Ennenno Janmalabandham December 20th: యష్ తో అట్లుంటది మరి, మనవడిని తెగ మెచ్చుకున్న రాజా, రాణి- బిక్కమొహం వేసిన వేద
యష్, వేద వెకేషన్ కోసం వాళ్ళ అమ్మమ్మ ఊరు వెళతారు. ఈరోజు ఎపిసోడ్లో ఏం జరిగిందంటే..
హోటల్ లో అమ్మాయిలు యష్ ని చూసి సైట్ కొట్టడంతో వేద బుంగమూతి పెడుతుంది. వెంటనే తనని అక్కడి నుంచి తీసుకుని వెళ్ళిపోతుంది. కారులో వెళ్తు ఆడవారి మాటలకి అర్థాలే వేరులే అని సాంగ్ వేసి కాసేపు వేదని ఆటపట్టిస్తాడు. వేద కోపం చూసి నన్ను ఇష్టపడుతున్నావా ఏంటి అని అడుగుతాడు. అదేమీ లేదు నేను కేవలం మదర్ ఆఫ్ ఖుషి అని చెప్తుంది. యష్ కూడా ఫాదర్ ఆఫ్ ఖుషి అంటాడు. వేద అలాగే కారులో కునికి పాటలు పడుతూ యష్ భుజం మీద వాలిపోతుంది.
‘ఎంత ప్రశాంతంగా నిద్రపోతున్నావ్ వేద, నీకు కల్మషం తెలియదు. అప్పటి వరకి మీ అమ్మకి న్యాయం చేయడం కోసం ఫైట్ చేశావ్ కానీ యాక్సిడెంట్ చేసింది నా కొడుకు అని తెలియగానే వాడిని వదిలేశావ్. నా వల్ల ఎంతో సఫర్ అయ్యావు. మాళవికతో ఎన్నో మాటలు పడ్డావ్. ఎవరిలోని లేని నీలో మాత్రమే ఉన్నది ఏంటో తెలుసా అమ్మతనం. ఖుషి గురించి ఎంత ఆలోచిస్తావో నిన్ను అసహ్యించుకునే ఆదిత్యలో కూడా బిడ్డని చూశావ్. ఏం చేసి నీ రుణం తీర్చుకోవాలి. అందుకే కనీసం ఈ చిన్న పని నీతో పాటు మీ అమ్మమ్మగారి ఊరు వచ్చి సంతోషపెట్టాలని అనిపించింది’ అని అంటాడు. మెళుకువ వచ్చి నిద్రలేచిన వేద ఏంటి కారు ఆపారు అని అడుగుతుంది. నిద్రపోతున్నావ్ అని ఆపాను అని చెప్తాడు.
Also Read: ఏడిపించేసిన డాక్టర్ బాబు- తల్లిని చూసి ఎమోషనల్ అయిన కార్తీక్, శౌర్యని చేరుకున్న సౌందర్య
‘మనం ఏ పరిస్థితుల్లో పెళ్లి చేసుకున్నామో వాళ్ళకి తెలియదు, ఉన్న నాలుగు రోజులు అన్ని మర్చిపోయి మనం హ్యాపీగా ఉందాం, వాళ్ళని హ్యపీగా ఉంచుదాం’ అని వేద యష్ ని రిక్వెస్ట్ చేస్తుంది. మనం ఊరు వెళ్ళేదాక వాళ్ళని సంతోషంగా ఉంచే బాధ్యత తనదని యష్ అనేసరికి వేద సంతోషిస్తుంది. రాజా, రాణి మేళతాళాలతో వేద వాళ్ళకి స్వాగతం పలుకుతారు. వాళ్ళని చూడగానే వేద పరుగున వెళ్లబోతుంటే తనని తోసేసి మరీ యష్ వెళ్ళి వాళ్ళ కాళ్ళ మీద పడి మీ మనవడిని ఆశీర్వదించండి అని అడుగుతాడు. యష్ అలా చేయడం చూసి వేద బిత్తరపోతుంది. వాళ్ళ దగ్గర మార్కులు కొట్టేయడం కోసం యష్ చేసే యాక్టింగ్ చూసి వేద చిరాకుగా ఫేస్ పెడుతుంది.
ఇద్దరినీ ఒకరి పేరు ఒకరు చెప్పి కుడి కాలు లోపల పెట్టి ఇంట్లోకి అడుగుపెట్టమని రాజా, రాణి చెప్తారు. యష్ సిగ్గుపడుతూ ‘మా ఆవిడ వేదస్విని నేను వచ్చాం’ అని చెప్తాడు. వేద కూడా ‘మాయన యశోధర్ నేను వచ్చాం’ అని అంటుంది. ఇద్దరూ ఇంట్లోకి అడుగుపెడుతుంటే ‘ఓ సీతా..’ అని సూపర్ సాంగ్ వేసి అద్భుతంగా చూపించారు. యష్ మాట తీరు చూసి అదుర్స్ మనవడు అని తెగ మెచ్చుకుంటారు. అది చూసి వామ్మో వచ్చి రాగానే వాళ్ళని బుట్టలో వేసుకున్నాడు మాములోడు కాదు అని మనసులో అనుకుంటుంది. యష్ దగ్గరగా వచ్చి అట్లుంటది మనతోటి అని అంటాడు. యష్ ని చూసి వేద కంటే తనే నచ్చాడని అంటారు.
Also Read: చిలిపి అల్లరి చేస్తూ భార్యని ఉడికించిన యష్- బుంగమూతి పెట్టిన వేద