ABP Desam


ఈ వారం ఈ రాశులవారికి పనుల్లో ఆటంకాలు, ఆర్థిక సమస్యలు, అనారోగ్యం


ABP Desam


మేష రాశి
మేష రాశివారికి ఈ వారం మిశ్రమ ఫలితాలున్నాయి. గ్రహాలు అంత అనకూలంగా లేవు...అందుకే ఆచితూచి అడుగేయాలి. డబ్బు విషయంలో జాగ్రత్త అవసరం. ప్రేమ జీవితంలో కొన్ని ఇబ్బందులు ఉండవచ్చు. అప్పులు చేయాలనే ఆలోచనలో ఉన్నట్టైతే ప్రస్తుతానికి ఆ ఆలోచన విరమించుకోండి.వ్యాపారులు మరింత కష్టపడాలి.


ABP Desam


మిథున రాశి
మిథున రాశివారు ఈ వారం డబ్బు, ఆరోగ్యం విషయంలో ప్రత్యేక శ్రద్ధ వహించాల్సి ఉంటుంది. డయాబెటిక్ రోగులైతే మరింత జాగ్రత్త. వ్యాపారం, ఉద్యోగం, చదువు కోసం విదేశాలకు వెళ్లాలనుకుంటే మీ ప్రయత్నాలు విజయవంతమవుతాయి. మీ జీవిత భాగస్వామి తెలివితేటలను చూసి మీరు గర్వపడతారు.


ABP Desam


కర్కాటక రాశి
ఈ వారం ఈ రాశివారు ప్రారంభించిన పనుల్లో కొన్ని ఆటంకాలు ఎదురైనా పూర్తి చేస్తారు. నిర్ణయాలలో ఆచితూచి వ్యవహరించడం మంచిది. ఆర్థికంగా ఇబ్బందులు పడినా అవసరాలకు డబ్బు చేతికందుతుంది. ఆస్తి వివాదాల నుంచి బయటపడతారు. వ్యాపారాల్లో అడుగు ముందుకు వేస్తారు. కోపం తగ్గించుకోండి


ABP Desam


వృశ్చిక రాశి
ఈ రాశి ఉద్యోగులు శత్రువుల పట్ల జాగ్రత్త వహించండి. వారం మధ్యలో ఆఫీసులో కొంత మార్పు రావచ్చు. వైవాహిక జీవితం బావుంటుంది. రాజకీయాలతో ముడిపడిన వ్యక్తులు మరింత కష్టపడాల్సి ఉంటుంది. వ్యాపారులు లాభపడతారు. ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. గృహ నిర్మాణయత్నాలు కలసివస్తాయి.


ABP Desam


ధనుస్సు రాశి
ఈ వారం మీరు కొంత జాగ్రత్తగా ఉండాలి. ఆర్థిక వ్యవహారాల్లో కొంత ఆటంకం ఉంటుంది.ఉద్యోగులు తమ లక్ష్యాలను చేరుకునేందుకు మరింత కష్టపడాల్సి ఉంటుంది. పెట్టుబడిదారులకు కూడా కొంత అసంతృప్తి తప్పదు. జీవిత భాగస్వామి ఆరోగ్యం గురించి ఆందోళన ఉంటుంది.


ABP Desam


కుంభ రాశి
ఈ వారం కుంభరాశి వారు ఆకస్మిక సమస్యలను ఎదుర్కోవలసి ఉంటుంది. వైవాహిక జీవితంలో కొన్ని ఇబ్బందులు తప్పవు, అపార్థాలకు దూరంగా ఉండేందుకు ప్రయత్నించండి. క్రీడాకారులు, విద్యార్థులు మరింత కష్టపడాలి. వ్యాపారులు నూతన పెట్టుబుడులు పెట్టేముందు ఆలోచించండి. ఆర్థిక వ్యవహారాలు ఆశాజనకంగా ఉంటాయి


ABP Desam


నోట్: ఆయా రాశిలో ఫలితాలన్నీ ఒక్కరికే వర్తిస్తాయని భావించరాదు. మీ జాతకం, గ్రహస్థితి ఆధారంగా కూడా మారుతాయి. వ్యక్తిగత వివరాల కోసం జ్యోతిష్య పండితులను సంప్రదించగలరు


ABP Desam


(Images Credit: freepik)