Guppedanta Manasu February 13th: ఊహించని నిర్ణయం తీసుకున్న మహేంద్ర- బెట్టు చేస్తున్న రిషిధార, బిక్కమొహం వేసిన చక్రపాణి
Guppedantha Manasu February 13th Update: గుప్పెడంతమనసు సీరియల్ ఇంట్రెస్టింగ్ గా సాగుతోంది. ఈ రోజు ఎపిసోడ్ లో ఏం జరిగిందంటే...
మహేంద్ర, జగతి ఎదిరించి మాట్లాడటం తలుచుకుని దేవయాని రగిలిపోతూ ఉంటుంది. రిషి దగ్గరకి వెళ్ళి నిన్న ఎక్కడికో వెళ్లావంట కదా అని అడుగుతుంది. వసుధారతో కలిసి మిషన్ ఎడ్యుకేషన్ టూర్ కి వెళ్లానని చెప్తాడు. ఎవరినో పెళ్లి చేసుకుని వెళ్ళిపోయిన వసుధారతో నువ్వు వెళ్ళడం ఎందుకని అడుగుతుంది. పెళ్లి చేసుకుని కాలేజ్ కి వచ్చి నిన్ను ఇబ్బంది పెట్టడం ఎందుకు, నీ కళ్ళ ముందు తిరుగుతుంటే బాధగా ఉంటుంది కదా అని దేవయాని అంటుంది. నీ ఆనందం గురించి ఆలోచించేది ఈ పెద్దమ్మ ఒక్కతే వసుధారని వదిలిపెట్టు, తనని కాలేజ్ నుంచి తీసేయ్ అని చెప్తుంది. ఇవన్నీ మీకు అవసరం లేదు, అవసరం లేని వాటి గురించి ఆలోచించి ఇబ్బంది పడకండని రిషి చెప్పేసరికి దేవయాని బిత్తరపోతుంది.
వసుధార రిషికి నిజం చెప్పడం లేదు ఎన్నాళ్ళు తను బాధపడతాడు, వాడిని చూసి తట్టుకోలేకపోతున్నా అని జగతితో మహేంద్ర అంటుండగా రిషి వస్తాడు.
రిషి: మేడమ్ మీరు నా దగ్గర ఏమైనా దాస్తున్నారా
జగతి: మేం నీదగ్గర ఏం దాస్తాను రిషి
రిషి: వసుధార పెళ్లి చేసుకుని వచ్చిన తర్వాత కోపంగా ఉంది తనని దూరం పెట్టారు. కానీ ఈ మధ్య మీరేదో మారినట్టు కనిపిస్తుంది నాకు మీరు ఏదో దాస్తున్నారని అనిపిస్తుంది
Also Read: మాజీ పెళ్ళానికి నెక్లెస్ ఇవ్వడానికి తిప్పలు పడుతున్న మాజీ మొగుడు- నందు మీద అనుమానపడుతున్న లాస్య
మహేంద్ర: ఇప్పుడు దారిలోకి వచ్చావ్, ఇదే మంచి అవకాశం రిషికి నిజం చెప్పెద్దామని జగతితో చిన్నగా అంటాడు
రిషి: మేడమ్ వసుధార విషయంలో మీ మాట తీరు మారినట్టు ఉంది. అన్నీ మర్చిపోయి ఏమి జరగనట్టు మామూలుగా ఉంటున్నారు. మీకు ఏదైనా తెలిస్తే చెప్పండి
జగతి: అసలు నిజం తెలిశాక చెప్పలేదని ఎంత గొడవ చేస్తాడో అని మనసులో అనుకుంటుంది. మహేంద్ర మాత్రం నిజం చెప్పడానికి ట్రై చేస్తుంటే జగతి వద్దని ఆపుతుంది. వసు చెప్పొద్దని చెప్పింది కదా ఎలా చెప్తామని జగతి అంటుంది. రిషినే నిజం తెల్సుకోనిద్దామని చెప్తుంది. రెండు రోజులు ఓపిక పడతాను అంతలోపు రిషి నిజం తెలుసుకుంటే సరి లేదంటే నేనే తనకి నిజం చెప్పేస్తాను ఇది ఫైనల్ అని మహేంద్ర తేల్చి చెప్పేస్తాడు.
రిషి మాటలు తలుచుకుని బాధపడుతూ ఉన్న వసును చక్రపాణి వచ్చి పలకరిస్తాడు. అప్పుడే రిషి వచ్చి హారన్ కొడతాడు. హారన్ సౌండ్ ఇట్టే గుర్తు పట్టేస్తుంది కదా రావడం లేదు ఏంటని రిషి అనుకుంటూ ఉంటాడు. వెళ్తే ఏదో ఒకటి తిడతారు ఆయనే లోపలికి రావాలని అనుకుంటుంది వసు. ఎంతకీ రాకపోయేసరికి రిషి ఇంట్లోకి వస్తుంటే వసు కావాలని తనకి తలనొప్పిగా ఉందని తండ్రికి చెప్తుంది. చక్రపాణి రిషి సర్ అని అంటే కావాలని వసు మాట దాటేస్తూ ఉంటుంది. రిషి లోపలికి వస్తాడు. మీరిద్దరూ మాట్లాడుకుంటూ ఉండండి నేను వెళ్ళి కాఫీ తీసుకొస్తానని చక్రపాణి అంటాడు కానీ వసు మాత్రం తండ్రిని ఆపి తనే వెళ్తుంది.
Also Read: మాళవికని తప్పుదారి పట్టించిన అభిమన్యు- వేదకి వార్నింగ్ ఇచ్చిన యష్
వసు కాఫీ ఇస్తుంటే తనతో మాట్లాడకుండా చక్రపాణిని మధ్యలో పెట్టి మాట్లాడతాడు. ఇద్దరూ ఒకరితో ఒకరు మాట్లాడుకోకుండా చక్రపాణిని మధ్యలోకి లాగుతూ ఉంటారు. ఏదో తగాదా పడ్డట్టు ఉన్నారు వీళ్ళు మాట్లాడుకోవడం లేదని చక్రపాణి మనసులో అనుకుంటాడు. తలనొప్పిగా ఉందని కాలేజ్ కి వెళ్ళను అని రిషి ఎదుటే వసు కావాలని ఎండీ అంటూ నొక్కి మరీ చెప్పి మెయిల్ పెడుతుంది. దీంతో రిషి కోపంగా అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. విషయాలు అడుగుతానని కావాలని తలనొప్పి అని అబద్ధం చెప్తోందని రిషి అనుకుంటాడు. నువ్వు ఇలా చెయ్యవు కదా ఎందుకు అన్నీ మర్చిపోయినట్టు అలా ఎలా ఉండగలుగుతున్నావ్ అని వసుతో గడిపిన క్షణాలు గుర్తు చేసుకుంటాడు.