By: ABP Desam | Updated at : 23 Dec 2022 09:48 AM (IST)
Edited By: RamaLakshmibai
Karthika Deeppam December 23rd Update Episode 1543 (Image Credit: Star Maa/Hot Star)
Karthika Deepam December 23rd Episode 1543 (కార్తీకదీపం డిసెంబరు 23ఎపిసోడ్)
శౌర్య చదువుకుంటుండగా చంద్రమ్మ వచ్చి స్కూల్ కి వెళ్లి చదువుకోవచ్చు కదా బంగారం అనడంతో లేదు పిన్ని నేను స్కూల్ కి వెళ్తే అమ్మానాన్నలను ఎవరు వెతుకుతారు. మొన్న నువ్వు స్కూల్ కి వెళ్ళమని చెప్పినప్పుడు నేను బాబాయి ఇద్దరం స్కూల్ ప్రిన్సిపాల్ తో మాట్లాడి వచ్చాము. ఇంటి దగ్గరే చదువుకుని పరీక్షలు రాస్తానని చెప్పి వచ్చానంటుంది. పెద్ద స్కూల్లో చదువుకోవాల్సిన నువ్వు అని అంటుండగా సౌర్య కోప్పడి పదేపదే మీరు వేరు నేను వేరు అని మాట్లాడకండి పిన్ని అని అంటుంది. ఇంతలో ఇంద్రుడు అక్కడికి వచ్చి బంగారం నీకు దెబ్బ తగిలింది కదా వెళ్లి ఈ టెస్ట్ లు చేయించుకోవాలి పద అంటాడు. టెస్టులు రాసిన చీటీ చూసిన శౌర్య... దీనిపై రౌడీ అని రాసిఉంది అలా పిలిచేది కేవలం మానాన్నే అని నిలదీస్తుంది. డాక్టరమ్మ రాసిచ్చిందని ఇంద్రుడు కవర్ చేసినా కానీ శౌర్య నిలదీస్తుంది. అప్పుడు ఇంద్రుడు...ఆ రోజు ట్రీట్మెంట్ అప్పుడు మా నాన్న రౌడీ అనిపిలుస్తారని చారుశీలతో అన్న మాటలు గుర్తుచేసుకుని... మానాన్న అలా పిలుస్తారని నువ్వే చెప్పావుకదా అని గుర్తుచేస్తాడు. అయినా కానీ శౌర్య..ఇది మానాన్న రైటింగే అని పట్టుబడుతుంది.
Also Read: MD అంటే మై డార్లింగ్ - రిషికి వసు ప్రేమోగ్రాఫ్, రొమాంటిక్ గా సాగిన ఎపిసోడ్
మరోవైపు దీప..కార్తీక్ చేసిన పని తలుచుకుని బాధపడుతుంటుంది. ఇన్ని రోజులు నేను వెతుకుతుంటే నన్ను వెతకనివ్వకుండా అడ్డుకున్నారా అనుకుని..ఇంద్రుడు తప్పించుకున్న సందర్భాలు గుర్తుచేసుకుంటుంది. ఏమైందమ్మా అని అడుగుతుంది పండరి. ఇంతలో అక్కడి కార్తీక్, చారుశీల నవ్వుకుంటూ వస్తారు.
కార్తీక్: నిన్న ఇంద్రుడు కనిపించాడు చారుశీల పట్టుకుందాం అనుకునే లోపే తప్పించుకొని వెళ్ళిపోయాడు
దీప: ఎక్కడెక్కడ వెతికారు డాక్టర్ బాబు ఇంద్రుడు కోసం నిన్న మనం హోటల్ దగ్గరికి వెళ్ళాము కదా అక్కడ కూడా వెతికారా
కార్తీక్: అవును దీప
దీప: నేను కూడా హోటల్ దగ్గరికి వెళ్లాను డాక్టర్ బాబు ఎదురుగా నా డాక్టర్ బాబు వాడికి డబ్బులు ఇస్తూ కనిపించారు అనడంతో కార్తీక్ షాక్ అవుతాడు. ఒకటి రెండు సార్లు నేను కూడా చెక్ చేసుకున్నాను నా కళ్ళు ఏమన్నా మోసం చేస్తున్నాయా అని అనుకున్నాను.. కానీ నా డాక్టర్ బాబే నన్ను మోసం చేస్తున్నాడని నాకు అర్థం అయింది .నా బిడ్డను ఎందుకు నాకు దూరం చేస్తున్నారు ..ఎందుకు నన్ను అందరికి దూరం చేయాలని చూస్తున్నారు .ఎందుకు ఇంద్రుడు తెలిసి కూడా తెలియనట్టుగా వాడు ఎక్కడున్నారో వెతుకునట్టుగా నటిస్తున్నారు .నన్ను నా కూతురిని విడదీయాలి అన్న ఆలోచన మీకు ఎలా వచ్చిందని ఏడుస్తుంది. నా బిడ్డ కోసం నేను అంతలా ఏడుస్తూ తాపత్రయపడుతుంటే మీకు సంతోషంగా ఉందా . కార్తీక్ మౌనంగా ఉండడంతో కాలర్ పట్టుకుని నిలదీస్తుంది దీప
కార్తీక్: అవును అని గట్టిగా అరుస్తాడు...దీప షాక్ అవుతుంది. నీకు ఇంద్రుడు కనిపించకుండా నేనే వాడిని దాచి పెడుతూ మీకు అబద్ధం చెప్పాను. నువ్వే కాదు నేను కూడా అందరికీ దూరంగా ఉంటున్నాను
దీప: ఎందుకు డాక్టర్ బాబు నేను మీకు ఏం అన్యాయం చేశాను ...ఎందుకు
కార్తీక్: ఎందుకంటే నేను ఎంతో కాలం బతకను కాబట్టి అని అబద్ధం చెబుతాడు కార్తీక్.
ఏంటి కార్తీక్ ఇలాంటి ట్విస్ట్ ఇచ్చాడు అనుకుంటుంది చారుశీల
దీప: ఏం మాట్లాడుతున్నారు డాక్టర్ బాబు మీకు ఏమైంది ఎందుకిలా మాట్లాడుతున్నారు
కార్తీక్: నేను ఎంతో కాలం బతకను అని తెలిసింది దీప అందుకే నిన్ను ఎవరి దగ్గరికి తీసుకెళ్లలేదు. నేను లేను అన్న ఆలోచనతోనే వాళ్ళందరిని బతకనివ్వాలి అని నేను నిన్ను ఎవరి దగ్గరికి తీసుకెళ్లలేదు . నిజం చెప్తే నువ్వు తట్టుకోలేవని నేను చెప్పలేదు దీప గుండె బరువెక్కిలా ఏడుస్తూ ఉంటుంది.
దీప: చారుశీల ఏదో ఒకటి చేయండి డాక్టర్ బాబును బతికించండి ఆయన లేకపోతే నేను బతకలేను అని ఏడుస్తూ మాట్లాడుతుంది.
Also Read: ఎంతోకాలం బతకనని షాకిచ్చిన కార్తీక్, రోగం దీపకా-కార్తీక్ కా అయోమయంలో చారుశీల!
జరిగిన విషయాలన్నీ తలుచుకుని సౌందర్య ఆలోచిస్తూ ఉంటుంది. ఇంతలోనే అంజి అక్కడికి రావడంతో మనం రేపు ఊరికి వెళ్తున్నాము రెడీగా ఉండు అని అంటుంది సౌందర్య. అక్కడ వెతికాం కదా మేడం అనడంతో హాస్పిటల్స్ గుళ్ళు మాత్రమే కాదు ఇంకా ఊరు చాలా ఉంది వెళ్లి వెతుకుదాం అంటుంది. ఇప్పుడు ఆనంద్ రావు నా మనవరాలు అక్కడ నెలల కొద్ది వెతుకుతూనే ఉంది దానికి కనిపించలేదు కానీ మీ మేడంకి రెండు రోజుల్లోనే కనిపిస్తారా అని అంటాడు. నీకు ఆ ఊరు బాగా తెలుసు అని చెప్పావు కదా ఆ ఊర్లో ఒక మంచి ఇల్లు చూడు ఈసారి అక్కడ నుంచి రావడం అంటూ జరిగితే దీప వాళ్లని తీసుకునే వస్తానంటుంది
రేపటి(శనివారం) ఎపిసోడ్ లో
డాక్టర్ బాబు మనల్ని వాళ్లు చూడకూడదు కానీ మనం వాళ్లని చూడొచ్చుకదా..వాళ్ల దగ్గరకు వెళతానని గొడవ చేయను ఒక్కసారి తీసుకెళ్లండి అని అడుగుతుంది దీప.. కార్తీక్ తీసుకెళ్లి శౌర్యని చూపిస్తాడు...నా బిడ్డను నేను తెచ్చుకుంటానంటూ కారు దిగుతుంది దీప...శౌర్య చూసిందో లేదో శనివారం ఎపిసోడ్ లో తెలుస్తుంది...
Ennenno Janmalabandham February 1st: భ్రమరాంబికకి వార్నింగ్ ఇచ్చిన మాళవిక- వేద మాటలకు బాధ పడిన యష్
Director Atlee: తండ్రయిన అట్లీ, పండంటి బాబు పుట్టినట్లు వెల్లడి
Thalapathy 67 Update: ‘దళపతి 67‘ నుంచి అదిరిపోయే అప్ డేట్, కీ రోల్లో సంజయ్ దత్, హీరోయిన్గా త్రిష
Urfi Javed On Kangana: ‘పఠాన్’పై ముద్దుగుమ్మల ఫైట్ - నీలో స్వచ్ఛతా, దైవత్వం ఉన్నాయంటూ ఉర్ఫీపై కంగనా కామెంట్స్
Nagababu On Jabardasth: వారిని నేను రమ్మనలేదు, ఎవరి రిస్క్ వాళ్లదే: ‘జబర్దస్త్’ రి-ఎంట్రీపై నాగబాబు కామెంట్స్
Etala Vs Kousik Reddy : ఈటలకు ప్రత్యర్థిని మార్చేసిన బీఆర్ఎస్ - పాత శత్రువు కొత్తగా బరిలోకి ! వర్కవుట్ అవుతుందా ?
ఉదయం 11 గంటలకు పార్లమెంట్ ముందుకు బడ్జెట్ 2023- పూర్తి షెడ్యూల్ ఇదే!
Stocks to watch 01 February 2023: ఇవాళ్టి ట్రేడ్లో చూడాల్సిన స్టాక్స్ ఇవి - ఫోకస్లో Adani Enterprises, Sun Pharma
కోటంరెడ్డి ఫోన్లు మేం ట్యాప్ చేయలేదు, కానీ తర్వాత బాధపడతాడు: మాజీ మంత్రి బాలినేని