Gruhalakshmi March 16th: మాజీ మొగుడు పెళ్ళానికి తాజా పెళ్లిరోజు, ఇదేం కర్మరా బాబు- తలబాదుకుంటున్న లాస్య
వాసుదేవ్ ఎంట్రీతో సీరియల్ ఇంట్రెస్టింగ్ గా సాగుతోంది. ఈరోజు ఎపిసోడ్లో ఏం జరిగిందంటే..
‘మొగుడికి విడాకులు ఇచ్చిన దాన్ని తెచ్చి ఇంట్లో ఉంచుకోవడం ఏంటి? నీ మొగుడు మీద అంత నమ్మకమా? మగాడిని నేను చెప్తున్నా విను కట్టుకున్న పెళ్ళాం ఎంత మంచిది అయినా పొరిగింటి పుల్లకూర రుచి కావాలని అనిపిస్తుంది. నీ మొగుడిని ఆ జాబితాలో వేసుకోవచ్చు. మొహం అమాయకంగా ఉందని నమ్మకు. మొహానికి బుద్ధికి అసలు సంబంధం లేదు. ఒకవేళ వీడు బుద్ధిగా ఉన్నా ఆ చిచ్చుబుడ్డి ఊరికే ఉండదు. కన్ను కొట్టిందంటే ఇక అంతే అని వాసుదేవ్ తులసికి సలహా ఇస్తాడు. నందు కక్కలేక మింగలేక మొహం అదోలా పెడతాడు. అందరూ పడుకోవడానికి వెళ్లబోతుంటే నందు లాస్య వెనుక వెళ్తాడు. అది చూసి నీ భార్య ఎవరని అడుగుతాడు. తులసి కదా నీ భార్య మరి తనతో తన గదిలోకి వెళ్ళకుండా లాస్య వెనుక వెళ్తావేంటని అంటాడు. తులసికి ఏదో ఆఫీసు పని ఉందని అందుకే వేరే గదిలో పడుకుంటానని చెప్పడంతో ఇంక నయం లాస్య గదిలో పడుకుంటానని అనలేదని తిడతాడు.
Also read: భర్తకి ముద్దు పెట్టేసిన వేద- యష్ ని దూరం చేసేందుకు విన్నీ కుట్ర
ఇబ్బంది అయినా సరే నువ్వు పడుకోవాల్సింది తులసి గదిలోనే కదా వెళ్ళు అని లాస్య చెప్పడంతో నందు చేసేదేమి లేక వెళ్ళిపోతాడు. కానీ లాస్య మాత్రం మనసులో ఏం జరుగుతుందోనని కంగారుపడుతుంది. తులసి నందు ఇబ్బందిగా ఒకే గదిలోకి వెళతారు. అన్నయ్య పడుకోవడానికి వెళ్లిపోగానే చెప్తాను మీరు వెళ్ళి మీ గదిలో పడుకోమని తులసి నందుకి చెప్తుంది. అటు లాస్య వాసుదేవ్ చేసిన పని తలుచుకుని కోపంతో ఊగిపోతుంది. గదిలో ఏం చేస్తున్నాడో ఏమోనని టెన్షన్ పడుతుంది. డ్యుయేట్స్ పాడుకుంటూ కలలోకి వస్తున్నారని లాస్య అటు ఇటూ తిరుగుతూ ఉంటుంది. సోరి తులసి ఇలా అవుతుందని అనుకోలేదని నందు అంటాడు. ఇప్పటికే వెయ్యి సార్లు చెప్పారు వినడానికే ఇబ్బందిగా ఉంది ఆపేయమని చెప్తుంది. తులసి నందు ఒకే బెడ్ మీద పడుకుని మధ్యలో దిండ్లు అడ్డం పెట్టుకుంటారు.
Also Read: పట్టాలెక్కిన దివ్య, విక్రమ్ లవ్- భార్యాభర్తలుగా ఒకే గదిలోకి నందు, తులసి
పొద్దున్నే వాసుదేవ్ వచ్చి తులసి తలుపు కొడుతూ ఉంటాడు. దేవ్ అరుపులకి ఇంట్లో అందరూ బయటకి వస్తారు. లాస్య వచ్చి నందు వైపు ఉరిమి ఉరిమి చూస్తుంది. నా దగ్గర నిజం ఎందుకు దాచారని వాసుదేవ్ కాసేపు అందరినీ టెన్షన్ పెడతాడు. నిజం తెలిసిపోయిందేమోనని భయపడుతూ నందు తప్పు చేశాను ఒప్పుకుంటున్నా అందుకు పూర్తి బాధ్యత నాది తులసికి ఏమి తెలియదు తనని ఏమి అనకని అంటాడు. మెడలో తాళి కట్టించేస్తాడు ఏమోనని లాస్య మనసులో అనుకుంటుంది. ఇంట్లో అందరూ కూడా చిన్న తప్పు వదిలేయమని అంటారు. కాసేపు అందరినీ టెన్షన్ పెట్టి బొకే తెచ్చి హ్యాపీ మ్యారేజ్ యానివర్సరీ అని చెప్తారు. అది చూసి లాస్య తిట్టుకుంటుంది. తులసి, నందుని కలిసి ఉంటే ఫోటో తీయమని లాస్యకి చెప్తాడు. ఇంట్లో ఉన్న మీరు పట్టించుకోలేదు ఏంటి ఇప్పుడైనా విసెష్ చెప్పమని అంటాడు. జీవితాంతం ఇలాగే సంతోషంగా కలిసి ఉండమని చెప్పనా అని దివ్య కావాలని లాస్యకి సెటైర్ వేస్తుంది. తులసికి చెప్పకుండా ఈవినింగ్ సర్ ప్రైజ్ పార్టీ ప్లాన్ చేశానని నందు అంటాడు.