Guppedanta Manasu January 10th Update: కనురెప్పల కాలం లోనే కథ మొత్తం మారిపోయిందే, అంతులేని బాధతో జగతికి థ్యాంక్స్ చెప్పిన రిషి!
Guppedantha Manasu January 10th Update: గుప్పెడంతమనసు సీరియల్ ఇంట్రెస్టింగ్ గా సాగుతోంది. ఈ రోజు ఎపిసోడ్ లో ఏం జరిగిందంటే...
గుప్పెడంతమనసు జనవరి 10 మంగళవారం ఎపిసోడ్ (Guppedanta Manasu January 10th Update)
మీకు దండం పెడతాను వెళ్లిపోండిసార్.. ఈ తాళి నా ఇష్టప్రకారమే నా మెడలో పడిందన్న వసుధార మాటలకు రిషి గుండె బద్దలవుతుంది.. తనలో గడిపిన క్షణాలు తలుచుకుంటూ బాధగా ఇంటికి చేరుకుంటాడు రిషి..
శూన్యంలోకి చూస్తూ లోపలకు అడుగేస్తాడు
మహేంద్ర: రిషి.. ఎలా ఉన్నావో చూడు
రిషి: ఉన్నాను కదా డాడ్
జగతి: అదికాదు రిషి
రిషి: నాకేం చెప్పకండి మేడం.. మీ శిష్యురాలిని కాలేజీకి తీసుకొచ్చినందుకు మనసులో మీకు థ్యాంక్స్ చెప్పుకున్నాను.. ఇప్పుడు కూడా చెప్పాలా మేడం..తనుజీవితంలో మరిచిపోలేని గుణపాఠం నేర్పించింది.. థ్యాంక్యూ మేడం
Also Read: అందరి ముందు బుక్కైపోయిన మోనిత, దీప-కార్తీక్ పై అనుమానపడుతున్న సౌందర్య
సోమవారం ఎపిసోడ్ లో ఏం జరిగిందంటే...
దేవయాని ఇంటికి రావడంతో జగతి అక్కయ్య మీకు రిషి ఫోన్ చేశాడా అని అడుగుతుంది. లేదు అన్న దేవయాని అదేంటి మీతో పాటు రాలేదా జగతి అంటుంది..లేదు వదిన గారు రిషి మా కంటే ముందు కార్లు బయలుదేరాడు ఇక్కడికి వచ్చాడు అనుకున్నాము అనడంతో అనుకోవడం ఏంటి మహేంద్ర అయినా మీకు బుద్ధి లేదా అంటూ జగతి,మహేంద్రపై సీరియస్ అవుతుంది. రెండు కార్లు ఉన్నాయి కదా రిషిని కూడా మీతో పాటు పిలుచుకొని రావచ్చు కదా అనడంతో మేము ఆ పరిస్థితిలో ఏం చెప్పినా రిషి వినిపించుకోలేడు వదిన అని అంటాడు మహేంద్ర. ఇంతలో అక్కడికి వచ్చిన ఫణీంద్ర..రిషి ఏడి అని అడిగితే..జరిగినదంతా చెబుతారు మహేంద్ర జగతి...ఇదే అవకాశంగా దొంగ ప్రేమ నటిస్తూ రిషికి ఏమైనా అయిందంటే మీ సంగతి చెబుతానని బెదిరించి అక్కడి నుంచి వెళ్లిపోతుంది దేవయాని..
Also Read: తాళి కట్టిందేవరో నిజం చెప్పిన వసు, ఆట ఆడుతున్న దేవయాని- ముక్కలైన రిషి హృదయం
రిషి..వసుధార కోసం జైలుకి వెళతాడు. ఎందుకు వసుధార ఇలా చేస్తున్నావు అసలు ఏమైందని బాధపడతాడు. నేను నిన్ను ఒకే ఒక ప్రశ్న అడిగి వరకు నేను ఇక్కడ నుంచి వెళ్ళను నాకు ఆ సమాధానం తెలియాలి అని అనుకుంటూ ఉంటాడు రిషి. అప్పుడు రాజీవ్ రిషి బయట ఉండడం గమనించి వసుధార దగ్గరికి వెళ్లి మీ రిషి సార్ మళ్లీ వచ్చాడు అనడంతో నాకు తెలుసు అని అంటుంది. మీ రిషి సార్ నేను చెప్తే వినడు అని అంటాడు. నేను రిషి సార్ కు నిజం చెప్పేస్తాను అనడంతో మీ అమ్మ నాన్నతో పాటు రిషి ని కూడా చంపేస్తాను ఆ తర్వాత నీ ఇష్టం అని వసుధార ని బెదిరిస్తాడు రాజీవ్. ఇంతలోనే అక్కడికి ఎస్ఐ రావడంతో ఎస్ఐ ని బ్రతిమలాడి లోపలకు వెళతాడు రిషి..
రిషి: ఒక్క ప్రశ్న వసుధార నీ మెడలో ఆ తాళిబొట్టు ఎవరు కట్టారు
వసు: నా ఇష్టం తోనే నా మెడలో తాళి పడింది. నా ఇష్టపూర్వకంగానే నా పెళ్లి జరిగింది నేను ఇంతకంటే మీకు ఎక్కువ ఏమీ చెప్పలేను దయచేసి ఇక్కడి నుంచి వెళ్లిపోండి
ఏం మాట్లాడుతున్నావ్ వసుధారా అనడంతో అవును సార్ నా ఇష్టపూర్వకంగానే పెళ్లి జరిగింది అనగా రిషి షాక్ అయ్యి అక్కడి నుంచి వెళ్లిపోతాడు. అప్పుడు రాజీవ్ నవ్వుకుంటూ ఉంటాడు.
నన్ను క్షమించండి రిషి సార్ అని వసు అనుకుంటే..క్షమించరాని తప్పుచేశావ్ వసుధార అని రిషి బాధపడతాడు... జైల్లో గోడపై రిషిధార అని పేరురాసి అది చూస్తూ కన్నీళ్లుపెట్టుకుంటుంది వసుధార...
దీనికి కొనసాగింపే పైన ప్రోమో...