జనవరి 9 నుంచి 15 వారఫలాలు: ఈ వారం ఈ రాశులవారికి అదృష్టం, ఆనందం



వృషభ రాశి
ఈ వారం వృషభరాశివారికి అనుకూల సమయం. ఆనందంగా ఉంటారు. అవివాహితులకు సంబంధాలు కుదురుతాయి. ఆర్థిక పరిస్థితి బావుంటుంది..అదే సమయంలో ఖర్చులు పెరుగుతాయి. కోపాన్ని అదుపులో ఉంచుకోవడం మంచిది. చదువు విషయంలో పిల్లలు కొంత ఆందోళన చెందుతారు. ఉద్యోగులకు శుభసమయం.



సింహ రాశి
ఈ వారం సింహరాశివారి ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. అప్పుల బాధలు తొలగిపోతాయి. వ్యాపారంలో లాభాలొస్తాయి. ఉద్యోగం మారాలనుకుంటే తొందరపడొద్దు. పెళ్లి సంబంధాలు కుదుర్చునేవారు జాగ్రత్తగా ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి. పని భారం, ఒత్తిడి ఉంటుంది. ఆరోగ్యం జాగ్రత్త



కన్యా రాశి
ఈవారం ప్రత్యేకంగా ఉంటుంది. ఈ వారం మీకు కెరీర్ పరంగా మంచిరోజు. ఉద్యోగులు కొత్త ఆలోచనలతో బాస్ ని మెప్పిస్తారు. కార్యాలయంలో మీ బాధ్యతలు పెరుగుతాయి. జీవిత భాగస్వామి నుంచి పూర్తి మద్దతు లభిస్తుంది. ఆర్థిక ఇబ్బందులను కొంతవరకూ అధిగమిస్తారు. తోబుట్టువులతో సంబంధాలు దెబ్బతింటాయి.



తులా రాశి
ఈ వారం తులారాశివారికి చాలా ప్రత్యేకంగా ఉంటుంది. ఆర్థిక లాభాలకు అవకాశం ఉంది. వ్యాపారంలో నూతన ఒప్పందాలు కుదుర్చుకుంటారు. వ్యసనాలకు దరంగా ఉండండి. వినోదరంగంలో ఉన్నవారికి అనుకూల సమయం. వైవాహిక జీవితంలో చాలా కాలంగా ఉన్న సమస్య పరిష్కారమవుతుంది.



మకర రాశి
మీ రాశిలో శని సంచరించే ఆఖరి వారం మీకు అన్నీ సానుకూల ఫలితాలే ఉన్నాయి. ఆర్థిక సంబంధిత విషయాలలో విజయం పొందవచ్చు. పెద్దల నుంచి ఆస్తులు పొందే అవకాశం ఉంది. విదేశాల్లో చదువుతున్న విద్యార్థులు విజయం సాధిస్తారు. ఒత్తిడి తక్కువగా ఉంటుంది. ఉద్యోగంలో మార్పు రావచ్చు.



మీన రాశి
2023 జనవరి 9 నుంచి 15 వరకు సమయం మీకు ముఖ్యమైనది. ఈ వారం మీ మనసు సంతోషంగా ఉంటుంది. ఉద్యోగులు, వ్యాపారులకు అనుకూల సమయం. ప్రేమికులు పెళ్లిదిశగా తమ బంధాన్ని తీసుకెళ్లవచ్చు. భూమి, భవనం, వాహనం కొనుగోలు గురించి ఆలోచించవచ్చు. ఆర్థిక లావాదేవీలు సంతృప్తికరంగా ఉంటాయి.



నోట్: ఆయా రాశిలో ఫలితాలన్నీ ఒక్కరికే వర్తిస్తాయని భావించరాదు. మీ జాతకం, గ్రహస్థితి ఆధారంగా కూడా మారుతాయి. వ్యక్తిగత వివరాల కోసం జ్యోతిష్య పండితులను సంప్రదించగలరు



(Images Credit: freepik)