Guppedanta Manasu December 23rd Update: రిషిధార ప్రేమ ప్రయాణం, గోలి సోడా - తాటితేగల గురించి రిషికి వసు స్పెషల్ క్లాస్!
Guppedantha Manasu December 23rd Update: గుప్పెడంతమనసు సీరియల్ ఇంట్రెస్టింగ్ గా సాగుతోంది. ఈ రోజు ఎపిసోడ్ లో ఏం జరిగిందంటే...
గుప్పెడంత మనసు డిసెంబరు 23 ఎపిసోడ్ ( Guppedantha Manasu December 23rd Update Today Episode 641)
రిషిధార ప్రయాణం సాగుతోంది...
కారు రోడ్డుపక్కన ఆపిన రిషి..వాటర్ కోసం చూసుకుంటాడు... బాటిల్ లో నీళ్లు లేకపోవడంతో షాప్స్ వెతుక్కుంటారు. రిషి తొడిగిన రింగు చూసుకుని మురిసిపోతూ రిషిని చూస్తుంది. ఎందుకలా చూస్తున్నావ్ అంటే..నా రిషి సార్ నా ఇష్టం అంటే.. రిషి కూడా అదే సమాధానం చెబుతాడు. ఆ తర్వాత మంచినీళ్లకోసం ఓ షాప్ దగ్గర ఆపుతారు. నువ్వుకూడా దిగు అని రిషి అడిగితే.. నాకేమైనా కొనిపెడతాను అంటేనే వస్తానంటుంది వసుధార. పర్స్ తీసి ఇచ్చేసి ఈ షాప్ మొత్తం కొనుక్కో అనగానే పర్సనే నావాడు అయినప్పుడు ఇక పర్స్ ఎందుకు సార్ అని నవ్వుతూ కారు దిగి వెళుతుంది. వాటర్ బాటిల్ కొనుక్కున్న తర్వాత గోలీషోడా చూసి ఇది తాగుదాం అంటూ..దాని చరిత్ర మొదలెడుతుంది...ఆ తర్వాత షోడా ఎలాకొట్టాలి, ఎలా తాగాలో క్లాస్ తీసుకుంటుంది...
ఆ తర్వాత తాటితేగలు చూసి మురిసిపోయి మరో క్లాస్ వేస్తుంది....ఇక చేసేది లేక ఇక చరిత్ర ఆపు నేను అన్నీ తింటానంటాడు రిషి.. పల్లీలు, మొక్కజొన్నలు, కొబ్బరిబొండాలు, పానీపూరీ, మిర్చిబజ్జి, పానీపూరీ, గోలీషోడా, తేగలు..ఇలా లెక్కపెడితే నా వేళ్లు అయిపోయాయంటూ సెటైర్స్ వేస్తాడు. ప్రపంచంలో ఉన్న అన్నీ నాతో తినిపిస్తావా అప్పటివరకూ నీకు ప్రశాంతత, మనశ్సాంతి ఉండదా అంటాడు రిషి...ఆ తర్వాత మళ్లీ ప్రయాణం సాగిస్తారు... సార్ సార్ జోరుగా పోనివ్వొద్దు.. నెమ్మదిగా వెళుతూ అన్నీ చూసి వెళదాం అంటుంది..వాళ్ల ఊరు ఎంట్రన్స్ దగ్గర ఆపించి బోర్డు చూపించి ఇంకొంచెం సేపు మురుసిపోతుంది. అక్కడ సెల్ఫీలతో సందడి చేస్తుంది వసుధార...ఎప్పటిలా రిషి వసుని చూసి మురిసిపోతుంటాడు... చెరువుగట్టు,రాముడి గుడి, అడవి అంటూ గలగలా మాట్లాడుతుంటుంది..మళ్లీ కార్లో బయలుదేరుతారు...
Also Read: చారుశీలకు షాకిచ్చిన కార్తీక్, శౌర్యను చూసి పరుగుతీసిన దీప, అదే ఊరిలో సౌందర్య!
అటు దేవయాని...రిషి వెళ్లడం గురించి తలుచుకుని రగిలిపోతుంటుంది. కాఫీ తీసుకొచ్చి ఇస్తుంది ధరణి... అది తాగి నేను టీ తాగుదాం అనుకున్నానంటుంది దేవయాని. అవునా మీ మనసులో మాటలు నాకెలా తెలుస్తాయి అత్తయ్యగారు.. అన్నిసార్లూ మనం అనుకున్నవి జరగవు కదా అని సెటైర్ వేస్తుంది. నువ్వు కావాలని మాట్లాడుతున్నావో లేదో నాకు తెలియదు కానీ ఈ కాఫీకప్పు తీసుకుని వెంటనే వెళ్లిపో అని ఫైర్ అవుతుంది. ఎందుకింత చిరాగ్గా ఉన్నారని అడిగితే..మరింత చిరాగ్గా మాట్లాడుతుంది దేవయాని. మరి టీ తీసుకురానా అని అడిగితే నాకేం వద్దు..నువ్వు సైలెంట్ గా చిత్రవధ చేస్తున్నావ్ వెళ్లిపో అంటుంది...
దేవయాని: వసుధార ఎందుకు ఒక్కతే వెళ్లింది..పద్దతిగా వెళ్లాలని ఆలోచించిందా, గౌరవంగా పిలవాలి అనుకుందా.. లేదా నేను అనుకున్న ప్లాన్ వసుధార పసిగట్టిందా..అయినా మనసులో అనుకున్న ప్లాన్ వసుధారకి ఎలా తెలుస్తుందిలే..నేనంటే ఏంటో త్వరోల తెలిసేలా చేస్తాను అనుకుంటుంది...
Also Read: MD అంటే మై డార్లింగ్ - రిషికి వసు ప్రేమోగ్రాఫ్, రొమాంటిక్ గా సాగిన ఎపిసోడ్
సార్ ఈ అరటిపండు తింటారా అని వసుధార అడగ్గానే..రెండు రోజుల వరకూ నన్ను ఏమీ అడగొద్దు అంటాడు. ఇందులో గొప్పతనం అంటూ వసుధార మొదలెట్టగానే..అరటి ఆకునుంచి మొదలు పెట్టి అన్నీ లిస్ట్ చెప్పేసిన రిషి ఇంకా ఏమైనా ఉన్నాయా అనగానే..అరటి పీచు అంటూ మొదలెడుతుంది వసుధార..అమ్మా తల్లీ నువ్వు తిను అంటాడు. అరటిపండును ఆస్వాదిస్తూ బావుంది సార్ అంటుంది..అసలు బాలేదని ఎప్పడైనా అన్నావా నువ్వు అని సెటైర్ వేస్తాడు రిషి...ఊర్లోకి ఎంటరైన వెంటనే తను చదువుకున్న కాలేజ్ చూపిస్తుంది. కాజేలీలో అరటిచెట్టు ఏమైనా నాటావా... అక్కడకు వెళితే నాతో అవి తినిపిస్తావా ఏంటి అంటాడు. ఆ తర్వాత ఇద్దరూ చేయి చేయి పట్టుకుని కాలేజీ మొత్తం తిరుగుతారు...
ఇలా మనం చిన్నప్పుడు చదువుకున్న స్కూల్, కాలేజీని చాలా ఏళ్ల తర్వాత చూస్తే బావుంటుంది కదా అని రిషి అంటే.. ఈ కాలేజీలో ఎన్నో జ్ఞాపకాలు అంటూ తన కలలు, జీవితం గురించి చెబుతుంది.. నా జీవితంలో అద్భుతమైన ములుపు జగతి మేడం కలవడం అనగానే..రిషి చేయివదిలేస్తాడు...అప్పటివరకూ యాక్టివ్ గా ఉన్న రిషి..డల్ అయిపోతాడు.. జగతి మేడంపై మీకున్న ద్వేషం పోదా సార్ అని అడుగుతుంది..వసుధారా కోపం పోతుందేమో కానీ ద్వేషం అన్నావ్ చూడు అది ద్వేషం కాదు నా పెయిన్ ...కోపాలను, ద్వేషాలను కాలం కరిగిస్తుంది కానీ బాధను కాలం తగ్గించదు అంటాడు... జగతి మేడం మా డాడ్ కి ప్రాణం, డాడ్ అంటే నాకు ప్రాణం..డాడ్ ఎప్పుడ సంతోషంగా ఉండాలన్నదే నాకోరిక.. మేడంపై నాకు కృతజ్ఞత ఉంది..ఎందుకంటే ఓ వైపు డాడ్ విషయంలో, ఇంకోవైపు..ఈ ప్రేమబంధం పరోక్షంగా జగతిమేడం ద్వారానే వచ్చింది కాబట్టి...ఓ బంధాన్ని వద్దనుకుంది..ఇంకో బంధాన్ని కలిపింది..ఈ విషయంలో మేడం రుణం తీర్చుకోలేను..ఆ విషయంలో మనసు మార్చుకోలేను అని మరోసారి క్లారిటీ ఇస్తాడు రిషి...జగతి ఇచ్చిన నల్లపూసల గొలుసు బాక్స్ గుర్తొచ్చి వసుధారకి ఇస్తాడు రిషి...ఏంటిసార్ అని వసుధార అడిగితే.. నేను చూడలేదని చెబుతాడు రిషి...