అన్వేషించండి

Mareechika Review - మరీచిక రివ్యూ: మిస్టరీ క్రైమ్ థ్రిల్లర్‌లో రెజీనా, అనుపమ... సతీష్ కాసెట్టి సినిమా ఎలా ఉందంటే?

Mareechika Review Telugu: రెజీనా, అనుపమ పరమేశ్వరన్, విరాజ్ అశ్విన్ ప్రధాన పాత్రల్లో నటించిన సినిమా 'మరీచిక'. సతీష్ కాసెట్టి దర్శకత్వంలో రూపొందిన ఈ మిస్టరీ క్రైమ్ థ్రిల్లర్ ఎలా ఉందంటే?

Mareechika Movie Review In Telugu: నేషనల్ అవార్డు విన్నింగ్ సినిమా 'హోప్', శ్రీకాంత్ 'టెర్రర్' తర్వాత సతీష్ కాసెట్టి దర్శకత్వం వహించిన సినిమా 'మరీచిక'. రెజీనా, అనుపమ పరమేశ్వరన్, విరాజ్ అశ్విన్ ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ చిత్రానికి ఇళయరాజా సంగీతం అందించగా... రాజీవ్ చిలక నిర్మించారు. మిస్టరీ క్రైమ్ థ్రిల్లర్‌గా రూపొందిన ఈ సినిమా ఎలా ఉందంటే?

కథ (Mareechika Movie Story Explained In Telugu): వెంకట లక్ష్మి (అనుపమా పరమేశ్వరన్) స్టూడెంట్. ఆమె కాలేజీ దగ్గరలో కేఫ్ నడిపే సంజు… సంజయ్ (విరాజ్ అశ్విన్)ను ఇష్టపడుతుంది. కానీ తన మనసులో మాటను చెప్పలేదు. ఓ రోజు తనకు సూపర్ మార్కెట్టులో పరిచయమైన ఎన్నారై మరీచిక (రెజీనా)ను తీసుకుని సంజూ కేఫ్ కి వెళుతుంది వెంకటలక్ష్మి.

సంజయ్, మరీచిక ప్రేమలో పడతారు. పెళ్లి చేసుకుంటారు. అయితే పెళ్లైన మర్నాడు మరీచికను సంజూ చంపేశాడని పోలీస్ స్టేషన్‌కు వచ్చి కంప్లైంట్ చేస్తుంది వెంకటలక్ష్మి. కట్ చేస్తే... సంజూ వచ్చి మరీచిక ఎవరో తనకు తెలియదని చెబుతాడు. స్టేషన్‌లో పిచ్చి పట్టినట్టు ప్రవర్తిస్తున్న వెంకటలక్ష్మిని డాక్టర్ దగ్గరకు తీసుకు వెళితే లేనిది ఉన్నట్టు ఊహించుకుంటుందని చెబుతారు. ఐదు నెలల తర్వాత మళ్ళీ పోలీస్ స్టేషన్‌కు వెంకట లక్ష్మి వస్తుంది. ఈసారి సంజూను మరీచిక చంపేసిందని చెబుతుంది. అయితే... స్టేషన్‌కు మరీచిక వస్తుంది. సంజూ ఎవరో తనకు తెలియదని చెబుతుంది. ఇన్వెస్టిగేషన్ చేస్తే రెండేళ్ల క్రితం సంజూ ఆత్మహత్య చేసుకున్నాడని తెలుస్తుంది. 

వెంకట లక్ష్మి, మరీచిక, సంజూ... ముగ్గురిలో ఎవరు ఎవర్ని ప్రేమించారు? వెంకట లక్ష్మి పోలీసుల దగ్గరకు వెళ్ళినప్పుడు మరీచిక తెలియదని సంజూ, సంజూ తెలియదని మరీచిక ఎందుకు చెప్పారు? రెండేళ్ల క్రితం ఆత్మహత్య చేసుకున్న సంజూ ఐదు నెలల క్రితం పోలీస్ స్టేషన్‌కు ఎలా వెళ్ళాడు? ఎవరు ఎవర్ని చంపేశారు? చివరకు ఏమైంది? అనేది సినిమా.  

విశ్లేషణ (Mareechika Telugu Review): సినిమా ఎలా ఉందో చెప్పే ముందు... ఈ టైటిల్ 'మరీచిక' గురించి చెప్పాలి. అటువంటి పేరు ఉంటుందా? అసలు మరీచిక అంటే అర్థం ఏమిటి? అని ఆలోచించిన ప్రేక్షకులు ఒకరిద్దరు అయినా ఉంటారు. ఆ సందేహాలకు సినిమాలో సమాధానం ఇచ్చారు. మరీచిక అంటే ఎండమావి అని చెప్పారు. వేసవిలో ఎండమావి కనిపిస్తుంది కానీ నీళ్లు ఉండవు. ఈ సినిమాలోనూ అంతే... నెక్స్ట్ సీన్ నుంచి బావుంటుందని ప్రేక్షకులు ఎదురు చూడటం తప్ప బావుందన్న సంతృప్తి కలగదు.  

సతీష్ కాసెట్టి దర్శకత్వం వహించిన 'మరీచిక'లో థ్రిల్లర్ సినిమాకు కావాల్సిన ట్విస్టులు, టర్నులు ఉన్నాయి. అయితే... ప్రేక్షకులకు థ్రిల్ ఇచ్చేలా చెప్పే కథనం, దర్శకత్వం కరువైంది. ఇంటర్వెల్ వరకు సినిమా ఫ్లాట్‌గా సాగుతుంది. సంజయ్ (విరాజ్ అశ్విన్)ను వెంకటలక్ష్మి (అనుపమ) ప్రేమించడం... మరీచిక (రెజీనా)ను సంజయ్ ప్రేమిస్తున్నాడని త్యాగం చేయడం వంటివి ఏమాత్రం ఆసక్తి కలిగించలేదు. ఇంటర్వెల్ ట్విస్ట్ ఒక్కటీ సెకండాఫ్ మీద కాస్త క్యూరియాసిటీ క్రియేట్ చేసింది. ఆ తర్వాత మళ్ళీ కథ మొదటికి వచ్చింది. ఫస్టాఫ్‌లో చూసిన సన్నివేశాలు మళ్ళీ రిపీట్ అవుతారు. క్యారెక్టర్స్ మారినా కంటెంట్ ఏమిటనేది ప్రేక్షకులకు అర్థం అవుతుంది. అందువల్ల బోర్ కొడుతుంది. అయితే వెంకట లక్ష్మి రెండోసారి పోలీస్ స్టేషన్‌కు వెళ్లిన తర్వాత వచ్చే ట్విస్టులు కాస్త థ్రిల్ ఇస్తాయి. ఆ సన్నివేశాల్లో పోలీస్ ఆఫీసర్ పాత్రను రాసిన విధానం అసలు బాలేదు.
 
ట్విస్టులు రివీల్ చేసినప్పుడు లేదా ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చేటప్పుడు స్క్రీన్ ముందున్న ప్రేక్షకుడు సర్‌ప్రైజ్ అవ్వాలి. అంతే గానీ ప్రేక్షకుడి మదిలో ప్రశ్న తలెత్తిన తర్వాత స్క్రీన్ మీద క్యారెక్టర్‌ సేమ్ క్వశ్చన్ వేస్తే... ఎంతటి గొప్ప ట్విస్ట్ ఉన్నా సీన్ కామెడీ అవుతుంది. 'మరీచిక'లో జరిగిందదే. చివరి అర గంటలో ట్విస్టులు ఉన్నాయి. అప్పటికే ప్రేక్షకుల సహనం సన్నగిల్లుతుంది. దాంతో వాటిని ఎంజాయ్ చేయలేరు. ట్విస్టులను సరిగా రివీల్ చేయకుండా కన్‌ఫ్యూజ్ చేయడం కూడా సినిమాకు మైనస్. కథ, కథనం, దర్శకత్వం ఆసక్తి కలిగించడం లేదంటే ఇళయరాజా సంగీతం అంతకు మించి అన్నట్టుంది. అసలు ఆర్ఆర్ (నేపథ్య సంగీతం) ఆయనే చేశారా? అన్నంత సందేహం కలిగింది. పాటలు పర్వాలేదు. కెమెరా వర్క్ ఓకే. వీఎఫ్ఎక్స్ అవసరమైన సినిమా కాదు. అవసరమైన రెండు మూడు సన్నివేశాలను సరిగా చేయలేదు. నిర్మాణ విలువలు ఓకే.

ప్లస్ పాయింట్స్:
చివరి అరగంట (ట్విస్టులు)

మైనస్ పాయింట్స్:
ఇళయరాజా సంగీతం
సతీష్ కాసెట్టి దర్శకత్వం
కథతో పాటు స్క్రీన్ ప్లే

విరాజ్ అశ్విన్, రెజీనా, అనుపమ పరమేశ్వరన్... ముగ్గురూ మంచి ఆర్టిస్టులు. పాజిటివ్, నెగెటివ్... ప్రతి ఒక్కరి పాత్రలో రెండు షేడ్స్ ఉన్నాయి. తమ తమ సన్నివేశాలకు తగ్గట్టు నటించారు. అనుపమ అయితే లుక్స్ పరంగానూ వేరియేషన్ చూపించారు. పోలీస్ స్టేషన్ సన్నివేశాల్లో జీవించారు. రెజీనా నటన ఓకే. విరాజ్ అశ్విన్ లుక్స్, యాక్టింగ్ పాత్రకు తగ్గట్టు ఉన్నాయి.

Also ReadKattalan Review Telugu - 'కాటాలన్' రివ్యూ: పుష్ప లాంటి కథ... ఏనుగు దంతాల స్మగ్లింగ్... మలయాళీ యాక్షన్ ఫిల్మ్ హిట్టా? ఫట్టా?

Mareechika Verdict:  మరీచిక... పేరుకు తగ్గట్లుందీ సినిమా. ఎండమావిలో నీళ్లు లేనట్టు... సినిమాలోనూ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఎగ్జైట్ చేసే, థ్రిల్ ఇచ్చే కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం లేవు. కథలో క్రైమ్ ఎలిమెంట్స్, ట్విస్టులు ఉన్నాయి. కానీ ప్రేక్షకుడు ఆహా అనేలా ఒక్కటీ లేదు. స్కిప్ చేయడం బెటర్.

Also ReadBlast Zone Review Telugu - 'బ్లాస్ట్ జోన్' రివ్యూ: యాక్షన్ కింగ్ అర్జున్ లేటెస్ట్ థ్రిల్లర్ - సినిమా ఎలా ఉందంటే?

View More
Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Anasuya Bharadwaj : అచ్చియమ్మ రోల్‌... రొమాంటిక్ సీన్స్ కాంట్రవర్సీ - రంగమ్మత్త రియాక్షన్
అచ్చియమ్మ రోల్‌... రొమాంటిక్ సీన్స్ కాంట్రవర్సీ - రంగమ్మత్త రియాక్షన్
Ram Charan OTT Movies : పెద్ది గాడి టాప్ 7 యాక్షన్ మూవీస్ - ఈ ఓటీటీల్లో ఇప్పుడే చూసెయ్యండి
పెద్ది గాడి టాప్ 7 యాక్షన్ మూవీస్ - ఈ ఓటీటీల్లో ఇప్పుడే చూసెయ్యండి
Balan The Boy: తెలుగు డబ్బింగ్ ఇంత ఘోరమా? మినిమమ్ కేర్ తీసుకోరా బాలన్?
తెలుగు డబ్బింగ్ ఇంత ఘోరమా? మినిమమ్ కేర్ తీసుకోరా బాలన్?
Kalavari Kodalu Kanaka Mahalakshmi Serial Today June 6th: కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: విహారిని లక్ష్మీ చూసిందా! సిరి తండ్రికి తెలీకుండా ఆ పని చేయగలదా!
కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: విహారిని లక్ష్మీ చూసిందా! సిరి తండ్రికి తెలీకుండా ఆ పని చేయగలదా!
Advertisement
Advertisement
Advertisement

వీడియోలు

Who Will Replace Virat in AFG ODI Series? | కోహ్లీ స్థానంలో వచ్చేది ఎవరు?
Shreyas Iyer as New India's T20 Captain? | టీమిండియా కొత్త T20 కెప్టెన్‌గా శ్రేయస్ అయ్యర్
Virat Kohli Ruled Out from ODI | అఫ్గాన్ వన్డే సిరీస్‌కు విరాట్ కోహ్లీ దూరం?
Research on Vaibhav Sooryavanshi | వైభవ్ సూర్యవంశీ మైండ్‌ సెట్‌పై పరిశోధన
AB de Villiers comments On Gujarat Titans | గుజరాత్ టీమ్‌పై ఏబీ డివిలియర్స్ ఫైర్

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Trinamool Congress Crisis 2026: మమతా బెనర్జీ వర్గంలో కేవలం ఆరుగురు ఎమ్మెల్యేలు, ఇద్దరు ఎంపీలే - దీదీ రాజకీయం ముగిసిపోయినట్లేనా?
మమతా బెనర్జీ వర్గంలో కేవలం ఆరుగురు ఎమ్మెల్యేలు, ఇద్దరు ఎంపీలే - దీదీ రాజకీయం ముగిసిపోయినట్లేనా?
Lingamaneni Ramesh Rajya Sabha: రాష్ట్రం కోసం పార్లమెంట్‌లో గళం విప్పుతా - జనసేన రాజ్యసభ అభ్యర్థి లింగమనేని రమేష్ నామినేషన్  దాఖలు
రాష్ట్రం కోసం పార్లమెంట్‌లో గళం విప్పుతా - జనసేన రాజ్యసభ అభ్యర్థి లింగమనేని రమేష్ నామినేషన్ దాఖలు
Sai Durgha Tej : సుప్రీం హీరో నెక్స్ట్ మూవీ - అహోబిలం ఆలయ ఉత్సవంతో లింక్... క్రేజీ టైటిల్ ఫిక్స్
సుప్రీం హీరో నెక్స్ట్ మూవీ - అహోబిలం ఆలయ ఉత్సవంతో లింక్... క్రేజీ టైటిల్ ఫిక్స్
Breaking News: టీ20 కెప్టెన్‌గా శ్రేయస్ అయ్యర్‌! జాతీయ జట్టులో సూర్యవంశీకి స్థానం! 
టీ20 కెప్టెన్‌గా శ్రేయస్ అయ్యర్‌! జాతీయ జట్టులో సూర్యవంశీకి స్థానం! 
CJP Protest: కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాల్సిందే! ఢిల్లీ వీధుల్లో బొద్దింకల గర్జన!
కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాల్సిందే! ఢిల్లీ వీధుల్లో బొద్దింకల గర్జన!
CJP Protest: కాక్రోచ్‌ జనతా పార్టీ ఆఫ్‌లైన్ పోరాటం! కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా డిమాండ్‌తో జంతర్‌ మంతర్ వద్ద ధర్నా!
కాక్రోచ్‌ జనతా పార్టీ ఆఫ్‌లైన్ పోరాటం! కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా డిమాండ్‌తో జంతర్‌ మంతర్ వద్ద ధర్నా!
Buchi Babu Sana: సారీ లేడీస్... 'పెద్ది'లో ఆ సీన్స్ డిలీట్ చేస్తున్నా - దర్శకుడు బుచ్చి ట్వీట్
సారీ లేడీస్... 'పెద్ది'లో ఆ సీన్స్ డిలీట్ చేస్తున్నా - దర్శకుడు బుచ్చి ట్వీట్
NTR: అడ్రస్ పెట్టు... అడ్రస్ పెట్టు... అభిమానికి కుకీస్ పంపిన ఎన్టీఆర్
అడ్రస్ పెట్టు... అడ్రస్ పెట్టు... అభిమానికి కుకీస్ పంపిన ఎన్టీఆర్
Embed widget