Guppedanta Manasu December 22nd Update: MD అంటే మై డార్లింగ్ - రిషికి వసు ప్రేమోగ్రాఫ్, రొమాంటిక్ గా సాగిన ఎపిసోడ్
Guppedantha Manasu December 22nd Update: గుప్పెడంతమనసు సీరియల్ ఇంట్రెస్టింగ్ గా సాగుతోంది. ఈ రోజు ఎపిసోడ్ లో ఏం జరిగిందంటే...
గుప్పెడంత మనసు డిసెంబరు 22 ఎపిసోడ్ ( Guppedantha Manasu December 22st Update Today Episode 640)
రిషి-వసు కార్లో వెళ్తూ ఉండగా ఇంతలో దేవయానికి ఫోన్ చేసి రిషి నువ్వు వసుధారతో కలిసి వెళ్తున్నావంట నిజమేనా అని అడిగితే అవును అంటాడు. నువ్వు వెంటనే వెనక్కి వచ్చేసేయ్ అనడంతో సారీ పెద్దమ్మ వసుధారని ఒంటరిగా పంపలేను..ఒక్కసారి నిర్ణయం తీసుకున్నాక మార్చుకోలేను అని చెప్పి కాల్ కట్ చేస్తాడు. కోపంతో రగిలిపోతుంది దేవయాని...జగతి ట్రైనింగ్ ఇచ్చింది నువ్వు రిషిని మార్చేశావ్ వసుధారా..నీ ఆటలు ఎలా సాగుతాయో చూస్తా అనుకుంటుంది..
దేవయాని: రిషి వెళతానంటే పంపడమేనా నాకు చెప్పాల్సిన అవసరం లేదా
జగతి: వెళ్లాలనుకున్నాడు మా పర్మిషన్ తీసుకోలేదు వెళుతున్నాను అని చెప్పాడు
దేవయాని: నువ్వు మధ్యలో మాట్లాడకు జగతి..నేను మహేంద్రతో మాట్లాడుతున్నాను రిషి మీద నీకు ఎటువంటి హక్కు లేదు ఈ విషయం నీకు తెలుసు నాకు తెలుసు. వసుధార వాళ్ల నాన్న కోపిష్టి అన్నారు...రిషిని ఆయన అనుమానిస్తే మీకు ఆనందమా.. రిషి వెళతా అన్నప్పుడు నాకు చెప్పాలికదా..మీ అంతట మీరే పెత్తనాలు చేస్తే ఎలా
మహేంద్ర:రిషి చిన్న పిల్లోడు కాదు..తనకు వెళ్లాలి అనిపించింది వెళ్లాడు..ఇందులో మన జోక్యం ఎంతవరకూ ఉండాలో అంతే ఉంటే బావుంటుంది
దేవయాని: నాకు చెప్పి నీతి మాటలు రిషికి చెప్పింటే రిషి ఆగిపోయేవాడు...ఏవండీ ఇక్కడ మాట్లాడరేంటి అని ఫణీంద్రని ఉద్దేశించి అంటుంది
ఫణీంద్ర: మీ వదిన చెప్పేది కూడా కరెక్టే అనిపిస్తోందికదా..
దేవయాని: అనిపించడంకాదు..అక్కడ రిషి అవమానపడేలోగా అందరం కలసి వెళదాం పదండి అని బలవంతంగా ఒప్పించే ప్రయత్నం చేస్తుంది...
జగతి: అక్కయ్యా..రిషి మనకు చెప్పి వెళ్లాడు..రిషి వెళ్లాక ఫోన్ చేస్తానని అప్పుడే రమ్మని చెప్పాడు..ఇప్పుడు అర్థాంతరంగా వెళ్లడం కరెక్ట్ కాదు
దేవయాని: ఏది కరెక్టో ఏది కరెక్ట్ కాదో నువ్వు నాకు చెబుతున్నావా..నిర్ణయాలు తీసుకోవాల్సింది నేనని నువ్వు మర్చిపోతున్నావ్
ఫణీంద్ర: దేవయానీ..జరిగిందేదో జరిగిపోయింది..రిషి కాల్ చేసినప్పుడే వెళదాం...ఇప్పుడు హడావుడిగా వెళ్లాల్సిన అవసరం లేదు..రిషి వద్దన్నాక వెళ్లడంకూడా కరెక్టే కాదేమో..ఆలోచిస్తే వెళ్లకపోవడమే మంచిది అనిపిస్తోంది
దేవయాని: అక్కడ రిషికి ఏదైనా జరగరానిది జరిగితే..
ఫణీంద్ర: రిషికి అలాంటి పరిస్థితులు రాకుండా వసుధార చూసుకుంటుంది..ఇంక ఈ విషయంలో చర్చ అవసరం లేదు రిషి కాల్ చేశాకే వెళదాం అని చెప్పేసి వెళ్లిపోతాడు ఫణీంద్ర...
జగతి మహేంద్ర నవ్వుకుంటారు
Also Read: ఎంతోకాలం బతకనని షాకిచ్చిన కార్తీక్, రోగం దీపకా-కార్తీక్ కా అయోమయంలో చారుశీల!
రిషి- వసుధార ఇద్దరూ కార్లో వెళుత్తూ ఉంటారు..ఓ దగ్గర కారు ఆపేసి ఏంటి వసుధారా ఏమీ మాట్లాడడం లేదు
వసు: సంతోషంతో మాటలు రావడం లేదు సార్..మీతో కలసి మా ఇంటికి వెళుతున్నానంటే పట్టలేని ఆనందంతో ఉన్నాను.
రిషి: మీ ఇంటికి వెళ్ళిన తర్వాత నన్ను ఏమని పరిచయం చేస్తావు
వసు: మా కాలేజీ ఎండీగారు రిషీంద్ర భూషమ్ గారు అని పరిచయం చేస్తాను
రిషి: అంతేనా
వసు: అంతే ఎలా అవుతుంది సార్..ఇంకా బాగా చెప్పాలి కదా..
రిషి: ఏం చెప్పుకుంటావు...ఇప్పుడు నాకు చెప్పు
వసు: ఎందుకులెండి సార్..అప్పుడే చెబుతాను..మీరు కారు పోనియ్యండి
రిషి: నువ్వు చెబితేనే కారు కదులుతుంది...
వసు: మీరు పక్కనే ఉంటే కారే కాదు కారడవి అయినా ఓకే...
రిషి: పొగరు..కారు ఆపినా పర్వాలేదు కానీ చెప్పనంటావ్
వసు: ఇంత గొప్ప ఎండీగారు నా పక్కనుంటే నాకు పొగరు ఉండడంలో తప్పేముంది..ఎస్ ఐయామ్ పొగరు..నాకు గర్వం ఉంది
రిషి: ఇలా ఎదురుమాట్లాడితే ఇంకేం అంటాను..అయినా మా ఇంట్లో నేను ధైర్యంగా ఈ అమ్మాయే నాకు భార్య అని చెప్పానుకదా..మరి నువ్వేం చెబుతావో నాకు చెప్పు వినడానికి నాకు బావుంటుంది కదా
వసు: చెబుతాను కానీ ఓ కండిషన్..నేను మా అమ్మకి మీ గురించి ఏం చెబుతానో చెప్పాలంటే..ఈ ఉంగరం మీరు నాకు పెట్టాలి అంటుంది
విఆర్ అనే అక్షరాలు ఉండే రింగ్ ని రిషి వసుధార చేయికి తొడుగుతాడు. ఉంగరం పెట్టాక రిషి ముద్దుపెడతాడు...
రిషి: ఇప్పుడు చెప్పు మీ ఇంట్లో వాళ్లకు నన్ను ఏమని పరిచయం చేస్తావు
వసుధార: ఒక పెన్ను తీసుకుని..కళ్లు మూసుకోండి అని చెప్పి రిషి చేతిలో ఒకటి రాస్తుంది.
రిషి సార్ మై డార్లింగ్.. ప్రేమతో మీ పొగరు అని రాయడంతో అది చూసి రిషి సంతోషపడతాడు.
అది చూసి మురిసిపోయిన రిషి...ఇప్పుడు మాటిస్తున్నాను వసుధారా ఈ రిషేంద్ర భూషణ్ కి నీపై ప్రేమ ఎప్పుడూ చెక్కుచెదరదు అని అంటాడు. సరే సార్ లేట్ అవుతుంది పదండి అంటుంది.
మరోవైపు జగతి బుక్ చదువుతూ ఉంటుంది...అప్పుడు అక్కడకు వస్తుంది దేవయాని
Also Read: వసు తండ్రిని ఎదుర్కొనేందుకు బయలుదేరిన రిషి, టెన్షన్లో జగతి మహేంద్ర!