Ennenno Janmalabandham December 19th: చిలిపి అల్లరి చేస్తూ భార్యని ఉడికించిన యష్- బుంగమూతి పెట్టిన వేద
వేద, యష్ ని ఒక్కటి చేయడం కోసం వాళ్ళని వెకేషన్ కి పంపించడంతో సీరియల్ ఇంట్రెస్టింగ్ గా సాగుతోంది. ఈరోజు ఎపిసోడ్లో ఏం జరిగిందంటే..
వేద, యష్ అగ్రహారం వెళ్ళడానికి కారులో బయల్దేరతారు. యష్ ఆకలిగా ఉందని ఎక్కడైనా ఆగి తిందామని అంటాడు. ఇద్దరూ కలిసి ఒక రెస్టారెంట్ కి వెళతారు. లైఫ్ లో ఒక కొత్త విషయం తెలుసుకున్న మనకి నచ్చినట్టు ఉండటం కాదు ఎదుటి వాళ్ళ కోసం మనల్ని మనం మార్చుకోవడంలో తెలియని సంతృప్తి ఉంటుంది. ఇప్పుడు మనం వేరు కాదు. ఒకరికి ఒకరం అని యష్ అంటాడు. ఖుషి తన తరఫున వచ్చి రిక్వెస్ట్ చేయగానే ఊరికి రావడానికి ఒప్పుకున్నట్లు యష్ చెప్తాడు. అంతలేదు ఖుషి మీ తరఫున వచ్చి నన్ను రిక్వెస్ట్ చేసిందని ఒప్పుకున్నా అని వేద అంటుంది.
ఇద్దరూ హోటల్ లో కాసేపు పోట్లాడుకుంటారు. అంతా ఖుషినే చేసిందని అనుకుంటారు. వీళ్ళిద్దరూ గొడవపడటం చూసి హోటల్ లో వాళ్ళంతా బిత్తరపోతారు. వేద, యష్ అందరూ తమనే చూస్తున్నారని తెలుసుకుని సైలెంట్ అయిపోతారు. మన ఇద్దరినీ ఎలాగైనా ఈ ట్రిప్ కి పంపించాలని ఖుషి ఇదంతా చేసింది. పిల్లల కోసం పేరెంట్స్ తాపత్రయ పడతారు. కానీ ఇక్కడ ఖుషి మన కోసం తాపత్రయపడుతుందని వేద అంటుంది. హోటల్ కి ముగ్గురు అమ్మాయిలు వస్తారు. వాళ్ళు యష్ ని చూసి హీరోలాగా హ్యాండ్సమ్ గా ఉన్నాడని అనుకుంటారు. ఆ మాటలు వేద, యష్ చెవిన కూడా పడతాయి.
Also Read: సా.. గుతున్న తులసి హోమ్ టూర్- లాస్య తానా అంటే తందాన అంటున్న నందు
ఆయన ఎవరనుకుంటున్నావ్ యశోధర్ బెస్ట్ సిఈవో అని చెప్పుకుంటారు. వాళ్ళ మాటలు విని యష్ ఉప్పొంగిపోతుంటే వేద మాత్రం రగిలిపోతుంది. వేద కోపం చూసి మరింత ఉడికించడానికి చూస్తుంటాడు. అదేంటో ఎక్కడికి వెళ్ళినా ఈ అమ్మాయిల చూపు నామీద ఉంటుందనే యష్ డబ్బా కొట్టుకుంటాడు. వేదని మరింత ఉడికించడానికి ఎక్కడో కాలిన వాసన వస్తుందని, దాన్నే జలస్ అంటారని అంటాడు. అమ్మాయిలు యష్ ని చూస్తూ ఉండేసరికి వేద కోపంగా వెళ్ళి వాళ్ళకి అడ్డంగా కూర్చుంటుంది. వెంటనే అమ్మాయిలు ఆవిడ భార్య అనుకుంటున్నా, జలస్ ఫీల్ అవుతుందని అనుకుంటారు. అవును నాకు జలస్. ఆయన నా భర్త. తనని ఎవరైనా చూస్తే నాకు బాధ ఉండదా అని వేద మనసులో అనుకుని మూతి తిప్పుతుంది.
Also Read: హడలెత్తించిన భ్రమరాంబిక- మాళవికని ఇంట్లో నుంచి పంపించేయమన్న అభీ సిస్టర్
అమ్మాయిలు వెంటనే యష్ ని పిలిచి మరీ హి చెప్తారు. యష్ కూడా హాయ్ చెప్పేసరికి వేద ఊదుకుతూ ఉంటుంది. వాళ్ళు అదే పనిగా యష్ ని చూస్తూ ఉండేసరికి వేద కోపంగా వెళ్లిపోదాం పద అని అంటుంది. వెళ్తూ వెళ్తూ యష్ వాళ్ళకి బాయ్ చెప్పేసరికి వేద కోపంగా బుంగమూతి పెట్టి వెళ్ళిపోతుంది. కారులో వేదని చూసి యష్ నవ్వుతూ ఉంటాడు. వేద కోపంగా నాకేమీ జలస్ లేదు, ఆ అమ్మాయిలకి బుద్ధి ఉండక్కర్లేదా, వాళ్ళ ని చూశాక అయినా మీరు నాదగ్గరకి వచ్చి కూర్చోవచ్చు కదా అని కడుపులో ఉన్న కోపం అంతా కక్కేస్తుంది.