని కేవలం రూ. 4.69 లక్షలకే సొంతం చేసుకోవచ్చు, దీనికి కిలోమీటరుకు రూ. 2.6 చొప్పున బ్యాటరీ రెంటల్ కట్టాల్సి ఉంటుంది. ఐసీఎన్‌జీ (iCNG) వెర్షన్ ధరను రూ. 5.79 లక్షలుగా నిర్ణయించారు. మారుతి సుజుకి స్విఫ్ట్, హ్యుందాయ్ గ్రాండ్ ఐ10 నియోస్ మోడళ్లకు గట్టి పోటీ ఇచ్చేలా టాటా ఈ కార్లను ముస్తాబు చేసింది.

Read Also: BYD DMi Super PlugIn Hybrid Technology: బీవైడీ డీఎమ్-ఐ హైబ్రిడ్ టెక్నాలజీ టీజర్ రిలీజ్ - అదిరిపోయే రేంజ్, ఫీచ‌ర్లు  

సరికొత్త ఎల్‌ఈడీ హెడ్‌ల్యాంప్స్.. 

లుక్ పరంగా 2026 టాటా టియాగో భారీ మార్పులతో సరికొత్త విజువల్ ఐడెంటిటీని సొంతం చేసుకుంది. ఫ్రంట్ సైడ్ ఐబ్రో స్టైల్ డీఆర్‌ఎల్స్ (DRLs) తో కూడిన కొత్త ఎల్‌ఈడీ హెడ్‌ల్యాంప్స్ కారుకు మరింత షార్పర్ లుక్‌ను ఇస్తున్నాయి. సెంటర్ లో బ్లాక్ ప్యానెల్, సరికొత్త బంపర్ డిజైన్ ఆకట్టుకుంటున్నాయి. సైడ్ ప్రొఫైల్ లో ఎలాంటి మార్పులు లేకపోయినా, ఫ్రెష్ డిజైన్ తో వచ్చిన అల్లాయ్ వీల్స్ కొత్తదనాన్ని తెచ్చాయి. వెనుక వైపు కనెక్టెడ్ స్టైల్ లో కనిపించే వర్టికల్ లైన్స్ ఎల్‌ఈడీ టెయిల్ లైట్స్, అప్‌డేటెడ్ బంపర్ ఉన్నాయి. ఈవీ మోడల్ లో బ్లాక్ ప్యానెల్‌కు బదులుగా బాడీ కలర్ ప్యానెల్, ఏరోడైనమిక్ అల్లాయ్ వీల్స్, ఎలెక్ట్రిక్ బ్యాడ్జింగ్స్ ఇచ్చారు.

Read Also: MG Majestor SUV Launched: ఎమ్జీ మెజస్టర్ ఎస్‌యూవీ లాంచ్: టయోటా ఫార్చూనర్‌కు గట్టి పోటీగా వచ్చిన సరికొత్త ఫ్లాగ్‌షిప్ మోడల్..

ఫస్ట్ టైమ్ సీఎన్‌జీ లో ఏఎమ్‌టీ..

ఇంటీరియర్ విషయానికి వస్తే డ్యాష్‌బోర్డ్ లేఅవుట్‌ను పూర్తిగా మార్చేశారు. ఇందులో 10.25-ఇంచ్ ఫ్లోటింగ్ టచ్‌స్క్రీన్ ఇన్‌ఫోటైన్‌మెంట్ సిస్టమ్, డ్రైవర్ కోసం సరికొత్త స్టాండ్ అలోన్ డిస్‌ప్లే ప్యానెల్ అమర్చారు. వెలిగే టాటా లోగోతో కూడిన 2-స్పోక్ స్టరింగ్ వీల్ లగ్జరీ ఫీల్ ఇస్తోంది. ఫీచర్ల పరంగా డ్యూయల్ వైర్‌లెస్ ఛార్జర్, 360 డిగ్రీ కెమెరా, బ్లైండ్ స్పాట్ మానిటర్, రియర్ ఏసీ వెంట్స్, క్రూజ్ కంట్రోల్ ఉన్నాయి. సేఫ్టీ కోసం స్టాండర్డ్‌గా 6 ఎయిర్‌బ్యాగ్స్, ఈఎస్‌పీ, హిల్ హోల్డ్ కంట్రోల్ ఆఫర్ చేస్తున్నారు. ఈ కారు జీఎన్‌సీఏపీ (GNCAP) క్రాష్ టెస్ట్ లో 4-స్టార్ సేఫ్టీ రేటింగ్ సాధించింది.

పవర్‌ఫుల్ ఇంజన్ పర్ఫార్మెన్స్.. బెస్ట్ ఈవీ బ్యాటరీ రేంజ్

ఈ కారులో 86 హెచ్‌పీ పవర్, 113 ఎన్ఎమ్ టార్క్‌ను జనరేట్ చేసే 1.2 లీటర్ నేచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజన్‌ను కొనసాగించారు. డ్యూయల్ సిలిండర్ టెక్నాలజీ ఉన్న సీఎన్‌జీ మోడల్ 75 హెచ్‌పీ పవర్ ఇస్తుంది. ఈ సెగ్మెంట్ లోనే ఫస్ట్ టైమ్ సీఎన్‌జీ కార్లలో 5-స్పీడ్ ఏఎమ్‌టీ (AMT) గేర్‌బాక్స్ ఆప్షన్ ఇవ్వడం విశేషం. టియాగో ఈవీ మోడల్ 19.2 కిలోవాట్ అవర్, 24 కిలోవాట్ అవర్ అనే రెండు బ్యాటరీ ప్యాక్ ఆప్షన్లతో లభిస్తోంది. ఇది సింగిల్ ఛార్జ్‌పై 205 కిమీ నుంచి 215 కిమీ రియల్ వరల్డ్ రేంజ్, 285 కిమీ ఎమ్ఐడీసీ (MIDC) రేంజ్ ఇస్తుంది. 30 కిలోవాట్ డీసీ ఫాస్ట్ ఛార్జర్ ద్వారా కేవలం 18 నిమిషాల ఛార్జింగ్ తో 100 కిమీ రేంజ్ యాడ్ చేసుకోవచ్చు.

Advertisement

టాప్ హెడ్ లైన్స్

రూ.50 వేల డౌన్ పేమెంట్‌పై Maruti Suzuki Baleno కొంటే ప్రతినెలా EMI ఎంత కట్టాలి ?
రూ.50 వేల డౌన్ పేమెంట్‌పై Maruti Suzuki Baleno కొంటే ప్రతినెలా EMI ఎంత కట్టాలి ?
BMW X1 LWB Petrol Review: BMWలో అత్యంత విలువైన SUV! అదిరిపోయే లగ్జరీస్‌తో వస్తున్న X1 LWB!
BMWలో అత్యంత విలువైన SUV! అదిరిపోయే లగ్జరీస్‌తో వస్తున్న X1 LWB!
Ferrari First EV:ఆక్షన్‌లో 382 కోట్లకు అమ్ముడైన Ferrari తొలి EV!
ఆక్షన్‌లో 382 కోట్లకు అమ్ముడైన Ferrari తొలి EV!
RE క్లాసిక్‌ 350 గోర్ఖా ఎడిషన్‌ లాంచ్‌.. కొత్త గ్రీన్‌ కలర్‌తో అదిరిపోయే లుక్‌! ధర ఎంతో తెలుసా?
ఆర్మీ స్ఫూర్తితో RE క్లాసిక్‌ 350 గోర్ఖా ఎడిషన్‌ లాంచ్‌.. ఎంత బాగుందో!
Advertisement

వీడియోలు

Vijayasai Reddy Announces New Political Party | విజయసాయి రెడ్డి కొత్త రాజకీయ పార్టీ
Gundenininda Gudigantalu Serial August 19 | ప్రభావతి, రోహిణిలకు ఊహించని షాక్
Pithapuram AE Family Suicide Case | కాకినాడ షేక్ సాధిక్ ఖాన్ వికృత రూపం - షూటింగ్ కోచ్ ముసుగులో కామాంధుడి దౌర్జన్యాలు
Anganwadi Leader Dalavai Ramadevi TDP MLC | ఎమ్మెల్సీగా అంగన్ వాడి టీచర్ దళవాయి రమాదేవి
India vs Sri Lanka 1st Test Day 2 Highlights | గాలే టెస్టులో దంచికొట్టిన పడిక్కల్
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Congress Politics: మంత్రి కొండా సురేఖకు టీపీసీసీ షోకాజ్ నోటీసులు.. పార్టీ నుంచి జక్కిడి ప్రభాకర్ రెడ్డి సస్పెండ్
Congress Politics: మంత్రి కొండా సురేఖకు టీపీసీసీ షోకాజ్ నోటీసులు.. పార్టీ నుంచి జక్కిడి ప్రభాకర్ రెడ్డి సస్పెండ్
Principal Roopa Reddy Murder Case: ఆ ఒక్క పదమే ప్రిన్సిపాల్ హంతకుల్ని పట్టించింది- రూపారెడ్డి హత్య కేసులో షాకింగ్ విషయాలు
ఆ ఒక్క పదమే ప్రిన్సిపాల్ హంతకుల్ని పట్టించింది- రూపారెడ్డి హత్య కేసులో షాకింగ్ విషయాలు
Nidhhi Agerwal Betting App Case: ఆన్‌లైన్ బెట్టింగ్ కేసులో ఈడీ విచారణకు హాజరైన నటి నిధి అగర్వాల్
ఆన్‌లైన్ బెట్టింగ్ కేసులో ఈడీ విచారణకు హాజరైన నటి నిధి అగర్వాల్
Vizag Airport Workers: న్యాయం చేయకపోతే ఆత్మహత్య చేసుకుంటాం: విశాఖ ఎయిర్‌పోర్టు మహిళా కార్మికుల ఆవేదన
న్యాయం చేయకపోతే ఆత్మహత్య చేసుకుంటాం: విశాఖ ఎయిర్‌పోర్టు మహిళా కార్మికుల ఆవేదన
Konda Politics: పరకాలలో పోటీ చేసేది నేనే.. నాకు కౌంటర్ ఇస్తే రేవంత్ రెడ్డి భాగోతాలు బయటపెడతా: కొండా సుస్మిత
పరకాలలో పోటీ చేసేది నేనే.. నాకు కౌంటర్ ఇస్తే రేవంత్ రెడ్డి భాగోతాలు బయటపెడతా: కొండా సుస్మిత
రూ.50 వేల డౌన్ పేమెంట్‌పై Maruti Suzuki Baleno కొంటే ప్రతినెలా EMI ఎంత కట్టాలి ?
రూ.50 వేల డౌన్ పేమెంట్‌పై Maruti Suzuki Baleno కొంటే ప్రతినెలా EMI ఎంత కట్టాలి ?
Folk Singer Eshwar Sai Controversy:వేములవాడలో వివాదం! మరో మహిళతో భార్యకు దొరికిపోయిన బాసింగ బలాలు ఫేమ్‌ ఈశ్వర్‌!
వేములవాడలో వివాదం! మరో మహిళతో భార్యకు దొరికిపోయిన బాసింగ బలాలు ఫేమ్‌ ఈశ్వర్‌!
Rajinikanth Vs Ram Pothineni: రజనీకాంత్ అల్లుడిగా రామ్ పోతినేని... 'ధర్మన్'లో విలన్‌గా
రజనీకాంత్ అల్లుడిగా రామ్ పోతినేని... 'ధర్మన్'లో విలన్‌గా
Embed widget