అన్వేషించండి

Gruhalakshmi June 14th: దివ్య మీద చెయ్యెత్తిన విక్రమ్- రాజ్యలక్ష్మి కుట్ర తెలుసుకున్న తులసి

దివ్యని ఇంటి కోడలిని చేసుకుని రాజ్యలక్ష్మి చిత్రహింసలు పెడుతుంది. ఈరోజు ఎపిసోడ్లో ఏం జరిగిందంటే..

మనమే దివ్యని మనవైపు నుంచి దూరం చేసుకునెలా చేస్తుంది. రాజ్యలక్ష్మి నాకు ఫోన్ చేసింది. దారి తప్పిన కూతురి గురించి ఇంతకముందే చెప్పాను అచ్చోసిన ఆంబోతులాగా వదిలేశారని రాజ్యలక్ష్మి తిడుతుంది. మీరు చెప్పిన దగ్గర నుంచి మేము పుట్టింటికి రావొద్దని చెప్పాను కదా అంటుంది. మీ పద్ధతి చూస్తుంటే దివ్యకి నచ్చ జెప్పినట్టు లేదు అత్త మీదకి తిరగబడి పంపినట్టు ఉంది. తనకి పెళ్ళయింది భర్త ఉన్నాడు. వాడికి మర్యాద ఇవ్వాలి కదా తన మొండితనం వల్ల ఇప్పటివరకు మొదటి రాత్రి జరగలేదు. శాంతి పూజ చేయాలని చెప్తుంటే వినకుండా అమ్మానాన్న ఇదే గోల. అలాంటప్పుడు పెళ్లి ఎందుకు చేశారు మీ ఇంట్లోనే ఉంచుకోవచ్చు కదా. మా వాడికి కూడా చెప్పి చెప్పి విరక్తి పుట్టింది కోడలిని తెచ్చుకున్నట్టు లేదు కొరివి దెయ్యాన్ని తెచ్చుకున్నట్టు ఉంది. రేపు వాళ్ళు విడిపోతే ఆ పాపం మీ అకౌంట్ లో వేసుకుంటారా? ఇప్పటికైనా కూతుర్ని దారిలో పెట్టుకోమని హెచ్చరించి ఫోన్ పెట్టేస్తుంది.

Also Read: కృష్ణ పాచిక పారలేదు- భార్యాభర్తలుగా హోమం చేసిన మురారీ దంపతులు, చివర్లో ట్విస్ట్ ఇచ్చిన ముకుంద

ఇప్పుడే కాదు ఇంతకముందు కూడా ఇలాగే ఫోన్ చేసి బెదిరించింది. దివ్య కాపురం కాపాడటానికి ఇంతకంటే వేరే మార్గం లేదని తులసి అంటుంది. రాజ్యలక్ష్మి మాటలు నమ్ముతున్నావా? విక్రమ్ పేరు అడ్డం పెట్టుకుని మనతో ఆడుకుంటుందని నందు చెప్తాడు కానీ ఎప్పటిలాగా తులసి ఏం చేయలేమని చేతులెత్తేస్తుంది. దివ్య జరిగినది తలుచుకుని రగిలిపోతూ ఉంటే రాజ్యలక్ష్మి వచ్చి రెచ్చగొడుతుంది. నీ వాళ్ళనే నీ కాళ్ళకి అడ్డుపడేలా చేశాను. మొగుడికి చెప్పుకోలేవు చెప్పినా వినిపించుకొడు. వినిపించుకునేలా చేస్తానని దివ్య ఆవేశంగా అంటుంది. నీ ప్రేమ దొంగ ప్రేమని తెలిసేలా చేస్తాను నన్ను ఒంటరి దాన్ని చేయడం కాదు నిన్ను ఒంటరి దాన్ని చేస్తానని భీరాలు పోతుంది దివ్య. నేను ఏడిపిస్తే ఏడుస్తూ పడి ఉండాలని హెచ్చరిస్తుంది. బుద్ధిగా నిజమైన తల్లిగా మారండి సంతోషిస్తాను కాదు కూడదు అంటే యుద్ధం ఆగదు. మీరు ఇల్లు వదిలి శాశ్వతంగా పారిపోవాల్సి వస్తుందని దివ్య అంటుంది. ఇద్దరూ కాసేపు వాదులాడుకుంటారు.

Also Read: స్వప్నని కాపాడిన రాజ్- అసలు నిజం తెలుసుకున్న కావ్య పెళ్లిని ఆపుతుందా?

నందు వాళ్ళు భోజనం చేస్తుంటే రాములమ్మ తన కూతురి పుట్టినరోజని చెప్పి పులిహోర తీసుకొస్తుంది. తను తినకుండా ఉంటున్నాడని తులసి ఈ ప్లాన్ వేసిందని నందుకి అర్థం అవుతుంది. నర్స్ వచ్చి విక్రమ్ తండ్రిని పరీక్షించి ఏవో ఇంజెక్షన్ ఇస్తుంది. తులసి విక్రమ్ ని కలుస్తుంది. కోర్టు గోడవల్లో పడి మీ గురించి పట్టించుకోలేకపోయాము ఏమి అనుకోవద్దని అంటుంది. శాంతి పూజలు చేయిస్తే ఏదో లాభం జరుగుతుందట కదా అని తులసి అడిగితే అలాంటి పూజలు ఏమి లేవని విక్రమ్ అంటాడు. అంటే రాజ్యలక్ష్మి అబద్ధాలు చెప్పిందని తులసి అర్థం చేసుకుంటుంది. తన చాదస్తం కొద్దీ ఏదో కాసేపు విక్రమ్ బుర్ర తింటుంది. నర్స్ ఏవో మందులు తీసుకొస్తుంటే దివ్య వాటిని పట్టుకుంటుంది. ఇవి రోజంతా మత్తులో పడి ఉండటం కోసం వేస్తున్నారని ఇంట్లో వాళ్ళే ఇవ్వమని చెప్తున్నారని నర్స్ చెప్తుంది. ఆ మందులు చూసి కోపంగా విసిరికొడుతుంది. అవి విక్రమ్ చూసి అడుగుతాడు.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

KTR: 'రూ.లక్షల కోట్లు పెట్టుబడులు తెచ్చినందుకు కేసు పెడతారా?' - జైల్లో పెడితే యోగా చేస్తానంటూ కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు
'రూ.లక్షల కోట్లు పెట్టుబడులు తెచ్చినందుకు కేసు పెడతారా?' - జైల్లో పెడితే యోగా చేస్తానంటూ కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు
Chandrababu: మదమెక్కి, కొవ్వెక్కి అంబోతుల్లా తయారయ్యారు - వీళ్లని వదిలి పెట్టాలా ? సోషల్ కీచకులకు చంద్రబాబు డైరక్ట్ వార్నింగ్
మదమెక్కి, కొవ్వెక్కి అంబోతుల్లా తయారయ్యారు - వీళ్లని వదిలి పెట్టాలా ? సోషల్ కీచకులకు చంద్రబాబు డైరక్ట్ వార్నింగ్
Pawan Kalyan: సర్పంచులకు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ గుడ్ న్యూస్ - వాలంటీర్లపై కీలక వ్యాఖ్యలు
సర్పంచులకు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ గుడ్ న్యూస్ - వాలంటీర్లపై కీలక వ్యాఖ్యలు
Ghaati Glimpse: తల కోసేసి చేత్తో పట్టుకుని - నెవర్ బిఫోర్ రోల్‌లో అనుష్క!
తల కోసేసి చేత్తో పట్టుకుని - నెవర్ బిఫోర్ రోల్‌లో అనుష్క!
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

US Election Results 5 Reasons for Kamala Harris Defeatజగనన్నపై కారుకూతలు కూస్తార్రా? ఇక మొదలుపెడుతున్నా!Elon Musk Key Role Donald Trump Win | ట్రంప్ విజయంలో కీలకపాత్ర ఎలన్ మస్క్ దే | ABP DesamTrump Modi Friendship US Elections 2024 లో ట్రంప్ గెలుపు మోదీకి హ్యాపీనే | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
KTR: 'రూ.లక్షల కోట్లు పెట్టుబడులు తెచ్చినందుకు కేసు పెడతారా?' - జైల్లో పెడితే యోగా చేస్తానంటూ కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు
'రూ.లక్షల కోట్లు పెట్టుబడులు తెచ్చినందుకు కేసు పెడతారా?' - జైల్లో పెడితే యోగా చేస్తానంటూ కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు
Chandrababu: మదమెక్కి, కొవ్వెక్కి అంబోతుల్లా తయారయ్యారు - వీళ్లని వదిలి పెట్టాలా ? సోషల్ కీచకులకు చంద్రబాబు డైరక్ట్ వార్నింగ్
మదమెక్కి, కొవ్వెక్కి అంబోతుల్లా తయారయ్యారు - వీళ్లని వదిలి పెట్టాలా ? సోషల్ కీచకులకు చంద్రబాబు డైరక్ట్ వార్నింగ్
Pawan Kalyan: సర్పంచులకు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ గుడ్ న్యూస్ - వాలంటీర్లపై కీలక వ్యాఖ్యలు
సర్పంచులకు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ గుడ్ న్యూస్ - వాలంటీర్లపై కీలక వ్యాఖ్యలు
Ghaati Glimpse: తల కోసేసి చేత్తో పట్టుకుని - నెవర్ బిఫోర్ రోల్‌లో అనుష్క!
తల కోసేసి చేత్తో పట్టుకుని - నెవర్ బిఫోర్ రోల్‌లో అనుష్క!
Maruti Suzuki E-Vitara: మొట్టమొదటి ఎలక్ట్రిక్ కారు పరిచయం చేసిన మారుతి - లుక్, ఫీచర్లు అదుర్స్!
మొట్టమొదటి ఎలక్ట్రిక్ కారు పరిచయం చేసిన మారుతి - లుక్, ఫీచర్లు అదుర్స్!
PM Vidyalaxmi: 'పీఎం విద్యాలక్ష్మి'రుణాలు ఎలా పొందాలి? ఎవరు అర్హులు? వడ్డీ ఎంత?
'పీఎం విద్యాలక్ష్మి'రుణాలు ఎలా పొందాలి? ఎవరు అర్హులు? వడ్డీ ఎంత?
YS Jagan: ఏపీలో చీకటి రోజులు - సూపర్‌-6 లేదు, సూపర్‌-7 లేదు - వైఎస్ జగన్ విమర్శలు
ఏపీలో చీకటి రోజులు - సూపర్‌-6 లేదు, సూపర్‌-7 లేదు - వైఎస్ జగన్ విమర్శలు
Sony PS5 Pro: గేమర్స్‌కు గుడ్ న్యూస్ - మోస్ట్ అవైటెడ్ పీఎస్ 5 ప్రో వచ్చేసింది - రేటు చూస్తే షాకే!
గేమర్స్‌కు గుడ్ న్యూస్ - మోస్ట్ అవైటెడ్ పీఎస్ 5 ప్రో వచ్చేసింది - రేటు చూస్తే షాకే!
Embed widget