Karthika Deepam To End: 'కార్తీకదీపం' సీరియల్ కు ఎండ్ కార్డ్, క్లారిటీ ఇచ్చిన నిరుపమ్, ప్రేమీ - త్వరలో 'బ్రహ్మముడి'
కార్తీకదీపం ముగింపు: టీవీ ప్రేక్షకుల్ని మెప్పిస్తోన్న ‘కార్తీకదీపం’ సీరియల్ మలుపులు తిరుగుతోంది. ముగింపు ఎప్పుడా అని ఎదురుచూస్తున్న ప్రేక్షకులకు గుడ్ న్యూస్ చెప్పారు డాక్టర్ బాబు, వంటలక్క
Karthika Deepam To End: ఏళ్ల తరబడి టీవీ ప్రేక్షకులు ఎదురుచూస్తున్న కార్తీకదీపం కథ ముగింపు దశకు చేరుకుంది. అందరికీ నచ్చే క్లైమాక్స్ తో వచ్చేందుకు టీమ్ సిద్ధమైంది. ప్రతిసారీ త్వరలో ఎండ్ కార్డ్ పడుతుందని ఆశగా ఎదురుచూడడం..మరో మలుపు తిప్పడం జరుగుతోంది. కానీ ఈసారి క్లైమాక్స్ పక్కా..ఎందుకంటే ఇది ఎవ్వరి ఊహా కాదు...నేరుగా సీరియల్ టీమ్ అఫీషియల్ గా ప్రకటించింది..
ప్రోమోలో ఏముందంటే
'కార్తీకదీపం' మీకు ఎన్నో మరుపురాని జ్ఞాపకాలు ఇచ్చింది.. మీ గుండెల్లో చోటుని కల్పించింది. ప్రతి గొప్ప కథకి ఓ ముగింప ఉంటంది (ప్రాణాలు వదిలేది నేను అని దీప అన్న డైలాగ్ ఉందిక్కడ), కార్తీకదీపం మీకు నచ్చే అద్భుతమైన క్లైమాక్స్ తో మీ ముందుకి రాబోతోంది. 'కార్తీక్ దీపం' ముగింపు మరోసరికొత్త కథకి నాంది పలకబోతోంది.. అదే 'బ్రహ్మముడి'. మా మీద మీరు చూపించిన ప్రేమాభిమానులు కావ్య రాజుపై కూడా చూపించాలి.... ఇదీ ప్రోమోలో ఉన్న విషయం..
కార్తీకదీపం ముగింపు అంటూ విడుదల చేసిన ప్రోమో ఇక్కడ చూడొచ్చు
View this post on Instagram
Also Read: ముగ్గురి భామల మధ్య డాక్టర్ బాబు- చారుశీలను వణికించిన మోనిత, శపథం చేసిన దీప
కార్తీకదీపం సీరియల్ జనవరి 7 నాటికి 1555 ఎపిసోడ్స్ పూర్తిచేసుకుంది.
ప్రస్తుతం కథలో మోనిత రీ ఎంట్రీ ఇచ్చింది. చారుశీల అనే డాక్టర్ కూడా కార్తీక్ ను పెళ్లిచేసుకుని ఆస్తి కొట్టేయాలని ప్లాన్ చేస్తోంది. మోనిత మాత్రం ఎంతకైనా తెగించి కార్తీక్ ను దక్కించుకోవాలి చూస్తోంది. మరోవైపు దీపకు...డాక్టర్ చారుశీల వేరే మందులు ఇప్పించడంతో త్వరలో దీప ప్రాణాలు కోల్పోతుందని చెబుతున్నారు. ఇంకోవైపు దీప- కార్తీక్ బతికి ఉన్నారనే నమ్మకంతో పిల్లలు హిమ, శౌర్య ఓవైపు..సౌందర్య ఆనందరావు మరోవైపు వెతుకుతున్నారు...వాళ్లని చూసిన దీప..అనారోగ్యంతో పోయేది నేను కదా మీరు వాళ్లదగ్గరకు వెళ్లిపోండని చెబుతుంది. చావైనా బతుకైనా నీతోనే అన్నాడు కార్తీక్...కథ రసవత్తరంగా జరుగుతున్న సమయంలో త్వరలో ముగింపు అని ప్రోమో వదిలారు...మరి ముగింపు ఎలా ఉండబోతోంది... దీపన చంపేస్తారా...లేదంటే చారుశీల మొనిత ఇద్దరు ఒకరిపై మరోకరు కుట్రలు చేసుకుని పోతారా...దీప-కార్తీక్...తన వాళ్లను చేరుకుంటారా..అన్నది చూడాలి
వాస్తవానికి కార్తీక్-దీప-మోనిత రీఎంట్రీ కథను...వారణాసి అనే ఆటోడ్రైవర్... సౌందర్య , హిమ, శౌర్యకి చెబుతున్నాడు... మళ్లీ అక్కడకు తీసుకెళ్లాకేే కథకు ముగింపు పలుకుతారా లేదా అన్నది కొద్ది రోజుల్లో క్లారిటీ వచ్చేస్తుంది....
Also Read: తరగతి గదిలోనే మిగిలిన మనసు - మోసం చేశావా వసుధారా అంటూ గుండెపగిలేలా ఏడ్చిన రిషి!