Gruhalakshmi May 10th: విక్రమ్ రూడ్ బిహేవియర్ - రాజ్యలక్ష్మి కాళ్ళ మీద పడి క్షమాపణ చెప్పిన దివ్య
లాస్య చేసిన మోసం బయట పడటంతో సీరియల్ ఇంట్రెస్టింగ్ గా సాగుతోంది. ఈరోజు ఎపిసోడ్లో ఏం జరిగిందంటే..
తులసికి లాస్య ఫోన్ చేసి నోటికొచ్చినట్టు మాట్లాడుతుంది. నందు క్షేమం కోరుకుంటున్నావా లేదంటే నందుని కోరుకుంటున్నావా? మనసులో మాట చెప్పేయచ్చు కదా. మా మధ్య దూరాన్ని వాడుకోవడానికి బాగానే ట్రై చేస్తున్నావని లాస్య అంటుంది.
లాస్య: బెయిల్ మీద బయటకి తీసుకురావడానికి బాగానే ఆరాటపడుతున్నావ్ గా
తులసి: అవును ఆరాటపడుతున్నా కానీ అత్తమామలు, నా బిడ్డల బాధ చూడలేక
లాస్య: నువ్వు మా మధ్య నుంచి అడ్డు తప్పుకోకపోతే నందుకి నరకం చూపిస్తా, అత్తారింట్లో నీ కూతురి జీవితం రోజురోజుకీ దుర్భరం చేస్తాను
తులసి: నీ బెదిరింపులకు నేను లొంగను నా కూతుర్ని నేను కాపాడుకుంటాను నందుని బయటకి తీసుకొస్తాను
Also Read: ట్విస్ట్ అదుర్స్, కావ్యని తోసేసి పారిపోయిన స్వప్న- రాహుల్ చెంప పగలగొట్టిన రాజ్
మోహన్ బెయిల్ ఇచ్చి నందుని విడిపిస్తాడు. స్టేషన్ నుంచి రాగానే దివ్య ఏడుస్తూ తండ్రిని కౌగలించుకుంటుంది. లాస్య అక్కడికి వస్తుంది. జైల్లోనే ఉంటానని వీరాలు పోయి వెంటనే బయటకి వచ్చావే అని దెప్పి పొడుస్తుంది. ఒక్కరోజుకి ఇలా గిలగిలాడిపోతే మూడేళ్లు ఉండాల్సి వస్తుంది అప్పుడేం చేస్తావని అంటుంది.
నందు: నీతో కలిసి ఉండటం కంటే జైల్లో ఉండటమే హాయి
లాస్య: జైలు నుంచి బయటకి రాగానే నాతో ఉండకూడదని కలలు కంటున్నావా? నిన్ను వదిలేది లేదు
నందు: నీ తప్పులు బయటకి తీసి నేను ఆడుకుంటాను
దివ్యని తులసి ఇంటికి వెళ్ళమని చెప్తుంది. విక్రమ్ రావడం చూసి రాజ్యలక్ష్మి దిగులు పడుతున్నట్టు నటిస్తుంది. నిన్ను పట్టించుకోని మనిషి గురించి ఎందుకు దిగులు పెట్టుకుని బాధపడుతున్నావాని అంటాడు. కొడుకు కోసమే ఆరాటపడుతున్నానంటూ నటిస్తుంది. అప్పుడే దివ్య వస్తుంది.
విక్రమ్: నిన్న రాత్రి నుంచి దివ్య వల్ల ఇంట్లో ఎవరికి ప్రశాంతత లేదు కేవలం తన వల్లే
తాతయ్య: దివ్య వచ్చేసింది కదా
విక్రమ్: నన్ను పట్టించుకొకపోయినా పరవాలేదు కానీ మా అమ్మ పట్ల నువ్వు చేసింది తప్పుగా అనిపించడం లేదా
దివ్య: నీ ప్రశ్న ఏంటో అర్థం కావడం లేదు నేను చేసిన తప్పు ఏంటి?
బసవయ్య: ఫస్ట్ నైట్ ఏర్పాటు చేస్తే అత్తకి చెప్పకుండా వెళ్ళిపోవడం తప్పు కాదా
సంజయ్: కనీసం అన్నయ్య ఫోన్ చేసినప్పుడైన విషయం చెప్పకపోవడం తప్పు కాదా వదిన
Also Read: తొందరపడిపోతున్న యష్- రెండు రోజుల్లో చిత్రని తనవైపుకి తిప్పుకుంటానన్న అభి
రాజ్యలక్ష్మి: పుట్టింటికి వెళ్లానని చెప్పింది కదా ఎందుకు అందరూ కలిసి ప్రశ్నలు వేసి ఇబ్బంది పెడుతున్నారు
దివ్య: ఏం చేయాలో అర్థం కానీ పరిస్థితుల్లో వెళ్ళాను. అయోమాయంలో చేసిన తప్పే కానీ ఒళ్ళు పొగరుతో చేసినది కాదు
విక్రమ్: ఆ మాట ఫోన్ చేసినప్పుడు చెప్పొచ్చు కదా అమ్మ ఎంత బాధపడిందో. చెప్పకుండా వెళ్లిపోయావు నీకు ఏదైనా జరిగితే పరిస్థితి ఏంటి? నీకోసం అమ్మ ఎంత టెన్షన్ పడిందో తెలుసా అమ్మకి సోరి చెప్పు
దివ్య: నీ నుంచి ఇలాంటి రెస్పాన్స్ వస్తుందని ఊహించలేదు నువ్వు నాకోసం వస్తావని అనుకున్నా కానీ నువ్వు రాలేదు. ఇంట్లో అడుగు పెట్టగానే అడుగుతావని అనుకున్నా అడగలేదు కానీ నన్ను దోషిగా చేసి శిక్ష కూడా వేశావు. నువ్వు గ్రేట్ మొదటి రాత్రి కూడా వదులుకుని పుట్టింటికి వెళ్ళింది నేను ఎంజాయ్ చేయడానికి కాదు మా నాన్నని అరెస్ట్ చేశారని ఫోన్ వచ్చింది. అయోమయంలో నేను పరిగెత్తాను నీకు చెప్పాలని కూడా తోచలేదు. విషయం తెలుసుకోకుండా నువ్వు అందరి మొగుళ్ళలా ప్రవర్తించావు. నీకు కావాల్సింది సోరి చెప్పడమే కదా? నా వల్ల తప్పు జరిగింది మిమ్మల్ని బాధ పెట్టాను నన్ను క్షమించండి. నా స్థానం నీ గుండెల్లో అనుకున్నా కానీ కనీసం నీ మనసులో కూడా నాకు చోటు లేదని తెలిసింది.