అన్వేషించండి

Game Changer Movie: రికార్డులు బద్దలు కొడుతున్న ‘రా మచ్చా’ - 24 గంటలల్లో ఎన్ని వ్యూస్?

రామ్ చరణ్ ‘గేమ్ ఛేంజర్’ నుంచి విడుదలైన సెకెండ్ సింగిల్ ‘ రా మచ్చ’కు ప్రేక్షకుల నుంచి అదిరిపోయే రెస్పాన్స్ వస్తోంది. 24 గంటల్లో అత్యధిక వ్యూస్ సాధించిన రెండో తెలుగు లిరికల్ గా రికార్డు సాధించింది.

Raa Macha Macha  Lyrical Song:  మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, శంకర్ కాంబోలో తెరకెక్కిన ప్రతిష్టాత్మక చిత్రం ‘గేమ్ ఛేంజర్’. మెగా తనయుడు గ్లోబల్ స్టార్ గా మారిన తర్వాత ప్రేక్షకుల ముందుకు వస్తున్న ఈ పాన్ ఇండియన్ మూవీపై దేశ వ్యాప్తంగా భారీగా అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమా ఈ ఏడాది చివరలో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో చిత్రబృందం ప్రమోషన్ కార్యక్రమాలను ముమ్మరం చేసింది. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్లు, ఫస్ట్ సింగిల్ విడుదలై ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి. ‘జరగండి జరగండి’ అంటూ సాగే ఫస్ట్ పాట ప్రేక్షకులను బాగా అలరించింది.  తాజాగా ఈ సినిమాకు సంబంధించిన సెకెండ్ సింగిల్ ను రిలీజ్ చేశారు. ‘రా మచ్చ మచ్చ’ అంటూ సాగే ఈ పాట ప్రేక్షకులను అద్భుతంగా ఆకట్టుకుంటోంది. 

సోషల్ మీడియాలో దుమ్మురేపుతున్న ‘రా మచ్చ’ సాంగ్

‘గేమ్ ఛేంజర్’ సినిమాలో రామ్ చరణ్ ఇంట్రో సాంగ్ గా ఈ పాటను రూపొందించారు. ఇందులో రామ్ చరణ్ మాసీ స్టెప్పులు, తమన్ అదిరిపోయే మ్యూజిక్ ప్రేక్షకులను మెస్మరైజ్ చేస్తోంది. బాలీవుడ్ కొరియోగ్రాఫర్ గణేష్ కంపోజ్ చేసిన స్టెప్ప్ ఆహా అనిపిస్తున్నాయి. ఈ పాట మెగా ఫ్యాన్స్ ను ఓ రేంజిలో అలరిస్తోంది. ఈ పాటు సోషల్ మీడియాలో దుమ్మురేపుతోంది. రికార్డు స్థాయిలో వ్యూస్ సాధించింది. 24 గంటలు పూర్తయ్యే సరికి ఈ పాట  టాలీవుడ్ లో ఆల్ టైం టాప్ 2లో నిలిచింది. వ్యూస్ పరంగా 24 గంటల్లో 16.44 మిలియన్ మార్క్ ను అందుకుంది. ‘రా మచ్చ’ సాంగ్ లైక్స్  పరంగానూ సత్తా చాటింది. 24 గంటలు పూర్తయ్యే సరికి 299K లైక్స్ సాధించింది. లైక్స్ పరంగా ఈ పాట టాప్ 10లో కూడా చేరలేకపోయింది. ఇక ఈ పాట సినిమాపై భారీగానే అంచనాలు పెంచింది. మున్ముందు రాబోయే ప్రమోషనల్ కంటెంట్ ఎలా ఉంటుందో చూడాలి.    

24 గంటల్లో అత్యధిక వ్యూస్ అందుకున్న 10 తెలుగు లిరికల్ సాంగ్స్

1.ధమ్ మసాలా- గుంటూరుకారం- 17.42M
2.రా మచ్చ మచ్చ- గేమ్ ఛేంజర్-16.44M
3.పెన్నీ సాంగ్- సర్కారు వారి పాట: 16.38M
4.చుట్టమల్లే- దేవర- 15.68M
5.కళావతి- సర్కారు వారి పాట- 14.78M                                                                                                                                                              6.మా మా మాహేషా- సర్కారు వారి పాట- 13.56M
7.ఊ అంటావా మావా- పుష్ప-  12.39M
8.సూసేకి అగ్గి రవ్వ మాదిరి- పుష్ప 2-10.97M
9.పుష్ప పుష్ప- పుష్ప 2- 10.38M
10.లాలా భీమ్లా- భీమ్లా నాయక్- 10.20M

క్రిస్మస్ కానుకగా ‘గేమ్ ఛేంజర్’ విడుదల

రామ్ చరణ్, శంకర్ కాంబినేషన్ లో తెరకెక్కిన ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ హీరోయిన్ గా నటిస్తోంది. ప్రముఖ నిర్మాత దిల్ రాజు ఈ సినిమాను ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. ఈ ఏడాది క్రిస్మస్ కానుకగా ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.  

Read Also: అవమానంగా భావించింది అందుకే - లడ్డూ వ్యవహారంపై మరోసారి స్పందించిన పవన్ కల్యాణ్

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Rains: అల్పపీడన ప్రభావం - ఈ నెల 15 వరకూ ఈ జిల్లాల్లో వర్షాలు, అధికారులకు సీఎం కీలక ఆదేశాలు
అల్పపీడన ప్రభావం - ఈ నెల 15 వరకూ ఈ జిల్లాల్లో వర్షాలు, అధికారులకు సీఎం కీలక ఆదేశాలు
KCR: తెలంగాణ తల్లి కొత్త విగ్రహం - కాంగ్రెస్ ప్రభుత్వానిది మూర్ఖపు చర్యంటూ కేసీఆర్ తీవ్ర ఆగ్రహం
తెలంగాణ తల్లి కొత్త విగ్రహం - కాంగ్రెస్ ప్రభుత్వానిది మూర్ఖపు చర్యంటూ కేసీఆర్ తీవ్ర ఆగ్రహం
WhatsApp Message Reminder: ‘బాబూ... మెసేజ్ ఓపెన్ చేయడం మర్చిపోయావ్’ - వాట్సాప్‌లో రానున్న కొత్త ఫీచర్ ఇదే!
‘బాబూ... మెసేజ్ ఓపెన్ చేయడం మర్చిపోయావ్’ - వాట్సాప్‌లో రానున్న కొత్త ఫీచర్ ఇదే!
Special Trains: శబరిమల భక్తులకు గుడ్ న్యూస్ - జనవరిలో 34 ప్రత్యేక రైళ్లు, ఆ రూట్లు ఇవే!
శబరిమల భక్తులకు గుడ్ న్యూస్ - జనవరిలో 34 ప్రత్యేక రైళ్లు, ఆ రూట్లు ఇవే!
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

ఆ ఊళ్లోనే పెద్దపులి తిష్ట! డ్రోన్లతో గాలింపుభారత్ ఘోర ఓటమి ఆసిస్ సిరీస్ సమంరైతులకు నో ఎంట్రీ, రోడ్లపై ఇనుప మేకులు, బోర్డర్‌లో భారీ బందోబస్తుసప్తవర్ణ శోభితం, శ్రీపద్మావతి అమ్మవారి పుష్పయాగం

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Rains: అల్పపీడన ప్రభావం - ఈ నెల 15 వరకూ ఈ జిల్లాల్లో వర్షాలు, అధికారులకు సీఎం కీలక ఆదేశాలు
అల్పపీడన ప్రభావం - ఈ నెల 15 వరకూ ఈ జిల్లాల్లో వర్షాలు, అధికారులకు సీఎం కీలక ఆదేశాలు
KCR: తెలంగాణ తల్లి కొత్త విగ్రహం - కాంగ్రెస్ ప్రభుత్వానిది మూర్ఖపు చర్యంటూ కేసీఆర్ తీవ్ర ఆగ్రహం
తెలంగాణ తల్లి కొత్త విగ్రహం - కాంగ్రెస్ ప్రభుత్వానిది మూర్ఖపు చర్యంటూ కేసీఆర్ తీవ్ర ఆగ్రహం
WhatsApp Message Reminder: ‘బాబూ... మెసేజ్ ఓపెన్ చేయడం మర్చిపోయావ్’ - వాట్సాప్‌లో రానున్న కొత్త ఫీచర్ ఇదే!
‘బాబూ... మెసేజ్ ఓపెన్ చేయడం మర్చిపోయావ్’ - వాట్సాప్‌లో రానున్న కొత్త ఫీచర్ ఇదే!
Special Trains: శబరిమల భక్తులకు గుడ్ న్యూస్ - జనవరిలో 34 ప్రత్యేక రైళ్లు, ఆ రూట్లు ఇవే!
శబరిమల భక్తులకు గుడ్ న్యూస్ - జనవరిలో 34 ప్రత్యేక రైళ్లు, ఆ రూట్లు ఇవే!
Sandhya Theater Stampede: సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటన - ముగ్గురిని అరెస్ట్ చేసిన పోలీసులు, కోలుకుంటోన్న బాలుడు
సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటన - ముగ్గురిని అరెస్ట్ చేసిన పోలీసులు, కోలుకుంటోన్న బాలుడు
Mahindra BE 6e Vs Tata Curvv EV: నెక్సాన్ వర్సెస్ కర్వ్ వర్సెస్ బీఈ 6ఈ - మూడు ఎలక్ట్రిక్ కార్లలో ఏది బెస్ట్!
నెక్సాన్ వర్సెస్ కర్వ్ వర్సెస్ బీఈ 6ఈ - మూడు ఎలక్ట్రిక్ కార్లలో ఏది బెస్ట్!
Bapatla Accident: ఏపీలో తీవ్ర విషాదం - టిప్పర్ లారీ ఢీకొని ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మృతి
ఏపీలో తీవ్ర విషాదం - టిప్పర్ లారీ ఢీకొని ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మృతి
Actor Manchu Manoj: బంజారాహిల్స్ ఆస్పత్రికి నటుడు మంచు మనోజ్ - నడవడానికి ఇబ్బంది పడుతూ వ్యక్తి సాయంతో.. వీడియో వైరల్
బంజారాహిల్స్ ఆస్పత్రికి నటుడు మంచు మనోజ్ - నడవడానికి ఇబ్బంది పడుతూ వ్యక్తి సాయంతో.. వీడియో వైరల్
Embed widget