ఈ రాశులవారు భావోద్వేగానికి లోనై నిర్ణయాలు తీసుకోవద్దు
మేష రాశి మీ ప్రస్తుత సంబంధాల గురించి మీలో కొన్ని సందేహాలు వస్తాయి. మీ వ్యక్తిగత భావాలను పక్కన పెట్టి...వాస్తవంగా ఆలోచించండి. ఒంటరిగా ఉండేవారు కొంత అసహన పరిస్థితుల ఎదుర్కొంటారు
వృషభ రాశి ఈ రాశివారి ప్రేమ జీవితంలో ఇబ్బందులు తలెత్తవచ్చు. రహస్య వ్యాధితో బాధపడే అవకాశం ఉంది. సాన్నిహిత్యం విషయంలో జాగ్రత్తగా ఉండండి.
మిథున రాశి ఈ రోజు మీరు మీ ప్రేమ జీవితానికి సంబంధించి కఠినమైన నిర్ణయం తీసుకునే మానసిక స్థితిలో ఉంటారు. మీ భావాలను మీరు గౌరవించండి. మీ మనసు చెప్పేది వినండి. ఒంటరి పక్షులు జంటన వెతుక్కోవడంలో సక్సెస్ అవుతారు.
కర్కాటక రాశి సింగిల్స్ కి ఈ రోజు ఉత్తేజకరమైన రోజు. ఈ రాశి వారి ప్రేమ, వైవాహిక జీవితంలో ఆనందం ఉంటుంది. స్నేహితులకు సహాయం చేయడంలో కొన్ని ప్రత్యేక ప్రణాళికలు వేస్తారు.
సింహ రాశి ఈ రోజు మీ ఆలోచనలు తప్పుదారి మళ్లుతాయి. మిమ్మల్ని మీరు నియంత్రించుకోవడం మంచిది. అర్థం చేసుకునే భాగస్వామిని పొందాలనే ఒంటరివారి కోరిక నెరవేరుతుంది.
కన్యా రాశి మీ ప్రేమ జీవితానికి కొంత శ్రద్ధ అవసరం. సానుకూల ఆలోచనతో ఉండండి. మీ జీవితం మీరు కోరుకున్న విధంగా మలుచుకునేందుకు ఇదే మంచిసమయం.
తులా రాశి ఈ రోజు మీరు మీ మాజీ ప్రేమికులను కలవాల్సి వస్తుంది...ఆ విషయంలో జీవిత భాగస్వామితో గందరగోళంగా ఉంటుంది. ప్రేమికులకు సంతోషకరమైన రోజు. అవివాహితులకు వివాహ సూచనలున్నాయి.
వృశ్చిక రాశి ఈ రోజు మీ భాగస్వామితో ఎక్కడికైనా వెళ్లేందుకు ప్లాన్ చేసుకుంటారు. మీ సంబంధంలో సాన్నిహిత్యం పెరుగుతుంది. ఒంటరివారు తమ వివాహానికి సంబంధించి ఏదైనా మ్యారేజ్ బ్యూరోను సంప్రదిస్తారు.
ధనుస్సు రాశి పాత సంబంధాలను విడిచిపెట్టి ముందుకు సాగడానికి ఇదే మంచి సమయం. ఇతరుల ఆనందం, బాధ గురించి మీరు కొంచెం ఆలోచించాలి. ప్రేమ జీవితం సంతోషంగా ప్రారంభమవుతుంది. అవివాహితుల అన్వేషణ పూర్తవుతుంది.
మకర రాశి ఈ రోజు వివాహితులు ఆనందంగా ఉంటారు. ప్రేమికులు భవిష్యత్ ప్రణాళికలు వేసుకోవడంలో బిజీగా ఉంటారు. వివాదాలకు దూరంగా ఉంటే..కుటంబంలో ప్రశాంతత నెలకొంటుంది.
కుంభ రాశి ఈ రోజు మీ మానసిక స్థితి చాలా చిరాకుగా ఉంటుంది. భాగస్వామిపై మీ చిరాకు ప్రదర్శించవద్దు. మీ సంబంధాల్లో చేదు ఉండే అవకాశం ఉంది. ఒంటరిగా ఉండేవారు తమ ప్రేమ జీవితం గురించి కొన్ని కఠిన నిర్ణయాలు తీసుకోవాల్సి రావొచ్చు.
మీన రాశి ఈ రోజు ఇంట్లో సంతోషకరమైన వాతావరణం ఉంటుంది. ప్రేమ జీవితం గురించి మరింత ఉత్సాహం ఉంటుంది. వివాహితుల చిన్న చిన్న వివాదాలకు దూరంగా ఉండాలి