Gruhalakshmi December 20th: పరాధాన్యంలో తులసి, సామ్రాట్- శ్రుతి, అంకిత రేషన్ బాధలు
ఇంట్లో వాళ్ళకి లాస్య పట్టపగలే చుక్కలు చూపిస్తుంది. ఈరోజు ఎపిసోడ్లో ఏం జరిగిందంటే..
తన మనసులో మాట చెప్పకుండానే సామ్రాట్ తులసి తన తల్లి సరస్వతిని ఇంటికి పంపిస్తాడు. ఆమెతో ప్రశాంతంగా మాట్లాడుకోమని చెప్తాడు. సామ్రాట్ విజిల్ వేసుకుంటూ మంచి హుషారుగా ఇంటికి రావడం చూసి వాళ్ళ బాబాయ్ బిత్తరపోతాడు. సామ్రాట్ తనని తాను మర్చిపోయి మరి తులసిని గుర్తు చేసుకుంటూ తనలో తనే నవ్వుకుంటాడు. వెర్రి నవ్వులు నవ్వుతున్నావ్ పిచ్చి అయినా ఎక్కి ఉండాలి లేదంటే ప్రేమలో అయినా పడి ఉండాలని సామ్రాట్ ని వాళ్ళ బాబాయ్ అంటాడు. ఏది కాదు నీకు ఎక్కింది పిచ్చి అనేసరికి.. మనసులో ఉన్నదేంటో బయటపెట్టు అబ్బాయ్, ఎవరో నీ మనసులోకి దూరి చక్కిలిగిలి పెడుతున్నారు అని కాసేపు ఆడుకుంటాడు.
తులసి పుట్టిన ఊరికి వెళ్లానని తల్లికి చెప్పి తన మనసులో ఉన్న విషయాలు అన్నీ చెప్పుకుంటుంది. సరస్వతి నాలుగు మంచి మాటలు తులసికి చెప్తుంది. గతాన్ని తవ్వుకుని చేయగలిగింది ఏమి లేదు ప్రశాంతంగా పడుకుందామని సరస్వతి అంటుంది. తులసి తల్లికి ముద్దు పెట్టి తన ఒడిలో తలపెట్టుకుని నిద్రపోతుంది. దివ్య ఏదో తీవ్రంగా ఆలోచిస్తూ ఉండటం శ్రుతి చూస్తుంది. ఏమైందని అడుగుతుంది. కాఫీ చల్లారిపోయింది చూసుకున్నావా అని అంటుంది. మళ్ళీ వేడి చేసుకుంటాలే అని దివ్య అంటుంది.
శ్రుతి: ఈ ఇంట్లో అన్నీ రేషన్, ఒక్క గ్యాస్ సిలెండర్ రెండు నెలలు రావాల్సిందే. అంతక ముందే అయిపోతే బొగ్గులా పొయ్యే గతి. రోజుకి రెండు పాల ప్యాకెట్లు మాత్రమే వాడాలి, సరిపోకపోయినా చేసేది ఏమి లేదు
అంకిత: ఇంట్లో ఎవరైనా నిమిషానికి 20 సార్లు మాత్రమే ఊపిరి పీల్చుకోవాలి. సరిపోకపోయినా చేసేది ఏమి లేదు ఇది రేషన్. అరకిలో కూరగాయలు కంటే ఎక్కువ వాడకూడదు
Also Read: యష్ తో అట్లుంటది మరి, మనవడిని తెగ మెచ్చుకున్న రాజా, రాణి- బిక్కమొహం వేసిన వేద
శ్రుతి: ఇప్పుడు చెప్పు నీ ప్రాబ్లం ఏంటి
దివ్య: కాలేజీలో యానివర్సరీ ఫంక్షన్ ఉంది ఫ్రెండ్స్ తో కలిసి డాన్స్ చేస్తానని మాట ఇచ్చాను. ఇంతక ముందు మమ్మీ ఉంది కాబట్టి డాన్స్ నేర్పించింది కానీ ఇప్పుడు ఎలా తను అక్కడ నేను ఇక్కడ తెగించి అక్కడికి వెళ్తే ఏం గొడవలు అవుతాయో ఏమో
శ్రుతి, అంకిత: చంకలో పిల్లిని పెట్టుకుని ఊరంతా వెతుకుతున్నారు టూ మచ్. తులసి ఆంటీలా డాన్స్ మేము నేర్పిస్తాము అవకాశం ఇస్తేనే కదా
దివ్య: మరి మా ఫ్రెండ్స్ ని కూడా తీసుకురావచ్చా, లాస్య ఆంటీ ఏమైనా అంటుందేమో
శ్రుతి: అది మేము చూసుకుంటాంలే
తులసి పరధ్యానంగా ముగ్గు వేస్తూ ఉంటుంది. అది చూసి ఏంటి ఇలా చేస్తున్నావ్ అని సరస్వతి అడుగుతుంది. తులసి ముగ్గు సరిగా వేయకపోవడం చూసి మనసు ఎక్కడ ఉందని అడుగుతుంది. మన ఊరు దగ్గరే తన మనసు ఉండిపోయిందని చెప్తుంది. అసలు దీనికి కారణం సామ్రాట్ అని సరస్వతి అంటుంది. ఆయన్ని ఏమీ అనకు అనుకోకుండా అలా జరిగిపోయిందిలే అని తులసి సామ్రాట్ ని వెనకేసుకొస్తుంది. ‘ఏదో ఒక రాగం’ అని తన ఇంట్లో పాడిన పాట వినపడేసరికి సరస్వతి, తులసి సంతోషంగా బయటకి వస్తారు.
Also Read: ఏడిపించేసిన డాక్టర్ బాబు- తల్లిని చూసి ఎమోషనల్ అయిన కార్తీక్, శౌర్యని చేరుకున్న సౌందర్య