News
News
X

Karthika Deepam January 10th Update: అందరి ముందు బుక్కైపోయిన మోనిత, దీప-కార్తీక్ పై అనుమానపడుతున్న సౌందర్య

కార్తీకదీపం జనవరి 10 ఎపిసోడ్: బుల్లితెర ప్రేక్షకులని ఎంతగానో ఆకట్టుకుంటున్న కార్తీక్ దీపం సీరియల్ కి త్వరలో శుభం కార్డు పడనుంది... ఈ రోజు ఏం జరిగిందంటే...

FOLLOW US: 
Share:

కార్తీకదీపం జనవరి 10 మంగళవారం ఎపిసోడ్ (Karthika Deepam January 10th Update)

హిమ, శౌర్య దగ్గర ఒక దొంగ డబ్బులు తీసుకుని పారిపోతూ ఉండగా వాళ్ళు పట్టుకునేందుకు పరిగెత్తుతారు..ఆ దొంగ పిల్లల్ని నెట్టేయడంతో వాళ్లు కిందపడకుండా పట్టుకుంటాడు కార్తీక్. అప్పుడు కార్తీక్ ని చూసి హిమ శౌర్య ఇద్దరూ ఒక్కసారిగా షాక్ అయ్యి ఎమోషనల్ అవుతారు. బ్యాంగ్రౌండ్ లో తండ్రి-కూతురు సెంటిమెంట్ సాంగ్ ప్లే అవుతుంది. 
హిమ: డాడీ ఎక్కడికి వెళ్ళిపోయారు మీరు మీకోసం మేము ఎంతలా వెతుకుతున్నామో తెలుసా చూసావా  శౌర్య ఆరోజు నేను చెప్తే వినలేదు కదా వచ్చాడు చూడు.
శౌర్య:ఇక్కడే ఉండి మా దగ్గరికి ఎందుకు రాలేదు నాన్న, నీకోసం ఎంతలా వెతికానో మా మీద కోపం వచ్చిందా మమ్మల్ని చూడాలనిపించడం లేదా అని ఎమోషనల్ గా మాట్లాడుతుంది.అయినా అమ్మ ఎలా ఊరుకుంది మమ్మల్ని చూడకుండా అమ్మ ఎలా ఉంది
కార్తీక్ ఏం మాట్లాడకుండా మౌనంగా కన్నీళ్లు పెట్టుకుంటూ ఉంటాడు.
హిమ: మిమ్మల్ని చూసి పరిగెత్తుకుని వచ్చాను..మీకు వినిపించలేదా
శౌర్య: ఆరోజు హిమ చూసింది అంటే నేను నమ్మలేదు కానీ ఇప్పుడు అనుమానం వస్తోంది. నన్ను కూడా చాలాసార్లు చూసి కూడా తప్పించుకుని తిరుగుతున్నారు కదా అని
కార్తీక్: మీరు అమ్మ దగ్గరికి వెళ్లడం కాదు మీరు ఇంటికి వెళ్ళండి నేను అమ్మని మీ దగ్గరికి తీసుకుని వస్తాను
మేం నమ్మము డాడీ మీరు మళ్ళీ ఎక్కడికో చోటికి వెళ్ళిపోతారు అందుకే మమ్మల్ని తీసుకెళ్లండి అంటారు.  కార్తీక్ చేసేదేమీ లేక హిమ, శౌర్యను దీప దగ్గరికి తీసుకెళ్లేందుకు సిద్ధపడతాడు. 

మరోవైపు సౌందర్య దీప వస్తుండగా సౌందర్య దీప చేయి గట్టిగా పట్టుకుంటుంది. అప్పుడు ఏంటి అత్తయ్య చెయ్యి వదిలితే పారిపోతున్నాను అనుకుంటున్నారా అంటే...లేదే నాకు ఇదంతా కలగా ఉన్నట్టుంది అని అంటుంది సౌందర్య. ఈ గుడ్ న్యూస్ మీ మామయ్యకు చెబుదాము అంటే నువ్వు ఇలా చెప్పే సగం సగం న్యూస్ ఆయనకు చెప్తే ఆయన ముందే హార్ట్ పేషంట్ ఆయన గుండె ఆగిపోతుంది అని అంటుంది. అసలు మీరు ఎక్కడ ఉన్నారు నా కొడుకు దగ్గరికి తీసుకెళ్ళు అనడంతో..అంతకన్నా ముందు మనం మాట్లాడుకోవాల్సిన విషయం ఒకటి ఉంది అంటుంది దీప. 

Also Read: 'కార్తీకదీపం' సీరియల్ కు ఎండ్ కార్డ్, క్లారిటీ ఇచ్చిన నిరుపమ్, ప్రేమీ - త్వరలో 'బ్రహ్మముడి'

దీప-సౌందర్య...హిమ,శౌర్య,కార్తీక్ ఎదురుపడతారు. ఒకరిని చూసి ఒకరు ఎమోషనల్ అవుతూ ఉంటారు. అప్పుడు ఇన్ని రోజులు ఎక్కడికి వెళ్లారమ్మా డాడీని అడిగితే  చెప్పలేదు..నువ్వైనా చెప్పమ్మా అంటారు పిల్లలు. అప్పుడు కార్తీక్-దీప ఇద్దరూ ఒకరి ముఖం మరొకరు చూసుకుంటారు. అప్పుడు కార్తీక్ దీపం వైపు చూస్తూ నువ్వు అనుకున్నదే చేసావ్ దీప అమ్మ వాళ్ళతో కలుపుతాను అన్నావు అలాగే కలిపావు అని అనుకుంటూ ఉంటాడు.
సౌందర్య: దీప ఏమి అడిగినా చెప్పడం లేదు పిల్లలకు కూడా కనిపించకుండా నన్ను దూరంగా తీసుకువచ్చింది
పిల్లలు: అవునా అమ్మ మమ్మల్ని చూడాలనిపించడం లేదా అని అడగడంతో లేదమ్మా 
పిల్లలను హత్తుకుని ఎమోషనల్ అవుతుంది
సౌందర్య: మీరు ప్రమాదంలో చనిపోయారు అనుకుని ఇన్ని రోజులు మేము చాలా బాధపడ్డాము కానీ ఉన్నారని తెలిసి కూడా మాకు ఎందుకు ఈ బాధ ఎందుకు మమ్మల్ని ఏడిపించారు .ఎందుకు మీ మనసు అంత కఠినంగా మారిపోయింది
కార్తీక్: ఏం మాట్లాడకుండా మౌనంగా ఉంటారు. సరే అమ్మా మీరు వెళ్లండి దీపను ఇంటికి తీసుకొచ్చి అన్నీ వివరంగా చెబుతాను
పిల్లలు: అమ్మ నాన్నలను వదలొద్దు నానమ్మ వదిలితే మళ్ళీ ఇక్కడి నుంచి వెళ్ళిపోతారు
సౌందర్య: వాళ్ల బాధ చూడండి రా తల్లిదండ్రులు ఉండి కూడా లేనట్టు బతకాల్సిన కర్మ వాళ్లకు ఏంటి . ఇప్పుడు మీరు కనిపించారు అన్న సంతోషం కంటే మీరు ఏం చేస్తున్నారు? ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నారు అన్న భయం ఎక్కువగా ఉంది 
దీప : భయపడాల్సింది ఏమీ లేదు
సౌందర్య: ఒక్కసారి మా స్థానంలో ఉండి మీరే ఊహించుకోండి మేము ఇన్ని రోజులు ఎంత నరకం అనుభవించి ఉంటామో అని..
మీరు ఎక్కడ ఉంటున్నారు ఏం చేస్తున్నారు ప్రతి ఒక్కటి ఈరోజు నాకు తెలియాలి. మమ్మల్ని మీ ఇంటి దగ్గరికి తీసుకెళ్లండి.. తప్పించుకుని వెళ్లడానికి వీల్లేదు 

Also Read: సౌందర్యని కలిసిన దీప, కార్తీక్ ని కలిసిన పిల్లలు- చారుశీలకి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చిన మోనిత

మరొకవైపు కార్తీక్ వాళ్ళ ఇంటికి వెళ్లిన మోనిత..వీళ్లెక్కడికి వెళ్లారు అనుకుంటుంది. హాస్పిటల్ కి తీసుకెళ్లాడా..సరే.. వచ్చేవరకూ లోపల కూర్చుందాం అనుకుని తాళాలు పగులగొడుతుంది. లోపలకు వెళ్లి ఆకలేస్తోందనుకుని దోసెలు పోసుకుంటుంది.  ఇంతలో కార్తీక్ సౌందర్యని ఆ ఇంటి దగ్గరికి తీసుకొస్తుంటారు...ఈ ఇంటికి నేను ఆల్రెడీ వచ్చాను అంటుంది. నువ్వు అంజి వచ్చిన విషయం మాకు తెలుసు మమ్మీ అని కార్తీక్ అనడంతో...మమ్మల్ని చూసి ఇంటికి తాళం వేసి తప్పించుకుని తిరుగుతున్నారన్నమాట అని అంటుంది సౌందర్య. అసలు ఏం చేస్తున్నారు నన్ను చూసి దాక్కోవాల్సిన అవసరం ఏంటని అడుగుతంది. లోపలకు వెళ్లి మోనితని చూసి అంతా షాక్ అవుతారు. మోనిత కూడా షాక్ అవుతుంది.
సౌందర్య: నా కొడుకు కోడలు ఎక్కడ ఉన్నారు నీకు తెలుసు కదా ఎందుకే నాకు అబద్ధం చెప్పావు నా కొడుకు కోడలు ఇంటికి రాకపోవడానికి కూడా కారణం నువ్వే కదా అని అంటుంది. ఏం జరిగిందో మీ కొడుకు,కోడలు చెప్పే ఉంటారుకదా అయినా నన్ను అడుగుతారేంటి..

రేపటి(బుధవారం) ఎపిసోడ్ లో
ఇద్దరూ కలసి ఏదైనా చెప్పకుండా దాస్తున్నారా అని సౌందర్యలో అనుమానం పెరుగుతుంది. కార్తీక్-దీప మాట్లాడుకుంటుండగా సౌందర్య చాటుగా వింటుంది.. 

Published at : 10 Jan 2023 09:07 AM (IST) Tags: Karthika Deepam Serial karthika Deepam Serial Today Episode Karthika Deepam Serial Written Update Karthika Deepam Episode Karthika Deepam Serial January 10th

సంబంధిత కథనాలు

Ennenno Janmalabandham February 8th: బయటపడిన అభిమన్యు అసలు రంగు, మాళవిక బతుకు బస్టాండ్- మనసులతో ఊసులాడుకున్న వేద, యష్

Ennenno Janmalabandham February 8th: బయటపడిన అభిమన్యు అసలు రంగు, మాళవిక బతుకు బస్టాండ్- మనసులతో ఊసులాడుకున్న వేద, యష్

Pawan Kalyan As God : ప్రేమికుల రోజు నుంచి దేవుడిగా పవన్ కళ్యాణ్

Pawan Kalyan As God : ప్రేమికుల రోజు నుంచి దేవుడిగా పవన్ కళ్యాణ్

Guppedanta Manasu February 8th: మహేంద్రనా మజాకా! టామ్ అండ్ జెర్రీ కొత్త ప్రయాణం మొదలైంది

Guppedanta Manasu February 8th: మహేంద్రనా మజాకా! టామ్ అండ్ జెర్రీ కొత్త ప్రయాణం మొదలైంది

Jailer vs Indian 2: ఒకే రోజు కమల్, రజినీ సినిమాలు విడుదల, 18 ఏళ్ల తర్వాత సేమ్ సీన్ రిపీట్!

Jailer vs Indian 2: ఒకే రోజు కమల్, రజినీ సినిమాలు విడుదల, 18 ఏళ్ల తర్వాత సేమ్ సీన్ రిపీట్!

Prabhas Team Reaction : కృతితో ప్రభాస్ ఎంగేజ్‌మెంట్ - రెబల్ స్టార్ టీమ్ క్లారిటీ

Prabhas Team Reaction : కృతితో ప్రభాస్ ఎంగేజ్‌మెంట్ - రెబల్ స్టార్ టీమ్ క్లారిటీ

టాప్ స్టోరీస్

Delhi Liquor Scam Case : ఢిల్లీ లిక్కర్ స్కాంలో వరుస అరెస్టులు - ఆడిటర్ బుచ్చిబాబుతో పాటు గౌతమ్‌ని కూడా !

Delhi Liquor Scam Case : ఢిల్లీ లిక్కర్ స్కాంలో వరుస అరెస్టులు - ఆడిటర్ బుచ్చిబాబుతో పాటు గౌతమ్‌ని కూడా !

PM Modi Sadri Jacket: ప్రధాని మోదీ ధరించిన జాకెట్‌ ఎంతో స్పెషల్, ఎందుకో తెలుసా?

PM Modi Sadri Jacket: ప్రధాని మోదీ ధరించిన జాకెట్‌ ఎంతో స్పెషల్, ఎందుకో తెలుసా?

బందరు పోర్టు కోసం పవర్ ఫైనాన్స్ కార్పోరేషన్ ద్వారా రుణం- 9.75 వడ్డీతో రూ. 3940 కోట్లు తీసుకోవడానికి క్యాబినెట్ గ్రీన్ సిగ్నల్

బందరు పోర్టు కోసం పవర్ ఫైనాన్స్ కార్పోరేషన్ ద్వారా రుణం- 9.75 వడ్డీతో రూ. 3940 కోట్లు తీసుకోవడానికి క్యాబినెట్ గ్రీన్ సిగ్నల్

RBI Policy: దాస్‌ ప్రకటనల్లో స్టాక్‌ మార్కెట్‌కు పనికొచ్చే విషయాలేంటి?

RBI Policy: దాస్‌ ప్రకటనల్లో స్టాక్‌ మార్కెట్‌కు పనికొచ్చే విషయాలేంటి?