అన్వేషించండి

Karthika Deepam December 22nd Update: ఎంతోకాలం బతకనని షాకిచ్చిన కార్తీక్, రోగం దీపకా-కార్తీక్ కా అయోమయంలో చారుశీల!

కార్తీకదీపం డిసెంబరు 22 ఎపిసోడ్: టీవీ ప్రేక్షకుల్ని మెప్పిస్తోన్న ‘కార్తీకదీపం’ సీరియల్ మలుపులు తిరుగుతోంది. కార్తీక్ కు గతం గుర్తుకురావడంతో కథ ఇంట్రెస్టింగ్ గా సాగుతోంది.

Karthika Deepam  December 22st  Episode 1542 (కార్తీకదీపం డిసెంబరు 22ఎపిసోడ్)

ఇంద్రుడు తప్పించుకుని వెళ్లిపోవడంతో దీప బాధపడుతుంది. ధైర్యం చెప్పిన కార్తీక్ నువ్వు ఇంటికివెళ్లు నేను చూసుకుంటాలే అని చెప్పి పంపించేసి..మళ్లీ హోటల్ దగ్గరకు వెళతాడు. అక్కడ ఇంద్రుడు ఎదురుచూస్తుంటాడు...
ఇంద్రుడు: మీరు బతికిఉన్నప్పటికీ ఇటు బిడ్డకు, అటు తల్లిదండ్రులకు ఎందుకు దూరంగా ఉంటున్నారు
కార్తీక్: దీప పరిస్థితి మొత్తం వివరించి...ఇలాంటి పరిస్థితుల్లో దీపను ఇంటికి తీసుకెళ్లలేను. మేం దొరికేవరకూ శౌర్య ఇంటికి వెళ్లదు
ఇంద్రుడు: మీకు ఆ విషయం చెబుదామనే పిలిచాను సార్..మీ అమ్మగారు వచ్చి అడిగినా శౌర్య వెళ్లనంది
దీప కోలుకుంటే కానీ పరిష్కారం లేదంటూ కార్తీక్ అక్కడకు వెళ్లిపోతాడు...

Also Read: వసు తండ్రిని ఎదుర్కొనేందుకు బయలుదేరిన రిషి, టెన్షన్లో జగతి మహేంద్ర!

సౌందర్య-ఆనందరావు: ఇంద్రుడు అన్నమాటలు తలుచుకుని సౌందర్య అనుమానపడుతుంది. అక్కడి పరిస్థితులు అనుమానంగా ఉన్నాయి. కొన్నిరోజులు ఉంచండి చాలు అని అడుగుతున్నారంటే ఈ  కొన్నిరోజుల్లో ఏం జరగబోతోంది..అని మాట్లాడుకుంటారు సౌందర్య-ఆనందరావు. రోషిణి మేడంకికాల్ చేసి మోనిత ఏమైనా చెప్పిందా అని కనుక్కుంటాను అంటుంది సౌందర్య. ఏమైనా చెప్పి ఉంటే మేడం కాల్ చేసేవారుకదా అంటాడు ఆనందరావు. మోనిత  ఎప్పుడు ఏం చేస్తుందో తెలియదు...తను లోపల ఉన్నా బయట వేరేవారితో ఆడిస్తుందేమో...ఇంద్రుడు మోనిత మనిషేనేమో అని డౌట్ పడుతుంది సౌందర్య. మొత్తం జరిగినదంతా చూస్తుంటే కార్తీక్-దీప బతికేఉన్నారనిపిస్తోంది అనుకుంటారు..

దీప-పండరి: మరోవైపు దీప..ఇంద్రుడుతప్పించుకుని వెళ్లడం చూసి బాధపడుతుంది. అక్కడకు జ్యూస్ తీసుకొచ్చి ఇచ్చిన పండరితో.. ఇంద్రుడు కనిపించిన విషయం చెబుతుంది దీప.నువ్వు పట్టుకోవాలి అనుకుంటున్నావు...నీ భర్త బిడ్డ నీ దగ్గరకు రాకూడదు అనుకుంటున్నారు ఈ విషయం నీకెలా చెప్పాలి దీపమ్మా అనుకుంటుంది. రేపు ఉదయం వెళ్లి వెతుకుదాం పండరి అని దీప అంటే..సార్ తో కలసి వెళ్లండమ్మా అంటుంది.. తనకి ఇష్టం లేదనిపిస్తోంది పండరి అని మనసులో మాట బయటపెడుతుంది దీప. 

చారుశీల-కార్తీక్ అక్కడకు వస్తారు. తొందరగా తినేస్తే ఇంజెక్షన్ చేయాలి అంటాడు  కార్తీక్. నాకేం కాలేదని అన్నయ్య చెబుతుంటే మీరేంటి మందుల మీద మందులు ఇస్తుననారని అడుగుతుంది. 
చారుశీల: రిపోర్టులు ఎవరికైనా చూపిస్తోందా అనుకుంటూ అయినా నువ్వు కార్తీక్ ను నమ్మడం లేదా
దీప: అవును నమ్మడం లేదు..శౌర్యని వెతకడం లేదు.. ఇంద్రుడిని పట్టుకోవడం లేదు..
కార్తీక్: నేను వెతుకుతూనే ఉన్నాను..నన్ను తప్పుగా అనుకుంటే ఎలా
చారుశీల: నువ్వు కార్తీక్ పై నమ్మకం కోల్పోవాలి..ఇంకా కుంగిపోవాలి.. అప్పుడే మృత్యువుకి దగ్గరవుతావు
దీప: శౌర్య సంగతి సరే కానీ..మరి అత్తయ్య, మావయ్య దగ్గరకు ఎందుకు తీసుకెళ్లలేదు...అక్కడ మరో బిడ్డ అల్లాడుతోంది. ఎందుకిలా చేస్తున్నారు...అందరకీ దూరంగా ఎందుకు నన్ను ఉంచుతున్నారు..
కార్తీక్: అమ్మావాళ్ల దగ్గరకు తీసుకెళతాను..
దీప: ఇప్పుడే వెళదాం...
కార్తీక్: ఈ రాత్రిపూట ఎక్కడికి వెళదాం..
దీప: ఎవ్వరు చెప్పినా వినను..
చారుశీల: రేపు తీసుకెళతాఅని చెబుతున్నారు కదా నా మాట విను..
దీప:నాకు నమ్మకం లేదు.. ఎందుకిలా వాయిదాలు వేస్తున్నారు.. ఎందుకు అందరికీ దూరంగా ఒంటరిని చేస్తున్నారు...
చారుశీల: వీళ్లిద్దర్నీ భ్రమలో ఉంచి అయిన వాళ్లకి దూరం చేయగలిగాను ఇప్పుడు చేయాల్సింది దీపను ఈ లోకానికి దూరం చేయడమే..చేస్తాను...

Also Read: దీప-కార్తీక్ ను శాశ్వతంగా విడగొట్టేందుకే రిపోర్ట్ మార్చాను, ద్యావుడా! చారుశీల మోనిత మనిషి!

అటు నిద్రలో శౌర్య ఉలిక్కిపడి లేస్తుంది... అమ్మకు ఒంట్లో బాలేనట్టు కలొచ్చింది..నిజంగా అమ్మకు ఆరోగ్యం బావోదు పిన్నీ అయినా పనిచేస్తూనే ఉంటుంది అని బాధపడుతుంది. మీ నాన్న డాక్టరే కదమ్మా ఎందుకు భయం అని సర్దిచెబుతారు ఇంద్రుడు-చంద్రమ్మ. మీ అమ్మకు ఏం కాదు..మీ నాన్నపక్కనే ఉన్నాడు కదా అంటాడు ఇంద్రుడు... ఏంటి నువ్వేమైనా చూశావా అని శౌర్య నిలదీస్తుంది...ఉంటారుకదా అని చెబుతున్నానని కవర్ చేస్తారు ఇంద్రుడు. నా దగ్గర మీరు ఏదో దాస్తున్నారని అనుమానం ఉందంటుంది శౌర్య...

ఇంద్రుడిని వెతికేందుకు వెళ్లిన దీప.. తనని ఎలాగైనా పట్టుకోవాలి. నిన్న హోటల్ దగ్గర కనిపించాడు కదా..అక్కడకు వెళ్లి అడిగి వాళ్లకు నా ఫోన్ నంబర్ ఇస్తే అప్పుడు దొరుకుతాడు అనుకుంటుంది. అదే హోటల్లో కార్తీక్..ఇంద్రుడితో మాట్లాడుతూ ఉంటాడు... శౌర్యకి కొన్ని టెస్టులు చేయించాలని చెబుతాడు. ఇంతలో హోటల్ దగ్గరకు వచ్చిన దీప...కార్తీక్-ఇంద్రుడిని చూసి షాక్ అవుతుంది... అక్కడి నుంచి వెళ్లిపోతుంది.

రేపటి(శుక్రవారం) ఎపిసోడ్ లో
నా డాక్టర్ బాబే నన్ను మోసం చేస్తున్నారని అర్థమైంది అంటూ నిలదీస్తుంది దీప.. అవును కావాలనే చేస్తున్నానని బయటపడతాడు కార్తీక్...ఎందుకంటే నేను ఎంతోకాలం బతకను కాబట్టి అని బయటపడతాడు...

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Amaravati Latest News: అమరావతిలో వారం రోజుల్లోనే రోడ్డు నిర్మాణం చేసి, ప్రారంభించిన మంత్రి నారాయణ
అమరావతిలో వారం రోజుల్లోనే రోడ్డు నిర్మాణం చేసి, ప్రారంభించిన మంత్రి నారాయణ
Phone Tapping case: ఫోన్ టాపింగ్ కేసు.. ఐఏఎస్ లతో పాటు ఐపీఎస్‌లను మరోసారి విచారించిన సిట్
ఫోన్ టాపింగ్ కేసు.. ఐఏఎస్ లతో పాటు ఐపీఎస్‌లను మరోసారి విచారించిన సిట్
Bigg Boss 9 Emmanuel: చేజేతులా బిగ్ బాస్ టైటిల్ పోగొట్టుకున్న ఇమ్మానుయేల్.. ఎక్కడ పొరబాటు చేశాడంటే..!
చేజేతులా బిగ్ బాస్ టైటిల్ పోగొట్టుకున్న ఇమ్మానుయేల్.. ఎక్కడ పొరబాటు చేశాడంటే..!
Champion OTT : 'ఛాంపియన్' ఓటీటీ డీల్ ఫిక్స్ - బడ్జెట్ To నాన్ థియేట్రికల్ బిజినెస్ వరకూ...
'ఛాంపియన్' ఓటీటీ డీల్ ఫిక్స్ - బడ్జెట్ To నాన్ థియేట్రికల్ బిజినెస్ వరకూ...

వీడియోలు

India vs Pakistan U19 Asia Cup Final | అండర్ 19 ఆసియా కప్ విజేతగా పాకిస్తాన్
Vaibhav Suryavanshi Shoe Gesture | వివాదంలో వైభవ్ సూర్యవంశీ
Smriti Mandhana Record Ind vs SL | టీ20ల్లో స్మృతి 4 వేల పరుగులు పూర్తి
India vs Sri Lanka T20 Highlights | శ్రీలంకపై భారత్ ఘన విజయం
రైల్వే శాఖ న్యూ ఇయర్ గిఫ్ట్.. కొవ్వూరులో ఆగనున్న ఇకపై ఆ 2 ఎక్స్ ప్రెస్‌లు

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Amaravati Latest News: అమరావతిలో వారం రోజుల్లోనే రోడ్డు నిర్మాణం చేసి, ప్రారంభించిన మంత్రి నారాయణ
అమరావతిలో వారం రోజుల్లోనే రోడ్డు నిర్మాణం చేసి, ప్రారంభించిన మంత్రి నారాయణ
Phone Tapping case: ఫోన్ టాపింగ్ కేసు.. ఐఏఎస్ లతో పాటు ఐపీఎస్‌లను మరోసారి విచారించిన సిట్
ఫోన్ టాపింగ్ కేసు.. ఐఏఎస్ లతో పాటు ఐపీఎస్‌లను మరోసారి విచారించిన సిట్
Bigg Boss 9 Emmanuel: చేజేతులా బిగ్ బాస్ టైటిల్ పోగొట్టుకున్న ఇమ్మానుయేల్.. ఎక్కడ పొరబాటు చేశాడంటే..!
చేజేతులా బిగ్ బాస్ టైటిల్ పోగొట్టుకున్న ఇమ్మానుయేల్.. ఎక్కడ పొరబాటు చేశాడంటే..!
Champion OTT : 'ఛాంపియన్' ఓటీటీ డీల్ ఫిక్స్ - బడ్జెట్ To నాన్ థియేట్రికల్ బిజినెస్ వరకూ...
'ఛాంపియన్' ఓటీటీ డీల్ ఫిక్స్ - బడ్జెట్ To నాన్ థియేట్రికల్ బిజినెస్ వరకూ...
Retirement Planning : రిటైర్మెంట్ ప్లానింగ్ కోసం స్టెప్-అప్ SIPలు బెస్ట్... ఎక్కువ బెనిఫిట్స్ కోసం
రిటైర్మెంట్ ప్లానింగ్ కోసం స్టెప్-అప్ SIPలు బెస్ట్... ఎక్కువ బెనిఫిట్స్ కోసం
Uttam Kumar Reddy: కాళేశ్వరం బ్యారేజీ కూలిపోవడానికి కారణం కేసీఆర్.. రాష్ట్ర ప్రజలకు క్షమాపణ చెప్పాలి: మంత్రి ఉత్తమ్
కాళేశ్వరం బ్యారేజీ కూలిపోవడానికి కారణం కేసీఆర్.. ప్రజలకు క్షమాపణ చెప్పాలి: మంత్రి ఉత్తమ్
iphone 15 Discount: ఐఫోన్ 15 మరింత చౌకగా, ఇక్కడ భారీ తగ్గింపు.. రూ.40 వేలలోపే కొనేయండి
ఐఫోన్ 15 మరింత చౌకగా, ఇక్కడ భారీ తగ్గింపు.. రూ.40 వేలలోపే కొనేయండి
Balakrishna : యంగ్ లుక్‌లో బాలయ్య? - హిస్టారికల్ డ్రామా 'NBK111' కోసం క్రేజీ టైటిల్
యంగ్ లుక్‌లో బాలయ్య? - హిస్టారికల్ డ్రామా 'NBK111' కోసం క్రేజీ టైటిల్
Embed widget