Gruhalakshmi July 25th Update: తులసి బుట్టలో పడిన సామ్రాట్, అది చూసి ఉడికిపోతున్న నందు, లాస్య- అంకిత దగ్గరకి వచ్చేసిన అభి

తులసికి సహాయం చెయ్యాలని సామ్రాట్ ఆరాటపడతాడు. కానీ సాయం తీసుకునేందుకు తులసి ఒప్పుకోదు. ఈరోజు ఎపిసోడ్ లో ఏం జరిగిందంటే..

FOLLOW US: 

బిజినెస్ ఐడియాలు ఇచ్చే వాళ్ళను ఇంటర్వ్యూ చేసేందుకు నందు, లాస్య రెడీ అవుతారు. నువ్వు ఇచ్చిన ప్రకటనకు మంచి స్పందన వచ్చింది బాగా క్లిక్ అయ్యిందని సామ్రాట్ బాబాయ్ సంతోషంగా వచ్చి చెప్తాడు. అదేమీ వినిపించుకోకుండా సామ్రాట్ పరధ్యానంగా ఉంటాడు. ఏదేమైనా తను చాలా గ్రేట్ బాబాయ్, ఆ థింకింగ్ పవర్, ఆ ఓపికకి 100 కి 100 మార్కులు ఇవ్వొచ్చు అని అంటాడు. సామ్రాట్ ఎవరి గురించి చెప్తున్నాడని ముసలాయన తలపట్టుకుంటాడు. ఇంత వరకు ఒక్కరినీ కూడా ఇంటర్వ్యూ చెయ్యలేదు ఎవరికి రా 100 మార్కులు ఇచ్చేస్తున్నవాని అడుగుతాడు. తులసికి బాబాయ్ నేను తులసి గురించి ఆలోచిస్తున్నాను తన గురించే మాట్లాడుతున్నానని అంటాడు. ఇక మనోడు బుట్టలో పడ్డాడులె అని సంబరపడతాడు సామ్రాట్ బాబాయ్. 'బ్లాంక్ చెక్ ఇస్తే అది చిత్తు కాగితంలాగా తెచ్చి న మొహాన కొట్టింది, అదే స్థానంలో ఇంకెవరైనా ఉంటే 1 తర్వాత వంద సున్నలు పెట్టుకునే వాళ్ళు. నా లైఫ్ లో ఇప్పటి వరకు డబ్బు మనుషులనే చూశాను తులసి లాంటి మంచి క్యారెక్టర్ ఉన్నవాళ్ళని ఫస్ట్ టైం చూస్తున్నాను. కష్టాల్లో అవసరాల్లో కూడా ఫ్రీగా వచ్చే డబ్బు కోసం ఆశపడకుండా అనురాగానికి బంధాలకి కట్టుబడి ఉండటం గ్రేట్ కేవలం అది తులసికి మాత్రమే సాధ్యం అవుతుంది' అని పొగడ్తల్లో ముంచెత్తుతాడు. నువ్వు ఒక స్త్రీ గురించి ఇంతగా మాట్లాడటం ఫస్ట్ టైం చూస్తున్నానని ముసలాయన సంతోషంగా చెప్తాడు. తులసికి ఏదో ఒక రకంగా హెల్ప్ చెయ్యాలి కానీ తను సాయం తీసుకునేందుకు ససేమిరా అంటుంది తన రుణం తీర్చుకోవాలి ఎలాగైనా అని సామ్రాట్ అంటాడు. 

Also Read: గుండెల్ని మెలిపెట్టే సీన్, ఖుషి కనిపించక అల్లాడిపోయిన వేద, యష్- కుక్కపిల్ల వాళ్ళని ఖుషి దగ్గరకి చేరుస్తుందా?

నందు, లాస్య ఉన్న ఆఫీసుకి తులసి వస్తుంది. అక్కడ వాళ్ళని చూసి తులసి షాక్ అవుతుంది. ఇక్కడికి వచ్చిన వాళ్ళు ఎవరైనా విషయం ముందు నందుకి చెప్పాల్సిందే అని లాస్య తులసి చేతిలోని ఫైల్ లాక్కుంటుంది. అది చూసి నువ్వు కూడా బిజినెస్ ప్రపోజల్ తో వచ్చావా అని లాస్య తులసిని అడుగుతుంది. మ్యూజిక్ స్కూల్ ఐడియాతో వచ్చిందని చెప్పి లాస్య, నందు నవ్వుతారు. ఇలాంటి ప్రపోజల్ తో వచ్చిన వాళ్ళని కూడా ఇంటర్వ్యూ చెయ్యాలా టైం వెస్ట్ కదా అని లాస్య వెటకారంగా మాట్లాడుతుంది. నీ కంటే ముందు చాలా మంది వచ్చారు నువ్వు వాళ్ళ తర్వాతే వెళ్ళి క్యూలో కూర్చో అని లాస్య హేళనగా మాట్లాడుతుంది. ఇక తులసి కూర్చొని ఉండటాన్ని సామ్రాట్ బాబాయ్ చూసి మీరేంటి ఇక్కడ అని అడుగుతాడు. నేను కూడా ఇంటర్వ్యూ కోసమే వచ్చానని చెప్తుంది. ఇక ఆయన తులసిని నేరుగా సామ్రాట్ దగ్గరకి తీసుకొని వస్తాడు. అక్కడే నందు, లాస్య కూడా ఉంటారు. తులసిని చూసి మొహాలు మాడ్చుకుంటారు. మీ ప్రపోజల్ ఏంటి అని సామ్రాట్ అడుగుతాడు. మ్యూజిక్ స్కూల్ ప్రపోజల్ తో వచ్చానని చెప్తుంది. దాని వల్ల ఉపయోగం ఏముందని నందు, లాస్య పుల్ల వేస్తారు. కానీ సామ్రాట్ అవేమీ వినిపించుకోకుండా తులసి గారి ప్రపోజల్ పట్టాలెక్కాలి. దానికి కావాల్సిన అమౌంట్ వెంటనే ఏర్పాట్లు చెయ్యండి, అవన్నీ మీరే దగ్గరుండి చూసుకోండి అని నందు, లాస్యలకు పురమాయిస్తాడు. నా కల తీరేలా చేస్తున్నారని తులసి సంతోషంగా వెళ్తుంది.. అది చూసి నందు, లాస్య ఉడికిపోతారు. 

Also Read: మా నాయన దుర్మార్గుడని ఆదిత్యకి చెప్పిన దేవి- నీకోసమే ఇదంతా చేశానంటూ మాధవ పైశాచికత్వం

బిజినెస్ ప్రపోజల్ ఒకే అయ్యిందని తులసి ఇంట్లో చెప్పడంతో అందరూ సంతోషిస్తారు. అప్పుడే అక్కడికి అభి బ్యాగ్ తో వస్తాడు. అది చూసి తులసి ముఖం వెలిగిపోతుంది. నేను మారలేదు, ఎవరి కోసం నా ఒపీనియన్ మార్చుకోలేదు. అంకిత కోసం వచ్చాను, తన మీద నా ప్రేమ నిరూపించుకోవడానికి వచ్చానని అభి చెప్తాడు. నీకు దూరంగా ఉండేందుకు బలవంతంగా ట్రై చేశాను కానీ నా వల్ల కాలేదు అందుకే వచ్చేశాను అని అంటాడు. అంకితని ఈ ఇంట్లో కట్టేశావ్ నిన్ను వదిలి ఎలాగూ రాదని తెలిసిపోయింది అందుకే ఒక మెట్టు దిగి నేనే వచ్చానని తులసితో అంటాడు.  

తరువాయి భాగంలో.. 

ప్రేమ్ కూడా బ్యాగ్ పట్టుకుని తులసి దగ్గరకి వచ్చేస్తాడు. శ్రుతి ఎక్కడా అని తులసి అడుగుతుంది. వాళ్ళ కౌసల్య అత్తయ్యకి ఒంట్లో బాగోలేదంటే ఇక్కడికి వెళ్ళిందని అబద్ధం చెప్తాడు. ఒకసారి శ్రుతికి ఫోన్ చెయ్యి మాట్లాడాలని ఉందని తులసి ఆడగటంతో ప్రేమ్ షాక్ అవుతాడు. 

Published at : 25 Jul 2022 10:09 AM (IST) Tags: Gruhalakshmi serial Gruhalakshmi Serial today episode Gruhalakshmi Serial Today Episode Written Update Gruhalakshmi Serial July 25 th

సంబంధిత కథనాలు

Tollywood: విజయ్ కోసం ఎగబడుతున్న జనాలు - అలియాభట్ ఇన్స్టాగ్రామ్ సంపాదన!

Tollywood: విజయ్ కోసం ఎగబడుతున్న జనాలు - అలియాభట్ ఇన్స్టాగ్రామ్ సంపాదన!

NTR30: ఎన్టీఆర్ సినిమాలో కృతిశెట్టి - క్లారిటీ వచ్చేసింది!

NTR30: ఎన్టీఆర్ సినిమాలో కృతిశెట్టి - క్లారిటీ వచ్చేసింది!

Bimbisara: 'బింబిసార' సినిమాను రిజెక్ట్ చేసిన రవితేజ?

Bimbisara: 'బింబిసార' సినిమాను రిజెక్ట్ చేసిన రవితేజ?

Shruti Haasan: నాకోసం అమ్మ నాన్న ఎవరికీ ఫోన్లు చేయలేదు - కష్టం ఎవరికైనా ఒకటే: శ్రుతిహాసన్

Shruti Haasan: నాకోసం అమ్మ నాన్న ఎవరికీ ఫోన్లు చేయలేదు - కష్టం ఎవరికైనా ఒకటే: శ్రుతిహాసన్

NTR: భుజం నొప్పితో బాధపడుతోన్న ఎన్టీఆర్ - రెండు నెలల పాటు రెస్ట్!

NTR: భుజం నొప్పితో బాధపడుతోన్న ఎన్టీఆర్ - రెండు నెలల పాటు రెస్ట్!

టాప్ స్టోరీస్

ప్రధాని మోదీకి పాకిస్థాన్‌లో ఓ సిస్టర్ ఉంది, రాఖీ కూడా పంపింది

ప్రధాని మోదీకి పాకిస్థాన్‌లో ఓ సిస్టర్ ఉంది, రాఖీ కూడా పంపింది

Rabindranath Tagore: ఐన్‌స్టీన్‌, రవీంద్రనాథ్ ఠాగూర్ మంచి స్నేహితులని మీకు తెలుసా?

Rabindranath Tagore: ఐన్‌స్టీన్‌, రవీంద్రనాథ్ ఠాగూర్ మంచి స్నేహితులని మీకు తెలుసా?

PF Data Leak: మీకు పీఎఫ్ అకౌంట్ ఉందా? అయితే జాగ్రత్తగా ఉండాలి - ఎందుకంటే మీ డేటా?

PF Data Leak: మీకు పీఎఫ్ అకౌంట్ ఉందా? అయితే జాగ్రత్తగా ఉండాలి - ఎందుకంటే మీ డేటా?

Flag Hoisting: జాతీయ జెండాను RSS ఎందుకు ఎగరేయటం లేదు? కాషాయ రంగుని మాత్రమే గుర్తిస్తోందా?

Flag Hoisting: జాతీయ జెండాను RSS ఎందుకు ఎగరేయటం లేదు? కాషాయ రంగుని మాత్రమే గుర్తిస్తోందా?